ఇది వైసీపీ ఎన్నికల టీం

Publish Date:Apr 10, 2023

Advertisement

రాష్ట్ర విభజన అనతరం ఎవరూ ఊహించని విధంగా అందరి అంచనాలను తల్లకిందులు చేస్తూ తొలి సారిగా భారీఎత్తున ఐఏఎస్ ల బదిలీలు జరగడం రాజకీయ, అధికార వర్గాల్లో హాట్ టాపిక్ గా మారింది. సాధారణంగా అసెంబ్లీ సమావేశాల అనంతరం బదిలీలు జరుగుతాయని అందరూ ఊహించారు. అయితే  కొందరు అధికారులపై మంత్రులు, ఎమ్మెల్యేలు పిర్యాదు చేయడం, అనంతరం ఈ నెల మూడో తేదీన జరిగిన ఎమ్మెల్యేల సమావేశంలో అధికారుల తీరుపై సీఎం వద్ద తమ అసంతృప్తి వ్యక్తం చేయడంతో బదిలీల జాబితాలో భారీ మార్పులు, చేర్పులు జరిగినట్లు సమాచారం.

ఈసారి బదిలీల్లో కొందరు ప్రజాప్రతినిధుల అభిప్రాయాలకు  ప్రాధాన్యత కల్పించినట్లు చెబుతున్నారు. అంతేగాకుండా మరో ఏడాదిలో సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో తమకు అనుకూలంగా ఉండేందుకు ఎన్నికల టీంను నియమించారనే వ్యాఖ్యలు కూడా వినిపిస్తున్నాయి. ఎన్నికల దిశగా ముఖ్యమంత్రి కీలక నిర్ణయాలు తీసుకుని పార్టీ ప్రభుత్వంలో మార్పు లకు శ్రీకారం చుట్టారు. పాలనలో ప్రక్షాళన ప్రారంభించారు. ఈసారి సీనియర్, జూనియర్ అధికారులందరికీ స్థాన చలనం కలిగింది.

అయితే కొందరు జూనియర్లకు బదిలీల్లో ప్రాధాన్యత లభించగా, కొందరు సీనియర్లకు ఆప్రధాన్యత పోస్టులు ఇచ్చారనే చర్చ జరుగుతోంది. ప్రధానంగా గవర్నర్కు ప్రత్యేక ప్రధాన కార్యదర్శిగా పనిచేసి, ప్రస్తుతం పోస్టింగ్ కోసం ఎదురుచూస్తున్న సీనియర్ ఐఏఎస్ అధికారి ఆర్.పి. సిసోడియాను ఏపీ మానవ వనరుల అభివృద్ధి సంస్థ డైరెక్టర్ గా  అప్రాధాన్య పోస్టులో ప్రభుత్వం నియమించిందని పలువురు భావిస్తున్నారు.  గతంలో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎల్వీ సుబ్రహ్మణ్యంను సాగనంపే క్రమంలో ఇదే తరహాలో బదిలీ జరిగినట్లు ఐఎఎస్ అధికారులు గుర్తు చేస్తున్నారు. కొన్ని రోజుల క్రితం ప్రభుత్వ ఉద్యోగుల సంఘం నాయకుడు సూర్యనారాయణ అప్పటి గవర్నర్ విశ్వభూషణ్ హరిచందన్ ను కలిసి జీతాల విషయంలో రాష్ట్ర ప్రభుత్వంపై ఫిర్యాదు చేశారు. సూర్య నారాయణతో పాటు ఉద్యోగులకు సిసోడియానే గవర్నర్ అపాయింట్ ఇప్పించారు.

