కిషన్ రెడ్డికి ఇది చాలెంజ్... ఇకపై  జమ్ము కాశ్మీర్ ఎన్నికల ఇన్ చార్జి 

Publish Date:Jun 17, 2024

Advertisement

త్వ‌ర‌లో ఎన్నిక‌లు జ‌ర‌గ‌నున్న జ‌మ్మూక‌శ్మీర్‌, హ‌రియాణా, మ‌హారాష్ట్ర‌, ఝార్ఖండ్‌ల‌కు బీజేపీ ఇన్‌ఛార్జ్‌ల‌ను నియ‌మించింది. దీనిలో భాగంగా కేంద్ర‌మంత్రి కిష‌న్ రెడ్డికి జ‌మ్మూకశ్మీర్ బాధ్య‌త‌లు అప్ప‌గించింది. అలాగే హ‌రియాణాకు ఇన్‌ఛార్జ్‌లుగా ధ‌ర్మేంద్ర ప్ర‌ధాన్‌, బిప్ల‌వ్ దేవ్‌ల‌ను నియ‌మించింది. మ‌హారాష్ట్ర బాధ్య‌త‌లు భూపేంద్ర యాద‌వ్‌, అశ్వినీ వైష్ణ‌వ్‌కు అప్ప‌గించ‌డం జ‌రిగింది. ఇక శివ‌రాజ్ సింగ్ చౌహాన్‌, హిమంత బిశ్వ‌శ‌ర్మ‌లను ఝార్ఖండ్ ఇన్‌ఛార్జ్‌లుగా నియ‌మిస్తున్న‌ట్లు ప్ర‌క‌టించింది. కిషన్ రెడ్డి ఆర్ఎస్ఎస్ బ్యాక్ గ్రౌండ్ లో రాజకీయ నేతగా ఎదిగిన వ్యక్తి. ఉగ్రవాదులకు అడ్డాగా ఉన్న హైదరాబాద్ లోనే ఆయన రాజకీయ ప్రస్థానం సాగింది.  ఒకప్పుడు టెర్రరిస్టుల హిట్ లిస్ట్ లో ఉన్న కిషన్ రెడ్డికి జమ్ము కాశ్మీర్ వేర్పాటువాదాన్ని ప్రోత్సహించే టెర్రరిస్టుల స్థావరంలో కిషన్ రెడ్డి ఎన్నికలు  జరపాలని హైకమాండ్ ఆదేశించింది. 
లోక్‌సభ ఎన్నికలు ముగిశాయి. మళ్లీ ఐదేళ్ల వరకు లోక్‌సభ ఎన్నికలు లేవు. అయినా మళ్లీ ఎన్నికల హడావుడి మొదలైంది. ఆర్టికల్ 370 రద్దు చేయడానికి ముందు నుంచి రాష్ట్రపతి పాలనలో ఉన్న జమ్ము-కాశ్మీర్ సహా మరికొన్ని రాష్ట్రాలకు అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. లోక్‌సభ ఎన్నికల్లో ఎదురైన చేదు అనుభవాలను దృష్టిలో పెట్టుకున్న భారతీయ జనతా పార్టీ అగ్రనాయకత్వం.. అసెంబ్లీ ఎన్నికల కోసం ఇప్పటి నుంచే సమాయత్తమైంది. ఆయా రాష్ట్రాలకు ఎన్నికల ఇంచార్జులు, సహ ఇంచార్జులుగా కేంద్ర మంత్రులు, బీజేపీ పాలిత రాష్ట్రాల ముఖ్యమంత్రులకు బాధ్యతలు అప్పగించింది. తద్వారా కేంద్ర ఎన్నికల సంఘం  ఆయా రాష్ట్రాల్లో ఎన్నికల తేదీలను ఖరారు చేసే సమయానికే ఎన్నికల రణరంగంలో ప్రత్యర్థుల కంటే నాలుగు అడుగులు ముందుండాలని చూస్తోంది. ఆయా రాష్ట్రాల్లో పార్టీ గెలుపు కోసం అనుసరించాల్సిన వ్యూహాల విషయంలో ఎన్నికల ఇంచార్జులు కీలకం కానున్నారు. ప్రదేశ్ చునావ్ ప్రభారీ (రాష్ట్ర ఎన్నికల ఇంచార్జి) పేరుతో ప్రతి రాష్ట్రానికి బీజేపీ ఇంచార్జులను నియమిస్తూ ఉంటుంది. ఆయా రాష్ట్రాల వ్యవహారాలు చూసుకునే పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శులకు అదనంగా ఎన్నికల ఇంచార్జులు అక్కడ ఉండి పార్టీని గెలిపించేందుకు వ్యూహాలు, ప్రణాళికలు అమలు చేయాల్సి ఉంటుంది.

