తోబుట్టువుల మధ్య బంధం బలంగా ఉండాలంటే తల్లిదండ్రులు నేర్పించాల్సిన విషయాలు ఇవే..!

Publish Date:Mar 14, 2026

Advertisement

 

ఒకే తల్లి రక్తం పంచుకుని పుట్టినా.. పెద్దయ్యాక జీవితాలు విడివడి దూరం పెరిగే బంధం తోబుట్టువుల బంధం. అయితే ఈ ప్రపంచంలో రక్త సంబంధానికి ఉన్న శక్తి, దాని ప్రత్యేకత చాలా గొప్పది. తల్లిదండ్రులకు చెప్పుకోలేని విషయాలు తోబుట్టువుకు చెప్పుకునే వారు ఎందరో ఉంటారు.   పిల్లల మధ్య ఉన్న తోబుట్టువుల బంధం  జీవితాంతం నిలిచే సంబంధం. ఈ బంధం ప్రేమతో, గౌరవంతో, పరస్పర సహకారంతో ఉండాలంటే తల్లిదండ్రుల పాత్ర చాలా కీలకం.


 తల్లిదండ్రులు చేసే  ప్రవర్తన,  ప్రేమ చూపే విధానం, మందలించే తీరు, పోలికలు పెట్టడం లాంటి వాటి వల్ల ఈ బంధం బలపడవచ్చు లేదా బలహీనమవచ్చు. తోబుట్టువుల బంధం బలంగా ఉండాలంటే తల్లిదండ్రులు నేర్పించాల్సినవి ఏంటో తెలుసుకుంటే..

తోబుట్టువుల బంధం బలంగా ఉండటానికి తల్లిదండ్రులు నేర్పించాల్సిన విషయాలు..

సమాన ప్రేమ, గౌరవం..

తల్లిదండ్రులు పిల్లలను  అందరినీ సమానంగా ప్రేమించడం, గౌరవించడం చాలా ముఖ్యం. “నువ్వు పెద్దవాడివి కాబట్టి ఎప్పుడూ తక్కువగా వాదించు” లేదా “నువ్వు చిన్నవాడివి, నీ అక్క/అన్న మాట విను” అనే మాటలు కొన్నిసార్లు అన్యాయంగా అనిపిస్తాయి. పిల్లలు ఇద్దరూ తల్లిదండ్రుల దృష్టిలో సమానమైనవారమనే భావన కలిగి ఉండాలి. ఇది అసూయ లేదా అసమానత ఫీలింగ్ రాకుండా చేస్తుంది.

 సహకారం, పంచుకోవడం నేర్పించాలి..


చిన్నప్పటి నుంచే కలిసి ఆటలు ఆడించడం, పని చేయించడం, ఒకరికొకరు సహాయం చేసుకోడం అలవాటు చేయాలి. కలసి చేసే పనులు జట్టు భావన,  బాధ్యతా భావం పెంచుతాయి.

కష్టాలు, ఇబ్బందులు పంచుకోవడం.. 

పిల్లలు తమ ఇబ్బందులను ఒకరితో ఒకరు చెప్పుకోవడం, ఒకరికి ఒకరు సహాయం చేసుకోడం, ఒకరి ఇబ్బందులలో మరొకరు తోడు ఉండటం చిన్నతనం నుండే తల్లిదండ్రులు నేర్పించాలి. దీనివల్ల తోబుట్టువు అంటే ధైర్యం, భరోసా ఏర్పడతాయి. 

వివాదాలు వచ్చినప్పుడు న్యాయంగా వ్యవహరించడం..

తల్లిదండ్రులు పిల్లల పట్ల న్యాయంగా ఉండాలి. ఎప్పుడు ఒకరికే తమ సపోర్ట్ ఇవ్వడం, తప్పు చేయకపోయినా ఇంకొకరిని తిట్టడం లాంటివి చేయకూడదు. వివాదాలు, ఇబ్బందులు వచ్చినప్పుడు ఒకరి వెంట మరొకరు ఎలా సపోర్ట్ ఉండాలో కూడా నేర్పించాలి. 

పోలికలు కాదు ప్రోత్సాహం ఇవ్వడం..

“నీ తమ్ముడు బాగా చదువుతున్నాడు, నువ్వు ఎందుకు చదవడం లేదు?” లాంటి పోలికలు బంధాన్ని పాడుచేస్తాయి. ప్రతిఒక్కరి బలాలు వేరు.  ఒకరు చదువులో, మరొకరు క్రీడల్లో మెరుస్తారు.  “నీకు వంట బాగా వస్తుంది, నీ అక్క డ్రాయింగ్ బాగా వేస్తుంది”  ఇలాంటి మాటలు  వల్ల ఇద్దరూ తమతమ ప్రతిభను గౌరవిస్తారు.

  సమయం కేటాయించడం..

పిల్లలతో సమయం గడపడటం చాలా ముఖ్యం. మరీ ముఖ్యంగా పిల్లల అభిరుచిని బట్టి వారికి సమయాన్ని కేటాయించాలి.  ఇలా చేస్తే పిల్లలందరికీ తల్లిదండ్రులు “నన్ను ప్రత్యేకంగా చూసుకుంటున్నారు” అనే భావన వస్తుంది.  ఇది అసూయ తగ్గిస్తుంది.

ప్రేమ చూపే విధానం నేర్పించడం..

తోబుట్టువులు ఒకరికి ఒకరు ప్రేమ చూపడం, క్షమించుకోవడం నేర్పించాలి. “అన్నకు sorry చెప్పు” అనడం కాకుండా, “నీ మాట వల్ల అన్నకి బాధ కలిగింది, ఇప్పుడు ఎలా సరిచేస్తావు?” అని అడగాలి.  ఇది మనసును అర్థం చేసుకునే నైపుణ్యాన్ని పెంచుతుంది.


