చలికాలంలో చమటలు పడుతున్నాయా..?

Publish Date:Dec 22, 2020

Advertisement

చలికాలంలో వచ్చిందంటే చాలు అనేక అనారోగ్య సమస్యలను వెంటపెట్టుకుని వస్తుంది. అయితే కరోనా కారణంగా ఈ సమస్య తీవ్రత మరింత పెరిగింది. వాతావరణంలో ఉష్ణోగ్రత తగ్గడం, పొగమంచు కమ్ముకోవడం వంటి కారణాలతో అనేక అనారోగ్యాలకు గురవ్వాల్సివస్తుంది. ఈ కాలంలో వైరల్‌ ఇన్‌ఫెక్షన్‌, జలుబు, శ్వాసకోశానికి సంబంధించిన వ్యాధులు, దగ్గు, తలనొప్పిలాంటివి ప్రధానంగా ఏర్పడే అనారోగ్యాలు. కరోనా లక్షణాలు కూడా ఇవే కావడంతో మరింత అప్రమత్తంగా ఉండాల్సి ఉంటుంది. ముఖ్యంగా వృద్ధులు, పిల్లల విషయంలో మరింత జాగ్రత్తగా ఉండాలి.

వాతావరణం చల్లగా ఉన్నప్పటికీ చెమటలు పడుతుంటే దాన్ని హైపోధెర్మియా అంటారు. ఆ సమయంలో శరీర ఉష్ణోగ్రత తగ్గిపోతూ, శరీరం చల్లగా మారుతుంది. శరీరంలోని వివిధ అవయవాలు చేసే పనులు మందకొడిగా సాగుతాయి. ఈ అనారోగ్యం ఏర్పడటానికి కారణం చల్లనిగాలి తాకుతున్నప్పుడు వెచ్చని దుస్తులు ధరించకపోవడం, ఆందోళన ఎక్కువగా ఉండటం, సరిగ్గా ఆహారాన్ని తీసుకోకపోవడం,  ఎక్కువ సమయం నీళ్ళల్లో నానటం లాంటి వాటివల్ల ఈ అనారోగ్యం ఏర్పడుతుంది. ఈ వ్యాధికి గురయినప్పుడు  మాటల్లో స్పష్టత ఉండదు. వణుకు ఏర్పడుతుంది.  మెదడుకు ఆలోచించే శక్తి తగ్గిపోతుంది. అశ్రద్ద, నిర్లక్ష్యం చేయకుండా వెంటనే వైద్యుని వద్దకు వెళ్ళి తగినవైద్యం చేయించుకోవాలి. వ్యాధి లక్షణాలను బట్టి వైద్యుని సంప్రదించ టమే కాకుండా తగిన ఆరోగ్య జాగ్రత్తలు కూడా తీసుకోవాలి.

చల్లనిగాలి శరీరానికి సోకకుండా శరీరాన్ని పూర్తిగా కప్పివుంచి, శరీరానికి వెచ్చదనాన్ని కలిగించాలి. గోరువెచ్చని నీటిని తాగాలి, వేడివేడిగా కాఫీ, టీ, సూప్ లు తాగవచ్చు, హైపోధెర్మియాకు వైద్య చికిత్స ఎంతో అవసరం.  లేకపోతే ప్రాణాపాయ పరిస్థితి కూడా ఏర్పడవచ్చు.

ఆస్తమాతో బాధపడుతున్నవారు..

చలికాలంలో ముఖ్యంగా వృద్ధులలో ఆస్తమా, గుండెజబ్బులు, శ్వాసకోశవ్యాధులు ఉన్నవారి పట్ల మరింత జాగ్రత్తగా ఉండాలి. చలిగాలికి రక్షణ చర్యలు తీసుకోకపోతే జలుబు, తుమ్ములు, గొంతు నొప్పివంటి లక్షణాలు కనిపిస్తే  వెంటనే వైద్యునికి చూపించాలి. ముందుజాగ్రత్తగా పిల్లలకు, వృద్ధులకు చలిగాలి సోకకుండా  స్వెట్టర్‌, మంకీ క్యాప్ లు వాడాలి.

చలికాలంలో ఆస్తమా  రోగులకు చాలా ఇబ్బంది కరంగా ఉంటుంది.  శ్వాస నాళాలలో ఒత్తిడి ఏర్పడి ఊపిరి పీల్చడం కష్టమవుతుంది.  కొంతమందికి ఎలర్జీ, దుమ్ము, పొగ కారణంగా శ్వాసనాళాలలో మెలికలు ఏర్పడి శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది కలుగుతుంది. పొద్దున, రాత్రి సమయంలో దగ్గు ఎక్కువగా వస్తుంది. వేగంగా నడవలేరు. శరీరంలో చురుకుదనం తగ్గుతుంది. కఫం అధికంగా ఏర్పడుతుంది. దగ్గినపుడు కళ్ళె ఆకుపచ్చరంగులో పడుతుంది.  ఆకలి లేకపోవడంతో ఆహారం తీసుకోవడం తగ్గుతుంది. ఆ కారణంగా బలహీనంగా మారుతారు. ఈ సమస్య రాకుండా ఉండాలంటే తక్కువ మోతాదులో ఎక్కువ ఆహారం తీసుకోవాలి. చలిగాలిలోనూ, మంచు కురిసేటప్పుడు బయటకు వెళ్ళకూడదు.వేడి  తగ్గని ఆహారపదార్థాలను మాత్రమే తీసుకోవాలి. చలికాలంలో కూడా రోజుకు 6 నుండి 10 గ్లాసుల వరకూ పరిశుభ్రమైన కాచి చల్లార్చి, వడకట్టిన నీటిని తాగాలి. జలుబు, దగ్గు ఎక్కువగా వుంటే డాక్టర్ ను సంప్రదించాలి.  పొగ, దుమ్ము, ధూళి ఉండే ప్రదేశాలకు దూరంగా ఉండాలి. సిగిరెటు, చుట్టా, బీడి తాగే అలవాటు ఉన్నవారికి దూరంగా ఉండాలి.

