తొలి విడతలో.. బీజేపీ, కాంగ్రెస్ కూటములు నువ్వా నేనా!

Publish Date:Apr 18, 2024

Advertisement

దేశంలో వేసవిని మించి పొలిటికల్ హీట్ ఉంది. దేశంలో ఏడు విడతల్లో సాగే సార్వత్రిక ఎన్నికలలో భాగంగా తొలి విడత పోలింగ్ కు సర్వం సిద్ధమైంది. మొత్తం 21 రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల్లో తొలి దశ పోలింగ్ జరగనుంది. తొలిదశలో మొత్తం 102 లోక్ సభ నియోజకవర్గాలకు పోలింగ్ నిర్వహిస్తారు. తొలివిడత ఎన్నికలు జరిగే రాష్ట్రాల్లో తమిళనాడు లోని మొత్తం 39 నియోజకవర్గాలకు ఒకే విడతలో పోలింగ్ జరగనుంది.   అసోం, అరుణాచల్ ప్రదేశ్ లో రెండేసి స్థానాలకు, చత్తీస్ గఢ్ లో ఒక స్థానానికి ఎన్నికలు జరుగుతాయి. మధ్యప్రదేశ్ లో ఆరు, మహారాష్ట్రలో ఐదు నియోజకవర్గాలకు పోలింగ్ నిర్వహిస్తారు.

వీటితోపాటు బీహార్‌లో నాలుగు నియోజకవర్గాలకు మణిపూర్, మేఘాలయలో రెండు  , మిజోరాం, నాగాలాండ్, సిక్కిం, త్రిపురలో ఒక్కో నియోజకవర్గానికి ఎన్నికలు జరుగుతాయి. అంతే కాదు రాజస్థాన్ లో 12 స్థానాలకు, ఉత్తరప్రదేశ్ లో ఎనిమిది, ఉత్తరాఖండ్ లో ఐదు , పశ్చిమ బెంగాల్‌లో మూడు నియోజ కవర్గాలు పోలింగ్ జరుగుతుంది. వీటితోపాటు పశ్చిమ బెంగాల్, బీహార్ రాష్ట్రాలలో కూడా తొలిదశలో భాగంగా కొన్ని నియోజకవర్గాలకు పోలింగ్ జరుగుతుంది. తమిళనాడులో  మొత్తం 39 నియోజవర్గాల్లో ఈనెల 19న ఒకేదఫా ఎన్నికలు జరుగుతాయి. దేశవ్యాప్తంగా అన్ని లోక్‌సభ నియోజకవర్గాలకు ఒకే దశలో పోలింగ్ జరుగుతున్న ఏకైక రాష్ట్రం తమిళనాడు కావడం విశేషం. తమిళనాడు రాజకీయాలు ఈసారి అందరినీ ఆకట్టుకుంటున్నాయి. సహజంగా తమిళనాట ఎప్పుడూ ఎన్నికల గోదాలో రెండు శిబిరాలే తలపడతాయి. అయితే ఈసారి లోక్‌సభ ఎన్నికల్లో మూడు కూటములు బరిలో ఉన్నాయి. ఇందులో మొదటిది డీఎంకే, కాంగ్రెస్ కూటమి. డీఎంకే ప్రస్తుతం తమిళనాట అధికారంలో ఉంది. కాంగ్రెస్ నాయకత్వంలోని   కూటమిలో కూడా డీఎంకే కూడా భాగస్వామిగా ఉంది. ఈ నేపథ్యంలో డీఎంకే సాయంతో తమిళనాడులో కొన్ని సీట్లు అయినా సునాయాసంగా గెలుచుకోవాలని కాంగ్రెస్ భావిస్తోంది. మరోవైపు ప్రధాన ప్రతిపక్షంగా ఉన్న పళనిస్వామి నాయకత్వంలోని అన్నా డీఎంకే కూడా లోక్‌సభ ఎన్నికల బరిలో ఉంది. కాగా అన్నాడీఎంకేతో తాజాగా సినీ నటుడు విజయ్‌కాంత్ నాయకత్వంలోని డీఎండీకే జత కట్టింది. డీఎండీకే కు ఐదు సీట్లు ఇవ్వడానికి పళనిస్వామి అంగీకరించారు. అలాగే ఎస్డీపీఐ, పుదియ తమిళగం పార్టీలకు ఒక్కో సీటు కేటాయించారు పళనిస్వామి. ఇదిలా ఉంటే మజ్లిస్ పార్టీతో అన్నా డీఎంకే తాజాగా పొత్తు పెట్టుకుంది. ఈ పొత్తుతో ముస్లిం మైనారిటీలు తమకు అనుకూలంగా ఓటు వేస్తారని అన్నాడీఎంకే భావిస్తోంది. కాగా భారతీయ జనతా పార్టీ 19 స్థానాలకు పోటీ చేస్తోంది. బీజేపీతో పొత్తు పెట్టుకున్న అన్బుమణి పట్టాళి మక్కళ్ మున్నేట్ర కజగం పది చోట్ల పోటీ చేస్తోంది. అలాగే పొత్తులో ఉన్న చిన్న పార్టీలకు కూడా ఒకటి రెండు చోప్పున బీజేపీ  సీట్లు  కేటాయించింది. తమిళనాడులో నిన్నమొన్నటివరకు బీజేపీకి పెద్దగా బలం కానీ, గుర్తింపు కానీ లేదు.  ఒకసారి డీఎంకేతో మరోసారి అన్నాడీఎంకేతో పొత్తు పెట్టుకుంటూ ఏదో ఉనికి మాత్రంగా రాష్ట్రంలో ఆ పార్టీ ఉండేది.  అయితే  తమిళనాడు బీజేపీ పగ్గాలు అన్నామలై చేపట్టిన తరువాత ఆ పార్టీ అనూహ్యంగా పుంజుకుందని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.  కోయంబత్తూరు నియోజకవర్గం నుంచి అన్నామలై బరిలో నిలిచారు.తమిళనాడులో ఇప్పటికే ప్రధాని నరేంద్ర మోడీ ప్రచారం హోరెత్తించారు. దశాబ్దాల నాటి కచ్చతీవు దీవిని ప్రచారాస్త్రాంగా చేసుకున్నారు. మన భూభాగంలో భాగమైన కచ్చతీవు దీవిని శ్రీలంకకు ఇచ్చేసి తమిళుల ప్రయోజనాలను అప్పటి కాంగ్రెస్ ప్రభుత్వం దెబ్బతీసిందని మండిపడ్డారు. తూత్తుకుడిలో భారీ సభ నిర్వహించి తమిళనాడుకు వరాలు ప్రకటించారు. 

ఇక యూపీ విషయానికి వస్తే ఆ రాష్ట్రంలో అత్యధికంగా 80 లోక్‌సభ సీట్లున్నాయి. కేంద్రంలో మూడోసారి అధికారంలోకి రావాలంటే ముందుగా ఉత్తరప్రదేశ్‌లో భారతీయ జనతా పార్టీ సత్తా చాటాల్సి ఉంటుంది. ఏప్రిల్ 19న ఉత్తరప్రదేశ్‌లోని ఎనిమిది నియోజకవర్గాల్లో ఎన్నికలు జరగబోతున్నాయి. తొలి విడత ఎన్నికలు జరగనున్న జాబితాలో సహరన్‌పూర్, కైరానా, ముజఫర్‌నగర్‌, బిజ్నూర్‌, నగీనా, రాంపూర్‌, పిల్‌భిత్ నియోజకవర్గాలున్నాయి. ఈ ఎనిమిదిలో ముజఫర్‌నగర్, కైరానా, పిల్‌భిత్..బీజేపీ సిట్టింగ్ సీట్లు.  ల్‌భిత్ బీజేపీ సిట్టింగ్ ఎంపీ వరుణ్ గాంధీకి ఈసారి టికెట్ ఇవ్వలేదు. యోగి ఆదిత్యనాథ్ క్యాబినెట్‌లో మంత్రిగా ఉన్న జితిన ప్రసాద్‌కు పిల్‌భిత్ టికెట్ కేటాయించింది బీజేపీ అధిష్టానం. రాష్ట్రంలోని కొన్ని ప్రాంతాల్లో సత్తా చూపగల ఉప ప్రాంతీయ పార్టీలతో బీజేపీ పొత్తు పెట్టుకుంది. ఇటీవల జయంత్ చౌధురి నాయకత్వంలోని  రాష్ట్రీయ లోక్‌దళ్ తో బీజేపీ పొత్తు కుదుర్చుకుంది. రాష్ట్రీయ లోక్‌దళ్ కు పశ్చిమ ఉత్తరప్రదేశ్‌లో గట్టి పట్టుంది. అంతేకాదు ఆర్ఎల్‌డీ మద్దతుతో జాట్ సామాజికవర్గం ఓట్లు గంపగుత్తగా తమకే పడతాయని బీజేపీ ఆశిస్తోంది. అలాగే ఉత్తరప్రదేశ్‌లోని మరో ఉప ప్రాంతీయ పార్టీ భారతీయ సమాజ్‌ పార్టీతోనూ కమలం పార్టీకి పొత్తు