మండలి వైస్ చైర్మన్ బరిలో తూమాటి.!
Publish Date:Aug 18, 2026
Advertisement
ఆంధ్రప్రదేశ్ శాసనమండలి డిప్యూటీ ఛైర్మన్ పదవికి సంబంధించి వైసీపీ అధినేత జగన్ వ్యూహాత్మక నిర్ణయం తీసుకున్నారు. పార్టీ సీనియర్ నాయకుడు, శాసనమండలి సభ్యుడు తూమాటి మాధవరావును ఈ పదవికి వైసీపీ తరఫున అభ్యర్థిగా ఖరారు చేశారు. దీంతో మంగళవారం (ఆగస్టు 18) తూమాటి మాధవరావు శాసనమండలి కార్యదర్శికి తన నామినేషన్ పత్రాలను సమర్పించారు. రాష్ట్ర శాసనమండలిలో వైసీపీకి సంఖ్యా బలం స్థానం ఉండటంతో.. డిప్యూటీ ఛైర్మన్‌గా ఆయన ఎన్నిక కావడం లాంఛనమే. నామినేషన్ పత్రాలు దాఖలు చేసిన వెంటనే, తూమాటి మాధవరావు తాడేపల్లిలోని వైసీపీ కేంద్ర కార్యాలయానికి చేరుకుని పార్టీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి జగన్ ను కలిసి ఆశీస్సులు తీసుకున్నారు. డిప్యూటీ ఛైర్మన్ అభ్యర్థిగా బరిలోకి దిగిన మాధవరావును ఈ సందర్భంగా జగన్ అభినందించారు. ఈ సందర్భంగా శాసనమండలిలో పార్టీ అనుసరించాల్సిన వ్యూహాలపై జగన్ ఆయనకు దిశానిర్దేశం చేశారు. తూమాటి మాధవరావు ఎన్నిక ఏకగ్రీవం అయ్యేలా చూడాలని, పార్టీ ఎమ్మెల్సీలందరూ సమన్వయంతో వ్యవహరించాలని జగన్ ఈ సందర్భంగా పార్టీ ఎమ్మెల్సీలను ఆదేశించారు. Thumati Madhava Rao, YSRCP, AP Legislative Council, Deputy Chairman Nomination, YS Jagan Mohan Reddy, Andhra Pradesh Politics
http://www.teluguone.com/news/content/thumati-madhava-rao-25-229222.html





