Publish Date:Oct 14, 2024
మన ఆంధ్రాలో జగనన్న తరహాలోనే అమెరికాలో కూడా ఒక పెద్దమనిషి వున్నాడు. ఆయన పేరు అమెరికా జగనన్న అలియాస్ డొనాల్డ్ ట్రంప్. ఈయన గతంలో ఒకసారి అమెరికా అధ్యక్షుడిగా పనిచేశాడు. రెండోసారి కూడా అమెరికా అధ్యక్షుడు అవ్వాలని అనుకున్నాడు. అయితే ఫెయిలయ్యాడు. ఇప్పుడు మరోసారి అధ్యక్షుడు అవ్వాలన్న ఉద్దేశంతో ఎన్నికల బరిలో నిలిచాడు. అయితే వెరైటీ ఏంటంటే, డోనాల్డ్ ట్రంప్ మీద కూడా మన జగనన్న మీద జరిగినట్టే హత్యాయత్నాల మీద హత్యాయత్నాలు జరుగుతున్నాయి. ఆమధ్య ఆయన ఎన్నికల ప్రచారంలో వున్నప్పుడు థామస్ మాథ్యూ క్రూక్ అనే ఒక వ్యక్తి ట్రంప్ మీద హత్యాయత్నం చేశాడు. ఆ మిస్టర్ క్రూక్ షార్ప్ షూటర్ కానట్టుంది.. బుల్లెట్ ట్రంప్ చెవిని రాసుకుంటూ వెళ్ళింది. ఆ షూట్ చేసిన వ్యక్తిని పోలీసులు కాల్చి చంపేశారు. తన మీద ఈ హత్యాయత్నం అధికార పార్టీయే చేయించింది అని ట్రంప్ గగ్గోలు పెట్టారు. అయితే, ఆయన గగ్గోలుని ఎవరూ పట్టించుకోలేదు. ఇదంతా ఎలక్షన్లలో సానుభూతి పొందడం కోసం ట్రంప్ ఆడుతున్న డ్రామాగా చాలామంది అమెరికన్లు బాహాటంగానే విమర్శించారు.
మొన్నామధ్య ట్రంప్ ఫ్లోరిడాలో గోల్ఫ్ ఆడుతూ వుండగా ఒక వ్యక్తి ట్రంప్‌ని హత్య చేయడానికి ఒక వ్యక్తి ప్రయత్నించాడని, తుపాకీ తీసుకుని ట్రప్ దగ్గరకి రాబోతూ వుండగా భద్రతాదళాలు అతన్ని పట్టుకున్నాయని వార్తలు వచ్చాయి. దీన్ని కూడా అమెరికా జనం లైట్‌గా తీసుకున్నారు. బుల్లెట్ చెవిని రాసుకుని వెళ్ళినప్పుడే జనం పట్టించుకోలేదు. ఇప్పుడు రెక్కీ జరిగిందని అంటే పట్టించుకుంటారా? ఇప్పుడు మరోసారి అంటే, ముచ్చటగా మూడోసారి ట్రంప్‌ని హత్యచేసే ప్రయత్నం జరిగిందని వార్తలు వస్తున్నాయి. ఇటీవల కాలిఫోర్నియాలోని కోచెల్లా ప్రాంతంలో ట్రంప్ ర్యాలీ నిర్వహించిన సమయంలో వేం మిల్లర్ అనే వ్యక్తి రెండు తుపాకులు జేబుల్లో పెట్టుకుని తిరిగాడని, దీనికి సంబంధించిన సమాచారం అందుకున్న వెంటనే అతన్ని అరెస్టు చేశామని పోలీసులు చెబుతున్నారు. ఏంటో... ఇలా ఎలక్షన్ టైమ్‌లో వరుసగా జరుగుతున్న ఈ హత్యాయత్నాలు చూస్తుంటే మనకి మన జగనన్నే గుర్తొస్తూ వుంటాడు.
By Teluguone
en-us
Political News
http://www.teluguone.com/news/content/third-trump-assassination-attempt-39-186741.html
అసలాయన రాజకీయ పార్టీ ఏర్పాటు ఉద్దేశమేంటో? లక్ష్యమేంటో ఆయనకైనా స్పష్టత ఉందా అనిపించేలా ఆయన మీడియా సమావేశం సాగింది.
ఇటు రాష్ట్రంలోనూ, అటు కేంద్రంలోనూ కూడా తెలుగుదేశం పార్టీ ఎన్డీయేలో కీలకమైన భాగస్వామ్య పక్షంగా ఉన్న నేపథ్యంలో తన పోరాటాలకు ఇండియా కూటమి అండ అవసరమని భావిస్తున్నారని చెబుతున్నారు
తన రాజకీయ విజయానికి మహిళలే ప్రధాన కారణమని ఉద్ఘాటించిన విజయ్, మహిళలకు తగిన గౌరవం ఇవ్వాల్సిన బాధ్యత అందరిపై ఉందన్నారు. మన ఇంట్లోనూ తల్లులు, చెల్లెళ్లు ఉంటారు. మహిళలను ఎవరైనా అవమానిస్తే చట్టం చూస్తూ ఊరుకోదని విజయ్ హెచ్చరించారు.