ఉంది. సుహేల్‌దేవ్ నాయకత్వంలోని భారతీయ సమాజ్ పార్టీ …పూర్వాంచల్ ప్రాంతంలో బలంగా ఉంది. దీంతో పూర్వాంచల్ ప్రాంతం ఓట్లు తమ ఖాతాలోనే పడతాయన్న ధీమా వ్యక్తం చేస్తున్నారు బీజేపీ నేతలు. ఉత్తరప్రదేశ్‌లోని మొత్తం 80స్థానాలనూ గెలుచుకోవాలని బీజేపీ లక్ష్యంగా పెట్టుకుంది. ఆయోధ్యలో రామ జన్మభూమి మందిరం నిర్మాణం, బాల రాముడి ప్రతిష్టతో ప్రజల్లో పెరిగిన సెంటిమెంట్ ను ఓట్లుగా మరల్చుకోవాలనే లక్ష్యంతో మందుకు సాగుతోంది. అలాగే ప్రధాని నరేంద్ర మోడీకి ఉన్న వ్యక్తిగత ఇమేజ్ ఓట్లు రాలుస్తుందని భరోసాతో ఉన్నారు కమలనాథులు. కాగా కాంగ్రెస్‌, సమాజ్‌వాదీ పార్టీ మధ్య సీట్ల పంపకం ఒక కొలిక్కి వచ్చింది. కాంగ్రెస్‌కు 17 సీట్లు కేటాయించింది సమాజ్‌వాదీ పార్టీ. మిగతా 63 సీట్లలో సమాజ్‌వాదీ పార్టీ సహా ఇండియా కూటమిలోని మిగతా భాగస్వామ్యపక్షాలు పోటీ చేస్తున్నాయి.

ఇక బీహార్ విషయానికి వస్తే..  బీహార్లో మొత్తం 40 లోక్‌సభ సెగ్మెంట్లున్నాయి. కాగా ఏప్రిల్ 19న ఈ రాష్ట్రంలోని నాలుగు నియోజకవర్గాలు ఔరంగాబాద్‌, నవాడా, గయ, జమూయ్ నియోజకవర్గాల్లో పోలింగ్ జరుగుతుంది. ఈసారి బీహార్‌లో జరిగే లోక్‌సభ ఎన్నికలు ముఖ్యమంత్రి నితీశ్‌ కుమార్ కు ప్రతిష్టాత్మకంగా మారాయి. మారిన సమీకరణాల నేపథ్యంలో కొన్ని నెలలకిందటే  జేడీ యూ అధినేత నితీశ్‌ కుమార్ రాజకీయంగా యూ టర్న్ తీసుకున్నారు. ఇండియా కూటమి నుంచి వైదొలగారు. మళ్లీ ఎన్డీయే కూటమిలోకి ఎంట్రీ ఇచ్చారు. బీజేపీ అండతో తొమ్మిదోసారి బీహార్ ముఖ్యమంత్రిగా నితీశ్ కుమార్ ప్రమాణస్వీకారం చేశారు. దీంతో సామాన్య ప్రజల్లో నితీశ్ కుమార్‌కు అవకాశవాది అనే ముద్ర పడింది. నితీశ్ కుమార్ పొలిటికల్‌గా యూ టర్న్ తీసుకున్న తీరు ఎన్డీయే కూటమికి మైనస్ పాయింట్ అవుతుందని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. ఈ బీహార్లో మెజారిటీ యాదవ సామాజికవర్గాన్ని రాష్ట్రీయ జనతాదళ్‌ వైపు మళ్లించడంలో తేజస్వి యాదవ్  సక్సెస్ అయినట్లు చెబుతున్నారు. అలాగే ముస్లిం మైనారిటీలు కూడా మహాఘట్‌బంధన్‌కు అనుకూలంగా మారారని అంటున్నారు. బీజేపీ, నితీశ్‌ కుమార్ నాయకత్వంలోని జేడీ యూ ఒక కూటమిగా ఈసారి ఎన్నికల్లో పోటీ చేస్తున్నాయి. ఈ కూటమిలో మరికొన్ని చిన్న చిన్న పార్టీలు కూడా ఉన్నాయి. పొత్తులో భాగంగా భారతీయ జనతా పార్టీ 17 స్థానాల్లో పోటీ చేస్తోంది. కాగా జనతాదళ్‌ యునైటెడ్ పార్టీ 16 సీట్లలో బరిలో దిగుతోంది. కాగా బీహార్‌లో కాంగ్రెస్, అలాగే లాలూ ప్రసాద్ యాదవ్ నాయకత్వంలోని రాష్ట్రీయ జనతాదళ్ ఒక కూటమిగా పోటీ చేస్తున్నాయి. 

