ఈ కేసులు టికెట్ లేకుండా చూపిస్తున్న సినిమాలే.. సీపీఐ నారాయణ

Publish Date:Apr 13, 2026

Advertisement

ఉన్నది ఉన్నట్లు కుండబద్దలు కొట్టినట్లు మాట్లాడే సీపీఐ నారాయణ ఏ విషయం మీదనైనా సరే ఎలాంటి బేషజాలూ లేకుండా ముక్కుసూటిగా మాట్లాడతారు. అటువంటి నారాయణ తెలుగువన్ న్యూస్ చానల్ కు ఇచ్చిన ప్రత్యేక ఇంటర్వ్యూలో రాష్ట్రంలో రాజకీయ పరిస్థితుల గురించి మాట్లాడారు. అలాగే ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ లో రాజకీయ నాయకులపై నడుస్తున్న కేసులపై తన అభిప్రాయం వ్యక్తం చేశారు. ఈ కేసులన్నీ ప్రజలకు టికెట్ లేని సినిమా చూపిస్తున్నాయన్నారు. ఈ కేసుల్లో ఎవరికి శిక్షలు పడవంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు.  
సీపీఐ సీనియర్ నాయకుడు డాక్టర్ కె. నారాయణ  తెలుగు రాష్ట్రాలలో ప్రస్తుతం హాట్ టాపిక్ గా ఉన్న ఆంధ్రప్రదేశ్ మద్యం కుంభకోణం, తిరుమల లడ్డూ ప్రసాదంలో కల్తినెయ్యి వినియోగం, అలాగే కాళేశ్వరం ప్రాజెక్టులో అవకతవకలు, అవినీతి, అక్రమాలు తదితర కేసులలో ఎవరికీ శిక్ష పడే అవకాశం లేదని విస్పష్టంగా చెప్పారు. 
  రెండు రాష్ట్రాల్లోనూ కూడా  ప్రభుత్వాలు మారిన తర్వాత గత ప్రభుత్వ హయాంలో జరిగిన అవినీతిపై విచారణలు ముమ్మరమయ్యాయి. ఏపీలో మద్యం కుంభకోణం, తిరుమల తిరుపతి లడ్డూ ప్రసాదం తయారీలో కల్తీ నెయ్యి వినియోగం, ఇక తెలంగాణలో కాళేశ్వరం, ఫోన్ ట్యాపింగ్, ఈ కార్ తదితర కేసుల విచారణ సాగుతోంది.   ఈ నేపథ్యంలోనే ఈ   కేసులు ఎక్కడి వరకు వెళ్తాయి? రాజకీయ నాయకులకు శిక్షలు పడతాయా? అన్న తెలుగువన్  ప్రశ్నకు నారాయణ  ఒకరి మీద ఒకరు రాళ్లు వేసుకోవడం తప్ప, ఐఏఎస్, ఐపిఎస్ అధికారుల సహకారంతో సాగే ఈ వ్యవహారాల్లో అసలైన దోషులకు శిక్షలు పడటం అసాధ్యమని కుండబద్దలు కొట్టేశారు. 

సివిల్ సర్వెంట్స్ రాజకీయ నాయకుల చేతిలో కీలుబొమ్మలుగా మారుతున్నారన్న నారాయణ, ఐఏఎస్, ఐపిఎస్ అధికారులు తమ ఆత్మగౌరవాన్ని తాకట్టు పెట్టి రాజకీయ ప్రయోజనాల కోసం పనిచేస్తున్నారనీ, రిటైర్మెంట్ తర్వాత కార్పొరేట్ సంస్థల్లో పదవుల కోసం పాకులాడుతున్నారని విమర్శించారు.  మీ పదవి ఎక్కడికీ పోదు, జీతం తగ్గదు.. మరి తప్పు చేయమని అడిగినప్పుడు ఎందుకు రిజెక్ట్ చేయలేకపోతున్నారు?" అని సూటిగా ప్రశ్నించారు.  

ఇకఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతిపై అడిగిన ప్రశ్నకు అది చంద్రబాబు అత్యుత్సాహం అని అన్నారు. గతంలో ఆయన అత్యుత్సాహం వల్లే అమరావతి నిర్మాణంలో సమయం వృధా అయ్యిందన్నారు.   రైతుల దగ్గర భూములు తీసుకోవడం చంద్రబాబు వల్ల మాత్రమే సాధ్యమైందని, కానీ వేల ఎకరాల భూమిని ఒకేసారి అభివృద్ధి చేయాలనుకోవడం వల్ల అప్పట్లో జాప్యం జరిగిందని అన్నారు. గ్రామీణ ప్రాంతాల్లో ప్రజల జీవనోపాధిని దెబ్బతీయకుండా అభివృద్ధి జరగాలని, కేవలం భవనాలు కడితే సరిపోదని సూచించారు. 

గత ఐదేళ్లలో జగన్మోహన్ రెడ్డి తన నెగటివ్ పాలిటిక్స్ ద్వారా చంద్రబాబు గెలుపునకు ఎలా సహకరించారో,   చంద్రబాబు   ప్రజల సమస్యలను విస్మరిస్తే ఆయనకు కూడా వచ్చే ఎన్నికల్లో అదే పరిస్థితి ఎదురౌతుందన్నారు.   

ప్రభుత్వాలు మారినప్పుడల్లా పాత అధికారులపై కక్షసాధింపు చర్యలు అన్నది  ఒక ఆచారంగా మారిందన్న నారాయణ.. ఈ వైఖరి  వ్యవస్థకు చేటు చేస్తుందని హెచ్చరించారు. అమరావతి రాజధానిని గెజిట్ నోటిఫికేషన్ ద్వారా చట్టబద్ధం చేయడం మంచిదే అయినా.. ప్రజల్లో ఉన్న ఇన్సెక్యూరిటీని తొలగించి, కేంద్రం నుంచి రావాల్సిన నిధులను సాధించడంపై చంద్రబాబు ప్రభుత్వం దృష్టి సారించాలన్నారు. జగన్  మావిగన్ ను పట్టించుకోవలసిన అవసరం లేదన్నారు.  

 