తెలంగాణ వ్యవహారాల ఇన్ చార్జ్ ఆబ్సెన్స్ లో రేవంత్ తన కేబినెట్ పునర్వ్యవస్థాకరణ విషయంలో మరింత స్వేచ్ఛగా నిర్ణయాలు తీసుకునే అవకాశాలుంటాయని పరిశీలకులు అంటున్నారు. పార్టీలో, ప్రభుత్వంలో అసంతృప్తికి చెక్ పెట్టి, తన నిర్ణయాలను అమలు చేయడానికి రేవంత్ కు ఇది అనువైన సమయంగా రాజకీయవర్గాలు చెబుతున్నాయి.
2014 నుంచి ఆంధ్రప్రదేశ్ లో రెండు ప్రధాన రాజకీయ పార్టీల మధ్యే అధికారం మారుతూ వస్తోంది. వైపీపీ, తెలుగుదేశం మధ్య ద్విముఖ పోరే నెలకొని ఉంది. ఈ పరిస్థితుల్లో విజయసాయిరెడ్డి కొత్త పార్టీ రాష్ట్రంలో రాజకీయ సమీకరణాలలో మార్పు తీసుకువచ్చే అవకాశాలు లేకపోలేదని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.
కాషాయం పార్టీ రాష్ట్ర నేతలు కొండా బీజేపీ ఎంట్రీపై ఒక్కొక్కరూ ఒక్కోలా మాట్లాడుతున్నారు. వీటికి తోడు సకుటుంబ సపరివార సమేతంగా అయితేనే కాషాయం కండువా కప్పుకుంటానంటూ కొండా సురేఖ కండీషన్లు పెడుతున్నట్లు వస్తున్న వార్తలు ఆమెకు బీజేపీ ఎంట్రీ కూడా మూసుకుపోయిందా అన్న అనుమానాలకు కలిగిస్తున్నాయి.
కొండా సుశ్మీత మీడియా సమావేశం ఏర్పాటు చేసి.. తన వ్యాఖ్యలకు తానే బాధ్యురాలిననీ, తన తల్లిపై వేటు వేయడం సరికాదనీ ఆవేదన వ్యక్తం చేశారు. తన వ్యాఖ్యలకు తన తల్లిని శిక్షించడం సరికాదన్నారు. తెలంగాణ కాంగ్రెస్ పార్టీలో వ్యక్తిగత అభిప్రాయాలకు, స్వతంత్రంగా మాట్లాడే మహిళల గొంతుకకు విలువ లేకుండా పోతోందని ఆవేదన వ్యక్తం చేశారు.
పార్టీ అధిష్టానం సీఎఉం మాటకు ఎంత ప్రాధాన్యత ఇస్తుందో, ఆయనకు వ్యతిరేకంగా అసమ్మతి గళం ఎత్తే సీనియర్ నేతలకూ అంతే ప్రాధాన్యత ఇస్తుంది. దీంతో కాంగ్రెస్ సీఎం ఇబ్బందులు ఎదుర్కొనే పరిస్థితి ఏర్పడుతుంది. కాంగ్రెస్ అధికారంలో ఉన్న పార్టీ సీఎంలు ఎదుర్కొంటున్న ప్రధాన సమస్య ఇదేనని చెప్పాలి.
ఒక్క ఆంధ్రప్రదేశ్ అనే కాదు.. దేశంలోని అన్ని రాష్ట్రాలలోనూ సొంత కాళ్లపై నిలబడాలన్నదే బీజేపీ విధానమని విష్ణువర్ధన్ రెడ్డి చెప్పారు. గతంలో ఏపీలో బీజేపీ మద్దతు వల్లే రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిందనీ, ఈ వాస్తవాన్ని సీఎం చంద్రబాబు నాయుడు, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ బహిరంగ వేదికలపై స్పష్టంగా చెప్పారని విష్ణువర్ధన్ రెడ్డి గుర్తు చేశారు.
రాయలసీమను హార్టికల్చర్ హబ్‌గా తీర్చిదిద్దేందుకు, రాష్ట్రంలో ఇరిగేషన్ సదుపాయాలను మెరుగుపరిచేందుకు చంద్రబాబు నాయుడు ప్రభుత్వం పకడ్బందీ ప్రణాళికలతో ముందుకు వెళ్తోందని స్పష్టం చేశారు. రాష్ట్రంలో సాగునీటి ప్రాజెక్టులు ఒక్కొక్కటిగా పూర్తవుతుండటంతో, ఇరిగేషన్ రంగంపై మాట్లాడటానికి ప్రతిపక్షానికి ఎలాంటి అవకాశాలు లేకుండా పోయాయని ఆయన కుండబద్దలు కొట్టారు.
జలయజ్ణం పేరుతో వైఎస్ చేసింది ధనయజ్ణమని విక్రమ్ పూల అన్నారు. ప్రాజెక్టుల అంచనా వ్యయం పెరగడం, ప్రాంతీయ సమతుల్యత లోపించడం, హెడ్ వర్క్స్ కంటే ముందుగా కాలువల తవ్వకం వంటి వాటికే వైఎస్ జలయజ్ణం పరిమితమైందని విక్రమ్ పూల వివరించారు.
కాంగ్రెస్ హైకమాండ్ మీనాక్షీ నటరాజన్ పై వేటు వేయాలని భావిస్తున్నట్లు చెబుతున్నారు. రాహుల్ గాంధీ నేతృత్వంలోని జాతీయ నాయకత్వం రాష్ట్రంలో కాంగ్రెస్ వ్వవహారాలను చక్కదిద్దేందుకు భూపేష్ బగెల్ సమర్ధంగా పని చేయగలరని భావించి ఆ మేరకు నిర్ణయం తీసుకున్నట్లు చెబుతున్నారు.