ఐఏఎస్‌లను అయ్య.. ఐపీఎస్‌లను కొడుకు ముంచారు!

Publish Date:Sep 16, 2024

Advertisement

అధికారులు అధికారంలో ఉన్న వారితో అంటకాగి.. వారి కోసం అడ్డగోలు పనులు చేస్తే పర్యవసానం అనుభవించక తప్పదని పలు మార్లు రుజువైంది. తాజాగా కాదంబరి జత్వానీ కేసులో ముగ్గురు ఐపీఎస్ అధికారుల సస్పెన్షన్ కూడా ఆ అధికారులు నిబంధనలను పట్టించుకోకుండా ఏలిన వారి కళ్లల్లో ఆనందం చూడడమే తమ జన్మకు సార్థకత అన్నట్లు ప్రవర్తించిన కారణంగానే ఇప్పుడు సస్పెన్షన్ కు గురయ్యారు. 

సాధారణంగా గ్రాడ్యుయేషన్ పూర్తి చేసిన చాలా మంది సవిల్ సర్వీసెస్ గోల్ గా ఎంచుకోవాలని భావిస్తారు. ఆ ప్రయత్నంలో విజయం సాధించిన వారు యువతకు స్ఫూర్తిగా నిలుస్తారు. సివిల్స్ సాధించడం కోసం వారెలా కృషి చేశారు. రోజుకు ఎన్నిగంటల పాటు చదివారు. ఎలా విజయం సాధించారు ఇత్యాది విషయాలను ఎంతో ఆసక్తిగా వింటారు. చదువుతారు. అయితే అలా సివిల్స్ సాధించి ఉన్నత స్థాయికి ఎదిగిన వ్యక్తులు తమ స్థాయికి తగని పనులు చేస్తే మాత్రం ప్రజలలో వారి పట్ల తీవ్ర ఆగ్రహం వ్యక్తం అవుతుంది. పరపతి, పలుకుబడి ఉండదు. ఇప్పుడు కాదంబరి జత్వానీ కేసులో సస్పెండైన ముగ్గురు ఐపీఎస్ అధికారుల పరిస్థితి కూడా అదే.  

జత్వానీ కేసులో ముగ్గురు ఐపీఎస్ అధికారులు పీఎస్సార్ ఆంజనేయులు, కాంతి రాణా టాటా, విశాల్ గున్నిల సస్పెన్షన్ ఆర్డర్ పై ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు సంతకం చేశారు. వీరు ముగ్గురూ కూడా గత జగన్ ప్రభుత్వ హయాంలో ప్రభుత్వాధికారులుగా కాక వైసీపీ కార్యకర్తలుగా పని చేశారన్న ఆరోపణలు ఉన్నాయి. విశ్లేషకులు వీరిని ఐపీఎస్ లుగా కాకుండా వైపీఎస్ లుగా అభివర్ణించేవారు. అయితే ఇప్పుడు మాత్రం వారు తమ స్థాయికి తగని, నిబంధనలు అంగీకరించని రీతిలో వైసీసీ అగ్రనాయకత్వం మెప్పు కోసం అడ్గగోలుగా వ్యవహరించారనడానికి తిరుగులేని సాక్ష్యం దొరకడంతో వారిపై సస్పెన్షన్ వేటు పడింది. 

ఐఏఎస్,ఐపీఎస్ అధికారులను సస్పెండ్ చేయడం అనేది ప్రభుత్వానికి అంత తేలిక ఏమీ కాదు. చరిత్రలో ఇప్పటి వరకూ ఐఏఎస్ లేదా ఐపీఎస్ లు సస్పెండైన ఘటన ఇది రెండోది మాత్రమే. ఇంతకు ముందు గుజరాత్ లో షహ్రాబుద్దీన్ కేసులు ఇలా అధికారులు సస్పెండయ్యారు. ఆ తరువాత ఇప్పుడు కాదంబరి జత్వానీ కేసులో ముగ్గురు ఐపీఎస్ లు సస్పెండయ్యారు.  ఏపీలో తాజాగా సస్పెండైన ముగ్గురు ఐపీఎస్ లూ అధికారులు తాము చేసిన తప్పిదం కారణంగానే అడ్డంగా బుక్కయ్యారు. 