By
en-us Political News

  
ఈ ప్రధాన పార్టీల వ్యూహాలకు తోడుగా మరికొన్ని రాజకీయ  పార్టీలో కూడా తమ ఉనికిని బలంగా చాటేందుకు ఖైరతాబాద్ ఉప ఎన్నిక బరిలోకి దిగడానికి సిద్ధమౌతున్నాయి. కల్వకుంట్ల కవిత నేతకూడా రంగంలోకి దిగుతుండటంతో పోటీ ఊహించని మలుపు తిరుగుతోంది.  
గత కొన్నేళ్లుగా  చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్ పలు సందర్భాల్లో ఒకే వేదికను పంచుకుంటూ వచ్చారు.  ముఖ్యమైన ప్రజా వేడుకల్లో వీరిద్దరూ కలసి పాల్గొనడం ఆనవాయితీగా మారింది. అయితే గత కొద్ది నెలలుగా ఇరువురూ ఒకే వేదికపై కనిపించడం లేదు. 
 విదేశీ పర్యటన ముగించుకుని ఇప్పటికే రాష్ట్రానికి తిరిగి వచ్చిన ముఖ్యమంత్రి చంద్రబాబు,  తన విధుల్లోకి నిమగ్నమయ్యారు. నేరుగా నెల్లూరు జిల్లాకు చేరుకుని  పల్లె పండుగ కార్యక్రమంలో ఆయన ఉత్సాహంగా పాల్గొన్నారు.
రామాయణం ప్రకారం లంకకు బయలుదేరే ముందు శ్రీరాముడు స్వయంగా మహాదేవుడిని పూజించాడని, ఈ చారిత్రక, పౌరాణిక విషయాలపై  అవగాహన లేని రేవంత్ వంటి వారు ఇటువంటి కువిమర్శలు చేస్తున్నారని బీజేపీ నేతలు మండిపడుతున్నారు.
ప్రాథమిక దశలో ఈ మరణాన్ని సాధారణ గుండెపోటుగా చిత్రీకరించే ప్రయత్నాలు జరగడం, ఆ తర్వాత హత్యగా తేలింది.  వైఎస్ హత్య వెనుక కొన్ని పెద్ద తలకాయల  ప్రయోజనాలు దాగున్నాయని వైఎస్ వివేకా కుమార్తె బహిరంగంగానే ఆరోపించారు.
బీఆర్ఎస్   బయటకు వచ్చిన తర్వాత కల్వకుంట్ల కవిత   తెలంగాణ రక్షణ పేన పేరుతో  కొత్త రాజకీయ పార్టీని ఏర్పాటు చేసిన సంగతి తెలిసిందే. భౌగోళిక తెలంగాణ సిద్ధించినప్పటికీ ప్రజలు ఆశించిన ఆశయాలు నెరవేరలేదని.. సామాజిక తెలంగాణ సాధన ద్వారా మాత్రమే ప్రత్యేక రాష్ట్ర సాకారానికి సార్థకత లభిస్తుందని కవిత పదేపదే చెబుతున్నారు.
స్థానిక ప్రజా సమస్యలను తనదైన శైలిలో పరిష్కరిస్తూ జనాల గుండెల్లో కొలువయ్యారు. అన్నిటికీ మించి మంగళగిరిలో నెలకొన్న అతి కీలకమైన, ప్రధానమైన   గృహ నిర్మాణ హక్కుల (హౌసింగ్ డాక్యుమెంటేషన్) పత్రాల సమస్యకు దశలవారీగా శాశ్వతంగా పరిష్కరిస్తున్నారు.
సీఈసీ జ్ఞానేశ్ కుమార్ రాజీనామాకు డిమాండ్..!
ఒకవైపు ఎన్నికల్లో భారీగా అక్రమాలు జరుగుతున్నాయని ఆరోపిస్తూనే, మరోవైపు అదే ఎన్నికల్లో ప్రతిపక్షాలు పాల్గొనడం వల్ల ఆ తప్పులకూ, లోపాలకు చట్టబద్ధత కల్పించినట్లవుతోందన్న ఆయన ఎన్నికలను బహిష్కరించాలని పిలుపునిచ్చారు.
ఉత్తరాంధ్ర రాజకీయాల్లో కీలక పరిణామం చోటుచేసుకుంది.
ఆ సమయంలో తాను కేరళ రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా విధులు నిర్వర్తిస్తుండగా, గ్యానేష్ కుమార్ కేంద్ర హోంమంత్రిత్వ శాఖలో ఉన్నతాధికారిగా సేవలందిస్తున్నారని గుర్తుచేశారు. ప్రయాణ సమయంలో తన రిటైర్మెంట్ అనంతర ప్రణాళికల గురించి  ఆరా తీసిన జ్ణానేష్ కుమార్‌.. ఆ సందర్భంలోనే బీజేపీ తరఫున పతనం తిట్ట లోక్‌సభ స్థానం నుంచి పోటీ చేయాలని సూచించారన్నారు. 
ఈ నియోజకవర్గంలో గత ఎన్నికల ఫలితాలు,  ప్రస్తుత రాజకీయ వాతావరణం దృష్ట్యా బీఆర్ఎస్, కాంగ్రెస్, బీజేపీలు విజయంపై ధీమాతో ఉన్నాయి. ఈ నేపథ్యంలో టీఆర్ఎస్ బరిలోకి దిగడంతో సమీకరణాలు ఏ విధంగా మారతాయన్న దానిపై సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. 
ప్పటి వరకూ మోడీ సర్కార్ ఘనంగా చెప్పుకుంటూ వచ్చిన పారదర్శకత ప్రశ్నార్థకమైంది.  రాజ్యాంగ వ్యవస్థలు బలహీనపడ్డాయన్న వాదనకు బలం చేకూరింది. అంత వరకూ విపక్షాలు చేసే విమర్శలను సునాయాసంగా తిప్పికొట్టి పై చేయి సాధించిన మోడీ సర్కార్ నీటి విషయంలో సమాధానం చెప్పుకోలేక తడబడింది. వెనకడుగు వేసింది. 
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.