 అప్పటికే బదిలీల జాబితా సిద్ధం అయినా విడుదల చేయలేదు. అపాయింట్మెంట్  ఇప్పించారన్న కారణంతో ప్రభుత్వం ఆయనను బదిలీ చేసిందని, ఆ సమయంలో ఐఏఎస్ వర్గాల్లో చర్చ జరిగింది. అదే విధంగా దేవదాయ శాఖ కమిషనర్ గా ఉన్న ఎం.హరిజవర్ లాల్ కు కార్మిక శాఖ కార్య దర్శిగా.. అంతగా ప్రాధాన్యం లేని పోస్టులోకి బదిలీ చేసారు. పాత గుంటూరులోని ఒక ఆలయానికి చెందిన రెండెకరాలకు.... ఎన్ఓసీ ఉత్తర్వులివ్వడం వివాదాస్పదమైంది. దానిపై తీవ్రంగా మండిపడిన హైకోర్టు... ఆయన ఆ పోస్టుకే అర్హుడు కాదని వ్యాఖ్యా నించింది. అయితే హరిజవర్ లాల్ దేవాదాయశాఖలో సమర్థవంతం గా పనిచేసినా ఆయనకు ప్రాధాన్యత లేని శాఖను కేటాయించడం చర్చనీయాంశం అయింది.

అలాగే  శేషగిరిబాబును కార్మికశాఖ కమిషనర్ గా ప్రాధాన్యత లేని శాఖలకు నియమించడంపై కూడా చర్చ జరుగుతోంది. అదే విధంగా ఎంఎల్సీ ఎన్నికల సందర్భంగా అనంతపురం కలెక్టర్ నాగలక్ష్మి రీ కౌంటింగ్ కు అనుమతి ఇవ్వలేదని అక్కడి అధికార పార్టీ నేతలు సీఎంకు ఫిర్యాదు చేసిన నేపథ్యంలో ఆమెను విజయనగరం కలెక్టర్ గా పంపినట్లు చెటుతున్నారు. అయితే అక్కడ కలెక్టర్ గా పనిచేసిన సూర్యకుమారిని కీలకమైన పంచాయితీ రాజ్ కమిషనర్ గా పదోన్నతి లభించింది. ఎనిమిది జిల్లాల కలెక్టర్లను మార్పు చేయగా ఇద్దరిని వేరే జిల్లాలకు

కృష్ణా జిల్లా కలెక్టర్ రంజిత్ బాషాను బాపట్ల కలెక్టర్ గా బదిలీ చేశారు.  బదిలీల్లో కీలక మైన దేవాదాయశాఖ, పంచాయితీ రాజ్ శాఖలతో పాటు స్కిల్ డెవల్పమెంట్ కార్పొరేషన్.. జెన్కో ట్రాన్స్కో, ఇంటర్ బోర్డు తదితర శాఖల అధికారులుకూ స్థాన చలనం కలిగింది. కాగా ఐపీఎస్ అధికారుల  బదిలీలకు రంగం సిద్దం అయింది. ఇప్పటికే ఎస్పీ స్థాయి నుంచి ఐజీ ర్యాంకు అధికారుల బదిలీల జాబితాపై కసరత్తు కొనసాగుతోంది. మరో రెండు రోజుల్లో ఐపీఎస్ జాబితా విడుదల కానున్నది. 

రాష్ట్రంలో రోజు రోజుకు తన గ్రాఫ్ పడిపోతున్న విషయాన్ని గమనించిన సీఎం జగన్.. మరో ఏడాది కాలంలో జరగనున్న ఎన్నికలై ఇప్పటి నుంచే దృష్టి పెట్టరని పరిశీలకులు భావిస్తున్నారు. అనననుకూల పరిస్థితులను అనుకూలంగా మర్చడంలో జగన్ సామర్థ్యం తెలియంది కాదు.. అందుకనే ఈ కసరత్తులనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి..