సినీనటి కాదంబరి జత్వానీపై వైసీపీ నాయకుడు కుక్కల విద్యాసాగర్ ఫిర్యాదు చేయడానికి ముందే ఐపీఎస్ అధికారులు ఆమెను అరెస్టు చేయడానికి ముంబైకి విమాన టికెట్లు బుక్ చేసుకున్నారు. ఈ ముగ్గురు అధికారుల సస్పెన్ష్ ఆర్డర్ ను బట్టి అప్పటి ఐంటెలిజెన్స్ చీఫ్ పీఎస్సార్ ఆంజనేయులు, అప్పటి విజవాడ సీపీ కాంతిరాణా, ఐపీఎస్ అధికారి విశాల్ గున్నిలను సీఎంవో కార్యాలయానికి పిలిపించుకుని కాదంబరి జత్వానీని ముంబై నుంచి తీసుకురావలసిందిగా ఆదేశించారు.  కేసుకు సంబంధించి ఎటువంటి వివరాలూ పరిశీలించకుండానే, శ్రద్ధ పెట్టకుండానే జత్వానీని ముంబై నుంచి తీసుకురావడాన్ని తీవ్రమైన అధికార దుర్వినియోగంగా ప్రస్తుత ప్రభుత్వం భావించి వారిపై సస్సెన్షన్ వేటు వేసింది.

అంతుకు ముందే  డీజీపీ నివేదిక ఆధారంగా ఇబ్రహీంపట్నం సీఐ సత్యనారాయణ, ఏసీపీ హనుమంతరావులపై సస్పెన్షన్ వేటు పడింది. తాజాగా ముగ్గురు ఐపీఎస్ లను సర్కార్ సస్పెండ్ చేసింది. కొసమెరుపేంటంటే.. గతంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో వైఎస్ రాజశేఖరరెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో జగన్ క్విడ్ ప్రొకొకు సహకరించి  ఐఏఎస్ అధికారులు కొందరు జైలు పాలైన సంగతి తెలిసిందే. ఇప్పుడు అంటే విభజిత ఆంధ్రప్రదేశ్ లో జగన్ హయాంలో అడ్డగోలుగా కేసులు, అరెస్టులకు పాల్పడి ఐపీఎస్ అధికారులు సస్పెండయ్యారు. ఇప్పుడు జగన్ అండ చూసుకుని అడ్డగోలుగా వ్యవహరించిన అధికారులు పర్యవసానం అనుభవించక తప్పదు. విచారణ ఎదుర్కొని దోషులుగా తేలితే కటకటాల పాలు కాకా తప్పదు.  

