సిట్టింగులకు టిక్కెట్లు.. బీఆర్ఎస్ లోప్రకంపనలు

Publish Date:Jan 17, 2023

Advertisement

ముఖ్యమంత్రి, బీఆర్ఎస్ అధ్యక్షుడు కేసీఆర్  పక్క పార్టీల నుంచి గోడ దూకిన ఏమ్మేల్యీలు సహా, సిట్టింగు ఎమ్మెల్యేలు అందరికీ మళ్ళీ టిక్కెట్లు ఇస్తామని ఎప్పుడో  చెప్పేశారు. అది కూడా పార్టీ వేదిక నుంచి సభా ముఖంగా  ప్రకటించారు. ముఖ్యమంత్రి అంత ముందుగా ఆ ప్రకటన ఎందుకు చేశారు, ఎందుకు చేయవలసి వచ్చింది, అనే విషయాన్ని పక్కన పెడితే, ఆయన చేసిన ప్రకటన పార్టీలో పెద్ద ఎత్తున ప్రకంపనలు సృష్టిస్తోంది.

ఈ ప్రకటన నేపధ్యంగానే ఖమ్మం జిల్లాకు చెందిన మాజీ మంత్రి తుమ్మల నాగేశ్వర రావు, మాజీ  ఎంపీ పొంలేటి సుధాకర రెడ్డి అలర్టయ్యారు. ఆత్మీయ సమ్మేళనాలు అంటూ సందడి చేశారు. భారాస ట్రబుల్ షూటర్, మంత్రి హరీష్ రావు దౌత్యంతో తుమ్మల వెనక్కి తగ్గారు కానీ, పొంగులేటి అయితే తగ్గేదేలే’అంటూ ముందుకు దూసుకు పోతున్నారు.  ఖమ్మంలో భారాస ఆవిర్భావ సభ జరిగే రోజు (జనవరి 18)నే ఢిల్లీలో ఆయన బీజేపీలో చేరేందుకు ముహూర్తం ఖరారైనట్లు తెలుస్తోంది. అయితే ముహూర్తం విషయంలో ఇంకా కొంత సందిగ్దత కొనసాగుతున్నా, పొంగులేటి కారు దిగడం మాత్రం ఖాయమని తేలిపోయింది.

ఖమ్మం కథ అలా ఉంటే, వరంగల్’ జిల్లాకు చెందిన భారాస సీనియర్ నాయకుడు, మాజీ ఉప ముఖ్యమంత్రి, కడియం శ్రీహారి ఏకంగా ఆత్మగౌరవ నినాదాన్నే ఎత్తుకున్నారు. ప్రస్తుతం ఎమ్మెల్సీగా ఉన్న ఆయన  వచ్చే ఎన్నికలలో స్టేషన్ ఘనపూర్’ నుంచి టికెట్ ఆశిస్తున్నారు. అయితే ముఖ్యమంత్రి కేసీఆర్, సిట్టిగులకే టికెట్ ప్రకటన చేసినప్పటి నుంచి,  సిట్టింగ్ ఎమ్మెల్ల్యే కడియం  చిరకాల ప్రత్యర్ధి తాటికొండ రాజయ్యల మధ్య ఎప్పటినుంచో సాగుతున్న ప్రత్యన్న యుద్ధం పీక్ కు చేరింది. ఇంకా స్పష్టంగా చెప్పాలంటే, కడియమ నేరుగా కేసీఆర్ నే టార్గెట్ చేశారు. అందుకే ఆయన ఎవరికీ తలవంచను, ఎవరికీ పాదాభివందనాలు చేయనని ఘాటైన వ్యాఖ్యలు చేశారు. ముఖ్యంగా ముఖ్యమంత్రి మహబూబాబాద్ పర్యటన సందర్భంగా, రాజయ్య సహా సిట్టింగ్ ఎమ్మెల్యేలు పోటీలు పడిమరీ ముఖ్యమంత్రికి పాదాభి వందనాలు చేశారు. ఆ సమావేశంలో ఉన్న కడియం మాత్రం తలవంచలేదు. కేసీఆర్ పాదాలకు మొక్కలేదు. ఈ నేపధ్యంలో  కడియం చేసిన వ్యాఖ్యలు మరింత దుమారం రేపుతున్నాయి. 