ఇక మహారాష్ట్ర విషయానికి వస్తే..ఈ రాష్ట్రంలో  48 లోక్ సభ స్థానాలున్నాయి.  ఒకప్పుడు మహారాష్ట్ర రాజకీయాలను శాసించిన ఆరు పార్టీలు ప్రస్తుతం రెండు కూటములుగా ఏర్పడ్డాయి.  ఒకవైపు ఉద్ధవ్ థాక్రే నాయకత్వంలోని శివసేన , కాంగ్రెస్, నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ , మరోవైపు భారతీయ జనతా పార్టీ, ముఖ్యమంత్రి ఏక్‌నాథ్ షిండే నాయకత్వంలోని శివసేన వర్గం, ఉప ముఖ్యమంత్రి అజిత్ పవార్ నాయకత్వంలోని ఎన్సీపీ వర్గం ఉన్నాయి. మహారాష్ట్ర రాజకీయాలను శివసేన చాలాకాలం పాటు శాసించింది. శివసేన హవా బలంగా వీచినంత కాలం మహారాష్ట్రలో బీజేపీ స్వంతంగా పాగా వేయలేకపోయింది. అయితే శివసేనలో చీలిక..  శరద్ పవార్ నాయకత్వంలోని నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీలో చీలికల  నేపథ్యంలో  రాష్ట్రంలో బీజేపీ పట్టు సాధించింది. 

ఇక రాజస్థాన్ విషయానికి వస్తే..  రాజస్థాన్‌లో మొత్తం 25 నియోజకవర్గాలున్నాయి. తొలి దశలో అల్వార్, భరత్ పూర్, బికనీర్, చురు, దౌసా, గంగానగర్, జైపూర్ అర్బన్‌, జైపూర్ రూరల్, ఝుంఝును, కరౌలి-ధోల్పూర్, నాగౌర్, సికార్ నియోజకవర్గాలకు పోలింగ్ జరుగుతుంది. ఈ రాష్ట్రంలో ప్రతి ఐదేళ్ల కొకసారి రాష్ట్ర ప్రభుత్వం మారే ఆనవాయితీ ఉంది. కొన్ని దశాబ్దాలుగా ఒక టర్మ్ అధికారంలో ఉన్న పార్టీ వరుసగా మళ్లీ అధికారంలోకి వచ్చిన దాఖలాలు లేవు. రాజుల కోటగా పేరున్న రాజస్థాన్‌ ప్రస్తుతం భారతీయ జనతా పార్టీకి అడ్డాగా ఉంది.  2014, 2019 ఎన్నికల్లో రాజస్థాన్‌లోని మొత్తం 25 లోక్ సభ స్థానాలనూ బీజేపీ గెలుచుకుంది. సారి కూడా క్లీన్ స్వీప్ చేయాలన్న పట్టుదలతో కమలం పార్టీ ఉంది. 
ఇక కాంగ్రెస్ విషయానికొస్తే రాజస్థాన్ లో ఆ పార్టీ పరిస్థితి దయనీయంగా ఉంది. కొన్ని నెలల కిందట జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పరాజయం పాలైంది. ఈ పరాజయం నుంచి ఇప్పటికీ కాంగ్రెస్ పార్టీ కోలుకోలేకపోయింది. ఈ పరిస్థితుల్లో   ఈ ఎన్నికల్లో ఎలాగైనా బోణీ కొట్టాలని కాంగ్రెస్ భావిస్తోంది.  మొత్తం మీద రాజస్థాన్‌పై కాంగ్రెస్ పార్టీ పెద్దగా ఆశలు పెట్టుకోలేదన్నది పరిశీలకుల విశ్లేషణ.

