తిరుమల లడ్డూల విక్రయంపై పరిమితి- భక్తునికి రెండు లడ్డూలు మాత్రమే!
Publish Date:Jun 2, 2022
Advertisement
తిరుమల తిరుపతి దేవస్థానం భక్తుల రద్దీకి తగినట్టుగా ఏర్పాట్లు చేయడంలో ఘోరంగా విఫలమైంది. భక్తులు తిరుమల రావద్దనీ, వారి ప్రయాణాలను వాయిదా వేసుకోవాలనీ కోరి తూచ్ అలా చెప్పలేదన్న టీటీడీ.. ఇప్పుడు తాజాగా శ్రీవారి లడ్డూలపై పరిమితి విధించింది. ఇంత కాలం భక్తులకు ఎన్ని కావాలంటే అన్ని లడ్డూలు విక్రయించిన టీటీడీ ఇప్పడు వాటిని రెండుకు పరిమితం చేసింది. దర్శనం చేసుకున్న భక్తుడికి ఉచితంగా ఇచ్చే లడ్డూ కాకుండా కేవలం రెండు లడ్డూలను మాత్రమే విక్రయిస్తున్నారు. రోజుకు 3లక్షల లడ్లు మాత్రమే తయారౌతున్నాయనీ, అయితే రోజుకుభక్తుల సంఖ్య 90 వేలకు మించడంతో లడ్డూల విక్రయంపై పరిమితి విధించక తప్పలేదని టీటీడీ పేర్కొంది. కాగా విక్రయ కేంద్రం అధికారులు కూడా భక్తులకు రెండు లడ్డూలు మాత్రమే విక్రయించినట్లు ధృవీకరించారు. ప్రస్తుత భక్తుల రద్దీ కొద్దిగా తగ్గుముఖం పట్టినందున శుక్రవారం నుంచి భక్తులకు ఉచితంగా ఇచ్చే లడ్డూ కాకుండా నాలుగు లడ్డూలు విక్రయించనున్నట్లు అధికారులు తెలిపారు. .
http://www.teluguone.com/news/content/tirumala-25-136860.html





