సిట్టింగులకే టికెట్లు.. బీఆర్ఎస్ లో గందరగోళం

Publish Date:Jun 2, 2023

Advertisement

ఎన్నికలు సమీపిస్తున్న కొద్దీ బీఆర్ఎస్ లో లుకలుకలు ఒక్కటొక్కటిగా బయటపడుతున్నాయి. సిట్టింగులకు సీట్ల విషయంలో ఆ పార్టీ ఎటూ తేల్చుకోలేకపోతోంది. గత ఎన్నికలలో విజయం సాధించిన తరువాత ముఖ్యమంత్రి కేసీఆర్ ఆపరేషన్ ఆకర్ష్ పేరిట ఇతర పార్టీల నుంచి గెలిచిన ఎమ్మెల్యేలను తమ పార్టీ తలుపులు బార్లా తెరిచి మరీ చేర్చుసుకున్నారు. అంతే కాదు కొంత కాలం కిందట సిట్టింగులందరికీ వచ్చే ఎన్నికలలో మళ్లీ పోటీ చేసేందుకు టికెట్లు ఇస్తానని కూడా ప్రకటించేశారు. ఆయన ఏ వ్యూహంతో ఆ ప్రకటన చేశారో కానీ అదే బూమరాంగ్ అయ్యింది.  

ఈ ప్రకటనతో ఖమ్మం జిల్లాకు చెందిన మాజీ మంత్రి తుమ్మల నాగేశ్వర రావు, మాజీ  ఎంపీ పొంలేటి సుధాకర రెడ్డిలు  ఆత్మీయ సమ్మేళనాలు అంటూ సందడి చేశారు. భారాస ట్రబుల్ షూటర్, మంత్రి హరీష్ రావు దౌత్యంతో తుమ్మల వెనక్కి తగ్గారు కానీ, పొంగులేటి మాత్రం తగ్గేదేలే అంటూ ముందుకు దూసుకు పోయారు. ఆయన ధిక్కార ధోరణితో పార్టీ నుంచి బహిష్కృతులయ్యారు కూడా. ఆయనకు తోడుగా జూపల్లి కృష్ణారావు ఉన్నారు. అలాగే వరంగల్ కు చెందిన సీనియర్ నాయకుడు, మాజీ ఉప ముఖ్యమంత్రి కడియం శ్రీహరి ఆత్మగౌరవ నినాదాన్ని ఎత్తుకున్నారు.  ముఖ్యమంత్రి కేసీఆర్, సిట్టిగులకే టికెట్ ప్రకటన చేసినప్పటి నుంచి,  సిట్టింగ్ ఎమ్మెల్ల్యే కడియం  చిరకాల ప్రత్యర్ధి తాటికొండ రాజయ్యల మధ్య ఎప్పటినుంచో సాగుతున్న ప్రత్యన్న యుద్ధం పీక్ కు చేరింది.

ఇంకా స్పష్టంగా చెప్పాలంటే, కడియమ నేరుగా కేసీఆర్ నే టార్గెట్ చేశారు. అందుకే ఆయన ఎవరికీ తలవంచను, ఎవరికీ పాదాభివందనాలు చేయనని ఘాటైన వ్యాఖ్యలు చేశారు.  పరిస్థితి చేయి జారుతోందని గ్రహించిన కేసీఆర్ నష్టనివారణ చర్యలలో భాగంగా మంత్రి ఎర్రబెల్లి దయాకరరావు చేత సిట్టింగులలో కొందరికి పార్టీ టికెట్లు వచ్చే అవకాశం లేదన్న ప్రకటన చేయించారు. అయితే అది కూడా ఎమంత ఫలితాన్ని ఇవ్వలేదు. మొత్తం మీద సిట్టింగులకు టికెట్ల వ్యవహారం బీఆర్ఎస్ లో పెద్ద సంక్షోభానికీ, గందరగోళానికీ దారి తీసింది. ప్రతి నియోజకవర్గంలోనూ ఇద్దరికి మించే ఆశావహులు ఉండటం.. ఎవరూ వెనక్కు తగ్గేందుకు సిద్ధంగా ఉడటంతో వారిలో టికెట్ దక్కని వారు రెబల్స్ గా బరిలో నిలిస్తే చాలా నియోజకవర్గాలలో బీఆర్ఎస్ విజయంపై ప్రభావం చూపే అవకాశాలు మెండుగా ఉంటాయని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.