By
en-us Political News

  
బీఆర్ఎస్‌ నుంచి గెలిచి కాంగ్రెస్‌లో చేరిన స్టేషన్‌ఘన్‌పూర్, భద్రాచలం ఎమ్మెల్యేలు కడియం శ్రీహరి, తెల్లం వెంకట్రావులకు తెలంగాణ హైకోర్టు నోటీసులు జారీ చేసింది. పార్టీ ఫిరాయించిన వారిపై అనర్హత వేటు వేయాలంటూ కుత్బుల్లాపూర్ బీఆర్ఎస్ ఎమ్మెల్యే కేపీ వివేకానంద దాఖలు చేసిన పిటిషన్‌ను హైకోర్టు నిన్న విచారించింది.
పెన్షన్లను సకాలంలో అందించాలని ఏపీ ప్రభుత్వానికి కేంద్ర ఎన్నికల సంఘం స్పష్టమైన ఆదేశాలను జారీ చేసిన సంగతి తెలిసిందే. ఎన్నికల కోడ్ నేపథ్యంలో లబ్ధిదారులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా పెన్షన్లను అందించాలని ఆదేశించింది. పెన్షన్ల పంపిణీకి సచివాలయ ఉద్యోగులను వాడుకోవాలని తెలిపింది. 
బాధితుల్ని కాపాడాల్సిన పోలీసులే అల్ల‌రి మూక‌ల‌కు అప్ప‌గిస్తే ఫ‌లితం ఎలా వుంటుందో మ‌ణిపూర్ మ‌హిళ‌ల అత్యాచార సంఘ‌ట‌న అద్దం ప‌డుతుంది. ఈ కేసుకు సంబంధించిన ఛార్జి షీటులో సీబీఐ కొందరు పోలీసుల పేర్లను చేర్చింది. బాధిత మహిళలను పోలీసులే స్వయంగా నిందితుల ముందు వదిలిపెట్టారని సీబీఐ పేర్కొంది. గతేడాది మే 4న కుకీ, మెయితీల మధ్య జరిగిన గొడవల్లో ఇద్దరు మహిళలపై అత్యాచారం జరిగింది. ఈ ఘటనకు సంబంధించి సీబీఐ దాఖ‌లు చేసిన చార్జి షీట్‌లోని అంశాలు తాజాగా వెలుగులోకి వచ్చాయి. 
మూడో సారి అధికారం తథ్యం అన్న ఆత్మవిశ్వాసంతో ముందుకు సాగుతున్న బీజేపీకి సార్వత్రిక ఎన్నికల తొలి రెండు విడతల్లో షాక్ తగిలిందా? అంటే పరిశీలకులు ఔననే అంటున్నారు. తొలి విడతలో ఎన్నో ఆశలు పెట్టుకున్న తమిళనాడు రాష్ట్రంలో బీజేపీకి వచ్చే స్థానాల సంఖ్య శూన్యమేనన్న వార్తల నేపథ్యంలో ఆ పార్టీ పూర్తిగా డీలా పడింది.
ఎదుటి వారు చేసేవన్నీ తప్పులు.. నేను మాత్రమే సుద్దపూసను అన్నభ్రమల్లో జగన్ పూర్తిగా మునిగిపోయారు. ఐదేళ్లు అధికారంలో ఉన్నా ఎన్నడూ మీడియా ముందుకు రాలేదు కానీ.. ఎన్నికలలో ఓటమి భయం వెంటాడుతుంటే.. అనివార్యంగా తన గురించి తను చెప్పుకోవడానికి ఏం లేకపోయినా.. విపక్షాలపై విమర్శలు గుప్పించడానికి ఆయన వద్ద ఉన్న పడికట్టు రాళ్ల వంటి మాటలను మరో సారి విసర్జించేందుకు జగన్ మీడియా ముందుకు వచ్చారు.