ఇదలా ఉంటే, కడియం సంచలన వ్యాఖ్యల నేపధ్యంలో  వరంగల్  జిల్లా మంత్రి మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు సిట్టింగ్ ఎమ్మెల్యేలలో, ఓ ఇరవై మంది ఎమ్మెల్యేలపై వ్యతిరేకత ఉందన్నారు. వచ్చే ఎన్నికల్లో 15 నుంచి 20 మంది ఎమ్మెల్యేలను మారిస్తే బీఆర్ఎస్ కు 100 సీట్లు గ్యారంటీ అని వ్యాఖ్యానించారు. మహబూబాబాద్ జిల్లా  దంతాలపల్లిలో ఖమ్మం బీఆర్ఎస్ ఆవిర్భావ సన్నాహక సమావేశంలో మాట్లాడిన మంత్రి దయాకర్ రావు తాను సొంతంగా చేయించిన సర్వే ప్రకారం  వచ్చే ఎన్నికల్లో బీఆర్ఎస్ కు 90 సీట్లు వస్తాయని.. అయితే 20 మంది సిట్టింగ్ లను మారిస్తే 100 సీట్లు ఖాయమని జోస్యం చెప్పారు. అయితే సిట్టింగ్ లందరికీ సీట్లు ఇస్తామని ఇప్పటికే  సీఎం కేసీఆర్ ప్రకటించారు. అయినా, కొంతమంది ఎమ్మెల్యేలను మార్చాల్సిందేనని దయాకర్ రావు చేసిన కామెంట్స్ ప్రస్తుతం చర్చనీయాంశంగా మారాయి.

నిజంగా ఎర్రబెల్లి సర్వే చేయించారా? గతంలో ఎప్పుడు లేనిది ఇప్పడు ఆయన స్వయంగా సర్వే ఎందుకు చేయించారు.  కడియం ‘ఆత్మ  గౌరవం’ నినాదం  హాట్ టాపిక్ గా మారిన నేపధ్యంలో అందుకు కౌంటర్’గా ఎర్రబెల్లి సంచలన సర్వే బయట పెట్టారా?, ముఖ్యమంత్రి కేసీఆర్  కడియం ఇష్యూని డైవెర్ట్ చేసేందుకు, నమ్మిన బంటు ఎర్రబెల్లి సర్వేని తెరమీదకు తెచ్చారా అనే సందేహాలు వ్యక్తమవుతున్నాయి. ఏది ఏమైనా ముఖ్యమంత్రి కేసేఆర్ స్వయంగా, కదిల్చిన తేనెతుట్టె భారసలో ప్రకంపనలు సృష్టిస్తోందని పరిశీలకులు పేర్కొంటున్నారు.

