వరల్డ్ కప్ జట్టులో హైదరాబాద్ కుర్రోడు?

Publish Date:Aug 11, 2023

Advertisement

అజారుద్దీన్, వీవీఎస్ లక్ష్మణ్  తరువాత  హైదరాబాద్ నుంచి అంతర్జాతీయ స్థాయికి ఎదిగిన క్రికెటర్లు పెద్దగా కనిపించరు. ఒక వేళ అడపాదడపా ఒకరిద్దరికి చాన్స్ వచ్చినా అది ఇలా వచ్చి అలా వెళ్లిపోయినట్లే కనిపిస్తోంది తప్ప వారికి పెద్దగా గుర్తింపు కూడా రాలేదు. ఇక అంబటి రాయుడు ఉన్నా అతని కెరీర్ మొత్తం వివాదాలతోనే సరిపోయింది. అర్హత ఉండి కూడా వివాదాల కారణంగానే వరల్డ్ కప్ కు అవకాశం లేకుండా పోయిందని అంటారు. అందుకు అలిగి ఆయన క్రికెట్ కు గుడ్ బై చెప్పేశాడు.

అయితే ఇప్పడు అంతర్జాతీయ స్థాయిలో స్థిరంగా సత్తాచాటే సామర్థ్యం హైదరాబాద్ కుర్రోడు తిలక్ లో ఉందని, ధోనీ లాంటి ఫినిషర్, సెహ్వాగ్ లాంటి అగ్రెసివ్ నెస్, కోహ్లీ లాంటి క్లాస్ తిలక్ లో ఉన్నాయనీ క్రీడా పండితులు చెబుతున్నారు. టి20లలో అరంగేట్రంలోనే విండీస్ పై తన ఆగమనాన్ని ఘనంగా చాటాడు తిలక్. అలాంటి తిలక్ కు ఈ ఏడాది జరిగే వరల్డ్ కప్ కు ఎంపిక అయ్యే చాన్స్ ఉందని చెబుతున్నారు. మొత్తంగా భారత క్రికెట్ లో గట్టిగా వినిపిస్తున్న పేరు తిలక్ వర్మ.  వెస్టిండీస్‌తో టీ20 సిరీస్‌తో తొలి సారిగా ఇండియన్ క్యాప్ ధరించిన తిలక్ వర్మ  మూడు వన్డేలలోనూ వరుసగా 39, 51, 49 నాటౌట్‌ స్కోర్లతో  కీలక ఇన్నింగ్స్ ఆడాడు.  

మూడు మ్యాచ్‌ల్లోనూ జ‌ట్టు ఇబ్బందిక‌ర ప‌రిస్థితుల్లో ఉన్న‌ప్పుడు క్రీజులోకి వచ్చి జట్టును ఆదుకున్నాడు. 20 ఏళ్ల వ‌య‌సులోనే  బ్యాటింగ్ లో అతడు చూపుతున్న ప్రతిభ, పరిణితి టాక్ ఆప్ ది క్రికెట్ గా మారిపోయిందంటే అతిశయోక్తి కాదు. ఈ నేపథ్యంలోనే మరో రెండు నెలలలో వరల్డ్ కప్ టోర్నీ ప్రారంభం కానుంది. ఆ వరల్డ్ కప్ కు ఇండియా తరఫున ఆడే ఆటగాళ్ల ఎంపిక విషయంలో సెలక్టర్లు ఒక అంచనాకు వచ్చేసి ఉన్నాయి. అయితే జట్టు ఎంపిక విషయంలో తిలక్ వర్మ పేరును పరిశీలించకుండా ఉండే పరిస్థితి లేదని మాజీలు గట్టిగా చెబుతున్నారు.

