Publish Date:Jun 22, 2026
ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో పెను సంచలనం అనిపించే పరిణామాలు చోటు చేసుకోబోతున్నాయా అంటే రాజకీయ పరిశీలకులు ఔననే అంటున్నారు. రాష్ట్రంలో వైసీపీ నుంచి త్వరలో భారీ వలసలు ఉండే అవకాశం ఉందన్న చర్చ ఏపీ రాజకీయవర్గాలలో జరుగుతోంది. ముఖ్యంగా వైసీపీకి చెందిన ముగ్గురు కీలక ఎంపీలు త్వరలోనే కాషాయం కండువా కప్పుకోనున్నారన్న వార్త ఇప్పుడు ఏపీ పొలిటికల్ సర్కిల్స్ లో గట్టిగా వినిపిస్తోంది. గత ఎన్నికల తర్వాత ఏపీలో అధికార పగ్గాలు చేపట్టిన తెలుగుదేశం కూటమి తిరుగులేని ఐక్యతతో ముందుకు సాగుతోంది. అయితే.. ఆ ఎన్నికలలో ఘోర పరాజయం పాలై, కనీసం విపక్ష హోదాకు కూడా నోచుకోని వైసిపి పరిస్థితి మాత్రం నానాటికీ తీసికట్టు అన్న చందంగా మారింది. ఇప్పుడు తాజాగా ఆ పార్టీకి చెందిన ఎంపీలు బీజేపీ గూటికి చేరనన్నారన్నవార్తలు గట్టిగా వినిపిస్తుననాయి. పార్లమెంటు ముంగిటకు రానున్న నియోజకవర్గాల పునర్విభజన బిల్లు నేపథ్యంలో ఈ పరిణామం చోటు చేసుకోనుందన్న వార్తలు రాజకీయంగా అత్యంత ప్రాధాన్యతను సంతరించుకున్నాయి.
పునర్విభజన బిల్లు ఆమోదం పొందితే, ఆంధ్రప్రదేశ్‌లో ఊహించని విధంగా దాదాపు 80 అసెంబ్లీ స్థానాలు, 13 లోక్ సభ స్థానాలు పెరిగే అవకాశం ఉంది. ఇంత పెద్ద ఎత్తున నియోజకవర్గాలు పెరిగితే, భవిష్యత్ ఎన్నికల్లో అధికార కూటమి పార్టీకిి బలమైన అభ్యర్థుల అవసరం ఏర్పడుతుంది. ఈ క్రమంలోనే ఇతర పార్టీల్లోని కీలక నేతలను తమ వైపు తిప్పుకునేందుకు కూటమి భాగస్వామ్య పక్షాలు వ్యూహాత్మకంగా అడుగులు వేస్తున్నాయని అంటున్యనారు. ఆ క్రమంలోనే రాష్ట్రంలో వైసీపీ పరిస్థితి అంతంతమాత్రంగా ఉండటంతో ఆ పార్టీ నేతలకు తమ రాజకీయ భవిష్యత్ పై ఆందోలన మొదలైందిజ ఈ నేపథ్యంలోనే వచ్చే కొద్దిరోజులలో వైసీపీ నుంచి భారీ ఎత్తున వలసలు ఉండే అవకాశం ఉందని అంటున్నారు.
ఈ మారుతున్న పరిణామాలను గమనించిన జనసేన పార్టీ ఇప్పటికే ప్రత్యేకంగా ఒక చేరికల కమిటీని ఏర్పాటు చేసి, వలసలను ప్రోత్సహిస్తోంది. మరోవైపు కేంద్రంలో అధికారంలో ఉన్న బిజెపి ఏపీలో తన బలాన్ని మరింత పెంచుకోవడానికి ఆపరేషన్ ఆకర్ష్ కు తెరలేపింది. అందులో భాగంగానే వైసిపికి చెందిన ముగ్గురు లోక్‌సభ సభ్యులతో బిజెపి అగ్రనాయకత్వం ఇప్పటికే సంప్రదింపులు జరిపినట్లు రాజకీయవర్గాలలో గట్టిగా వినిపిస్తోంది. నియోజకవర్గాల సంఖ్య పెరిగితే వచ్చే రాజకీయ లబ్ధిని అందిపుచ్చుకోవడానికి ఈ ఎంపీలు కమలం గూటికి చేరడమే ఉత్తమ మార్గమని భావిస్తున్నట్లు చెబుతున్నారు.