By
en-us Political News

  
సూపర్‌మార్కెట్‌లో, షాప్స్ లో, చిన్న అంగళ్లలో కొనుగోలు చేసే బిస్కెట్లు, ప్యాకెట్ ఫుడ్స్, పాల ఉత్పత్తులు, జ్యూస్‌లు, సాస్‌లు, రెడీ టు ఈట్ ఆహార పదార్థాలపై Best Before,Use By, Expiry Date వంటి పదాలు కనిపిస్తుంటాయి,చాలామందికి వీటి మధ్య తేడా స్పష్టంగా తెలియదు.
ఫ్యాటీ లివర్ అంటే ఏమిటి? ఇది ఎందుకు వస్తుంది? లక్షణాలు ఎలా ఉంటాయి? ఎలా గుర్తించాలి? అనే విషయాలను ఈ వీడియోలో డాక్టర్ ఆర్. బాలాజీ సులభంగా వివరిస్తున్నారు.
మునగాకు (Moringa Leaves) మనకు ప్రకృతి అందించిన పోషక విలువలు ఉన్న ఆహారాల్లో ఒకటి. మునగాకులో విటమిన్లు, ఖనిజాలు, యాంటీఆక్సిడెంట్లు వంటి ఎన్నో పోషకాలు ఉంటాయి.
దాహంగా అనిపించినప్పుడు, గొంతు పొడిగా మారినప్పుడు నీరు తాగడం సహజం.  అయితే ఇలా నీరు తాగగానే.. మళ్లీ కాసేపటికే వెంటనే దాహం వేస్తుంది కొందరికి.
రెస్టారెంట్లలో భోజనం తర్వాత స్వీట్ సొంపు ఇస్తుంటారు.  చాలామందికి ఈ సొంపు అంటే చాలా ఇష్టంగా ఉంటుంది.  కొందరు ఇంట్లో కూడా భోజనం తర్వాత స్వీట్ సొంపు తినడం లేదా సొంపు కండ చెక్కర కలిపి తినడం చేస్తుంటారు.
 నేటికాలంలో డెస్క్ ఉద్యోగాలు, గంటల తరబడి స్క్రీన్ చూడటం, ఎక్కువ దూరం ప్రయాణాలు.. ఇవి మాత్రమే కాకుండా తీరిక సమయంలో సోఫాలో కూర్చునే అలవాటు వంటివి  రోజువారీ శారీరక శ్రమను చాలా తగ్గించాయి.
కాకరకాయ అంటే చాలామందికి ముందుగా గుర్తొచ్చేది దాని చేదు రుచే.  అయితే కాకరకాయను చేదు లేకుండా వండే క్రమంలో చాలామంది వాటిని ఉప్పులో, చింతపండు రసంలో నానబెడుతూ ఉంటారు.  వీటి కారణంగా  అందులో విత్తనాలు వచ్చేస్తుంటాయి.
ఆహారాన్ని తాగాలి.. నీళ్లను తినాలి.. అనే మాట మన పెద్దలు తరచుగా చెబుతుంటారు. మొదట వింటే ఇది కాస్త విచిత్రంగా అనిపిస్తుంది.
ఆహారాన్ని తాగాలి.. నీళ్లను తినాలి.. అనే మాట మన పెద్దలు తరచుగా చెబుతుంటారు. మొదట వింటే ఇది కాస్త విచిత్రంగా అనిపిస్తుంది.
గ్యాస్, ఎసిడిటీ, ఛాతిలో మంట, తరచూ తేన్పులు రావడం వంటి సమస్యలను చాలామంది సాధారణమైనవిగా భావించి నిర్లక్ష్యం చేస్తుంటారు.
మోకాళ్ల నొప్పులు, కీళ్ల సమస్యలు ఒకప్పుడు 60–70 ఏళ్ల వయసులో ఎక్కువగా కనిపించేవి. కానీ ఇప్పుడు 40లలో ఉన్నవారిలో కూడా మోకాళ్ల సమస్యలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. కొందరికి చిన్న వయసులోనే Knee Replacement అవసరమయ్యే పరిస్థితి ఎందుకు వస్తోంది?
గుడ్లు పోషకాహారం యొక్క పవర్హౌస్.  ప్రోటీన్, ఆరోగ్యకరమైన కొవ్వులు, అవసరమైన విటమిన్లు గుడ్డులో పుష్కలంగా ఉంటాయి.
కాళ్లు, చేతులు తిమ్మిరిగా అనిపించడం, జలదరింపు రావడం చాలామందికి అప్పుడప్పుడు ఎదురయ్యే సమస్య. ఎక్కువసేపు ఒకే పొజిషన్‌లో కూర్చోవడం లేదా నరాలపై ఒత్తిడి పడటం వల్ల తాత్కాలికంగా తిమ్మిర్లు రావచ్చు.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.