తిరుమలలో భక్తుల రద్దీ సాధారణంగా ఉంది. బుధవారం (మే 1)ఉదయం శ్రీవారి దర్శనం కోసం వేచి ఉన్న భక్తులతో ఆరు కంపార్ట్ మెంట్లు నిండిపోయాయి.
వామ్మో... రోజులు మరీ దారుణంగా మారిపోతున్నాయి. ఇటీవల కర్నాటకలో ఇంటర్మీడియట్ పరీక్షల ఫలితాలు విడుదలయ్యాయి.
శుభకార్యాలకు ముహూర్తాలు లేవని పండితులు తేల్చారు. ఈ మూడు నెలలు వైశాఖ, జ్యేష్ట, ఆషాడ మాసాలు కావడంతో ముహుర్తాలు లేవని పండితులు చెబుతున్నారు. దీంతో పెళ్లిళ్లతో పాటు నూతన గృహ ప్రవేశాలు, దేవతా విగ్రహ ప్రతిష్టాపనలు, శంకుస్థాపనల వంటి కార్యాలకు విరామం వచ్చింది.
టీడీపీ సంక్షేమ ప‌థ‌కాల ముందు జ‌గ‌న్ న‌వ‌ర‌త్నాలు వెల‌వెల పోతున్నాయి. గ‌తంలో జ‌గ‌న్‌కు ఓటు వేసిన వారంతా ఇప్పుడు కూట‌మి మేనిఫెస్టో కే జై అంటున్నారు. ముఖ్యంగా పెన్షన్లు రూ.4 వేలకు పెంపు, ఏడాదికి 3 ఉచిత గ్యాస్ సిలిండర్లు, మహిళలకు ఉచిత ఆర్టీసీ ప్రయాణం మొత్తం ఏపీ రాజ‌కీయ ముఖ‌చిత్రాన్నే మార్చివేసింది.
తెలుగుదేశం పార్టీ, జనసేన పార్టీ ‘జనగళం’ పేరుతో విడుదల చేసిన ఉమ్మడి మేనిఫెస్టోలో ప్రతి హామీ పద్ధతిగా వుంది. చంద్రబాబు విజన్‌ని ప్రతిఫలించేలా వుంది.
ఛత్తీస్ గఢ్ లో నక్సల్స్ కు మరోసారి ఎదురుదెబ్బ తగిలింది. నారాయణపూర్, కాంకేర్ జిల్లాల సరిహద్దుల్లో జరిగిన ఎదురుకాల్పుల్లో ఏడుగురు మావోలు మృతి చెందారు. మృతుల్లో ఇద్దరు మహిళా నక్సల్స్ ఉన్నట్టు పోలీసులు తెలిపారు. ఘటన స్థలంలో ఒక ఏకే-47 రైఫిల్, ఇతర ఆయుధాలు స్వాధీనం చేసుకున్నారు. ఈ దాడుల్లో డీఆర్ జీ, ఎస్టీఎఫ్ బలగాలు పాల్గొన్నాయి
కూటమి ఉమ్మడి మేనిఫెస్టో మంగళవారం విడుదల చేసింది. ఇప్పటికే అధికార వైసీసీ నవరత్నాలు ప్లస్ అంటూ మేనిఫెస్టోను విడుదల చేసిన సంగతి తెలిసిందే. దీంతో కూటమి మేనిఫెస్టోతో జగన్ మేనిఫెస్టోను పోలుస్తూ జనం చర్చించుకుంటున్నారు. జగన్ కొత్తగా ఇచ్చేదేమీ లేకపోగా, నవరత్నాలుప్లస్ అని గత ఎన్నికలలో విఫల హామీలకే కొద్ది పాటి నగదును చేర్చి ప్రకటించారన్న పెదవి విరుపు వైసీపీ వర్గాల నుంచే వ్యక్తం అవుతోంది.
గాజుగ్లాసు గుర్తు ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా పెద్ద ఎత్తున చర్చలో ఉంది. గాజు గ్లాసు గుర్తును జనసేనకు రిజర్వ్ చేసిన ఎన్నికల సంఘం ఆ పార్టీ పోటీ చేయని స్థానాలలో మాత్రం ఆ గుర్తును స్వతంత్ర అభ్యర్థులకు కేటాయించింది. ఏపీలో తెలుగుదేశం, జనసేన, బీజేపీ పొత్తు పెట్టుకుని కూటమిగా పోటీలో ఉన్న సంగతి తెలిసిందే.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.