జమ్ము కాశ్మీర్ రాష్ట్రానికి స్వయం ప్రతిపత్తిని కల్పించిన ఆర్టికల్ 370ని రద్దు చేసిన తర్వాత ఆ రాష్ట్రం నుంచి లద్దాఖ్ ప్రాంతాన్ని వేరు చేసిన విషయం తెలిసిందే. లద్దాఖ్‌ను కేంద్ర పాలిత ప్రాంతంగా ప్రకటించిన కేంద్ర ప్రభుత్వం, మిగతా జమ్ము-కాశ్మీర్‌ను అసెంబ్లీతో కూడిన కేంద్ర పాలిత ప్రాంతంగా ప్రకటించింది. ఇందులో పాకిస్తాన్ ఆక్రమణలో ఉన్న కాశ్మీర్ లో కూడా కొన్ని నియోజకవర్గాలను ప్రకటిస్తూ అసెంబ్లీని పునర్వ్యవస్థీకరించింది. ప్రస్తుతం లెఫ్టినెంట్ గవర్నర్ మనోజ్ సిన్హా ద్వారా రాష్ట్రపతి పాలన నడుస్తోంది. ఈ రాష్ట్రానికి పూర్తిస్థాయి రాష్ట్ర హోదా కల్పించాలంటూ సుప్రీంకోర్టులో అనేక పిటిషన్లు దాఖలవగా.. త్వరలోనే రాష్ట్ర హోదా కల్పిస్తామంటూ కేంద్ర ప్రభుత్వం సుప్రీంకోర్టులో అఫిడవిట్ కూడా దాఖలు చేసింది. ఈ రాష్ట్ర హోదాతో సంబంధం లేకుండా అక్కడి అసెంబ్లీకి ఎన్నికలు నిర్వహించే విషయంలోనూ పిటిషన్లు దాఖలవగా.. లోక్‌సభ ఎన్నికల తర్వాత అసెంబ్లీకి ఎన్నికలు నిర్వహిస్తామంటూ కేంద్ర ఎన్నికల సంఘం సుప్రీంకోర్టుకు తెలిపింది. ఆ మేరకు మహారాష్ట్ర, హర్యానా, జార్ఖండ్ రాష్ట్రాలతో పాటు జమ్ము-కాశ్మీర్‌కు ఒకేసారి అసెంబ్లీ ఎన్నికలు నిర్వహించేందుకు ఈసీ కసరత్తు చేస్తోంది.

ఆర్టికల్ 370 రద్దు చేసిన సమయంలో కాశ్మీర్ లోయ పూర్తి అల్లకల్లోలంగా మారింది. ఏడాది కాలం పాటు ఆ రాష్ట్రంలో మొబైల్ ఇంటర్నెట్ సేవలను నిలిపివేయాల్సి వచ్చిందంటేనే పరిస్థితి ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చు. నిత్యం ఘర్షణలతో అట్టుడుకిన ఆ ప్రాంతంలో మెల్లమెల్లగా శాంతి నెలకొంది. మారిన కాశ్మీర్ కనిపిస్తోంది. అభివృద్ధి పట్టాలెక్కింది. పర్యాటకం ఒక్కసారిగా ఊపందుకుంది. ఆ ప్రాంత ప్రజల్లో సైతం మార్పు సానుకూల దృక్పథాన్ని పెంచింది. అయితే ఇదంతా చూసి ఓర్వలేని పాకిస్తాన్.. కుట్రలు చేస్తూనే ఉంది. తమ భూభాగంపై శిక్షణ ఇచ్చి, అధునాతన మారణాయుధాలు సమకూర్చి ఉగ్రవాదులను మన భూభాగంపైకి పంపుతోంది. ఇంతకాలం పాటు భద్రతా బలగాలను లక్ష్యంగా చేసుకుని దాడులకు పాల్పడుతున్న సీమాంతర ఉగ్రవాదులు, ఈ మధ్య జమ్ము ప్రాంతంలో యాత్రికులను లక్ష్యంగా చేసుకుని దాడులకు తెగబడుతున్నారు.

