పశ్చిమ బెంగాల్ రాజకీయాల్లో పెను సంచలనం చోటుచేసుకుంది. ఇటీవలి ఎన్నికలలో ఘోర పరాజయం పాలై అధికారం కోల్పోయిన తృణమూల్ కాంగ్రెస్ (టీఎంసీ) పార్టీకి భారీ షాక్ తగిలింది. ఆ పార్టీకి చెందిన ముగ్గురు రాజ్యసభ మాజీ సభ్యులు సుఖేందు శేఖర్ రాయ్, సుస్మితా దేవ్, ప్రకాష్ చిక్ బారాయిక్ లు కాషాయ తీర్ధం పుచ్చుకున్నారు.
గురువారం (జులై 9) వీరు అధికారికంగా బీజేపీ గూటికి చేరారు. గత నెలలోనే వీరంతా తమ రాజ్యసభ సభ్యత్వాలకు రాజీనామా చేసిన సంగతి విదితమే. వీరరుముగ్గురూ గురువారం జులై 9) బెంగాల్ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు సమీక్ భట్టాచార్య సమక్షంలో కమలం కండువా కప్పుకుని బీజేపీలో చేరారు. వీరు ముగ్గురూ ఇలా బీజేపీలో చేరారో లేదో అలా బీజేపీ హైకమాండ్ వీరి రాజీనామాతో ఖాళీ అయిన ఆ మూడు రాజ్యసభ స్థానాల ఉపఎన్నికలకే వీరినే తమ అభ్యర్థులుగా ప్రకటించింది.
పార్టీ మారిన ఈ ముగ్గురు నేతల్లో సుఖేందు శేఖర్ రాయ్ టీఎంసీలో సీనియర్ నాయకుడు. 2024 ఆగస్టులో కోల్‌కతాలోని ప్రభుత్వ ఆర్జీ కర్ మెడికల్ కాలేజీ ఆసుపత్రిలో ఒక జూనియర్ డాక్టర్‌పై జరిగిన హత్యాచార ఘటనపై అప్పుడే సుఖేందు శేఖర్ రాయ్.. అప్పటి ముఖ్యమంత్రి మమతా బెనర్జీ నేతృత్వంలోని తృణమూల్ కాంగ్రెస్ ప్రభుత్వ తీరును, పోలీసుల వైఫల్యాలను తప్పుపట్టారు. సొంత పార్టీ ప్రభుత్వంపైనే తిరుగుబాటు బావుటా ఎగురవేశారు.
దీంతో అప్పటి నుంచీ టీఎంసీ హై కమాండ్ ఆయనను పూర్తిగా పక్కనబెట్టింది. ఈ నేపథ్యంలోనే.. సుఖేందు శేఖర్ రాయ్ గత నెల 8న తన రాజ్యసభ పదవికి రాజీనామా చేశారు. ఆ తర్వాత జూన్ 10న సుస్మితా దేవ్, 11న ప్రకాష్ చిక్ బారాయిక్ కూడా తమ పదవులకు రాజీనామా చేశారు. ఇప్పుడు వారు బీజేపీ గూటికి చేరి టీఎంసీకి, మాజీ సీఎం మమతా బెనర్జీకి గట్టి షాక్ ఇచ్చారు.
West Bengal Politics, BJP TMC Shock, Sukhendu Sekhar Ray, Mamata Banerjee, Rajya Sabha By Election Candidates
By Teluguone
en-us
Political News
http://www.teluguone.com/news/content/three-tmc-mps-join-bjp-25-225569.html
నిన్నగాక మొన్న ఇదే మోడీ నాయకత్వంలోని ఎన్డీయే సర్కార్ కు వ్యతిరేకంగా పోరాడటానికి సిద్ధంగా ఉన్నానని ప్రకటించిన జగన్, ఇప్పుడు ఆదే మోడీ నాయకత్వాన్ని ప్రస్తుతిస్తూ ప్రశంసలు కురిపించడం ద్వంద్వ వైఖరి కాక మరేమిటని పరిశీలకులు ప్రశ్నిస్తున్నారు.
. ఇక షర్మిల విజయ్ ను కలిసి తన కుమార్తె వివాహానికి హాజరు కావాల్సిందిగా కోరుతూ పెళ్లి శుభలేక అందించడం ప్రాధాన్యత సంతరించుకుంది. ఎందు కంటే కేంద్ర స్థాయిలో కాంగ్రెస్ తో పొత్తు విషయంలో విజయ్ నేతృత్వంలోని టీవీకే పార్టీ కూడా కీలకంగా ఉంది. అలాగే తమిళనాడులో విజయ్ నేతృత్వంలోని ప్రభుత్వంలో కాంగ్రెస్ భాగస్వామి.
లౌకిక స్వభావం కలిగిన ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లోకి మతపరమైన అంశాలను జొపపించడానికి విజయసాయి ప్రయత్నిస్తున్నారని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. ఇక తమ ప్రసంగాల్లో, మీడియా సమావేశాలలో విజయసాయిరెడ్డి ప్రస్తావిస్తున్న అంశాలు ఆ విశ్లేషణలకుబలం చేకూరుస్తున్నాయి.
ఇప్పటికే తనపై 45 ఎఫ్ఐఆర్ లు ఉన్నాయన్న ఆయన తన టార్గెట్ వంద ఎఫ్ఐఆర్ లు అని చెప్పారు. అంతే కాదు.. వాటిని తాను ప్రజల పక్షాన నిలబడినందుకు దక్కిన మెడల్స్ గా భావిస్తానన్నారు. రాహుల్ చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు దేశ వ్యాప్తంగా హాట్ టాపిక్ గా మారాయి.
విపక్షాల నిరసనల నేపథ్యంలో పోలీసులు ఢిల్లీలో విస్తృత బందోబస్తు ఏర్పాట్లు చేశారు. పలు ప్రాంతాల్లో బారికేడ్లు ఏర్పాటు చేయడంతో పాటు వేలాది మంది భద్రతా సిబ్బందిని మోహరించారు. ట్రాఫిక్ మళ్లింపులు కూడా చేపట్టారు. జంతర్ మంతర్, పార్లమెంట్ పరిసరాలు, ఎన్నికల సంఘం కార్యాలయం వైపు వెళ్లే మార్గాల్లో ప్రత్యేక నిఘా కొనసాగుతోంది.
ధనుష్ తన కొత్త రాజకీయ పార్టీ కోసం తమిళగ ఎళుచ్చి కళగం అనే పేరును ఖరారు చేసినట్లు ప్రచారం జరుగుతోంది. అలాగే.. ఈ పేరుతో ఇప్పటికే కేంద్ర ఎన్నికల సంఘం వద్ద పార్టీ రిజిస్ట్రేషన్ ప్రక్రియ కూడా పూర్తయ్యిందని అంటున్నారు.
ఒక దశలో తన రిటైర్మెంట్ తరువాత టీడీపీలో చేరేందుకు కూడా తాను సిద్ధపడ్డాననీ, అవసరమైతే ఎన్నికల బరిలో దిగడానికి కూడా రెడీ అయ్యాయనీ చెప్పిన ఏబీ వెంకటేశ్వరరావు, అ
బీసీ మోర్చా రాష్ట్ర అధ్యక్షుడు ప్రకాశ్ పాల్, ప్రముఖ దళిత నేత, మాజీ ఎంపీ విద్యాసాగర్ సోన్‌కర్, అలాగే అలహాబాద్ హైకోర్టు బార్ అసోసియేషన్ అధ్యక్షుడిగా రెండుసార్లు బాధ్యతలు నిర్వర్తించిన రాధాకాంత్ ఓఝా వంటి వారికి చోటు లభించింది.
ఆఫ్రికాలోని కాంగో నదిలో జరిగిన ఒక అత్యంత విషాదకరమైన పడవ ప్రమాదం యావత్ ప్రపంచాన్ని దిగ్భ్రాంతికి గురిచేసింది.
తెలంగాణ రాష్ట్రంలో అవినీతి అధికారులపై అవినీతి నిరోధక శాఖ (ఏసీబీ) ఉక్కుపాదం మోపుతోంది.
ఉత్తరప్రదేశ్ రాజకీయాల్లో భారతీయ జనతా పార్టీ (బీజేపీ) అధిష్ఠానం అనూహ్య నిర్ణయం తీసుకుని అందరినీ విస్మయానికి గురిచేసింది.
వైద్యశాస్త్ర రంగంలో ప్రపంచవ్యాప్తంగా అత్యున్నతంగా భావించే నోబెల్ బహుమతి ప్రకటన వెలువడింది.
ఢిల్లీలోని ప్రముఖ ప్రాంతమైన జంతర్ మంతర్ వద్ద ఉద్రిక్త వాతావరణం నెలకొంది. ఎన్నికల సంఘం ప్రధానాధికారి (CEC) జ్ఞానేశ్ కుమార్ రాజీనామా డిమాండ్