 వెస్టిండీస్‌తో టీ20ల్లో తిల‌క్ వ‌ర్మ ఆట చూసిన తరువాత ఇండియన్ క్రికెట్ కు మరో స్టార్ లభించాడని అర్ధమైపోయిందని మాజీ క్రికెటర్ వ‌సీం జాఫ‌ర్ అన్నాడు. ప్ర‌పంచ‌క‌ప్‌కు కోసం టీమ్ఇండియా తరఫున ఆడే ఆటగాళ్లలో తిలక్ వర్మ కచ్చితంగా ఒకడిగా ఉంటాడని విశ్వాసం వ్యక్తం చేశాడు.  టి 20లలో రాణించినంత మాత్రాన వన్డేల్లో అదరగొడతాడన్న నమ్మకం ఏముందని ప్రశ్నించే వారు సూర్యకుమార్ యాదవ్ ను ఉదాహరణగా చూపుతున్నారు. టి20ల్లో అదరగొట్టే సూర్యకుమార్ యాదవ్ వన్డేల్లో తేలిపోవడాన్ని గుర్తు చేస్తున్నారు.  అయితే తిలక్ వర్మ విషయం వేరనీ, లిస్ట్‌-ఏ క్రికెట్‌లో తిలక్ వ‌ర్మ‌కు అద్భుత‌మైన గ‌ణాంకాలు ఉన్నాయ‌ని, అత‌డిని వ‌న్డేల్లో ఆడిస్తే మంచి ఫ‌లితాలు రాబ‌ట్ట‌వ‌చ్చున‌ని   భార‌త మాజీ చీఫ్ సెల‌క్ట‌ర్ ఎమ్ఎస్‌కే ప్ర‌సాద్ గట్టిగా చెబుతున్నారు.  

లిస్ట్‌-ఏ క్రికెట్‌లో హైద‌రాబాద్ త‌రుపున 25 మ్యాచులు ఆడిన తిల‌క్ 56.18 స‌గ‌టుతో 1,236 ప‌రుగులు చేశాడు. వీటిలో ఐదు శ‌త‌కాలు, ఐదు అర్థ‌శత‌కాలు ఉన్నాయి.   వన్డేల్లో ఫినిషర్ పాత్రకు తిలక్ వర్మ కచ్చితంగా అతికినట్టుగా సరిపోతాడని, సెలక్టర్ లు అతడిని పరిగణనలోనికి తీసుకోకతప్పదని అంటున్నారు. 