భౌగోళికంగా హిందూ, సిక్కు ప్రజలు ఎక్కువగా ఉన్న జమ్ములో భారతీయ జనతా పార్టీ ఎన్నికల ప్రచారానికి వచ్చిన సమస్య పెద్దగా లేకపోయినా, అత్యధిక శాతం ముస్లిం జనాభా కల్గిన కాశ్మీర్ లోయ కాషాయ దళానికి సవాళ్లు విసురుతోంది. ఆ పార్టీ తరఫు ప్రజా ప్రతినిధులుగా ఉన్నవారిని ఉగ్రవాదులు వెంటాడి హతమార్చుతున్నారు. పార్టీ కార్యకర్తలను కాపాడుకోవడం బీజేపీకి అసలు సిసలు సవాలుగా మారింది. ఇలాంటప్పుడు బీజేపీ తరఫున ఎన్నికల ప్రచారం నిర్వహించడం, వ్యూహాలు, ప్రణాళికలను అమలు చేయడం కూడా అంత సులభమేమీ కాదు. అలాంటి రాష్ట్రానికి కేంద్ర మంత్రి కిషన్ రెడ్డిని బీజేపీ హైకమాండ్ ఎన్నికల ఇన్‌చార్జిగా నియమించింది. గతంలో కేంద్ర హోంశాఖ సహాయ మంత్రిగా పనిచేసిన కిషన్ రెడ్డి, ఈ రాష్ట్రంపై గట్టి పట్టు సాధించారు. పార్టీ కార్యక్రమాల్లోనూ చురుగ్గా పాల్గొన్నారు. స్థానిక సంస్థల ఎన్నికల సమయంలో ఆయన అక్కడే ఉండి ఎన్నికల వ్యూహాలు అమలు చేశారు. గతానుభవాలను దృష్టిలో పెట్టుకున్న బీజేపీ హైకమాండ్.. అసెంబ్లీ ఎన్నికల బాధ్యతల్ని కూడా ఆయన భుజాలపై మోపింది. ఆర్టికల్ 370 రద్దు తర్వాత జరుగనున్న తొలి అసెంబ్లీ ఎన్నికలు సవాళ్లతో కిషన్ రెడ్డికి స్వాగతం పలుకుతున్నాయి.

