ఆధారాలు లేని స్కిల్ డెవలప్ మెంట్ స్కాం కేసులో అరెస్టైన టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడుకి 52 రోజుల తర్వాత మంగళవారం మధ్యంతర బెయిల్ లభించిన సంగతి తెలిసిందే. జగన్ కక్ష్య సాధింపు చర్యల్లో భాగంగా మాజీ ముఖ్యమంత్రిని అరెస్ట్ చేయడం వైఎస్ఆర్ సిపి ప్రభుత్వం ప్రజాగ్రహానికి గురైంది. కేసు మెరిట్స్ తో సంబంధం లేకుండా కేవలం ఆరోగ్య కారణాల రీత్యా చంద్రబాబుకు మధ్యంతర బెయిల్ మంజూరు చేస్తున్నట్లు కోర్టు తెలిపింది. ఈ నేపథ్యంలో... విధించిన షరతుల్లో ఇద్దరు వ్యక్తుల ష్యూరిటీ కూడా ఒకటిగా ఉంది. ఈ సమయంలో ఇద్దరు టీడీపీ నేతలు ముందుకొచ్చారు! అవును... స్కిల్ డెవలప్ మెంట్ కుంభకోణంలో అరెస్టైన టీడీపీ అధినేత చంద్రబాబుకు హైకోర్టు షరతులతో కూడిన మధ్యంతర బెయిల్ మంజూరు చేయడంతో ష్యూరిటీలు సమర్పించడానికి మాజీ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు, పొలిట్ బ్యూరో సభ్యుడు బొండా ఉమామహేశ్వరరావు హైకోర్టు తీర్పు రాగానే విజయవాడ ఏసీబీ కోర్టులో హాజరయ్యారు!ఈ సందర్భంగా... ఇద్దరూ చెరో రూ.లక్ష చెల్లించి, చంద్రబాబు కోసం ష్యూరిటీలను సమర్పించారు. తర్వాత న్యాయమూర్తి జస్టిస్ హిమబిందు వీరిద్దరినీ ప్రశ్నించారు. అందులో భాగంగా ఇద్దరి పేర్లూ అడిగిన ఆమె.. ఎవరికి ష్యూరిటీ ఇస్తున్నారో తెలుసా..? అని ప్రశ్నించారు. దీనికి సమాధానంగా... చంద్రబాబుకు అని వారు చెప్పారు. అనంతరం... ష్యూరిటీగా ఎంత మొత్తం చెల్లించారు? అని ప్రశ్నించగా.. రూ.లక్ష చెల్లించామని సమాధానమిచ్చారు. కాగా... మంగళవారం చంద్రబాబుకు మధ్యంతర బెయిల్ వార్త రాగానే 3 గంటల సమయంలో లోకేశ్, బ్రాహ్మణి, కొండపి ఎమ్మెల్యే డోలా బాలవీరాంజనేయస్వామి చంద్రబాబుతో ములాఖత్ కు జైల్లోకి వెళ్లారు. 4 గంటల సమయంలో వారు బయటకు వచ్చారు. ఈ సందర్భంగా జైలు బయట ఎదురుచూస్తున్న టీడీపీ నాయకులను భుజం తట్టి పలకరించారు. అంతకముందు అచ్చెన్నాయుడిని ఆలింగనం చేసుకున్నారు. అనంతరం చంద్రబాబు బయటకు రావడంతో సాయంత్రం 4:45 గంటలకు జైలు చంద్రబాబు వాహనశ్రేణికి బయలుదేరింది. ఈ క్రమంలో టీడీపీ కార్యకర్తలు రోడ్లపైకి రావడంతో... కొన్నిచోట్ల గంటకు పది కి.మీ. వేగంతో కూడా ప్రయాణం సాగలేని పరిష్తితి నెలకొంది. దీంతో సుమారు పదమూడున్నర గంటల ప్రయాణం తర్వాత బుధవారం ఉదయం 6:00 గంటల ప్రాంతంలో చంద్రబాబు ఉండవల్లిలోని తన నివాసానికి చేరుకున్నారు.
By Teluguone
en-us
Political News
http://www.teluguone.com/news/content/these-people-shurity-s-for-chandrababu-39-164361.html
నిన్నటి వరకూ జగన్ కు పెట్టని కోటలా నిలిచిన పులివెందులలో ఇప్పుడు తెలుగుదేశం జెండా ఘనంగా ఎగురుతోంది. సుదీర్ఘకాలంగా వైసీపీకి తిరుగులేని కంచుకోటగా ఉన్ పులివెందుల పరిధిలో తెలుగుదేశం పార్టీ తన ఉనికిని బలంగా చాటుకుంటోంది.
వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్రెడ్డి తీరుపై ఆ పార్టీ నుంచి బయటకు వచ్చిన మాజీ ఎంపీ విజయసాయి రెడ్డి తీవ్రస్థాయిలో మండిపడ్డారు.
తుఫాను కారణంగా చీరాల మన్సిపాల్టీలో ఓట్ల లెక్కింపు శుక్రవారం (నవంబర్ 5) జరుగుతోంది. ఇప్పటి వరకు ఎక్కడా కనీసం డిపాజిట్ కూడా దక్కని కాంగ్రెస్ ఖాతాలో తొలి విజయం నమోదైంది. కాంగ్రెస్ పార్టీ చీరాల మునిసిపోల్స్ లో గట్టి పోటీ ఇచ్చింది. 25వ వార్డులో విజయం సాధించింది. 25వ వార్డు నుంచి బరిలోకి దిగిన కాంగ్రెస్ అభ్యర్థి వెంకట్రావు విజయం సాధించారు.
పోలింగ్ సరళి, వెలువడిన ఫలితాలు వైసీపీ శిబిరంలో ఆందోళన కలిగిస్తుంటే వైసీపీ అధినేత, మాజీ సీఎం జగన్ మాత్రం మేకపోతు గాంభీర్యం ప్రదర్శిస్తూ, అధికార తెలుగుదేశం కూటమి అరాచకాలు, అధికార దుర్వినియోగం తమ ఓటమికి కారణాలుగా చూపడానికి ప్రయత్నిస్తున్నారు. ఎన్నికల ఫలితాల వెల్లడి తర్వాత వైఎస్ జగన్ నిర్వహించిన ఈ మీడియా సమావేశంలో జగన్ చెప్పిందే చెప్పారు.
కాంగ్రెస్, కమ్మూనిస్టుల మద్దతుతో ఎన్నికల బరిలోకి దిగిన ఏబీవీకి ఘోర పరాజయం ఎదురైన సంగతి తెలిసిందే. కమ్యూనిస్టులకు అంతో ఇంతో పట్టున్న ప్రాంతాలలో కూడా ఆయనకు ఓట్లు రాలలేదు. ఇక కాంగ్రెస్ మద్దతు ఆయనకు ఎందుకూ కొరగాకుండా పోయింది.
ఈ వేడుకలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి, కేటీఆర్, విజయ్ ఒకే దగ్గర చేరి సరదాగా ముచ్చటించుకోవడం ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది.
నామినేషన్ల ఉపసంహరణ గడువు ముగిసే నాటికి రాష్ట్ర వ్యాప్తంగా 77 జడ్పీటీసీలు, 2051 ఎంపీటీసీలు ఏకగ్రీవమైనట్లు ఎన్నికల అధికారులు వెల్లడించారు. ఇక మిగిలిన స్థానాలకు పోటీ పడుతున్న 21 వేల 012 మంది అభ్యర్థుల భవితవ్యం తేల్చేందుకు ఓటర్లు పోలింగ్ కేంద్రాల వద్ద బారులు తీరారు.
వైసీపీపై అధికార కూటమి ఒత్తిడి, అక్రమాలు ఉన్నప్పటికీ క్షేత్రస్థాయిలో ప్రజలు వైసీపీకి వ్యతిరేకంగా ఉన్నారని పరోక్షంగా వ్యాఖ్యానించి, ప్రజా క్షేత్రంలో వైసీపీ బలహీనంగా ఉందని చెప్పకనే చెప్పారు. గతంలో తాము అధికారంలో ఉన్నప్పుడు వ్యవహరించిన తీరు కారణంగానే నేడు వైసీపీకి ఈ గతి పట్టిందంటూ అంబటి చేసిన వ్యాఖ్యలు రాజకీయంగా ప్రాధాన్యత సంతరించుకున్నాయి.
పాడిందే పాటరా అన్న సామెత చందంగా ఉంది జగన్ తీరు. ఆంధ్రప్రదేశ్లో మున్సిపల్ ఎన్నికల ఫలితాలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో తీవ్ర నిరాశను మిగిల్చాయి. గతంలో 2024 సార్వత్రిక ఎన్నికల ఓటమి తర్వాత ఏ విధంగానైతే ఈవీఎంలు, ఎన్నికల సంఘాన్ని వైఎస్ జగన్మోహన్ రెడ్డి తప్పుపట్టారో, ఇప్పుడు మున్సిపల్ ఎన్నికల ఫలితాల విషయంలోనూ అదే పాతరాగాన్ని అందుకున్నారు.
2024 ఎన్నికలలో విశాఖ జనం జగన్ విశాఖ రాజధాని ప్రతిపాదనను తిరస్కరించారు. ఇప్పుడు జగన్ మావిగన్ ప్రతిపాదనను మచిలీపట్నం, విజయవాడ, గుంటూరు జనం ఓటుతో తోసి రాజన్నారు.