డీలిమిటేషన్ బిల్లు ఆమోదం పొందితే.. రాష్ట్రంలో నియోజకవర్గాలు పెరగడం అన్నది కేవలం నంబర్స్ మాత్రమే కాదు.. అది రాష్ట్ర రాజకీయ ముఖచిత్రాన్నే మార్చేసే కీలక పరిణామంగా రాజకీయ పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. ఈ క్రమంలోనే.. వైసిపికి, ఆ పార్టీలో కొనసాగితే.. తమకూ రాజకీయ భవిష్యత్ లేదని భావిస్తున్న ఆ పార్టీకి చెందిన నేతలు.. పార్టీ మారడానికి ఇదే మంచి తరుణమని భావిస్తున్నారని అంటున్నారు. ఈ నేపథ్యంలోనే ముగ్గురు వైసీపీ ఎంపీలు కమలం గూటికి చేరడానికి రెడీ అయిపోయారని చెబుతున్నారు. అయితే ఈ వలసల పర్వం ఈ ముగ్గురితో ఆగే అవకాశం లేదనీ, ముందు ముందు మరింత మంది వైసీపీయులు కూటమి పార్టీలలో చేరే అవకాశాలు మెండుగా ఉన్నాయనీ పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.
By Teluguone
en-us
Political News
http://www.teluguone.com/news/content/three-yp-mps-likely-to-join-bjp-25-223765.html
ఉత్తర్ ప్రదేశ్ రాజకీయం మళ్లీ ఒక్కసారిగా తీవ్రస్థాయిలో వేడెక్కింది.
2024 ఎన్నికల్లో రాష్ట్రంలో వైసీపీ ఘోర పరాజయాన్ని మూటగట్టుకుని కనీసం ప్రతిపక్ష హోదాకు కూడా నోచుకోకుండా కేవలం 11 స్థానాలకే పరిమితమైన సంగతి తెలిసిందే. అయితే ఇదే విషయంలో తాజాగా తాడేపల్లి వైసీపీ కేంద్ర కార్యాలయంలో మీడియా సమావేశంలో మాట్లాడిన అంబటి రాంబాబు ఆ ఎన్నికల్లో వైసీపీ 11 స్థానాలకు మాత్రమే పరిమితమైనా 40 శాతం ఓటు షేర్ దక్కించుకుందని చెప్పారు.
దశాబ్దాలుగా పార్టీని నమ్ముకుని ఉన్న సీనియర్ నాయకులను పక్కనపెట్టి, కొత్తగా వచ్చిన వారికి ప్రాధాన్యం ఇవ్వడంపై తమ్ముళ్లలో అసంతృప్తి జ్వాలలు రేగుతున్నాయి. ఈ పరిణామాలు నారా లోకేష్ నాయకత్వ తీరుపై, కూటమి ప్రభుత్వ నిర్ణయాలపై పార్టీలోనే అసంతృప్తి వ్యక్తమౌతోంది.
ఉపాధ్యాయ ఉద్యోగాల భర్తీని అడ్డుకునేందుకు వైసీపీ నేతలు హైకోర్టులో ఏకంగా 300 కోర్టు కేసులు వేయించారని, అయితే ధర్మాసనం వారికి తీవ్రంగా మొట్టికాయలు వేసి బుద్ధి చెప్పిందని గుర్తుచేశారు. నిరుద్యోగుల జీవితాలతో ఆడుకోవడమే వైకాపా నైజమని మండిపడ్డారు.
మ్మెల్సీ రామసుబ్బారెడ్డి తన సతీమణి ఇందిరమ్మతో కలిసి దీక్షా శిబిరానికి చేరుకున్నారు. అయితే పోలీసులు అనుమతి లేదంటూ వారిని అడ్డుకున్నారు. ఈ దశలో వైపీపీ శ్రేణులు, పోలీసుల మధ్య వాగ్వాదం జరిగింది. పరిస్థితి అదుపుతప్పుతుండటంతో పోలీసులు ఎమ్మెల్సీ దంపతులను, పలువురు కార్యకర్తలను అదుపులోనికి తీసుకుని అక్కడ నుంచి తరలించారు.
విజయ్ రాజకీయ ప్రత్యర్థుల విమర్శలకు స్పందించలేదు. తన భార్యపై గానీ, కోర్టులో ఉన్న విడాకుల ప్రక్రియపై గానీ విజయ్ పన్నెత్తు మాట మాట్లాడలేదు. వ్యక్తిగత విషయాలకూ, రాజకీయాలకూ సంబంధం లేదని ఒక్క ముక్కలో తేల్చేశారు.