                          *రూపశ్రీ.

By
en-us Political News

  
చిన్నతనం అంటేనే ఆటలు, అల్లరి పనులు, చిన్న చిన్న గొడవలు. పిల్లలు చిన్నతనంలో ఉన్నప్పుడు స్నేహితులు, తమ తోటి పిల్లలతో ఆడుకుంటారు.. అలాగే కొన్ని సార్లు గొడవలు కూడా పడతారు.
వయసు పైబడే కొద్దీ, చాలా మంది తల్లిదండ్రులకు రోజువారీ పనులలో సహాయం అవసరం అవుతుంది. ఉద్యోగాల రీత్యా పిల్లలు దూరంగా ఉండటం లేదా విదేశాల్లో ఉండటం జరుగుతుంది. ఇలాంటి పరిస్థితులలో పిల్లలు తల్లిదండ్రుల కోసం పిల్లలు కేర్ టేకర్ ను నియమించుకోవాలని అనుకుంటారు.
 పిల్లల ముందు బట్టలు మార్చుకోవడం వల్ల పెద్దగా నష్టం ఏమీ ఉండదని అనుకుంటారు.  సాధారణంగా ఇంట్లో మగవాళ్లు అయినా ఆడవాళ్లు అయినా పిల్లలు ఉన్నా పెద్దగా పట్టించుకోకుండా బట్టలు మార్చుకుంటారు.
5 Habits Every Father Should Give Up for His Daughter,Every Father Needs to Hear These 5 Parenting Tips,5 Habits to Leave Behind
Signs of a Healthy Family Environment,Healthy Family or Toxic EnvironmentIs Your Family Environment Healthy
పిల్లల వ్యక్తిత్వం, ఆత్మవిశ్వాసం , ఆలోచనా విధానం మొదలైన విషయాలలో  తల్లిదండ్రులిద్దరూ కీలక పాత్ర పోషిస్తారు. తల్లి ప్రేమ, శ్రద్ధ పిల్లల భావోద్వేగ పునాదిని బలపరిస్తే.. తండ్రి ప్రవర్తన, క్రమశిక్షణ, మాటతీరు,   జీవనశైలి వంటివి  పిల్లలపై చాలా గట్టి  ప్రభావాన్ని చూపుతాయి.
ప్రతి వ్యక్తికి తన జీవితంలో బోలెడు బలం, ప్రశాంతత,  ఆత్మవిశ్వాసం,  జీవితం మీద భరోసా కలిగేది కుటుంబం వల్లనే.
వివాహం కేవలం ఇద్దరు వ్యక్తుల మధ్య ముడిపడేదే కాదు.. రెండు కుటుంబాల మధ్య ముడిపడే బంధం. భారతదేశంలో చాలా వరకు వివాహం తర్వాత అమ్మాయి అత్తవారింటికి వెళుతుంది. భర్త, అత్తమామలతో కలిసి జీవిస్తుంది. అత్తారింట్లో అత్తమామలు మంచివాళ్లు, కోడలిని అర్థం చేసుకుని బాగా చూసుకునేవాళ్లు అయితే ఆ ఇంట్లో ఆడపిల్ల సంతోషంగా ఉంటుంది...
వేసవి సెలవలు పూర్తయ్యాక పిల్లలు స్కూల్ కు వెళ్లడం అనేది సహజం. పాఠశాలకు వెళ్లడం పిల్లల జీవితంలో పెద్ద మార్పుగా మారుతుంది. మరీ ముఖ్యంగా కొత్తగా స్కూల్ లో జాయిన్ అయిన పిల్లల విషయంలో...
ప్రజల జీవితాలలో ముఖ్యమైనవి సంబంధాలు. నేటికాలంలో ఇంటర్నెట్, డిజిటల్ పరంగా ఎంత దూరంలో ఉన్నా ఎవరినీ పెద్దగా మిస్ కాకుండా పక్కనే ఉన్నట్టుగా పోన్ మాట్లాడటం, వీడియో కాల్స్ చేయడం వంటి మార్గాలలో దగ్గరగానే ఉన్నట్టు ఫీల్ అవుతారు. కానీ బంధాల మధ్య గతంలో కంటే అపార్థాలు, గొడవలు, అతిగా స్పందించడం..
మొబైల్ వ్యసనం మీ మెదడుపై ఎలాంటి ప్రభావం చూపుతుంది? ఏకాగ్రత, జ్ఞాపకశక్తి, నిద్ర, మానసిక ఆరోగ్యంపై మొబైల్ వల్ల కలిగే సమస్యలు మరియు వాటి నుంచి బయటపడే మార్గాలను MindVision వేణుగోపాల్ ఈ వీడియోలో సులభంగా వివరించారు...
ఒక ఉత్తమమైన తరాన్ని సమాజానికి ఇచ్చే ఉద్దేశంతో వివాహం చేసుకుంటారని పెద్దలు చెబుతారు. ఆరోగ్యకరమైన బంధం ద్వారా  ఒక మంచి తరం తయారవుతుంది. కుటుంబం విషయానికి వస్తే.. వంశం ముందుకు సాగడం అనేది పిల్లల ద్వారానే జరుగుతుంది...
నేటి కాలంలో, సంబంధాలు బలపడటానికి , విచ్ఛిన్నం కావడానికి కమ్యూనికేషన్ సరిగా లేకపోవడమే అతిపెద్ద కారణంగా మారింది. అది కుటుంబ సంబంధం అయినా, స్నేహ సంబంధం అయినా, లేదా మరేదైనా వ్యక్తిగత సంబంధం అయినా..
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.