By
en-us Political News

  
గతంలో రాష్ట్ర రాజకీయాలలో  కొండా సురేఖ కేటీఆర్ పై చేసిన వ్యక్తిగత విమర్శలు  దుమారం రేపిన సంగతి తెలిసిందే. ఇప్పుడు ఆ వ్యాఖ్యలకు బేషరతుగా క్షమాపణ చెప్పిన కొండా సురేఖ వాటిని ఉపసంహరించుకున్నారు.   గతంలో కేటీఆర్ పై తాను చేసిన అనుచిత వ్యాఖ్యలను  పూర్తిగా వెనక్కి తీసుకుంటున్నట్లు సోషల్ మీడియా వేదికగా  పేర్కొన్నారు. 
తెలంగాణ రాజకీయాలలో ఏ పార్టీతోనూ పొత్తు లేదు లేదంటూనే జనసేనతో పొత్తుకు తహతహలాడుతోంది. తెలంగాణలో స్వంతంగానే బరిలోకి దిగుతామని కుండబద్దలు కొట్టిన బీజేపీ ఇప్పుడు జనసేనతో అంతర్గత పొత్తు కుదుర్చుకుందన్న ప్రచారం జోరుగా సాగుతోంది. 
నియోజకవర్గంలో రాబోయే మున్సిపల్ చైర్మన్ ఎన్నికలను తెలుగుదేశం కూటమి గెలుచుకుంటుందన్న ధీమా వ్యక్తం చేశారు. వైసీపీకి పులివెందుల ఇంకెంత మాత్రం కంచుకోట కాదని విస్పష్టంగా పేర్కొన్నారు.  దశాబ్దాలుగా తిరుగులేని ఆధిపత్యం చెలాయిస్తున్న పులివెందులలో కూటమి నేతలు నేరుగా సవాళ్లు విసురుతుండటం పులివెందులలో మసకబారిన వైసీపీ ప్రతిష్ఠకు, పలుకుబడికి నిదర్శనంగా పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. 
అయితే, ప్రస్తుతం సిద్ధమవుతున్న చార్జ్‌షీట్‌ను మరింత పటిష్టంగా రూపొందించేందుకు ఉన్నతాధికారులు ఢిల్లీలోని ప్రముఖ సుప్రీంకోర్టు న్యాయవాదులతో సంప్రదింపులు జరిపినట్లు తెలుస్తోంది. సాంకేతిక సాక్ష్యాలు, బాధితుల వాంగ్మూలాల ఆధారంగా ఈ అదనపు చార్జిషీట్ ను సిద్ధం చేస్తున్నట్లు సమాచారం.
విపత్కర సమయంలో తెలుగు రాష్ట్రాల ఐక్యత.. ఏపీకి సాయం.!
హైదరాబాద్‌లోని జూబ్లీహిల్స్ నివాసంలో ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డిని శ్రీ కృష్ణ సదర్ సమ్మేళనం ఉత్సవ కమిటీ ప్రతినిధులు మర్యాదపూర్వకంగా కలిశారు.
ఒక్కోసారి చిన్న ప్రయత్నం కూడా ఊహించని విధంగా జీవితాన్ని మార్చేస్తుందనడానికి నిదర్శనంగా నిలిచింది ఒక ఉదంతం.
ఆంధ్రప్రదేశ్‌ను వణికించిన అర్నబ్ తుఫాను ప్రభావంతో పంటలు, ఇళ్లు, రహదారులు, విద్యుత్ వ్యవస్థలకు నష్టం వాటిల్లింది.
ప్రకృతి వైపరీత్యాలు సంభవించిన క్లిష్ట పరిస్థితుల్లోనూ ఏ మాత్రం వెనకడుగు వేయకుండా, ప్రాణాలను సైతం లెక్కచేయకుండా విద్యుత్ శాఖ సిబ్బంది సేవలందిస్తున్న తీరు ఎంతో స్ఫూర్తిదాయకమని
స్థానిక  సన్నాహాలపై తెలుగుదేశం కూటమికి చెందిన దాదాపు 45 వేల మంది ముఖ్య నేతలు, ప్రజాప్రతినిధులు,  కార్యకర్తలతో  సీఎం చంద్రబాబు ఈ టెలీ కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన వైసీపీపై చంద్ర నిప్పులు చెరిగారు.
కేరళలోని కొచ్చిలో సంచలనం సృష్టించిన మెర్సిడెస్ బెంజ్ కారు ప్రమాదం కేసు పోలీసు శాఖలో కలకలం రేపుతోంది.
కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు, పెన్షనర్లకు కేంద్ర ప్రభుత్వం శుభవార్త అందించింది.
మహా న‌గ‌రం హైద‌రాబాద్‌లో ఎట్టి పరిస్థితుల్లోనూ తాగు నీటి సమస్య తలెత్తకుండా చర్యలు తీసుకోవాలని ముఖ్యమంత్రి ఎ.రేవంత్ రెడ్డి అధికారులను ఆదేశించారు.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.