By
en-us Political News

  
ఒక దశలో తన రిటైర్మెంట్ తరువాత టీడీపీలో చేరేందుకు కూడా తాను సిద్ధపడ్డాననీ, అవసరమైతే  ఎన్నికల బరిలో దిగడానికి కూడా రెడీ అయ్యాయనీ చెప్పిన ఏబీ వెంకటేశ్వరరావు, అ
బీసీ మోర్చా రాష్ట్ర అధ్యక్షుడు ప్రకాశ్ పాల్, ప్రముఖ దళిత నేత, మాజీ ఎంపీ విద్యాసాగర్ సోన్‌కర్, అలాగే అలహాబాద్ హైకోర్టు బార్ అసోసియేషన్ అధ్యక్షుడిగా రెండుసార్లు బాధ్యతలు నిర్వర్తించిన రాధాకాంత్ ఓఝా వంటి వారికి చోటు లభించింది.
జిల్లాలో పార్టీ పరిస్థితి వేగంగా దిగజారిపోతోంది. మజ్జి పార్టీని వీడటంతో జాగ్రత్త పడాల్సిన పార్టీ హైకమాండ్, అలాగే బొత్స సత్యనారాయణ చేతులెత్తేసినట్లు కనిపిస్తోంది. అంతే కాకుండా కూర్చున్న కొమ్మనే నరుక్కున్న చందంగా అసంతృప్తులను బుజ్జగించాల్సింది పోయి వారిపై సస్పెన్షన్ వేటు వేయడంతో జిల్లాలో పార్టీని జీరో నుంచి బిల్డ్ చేద్దామనుకుంటున్నారా? లేక జిల్లా పార్టీని వదిలేశారా అన్న అనుమానాలు పార్టీ శ్రేణుల నుంచే వస్తున్నాయి. 
ఆంధ్రప్రదేశ్ రాజకీయ రంగంలో ప్రతి క్షణం ఒక కొత్త మలుపు తిరుగుతోంది.
పొలిటికల్ సర్కిల్స్ లో గట్టిగా వ్యక్తం అవుతున్న అభిప్రాయం ఏమిటంటే.. మీడియా సమావేశాలలో జగన్ మాట్లాడే విధానం కంటే విజయసాయి రెడ్డి మాట్లాడే విధానం చాలా చాలా బెటర్ అని. 
అయితే ఆయన  తాజాగా   నిర్వహించిన కార్యకర్తల సమావేశం మాత్రం భిన్నంగా జరిగింది. ఆ సమావేశంలో ఆయన మాట్లాడిన మాటలు,  వ్యక్తం చేసిన అసహనం వైసీపీవర్గాలలో  కలకలం రేపింది. 
జనసేన, బీజేపీ నాయకులు ప్రభుత్వ కార్యక్రమాల్లో పెద్దగా భాగస్వాములు కావడం లేదు.  ప్రతి నెలా పెన్షన్ల పంపిణీలో టీడీపీ నేతలు, కార్యకర్తలు చురుకుగా పాల్గొంటుంటే.. జనసేన, బీజేపీ నాయకుల భాగస్వామ్యం నామమాత్రంగా ఉంటోందనీ, ఇది కూటమి పార్టీల మధ్య సమన్వయ లోపం ఉందా అన్న అనుమానాలను కలిగిస్తోందనీ సర్వేలో వెల్లడైన జనాభిప్రాయం. 
ఈ ప్రధాన పార్టీల వ్యూహాలకు తోడుగా మరికొన్ని రాజకీయ  పార్టీలో కూడా తమ ఉనికిని బలంగా చాటేందుకు ఖైరతాబాద్ ఉప ఎన్నిక బరిలోకి దిగడానికి సిద్ధమౌతున్నాయి. కల్వకుంట్ల కవిత నేతకూడా రంగంలోకి దిగుతుండటంతో పోటీ ఊహించని మలుపు తిరుగుతోంది.  
గత కొన్నేళ్లుగా  చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్ పలు సందర్భాల్లో ఒకే వేదికను పంచుకుంటూ వచ్చారు.  ముఖ్యమైన ప్రజా వేడుకల్లో వీరిద్దరూ కలసి పాల్గొనడం ఆనవాయితీగా మారింది. అయితే గత కొద్ది నెలలుగా ఇరువురూ ఒకే వేదికపై కనిపించడం లేదు. 
 విదేశీ పర్యటన ముగించుకుని ఇప్పటికే రాష్ట్రానికి తిరిగి వచ్చిన ముఖ్యమంత్రి చంద్రబాబు,  తన విధుల్లోకి నిమగ్నమయ్యారు. నేరుగా నెల్లూరు జిల్లాకు చేరుకుని  పల్లె పండుగ కార్యక్రమంలో ఆయన ఉత్సాహంగా పాల్గొన్నారు.
రామాయణం ప్రకారం లంకకు బయలుదేరే ముందు శ్రీరాముడు స్వయంగా మహాదేవుడిని పూజించాడని, ఈ చారిత్రక, పౌరాణిక విషయాలపై  అవగాహన లేని రేవంత్ వంటి వారు ఇటువంటి కువిమర్శలు చేస్తున్నారని బీజేపీ నేతలు మండిపడుతున్నారు.
ప్రాథమిక దశలో ఈ మరణాన్ని సాధారణ గుండెపోటుగా చిత్రీకరించే ప్రయత్నాలు జరగడం, ఆ తర్వాత హత్యగా తేలింది.  వైఎస్ హత్య వెనుక కొన్ని పెద్ద తలకాయల  ప్రయోజనాలు దాగున్నాయని వైఎస్ వివేకా కుమార్తె బహిరంగంగానే ఆరోపించారు.
బీఆర్ఎస్   బయటకు వచ్చిన తర్వాత కల్వకుంట్ల కవిత   తెలంగాణ రక్షణ పేన పేరుతో  కొత్త రాజకీయ పార్టీని ఏర్పాటు చేసిన సంగతి తెలిసిందే. భౌగోళిక తెలంగాణ సిద్ధించినప్పటికీ ప్రజలు ఆశించిన ఆశయాలు నెరవేరలేదని.. సామాజిక తెలంగాణ సాధన ద్వారా మాత్రమే ప్రత్యేక రాష్ట్ర సాకారానికి సార్థకత లభిస్తుందని కవిత పదేపదే చెబుతున్నారు.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.