By
en-us Political News

  
సినిమా రంగంలో సరికొత్త చరిత్ర సృష్టిస్తూ ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా సక్సెస్ ఫుల్ డైరెక్టర్ అట్లీ దర్శకత్వంలో అత్యంత ప్రతిష్టాత్మకంగా
వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి మరో ఎదురుదెబ్బ తగిలింది.
ప్రముఖ సినీనటి రాధ తన కుటుంబ సభ్యులపై చెన్నై పోలీసులను ఆశ్రయించారు.
రాజకీయ నేతలను లక్ష్యంగా చేసుకుని అనుచిత వ్యాఖ్యలు చేయడం వంటి తీవ్రమైన అభియోగాలపై ఆంధ్రప్రదేశ్ పోలీసులు అతడిని అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో పోలీసుల విచారణలో భాగంగా వెలుగుచూసిన పరిణామాలు, అతడు వ్యక్తం చేసిన పశ్చాత్తాపం డిజిటల్ మీడియాలో ఇష్టారీతిగా వ్యాఖ్యలు చేసే వారందరికీ నిస్సందేహంగా ఒక హెచ్చరిక అని చెప్పవచ్చు. 
కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ కాంగ్రెస్ పార్టీపై తీవ్రస్థాయిలో విమర్శలు చేశారు.
పెళ్లంటే సంబరమా.. అప్పుల భారమా? రూ.45 లక్షల లోన్‌పై నెటిజన్ ఆవేదన..!
భీమిలి అసెంబ్లీ నియోజకవర్గ వైసీపీ సమన్వయకర్తగా (ఇన్ చార్జ్) బొత్స అనూషను ఆ పార్టీ అధినేత జగన్ నియమించారు. ఈ మేరకు   పార్టీ కేంద్ర కార్యాలయం నుంచి  ఉత్తర్వులు వెలువడ్డాయి. పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్‌మోహన్ రెడ్డి ఆదేశాల మేరకే ఈ నియామకం జరిగినట్లు పార్టీ వర్గాలు వెల్లడించాయి.  
స్థానిక సంస్థల ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో జగన్ విదేశీ పర్యటన పెట్టుకోవడాన్ని ప్రస్తావిస్తూ రాజకీయ పరిశీలకులు షర్మిల కుమార్తె వివాహానికి హాజరు కాకుండా తప్పించేకునేందుకే జగన్ ఈ నిర్ణయం తీసుకుని ఉండొచ్చంటూ విశ్లేషిస్తున్నారు.  ఈ నేపథ్యంలోనే షర్మిల తన అన్న నివాసానికి వెళ్లి వివాహ ఆహ్వానపత్రిక అందిస్తారా? అందిస్తే జగన్ ఆ వివాహానికి హాజరౌతారా? అన్న అనుమానాలు పరిశీలకులలో వ్యక్తమౌతున్నాయి.
విదేశీ పర్యటనలో ఉన్నంతకాలం  అందుబాటులో ఉండే కాంటాక్ట్ ఫోన్ నంబరుతో పాటు అధికారిక ఈ-మెయిల్ అడ్రస్ కూడా సీబీఐ అధికారులకు కచ్చితంగా అందించాలి. ఇక విదేశీ పర్యటన ముగిసిన వెంటనే   కోర్టు విచారణ ప్రక్రియకు హాజరు కావాలని కోర్టు ఆదేశించింది.
చీఫ్ జస్టిస్ అపరేష్ కుమార్ సింగ్, జస్టిస్ జి.ఎం. మొహిద్దీన్ కూడిన ధర్మాసనం స్పీకర్ తీర్పును పక్కనపెట్టి దానం నాగేందర్ అనర్హతను ఖాయం చేసింది. 
విజయవాడ ఏసీబీ కోర్టు న్యాయాధికారి సమక్షంలో శుక్రవారం దాదాపు ఐదుగంటల పాటు  సత్యప్రసాద్‌ తన వాంగ్మూలాన్ని నమోదు చేయించారు. ఈ ప్రక్రియలో పలువురు న్యాయవాదులు, ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్) అధికారులు   పాల్గొన్నారు. ప్రభుత్వంలో ఉన్నప్పుడు కీలక బాధ్యతలు నిర్వర్తించిన సత్యప్రసాద్, ఈ అక్రమ వసూళ్ల తంతు ఎలా సాగిందో సవివరంగా న్యాయమూర్తి ఎదుట చెప్పారు.
దానం నాగేందర్ అధికారికంగా బీఆర్‌ఎస్‌ పార్టీకి రాజీనామా చేయకుండానే కాంగ్రెస్‌ గూటికి చేరారని, అంతేకాకుండా కాంగ్రెస్‌ పార్టీ తరఫున సికింద్రాబాద్‌ లోక్‌సభ స్థానానికి అభ్యర్థిగా  పోటీ చేశారని హైకోర్టు దృష్టికి తెచ్చారు. పార్టీ ఫిరాయింపులకు ఇవి  బలమైన సాక్ష్యాధారాలని వారు పేర్కొన్నారు.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.