By
en-us Political News

  
దశాబ్దాలుగా పెండింగ్‌లో ఉన్న అర్బన్ ల్యాండ్ సీలింగ్‌ (ULC) దరఖాస్తుల పరిష్కారానికి తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది.
హైదరాబాద్‌లో కుటుంబ కలహాలు విషాదాంతమయ్యాయి
ఉత్తరాంధ్ర రాజకీయాల్లో కీలక పరిణామం చోటుచేసుకుంది.
పంజాబ్‌లోని ప్రసిద్ధ లవ్లీ ప్రొఫెషనల్ యూనివర్సిటీ క్యాంపస్‌లో శనివారం రాత్రి ఊహించని పరిణామాలు చోటుచేసుకున్నాయి.
ఆ సమయంలో తాను కేరళ రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా విధులు నిర్వర్తిస్తుండగా, గ్యానేష్ కుమార్ కేంద్ర హోంమంత్రిత్వ శాఖలో ఉన్నతాధికారిగా సేవలందిస్తున్నారని గుర్తుచేశారు. ప్రయాణ సమయంలో తన రిటైర్మెంట్ అనంతర ప్రణాళికల గురించి  ఆరా తీసిన జ్ణానేష్ కుమార్‌.. ఆ సందర్భంలోనే బీజేపీ తరఫున పతనం తిట్ట లోక్‌సభ స్థానం నుంచి పోటీ చేయాలని సూచించారన్నారు. 
ఈ నియోజకవర్గంలో గత ఎన్నికల ఫలితాలు,  ప్రస్తుత రాజకీయ వాతావరణం దృష్ట్యా బీఆర్ఎస్, కాంగ్రెస్, బీజేపీలు విజయంపై ధీమాతో ఉన్నాయి. ఈ నేపథ్యంలో టీఆర్ఎస్ బరిలోకి దిగడంతో సమీకరణాలు ఏ విధంగా మారతాయన్న దానిపై సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. 
ప్పటి వరకూ మోడీ సర్కార్ ఘనంగా చెప్పుకుంటూ వచ్చిన పారదర్శకత ప్రశ్నార్థకమైంది.  రాజ్యాంగ వ్యవస్థలు బలహీనపడ్డాయన్న వాదనకు బలం చేకూరింది. అంత వరకూ విపక్షాలు చేసే విమర్శలను సునాయాసంగా తిప్పికొట్టి పై చేయి సాధించిన మోడీ సర్కార్ నీటి విషయంలో సమాధానం చెప్పుకోలేక తడబడింది. వెనకడుగు వేసింది. 
ఎంతటి సంక్షోభాన్నైనా సంయమనం కోల్పోకుండా అధిగమించడం, ఆ సంక్షోభాన్నే అవకాశంగా మలచుకుని ముందుకు సాగడం ఆయన నైజం. ఎంతటి క్షిష్టమైన సమస్యనైనా  పరిష్కరించగలిగే నేర్పు, ఎంతటి సంక్షోభాన్నైనా తట్టుకునిముందుకు సాగే సామర్ధ్యం కారణంగానే ఆయనకు పొలిటికల్ సర్కిల్స్ లొ  క్రైసిస్ మ్యాన్ అన్న గుర్తింపు వచ్చింది. 
వ్యవసాయ రంగానికి పెద్దపీఠ వేసేలా చంద్రబాబు  35 వేలకోట్ల రూపాయల అంచనాతో  సాగునీటి రోడ్‌మ్యాప్‌ను ప్రకటించారు. దీని ద్వారా రాష్ట్రవ్యాప్తంగా పెండింగ్‌లో ఉన్న 36 సాగునీటి ప్రాజెక్టులను వేగంగా పూర్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. అంతేకాకుండా..  దేశంలోనే తొలిసారిగా ఆంధ్రప్రదేశ్‌లో  ఇరిగేషన్ అండ్ వాటర్ క్యాలెండర్ ను అందుబాటులోకి తెచ్చారు.
ఎన్నికలు రిగ్గింగ్ అవుతున్నాయని తెలిసినా, ప్రతిపక్షాలు మళ్లీ అవే ఎన్నికల్లో పాల్గొంటూ ఆ పద్ధతికి చట్టబద్ధత ఎందుకు కల్పిస్తున్నాయని ప్రశ్నించి సంచలనం సృష్టించారు.  ఓట్లు చోరీకి గురవుతున్నా, ఎమ్మెల్యేలు, ఎంపీలు కొనుగోలుకు గురవుతున్నా, పార్టీలు చీలిపోతున్నా కేవలం ఉనికి కోసమే పోరాడుతున్నారా అని నిలదీశారు.
వైసీపీకి చెందిన పలువురు నాయకులు జనసేన పార్టీలో చేరారు.
ఎండిన నదిలో గంగమ్మ పరవళ్లు.. కరువు నేలపై జలకళ.!
చెన్నైలో బీఎస్ఎఫ్ నూతన భవనాలను ప్రారంభించిన కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.