ఇది వచ్చే ఎన్నికలలో విజయం సాధించి హ్యాట్రిక్ సాధించాలన్న కేసీఆర్ ఆశలకు గండి కొడుతుందని అంటున్నారు. ఎన్నికలు ఇక నెలల వ్యవధిలోకి వచ్చిన నేపథ్యంలో  సిట్టింగ్ ఎమ్మెల్యేలకు టికెట్లపై మంత్రి కేటీఆర్  రంగంలోకి దిగారు.  ఇప్పటికిప్పుడు అసమ్మతి, అసంతృప్తి భగ్గుమనకుండా నష్ట నివారణ చర్యలలో భాగంగా.. సిట్టింగ్ ఎమ్మెల్యేలకు టికెట్లపై ఇప్పటికిప్పుడే నిర్ణయం తీసుకునేది లేదని కుండబద్దలు కొట్టారు. అదే సమయంలో పని తీరు బాగున్న సిట్టింగుల టికెట్లకు ఢోకా లేదని చెప్పారు. అలాగే పనితీరులో వెనుకబడ్డవారు తమ తీరు మార్చుకుని పుంజుకుంటే.. టికెట్లు దక్కే అవకాశాలు మెరుగుపడతాయని చెప్పారు.  

పార్టీ కోసం, పార్టీ విజయం కోసం ఎళ్ల వేళలా కృషి చేసే వాళ్లందరిపై పార్టీ అధినేత ఓ కన్నేసి ఉంచారని వివరించారు. మొత్తం మీద సిట్టింగులకు టికెట్ల విషయంలో కేసీఆర్ ముందుగానే చేసిన ప్రకటన బీఆర్ఎస్ లో కలకలం సృష్టించింది. సంక్షోభానికి తేరతీసింది. మంత్రులు హరీష్ రావు, కేటీఆర్ ఇప్పుడు నష్ట నవారణ చర్యలకు శ్రీకారం చుట్టినా.. ఆశావహులందరినీ సంతృప్తి పరచడం సాధ్యమౌతుందా అన్న అనుమానాలను పరిశీలకులు వ్యక్తం చేస్తున్నారు. 

By
en-us Political News

  
ముఖ్యమంత్రి సిద్ధరామయ్య విధానసౌధలో కేబినెట్ సమావేశం నిర్వహిస్తున్న సమయంలోనే.. పాతిక మంది ఎమ్మెల్యేలు ఓ ప్రైవేట్ హోటల్‌లో ఈ భేటీ జరగడం సంచలనం సృష్టించింది.
తెలుగువన్ వాస్తవ వేదిక 16వ సంచికలో ప్రస్తుత రాజకీయ పరిస్థితులపై విస్తృత చర్చ జరిగింది.
జనసేన పార్టీ ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్వహించే ఆవిర్భావ దినోత్సవ వేడుకలకు ఈసారి దూరం జరిగింది.
పార్టీ ఫిరాయింపుల కేసులో ఎమ్మెల్యేలు దానం నాగేందర్, కడియం శ్రీహరికి ఊరట
రాష్ట్రంలో బీఆర్ఎస్‌ రెండుసార్లు, కాంగ్రెస్‌ ఒకసారి అధికారంలోకి వచ్చాయనీ, ఆ రెండు ప్రభుత్వాల వైఫల్యాలనూ గమనించిన తెలంగాణ ప్రజలు వచ్చే ఎన్నికల్లో బీజేపీకి అధికారం కట్టబెట్టాలని ఇప్పటికే ఒక నిర్ణయానికి వచ్చేశారన్నారు.
జాతీయ పార్టీలకే ప్రయోజనం చేకూరుతుందనీ, రాష్ట్రాల సమస్యలపై పట్టింపే లేని పరిస్థితి ఉత్పన్నమౌతుందని ఆందోళన వ్యక్తం చేశారు. కేవలం ఖర్చు తగ్గుతుందన్న నెపంతో కేంద్రం జమిలి ఎన్నికల నిర్వహణకు మొగ్గు చూపడమంటే.. ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేయడమే ఔతుందని పేర్కొన్నారు.
జగన్ హయాంలో లిక్కర్ మాఫియా రాజ్యమేలిందన్న షర్మిల, నాసిరకం మద్యంతో ప్రజల ఆరోగ్యాన్ని గుల్ల చేయడంతో పాటు రాష్ట్ర ఆదాయాన్ని కూడా కొల్లగొట్టారన్నారు. జగన్ హయాంలో కంటైనర్ల కొద్దీ మాదకద్రవ్యాలు రాష్ట్రంలోకి వచ్చాయని ఆరోపించారు.
రాజంపేటలో కూటమి నాయకుల రాజకీయం రాజుకుంది.
వ్యవస్థను కాపాడాల్సిన వారే విద్రోహానికి పాల్పడుతున్నారా? అనే అంశాలపై ప్రముఖ విశ్లేషకుడు అప్పసాని రాజేష్ తెలుగువన్ కు ఇచ్చిన ప్రత్యేక ఇంటర్వ్యూలో కూలంకషంగా వివరించారు.
గ్లోబల్ ప్రపంచంలో ఒక చోట రేగే చిచ్చు, ఖండాలు దాటి మన వంటింటి గ్యాస్ ధరను, మన పిల్లల సాఫ్ట్‌వేర్ ఉద్యోగాలను కూడా ప్రభావితం చేస్తుంది.
టీవ‌ల బొత్సకు బ్రెయిన్ స్ట్రోక్ త‌గిలి తీవ్రంగా ఇబ్బంది ప‌డ్డారు. కోలుకుని ఆయ‌న మండ‌లికి వచ్చారు. అప్పుడు ఆయనకు లోకేష్ సాద‌రంగా ఆహ్వానించిన తీరు పట్ల లోకేష్ పై సర్వత్రా హర్షం వ్యక్తం అవుతోంది. అదే గతంలో చంద్రబాబు పై జగన్ చేసిన వ్యాఖ్యలపై పార్టీలకు అతీతంగా అందరూ ఆగ్రహం వ్యక్తం చేశారు.
ఓడ‌లు బండ్లు అవుతాయి. బండ్లే ఓడ‌ల‌వుతాయి అన్న సామెతకు నేటి జగన్ పరిస్థితి అచ్చుగుద్దినట్లు సరిపోతుందంటున్నారు పరిశీలకులు. ఒక్కోసారి అవ‌స‌రం తీరిపోయిన త‌ర్వాత విసిరేసిన తెడ్డే.. చివ‌రికి ప‌డ‌వ బోల్తా ప‌డ్డ‌ప్పుడు దిక్క‌వుతుంది. అన్న‌దానికి జ‌గ‌న్ అప‌రిప‌క్వంతో కూడుకున్న రాజ‌కీయ విధానాలే ఉదాహ‌ర‌ణంటున్నారు.
కూటమి ఐక్యత ప్రాధాన్యతను జనసేనాని, ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ అసెంబ్లీ వేదికగా వివరించడం కిరణ్ రాయల్ వంటి నేతలకు చెంపపెట్టుగానే పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. కూటమి ఐక్యత వల్ల ఎంత మేలు జ‌రుగుతుందో పవన్ కల్యాణ్ విడ‌మ‌ర‌చి చెప్పారు.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.