By
en-us Political News

  
కొలంబియా యూనివర్సిటీ వేదికగా రాహుల్ గాంధీ మాట్లాడుతూ, ప్రస్తుతం  దేశ ఆర్థిక వ్యవస్థ   పతనావస్థలో ఉందని రాహుల్ సంచలన వ్యాఖ్యలు చేశారు. దేశంలో నిరుద్యోగ సమస్య విపరీతంగా పెరిగిపోయిందని, యువతకు ఉపాధి అవకాశాలు కరవయ్యాయని ఆయన ఆరోపించారు.
తమ కుటుంబ వివాహ వేడుకకు తండ్రిసమానులైన ఒక సీనియర్ రాజకీయ నాయకుడిని ఆహ్వానించడంలో తప్పేముందని ప్రశ్నించిన షర్మిల.. దీనికి అనవసరమైన, అభ్యంతరకరమైన అర్థాలు ఆపాదించి ప్రచారం చేయడం జగన్ దిగజారుడుతనానికి నీచ మసస్థత్వానికి నిదర్శనమన్నారు.
తెలంగాణ కాంగ్రెస్ రాజకీయ వర్గాల్లో గత కొంతకాలంగా నెలకొన్న ఉత్కంఠకు అఖిల భారత కాంగ్రెస్ కమిటీ (ఏఐసీసీ) అధికారికంగా తెరదించింది.
ఈ నేపథ్యంలో వైయస్ జగన్మోహన్ రెడ్డికి అత్యంత సన్నిహితుడైన చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి వైసీపీ తరపున తొలిసారిగా విజయసాయి పార్టీపై స్పందించారు. అయితే, ఆయన తన స్పందనను చాలా సాధారణంగా, క్లుప్తంగా ముగించడమే కాకుండా విజయసాయి రెడ్డిని   తేలికగా తీసుకున్నట్లు కనిపించింది.
వైసీపీకి సుదీర్ఘకాలం పాటు అత్యంత సన్నిహితుడిగా, కీలక నేతగా వ్యవహరించిన విజయసాయిరెడ్డి సొంతంగా కొత్త రాజకీయ పార్టీని ప్రకటించడం రాష్ట్ర రాజకీయ వర్గాల్లోచర్చకు తెరతీసింది.
పేద,  మధ్యతరగతి ప్రజల ఆదాయాన్ని పెంచేలా చర్యలు తీసుకోవడం వంటి హామీలను ప్రకటించారు. రాజకీయాల్లో పాత పద్ధతులకు స్వస్తి చెప్పి, ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా పరిపాలన అందించడమే తమ పార్టీ విధానమని విజయసాయిరెడ్డి చెప్పారు, 
విజయ్ ప్రభంజనంతో ఎంతోమంది సామాన్య అభ్యర్థులు సైతం ఎమ్మెల్యేలుగా విజయం సాధించారు. అయితే.. ప్రజలు అందించిన ఈ భారీ విజయాన్ని కొందరు ప్రజాప్రతినిధులు సరిగ్గా ఉపయోగించుకోలేకపోతున్నారనే విమర్శలు వ్యక్తమవుతున్నాయి.
కడప జిల్లా రాజకీయాల్లో ఆసక్తికర పరిణామాలు చోటుచేసుకుంటున్నాయి.
ప్రతి ఒక్కరికీ నిర్దిష్ట పాత్రలు ఉండేలా చంద్రబాబు    రూపొందించిన వ్యవస్థ వల్ల  కుటుంబంలో అంతర్గత విభేదాలు రాకుండా, ఎవరికీ తక్కువ అనే భావన కలగకుండా ఉందనీ, కుటుంబంలో అందరం సమానమేననీ చెప్పారు.
నిన్నటి వరకూ జగన్ కు పెట్టని కోటలా నిలిచిన పులివెందులలో ఇప్పుడు తెలుగుదేశం జెండా ఘనంగా ఎగురుతోంది.  సుదీర్ఘకాలంగా వైసీపీకి తిరుగులేని కంచుకోటగా ఉన్ పులివెందుల పరిధిలో తెలుగుదేశం పార్టీ తన ఉనికిని బలంగా చాటుకుంటోంది.
వైసీపీ అధినేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి తీరుపై ఆ పార్టీ నుంచి బయటకు వచ్చిన మాజీ ఎంపీ విజయసాయి రెడ్డి తీవ్రస్థాయిలో మండిపడ్డారు.
తుఫాను కారణంగా చీరాల మన్సిపాల్టీలో ఓట్ల లెక్కింపు శుక్రవారం (నవంబర్ 5) జరుగుతోంది. ఇప్పటి వరకు ఎక్కడా కనీసం డిపాజిట్ కూడా దక్కని కాంగ్రెస్ ఖాతాలో  తొలి విజయం నమోదైంది. కాంగ్రెస్ పార్టీ చీరాల మునిసిపోల్స్ లో గట్టి పోటీ ఇచ్చింది. 25వ వార్డులో విజయం సాధించింది.  25వ వార్డు నుంచి బరిలోకి దిగిన కాంగ్రెస్ అభ్యర్థి వెంకట్రావు విజయం సాధించారు. 
పోలింగ్ సరళి, వెలువడిన ఫలితాలు వైసీపీ శిబిరంలో ఆందోళన కలిగిస్తుంటే వైసీపీ అధినేత, మాజీ సీఎం జగన్ మాత్రం మేకపోతు గాంభీర్యం ప్రదర్శిస్తూ, అధికార తెలుగుదేశం కూటమి అరాచకాలు, అధికార దుర్వినియోగం తమ ఓటమికి కారణాలుగా చూపడానికి ప్రయత్నిస్తున్నారు.  ఎన్నికల ఫలితాల వెల్లడి తర్వాత వైఎస్ జగన్ నిర్వహించిన ఈ మీడియా సమావేశంలో జగన్ చెప్పిందే చెప్పారు. 
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.