తెలంగాణలో త్వరలో జరగనున్న స్థానిక ఎన్నికల్లో బీజేపీకి ఏ పార్టీతోనూ పొత్తులు పెట్టుకునే ఆలోచన లేదని స్పష్టం చేశారు. జనసేన పార్టీతో తమకు ఉన్న మిత్రబంధం కేవలం కేంద్ర స్థాయికి , ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి మాత్రమే పరిమితమని, తెలంగాణలో ఆ పొత్తును పొడిగించే ప్రసక్తే లేదని కుండబద్దలు కొట్టేశారు.
వైసీపీ అధినేత జగన్ మాత్రం బాధితుల వేదనను, కష్టాలను ఇసుమంతైనా పట్టించుకోకుండా, అక్రమాలకు పాల్పడిన నిందితుల వద్దకు వెళ్లి వారిని పరామర్శిస్తూ, ఓదార్చడం వింతగా విడ్డూరంగా ఉందన్నారు. అక్రమాలకు పాల్పడండి అండగా ఉంటానంటూ జగన్ నిందితులకు భరోసా ఇస్తున్నట్లుగా ఆయన తీరు ఉందన్నారు.
దశాబ్దాలుగా తెలుగుదేశం పార్టీలో క్రియాశీలంగా పనిచేస్తున్న సీనియర్ నేత చలసానికి సొంత పార్టీ నుంచే ఈ స్థాయి ఒత్తిడి రావడం వెనుక కృష్ణా జిల్లా పార్టీలో ఉన్న అంతర్గత విభేదాలే కారణమని పరిశీలకులు అంటున్నారు. ఎన్టీఆర్ తెచ్చిన మాక్స్ చట్టం కింద స్వతంత్రంగా నడుస్తున్న ఈ డెయిరీలో ప్రభుత్వ జోక్యానికి తావు లేకపోయినా. . చలసానిపై ఈ స్థాయిలో రాజీనామాకు ఒత్తడి రావడం పట్ల పాడి రైతులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
వైసీపీలోని కాపు సామాజికవర్గానికి చెందిన నేతలు అంబటి రాంబాబు, పేర్ని నాని మీడియా ముందుకొచ్చి బోండా ఉమా మద్దతుగా గళమెత్తారు. అయితే.. తాజాగా వైసీపీ నిరసనలను ప్రశ్నిస్తూ ఆ పార్టీ నేతలను బోండా ఉమా గట్టిగా నిలదీయడంతో వైసీపీ ఆశలు నీరుగారిపోయాయి.
న్నికల ఖర్చుల విషయానికి వస్తే వైసీపీ దేశంలోనే అత్యధికంగా వ్యయం చేసిన ప్రాంతీయ పార్టీగా నిలిచింది. ఆ ఆర్థిక సంవత్సరంలో వైసీపీ ఆదాయం 140.4 కోట్ల రూపాయలు కాగా, చేసిన వ్యయం 340.2 కోట్ల రూపాయలు. తమ వార్షిక రాబడి కంటే 142 శాతం అదనంగా, అంటే దాదాపు 199.8 కోట్ల మేర ఎక్కువ వ్యయం చేసింది.
దేశవ్యాప్తంగా విద్యా వ్యవస్థను వేధిస్తున్న ప్రశ్నాపత్రాల లీకేజీలు, నిరుద్యోగం, యువత భవిష్యత్తుపై రాహుల్ గాంధీ ప్రత్యక్షంగా విద్యార్థులతో ముఖాముఖి నిర్వహించేందుకు ఉద్దేశించిన ఈ సదస్సు ఈనెల 8న. ప్రయాగ్‌రాజ్‌లోని ప్రసిద్ధ కేపీ కాలేజీ మైదానంలో నిర్వహించేందుకు కాంగ్రెస్ భారీ ఏర్పాట్లు చేసింది.
పరామర్శల పేరిట పోలీసుల ఆంక్షలను ఉల్లంఘిస్తూ, శాంతి భద్రతల సమస్య ఉత్పన్నమయ్యేలా సాగుతున్న ఆయన పర్యటనల తీరు నేపథ్యంలో జగన్ భద్రత అంశం మరోసారి చర్చకు వచ్చింది. అంతటితో ఆగకుండా, జగన్‌కు రక్షణ తగ్గించారంటూ వైసీపీ ఎంపీల బృందం కేంద్ర హోంమంత్రి అమిత్ షాను కలవడం, దీనిపై రాష్ట్ర ప్రభుత్వం వెంటనే వివరణ ఇవ్వడంతో జగన్ భద్రత అంశం ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది.