అలిగిన వీరశివా..సీఎం హితబోధ
Publish Date:Jan 19, 2012
Advertisement
హైదరాబాద్: తిరుపతి శాసనసభ్యుడు చిరంజీవి వర్గం శాసనమండలి సభ్యుడు సి.రామచంద్రయ్యను కిరణ్ కుమార్ రెడ్డి తన మంత్రివర్గంలోకి తీసుకోవడంపై కమలాపురం ఎమ్మెల్యే వీరశివారెడ్డి అలిగారు. సి.రామచంద్రయ్య, గంటా శ్రీనివాస్ రావులు మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేసిన అనంతరం వీరశివారెడ్డి ముఖ్యమంత్రిని కలిసి తన శాసనసభ్యత్వానికి రాజీనామా చేస్తున్నట్లు లేఖను అందజేశారు. అయితే కిరణ్ మాత్రం రాజీనామాను స్వీకరించలేదు. రాజకీయాల్లో అన్నీ అనుకున్నట్లే జరగవని, ఇటువంటి పరిణామాలు సహజమేనని సిఎం వీరశివారెడ్డికి హితబోధ చేసినట్లుగా తెలుస్తోంది. తెలుగుదేశం పార్టీ అవిశ్వాస తీర్మానం పెట్టిన సమయంలో చిరంజీవి ప్రభుత్వాన్ని ఆదుకున్నందున ఆయన వర్గంలో వారు కోరిన ఇద్దరికి మంత్రిగా అవకాశం ఇచ్చామని చెప్పారని తెలుస్తోంది. అధిష్టానం నిర్ణయానికి కట్టుబడి ఉంటే మంచి భవిష్యత్తు ఉంటుందని సూచించినట్లుగా సమాచారం. దీంతో వీర శివా రెడ్డి వెనక్కి తగ్గినట్లుగా తెలుస్తోంది.
http://www.teluguone.com/news/content/thirupathi-24-11049.html





