నాడు పోల‘వారం’.. నేడు పోల‘వరం’

Publish Date:Mar 28, 2025

Advertisement

పోలవరం కేవలం ఒక బహుళార్థసాధక ప్రాజెక్టు మాత్రమే కాదు. కోట్లాది మంది ఆంధ్రుల కల. లక్షలాది మంది ఆశలు, ఆకాంక్షల ప్రతిరూపం.  రాష్ట్ర శ్రేయస్సు కోసం, ప్రగతి కోసం, రాష్ట్రం సస్యశ్యామలంగా ఉండటం కోసం, సాగు, తాగు నీటి కొరత, విద్యుత్ కొరతలు లేకుండా రాష్ట్రం సుభిక్షంగా ఉంటుందన్న ఆశతో ఎందరో..  తరతరాలుగా తాము జీవించిన ఊరును, ఇళ్లను వదులుకుని రాష్ట్ర భవిష్యత్ కోసం తృణ ప్రాయంగా త్యజించిన త్యాగధనుల కథ, వ్యథ కూడా .  గత వైసీపీ ప్రభుత్వ నిర్లక్ష్యం, బాధ్యతారాహిత్యం, నిష్పూచీతనం కారణంగా పోలవరం కోసం సర్వం త్యాగం చేసిన కుటుంబాలు అష్టకష్టాలూ పడ్డాయి.

వారి జీవితాలు దుర్భరంగా మారాయి.  ఈ ప్రాజెక్టు కోసం సర్వం కోల్పోయిన ఆ కుటుంబాల వేదన వర్ణనాతీతం. గత ప్రభుత్వం నిర్లక్ష్యం, ఆలస్యం వారి జీవితాలను దుర్భరం చేశాయి.అసలు రాష్ట్ర విభజన సమయంలో పోలవరంను జాతీయ ప్రాజెక్టుగా ప్రకటించిన తరువాత విభజిత ఆంధ్రప్రదేశ్ తొలి ముఖ్యమంత్రిగా నారా చంద్రబాబునాయుడు పదవీ బాధ్యతలు చేపట్టిన తరువాత పోలవరం పరుగులు తీసింది. ఆంధ్రప్రదేశ్ జీవనాడి వంటి పోలవరం ప్రాజెక్టు పూర్తికి అత్యంత ప్రాధాన్యత ఇచ్చిన చంద్రబాబు అప్పట్లో సోమవారానికి పోలవారంగా నామకరణం చేసి.. క్రమం తప్పకుండా ప్రాజెక్టును సందర్శించి పనుల పురోగతిపై సమీక్షించేవారు. ఆయన నిరంతర పర్యవేక్షణలో ఆ ఐదేళ్లలో పోలవరం పరుగులు తీసింది.

అప్పట్లో కేంద్రంలో అధికారంలో ఉన్న మోడీ సర్కార్ నిధుల విషయంలో సహాయ నిరాకరణ చేసినా చంద్రబాబు వెనకడుగు వేయలేదు.. రాజధాని కూడా లేని రాష్ట్రంలో, పేరు తప్ప మరేమీ మిగలని విభజిత ఆంధ్రప్రదేశ్ ను ఓ వైపు ప్రగతి పథకంలో నడిపిస్తూనే, ఆర్థిక ఇబ్బందులను ఎదుర్కొంటూనే.. రాష్ట్ర ఖజానా నుంచే పోలవరం పనులకూ నిధులు వెచ్చించారు. అయితే దాదాపు 80శాతం పూర్తైన పోలవరంకు 2019లో గ్రహణం పట్టింది. తెలుగుదేశం అధికారం కోల్పోయి.. వైసీపీ అధికారంలోకి వచ్చింది. ముఖ్యమంత్రిగా పదవీ బాధ్యతలు చేపట్టిన తరువాత జగన్ ఏపీకి అత్యంత ప్రధానమైన, కీలకమైన పోలవరం, రాజధాని అమరావతి పనులను పడకేసేలా చేశారు. రెంటినీ నిర్వీర్యం చేశారు. పోలవరం నిర్వాసితుల పట్ల అత్యంత క్రూరంగా వ్యవహరించారు. కేంద్రం డబ్బులు ఇవ్వడం లేదు.. నేనేం చేయలేనంటూ చేతులెత్తేశారు. ఐదేళ్లు గిర్రున తిరిగాయి. అహంకారం, నిష్క్రియాపరత్వం, అరాచకత్వం మాత్రమే పాలనకు అర్ధం అన్నట్లుగా విర్రవీగిన జగన్ సర్కార్ ను జనం 2024 ఎన్నికలలో తిరస్కరించారు.

మళ్లీ తెలుగుదేశం కూటమికి పట్టం కట్టారు. చంద్రబాబు ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టారు. ఆ క్షణం నుంచీ పోలవరం పరుగులు మళ్లీ ప్రారంభమయ్యాయి. ఈ సారి కేంద్రంలోని మోడీ సర్కర్ నుంచి కూడా సహకారం అందుతోంది. దీంతో 2027 నాటికి పోలవరం ప్రాజెక్టు పూర్తి అవుతుందన్న చంద్రబాబు ప్రకటన రాష్ట్ర ప్రజలలో ఆనందాన్ని నింపింది.  

ఇక ముఖ్యమంత్రి చంద్రబాబు పోలవరం ప్రాజెక్టును గురువారం (మార్చి 27) సందర్శించారు. ఆ సందర్భంగా పోలవరం నిర్వాసితులతో ముఖాముఖీ మాట్లాడారు.వారి కష్టాలను స్వయంగా తెలుసుకున్నారు. అక్కడితో ఆగలేదు.. పోలవరం ప్రాజెక్టు 2027 నాటికి పూర్తవుతుందని ప్రకటించి ఊరుకోకుండా.. ప్రాజెక్టు ప్రారంభించడానికి ముందుగానే నిర్వాసితులందరికీ పునరావాసం కల్పిస్తానని ప్రకటించి వారికి కొండంత ధైర్యాన్నిచ్చారు.   గతంలో జరిగిన అన్యాయాలను సరిదిద్ది, అర్హులైన ప్రతి ఒక్కరికీ న్యాయం చేస్తామని విస్పష్ట హామీనిచ్చారు.  పరిహారం కూడా పారదర్శకంగా అందిస్తామన్నారు.   ఆశలు వదిలేసుకున్ననిర్వాసితుల్లో గుండె ధైర్యం నింపారు.  తమ త్యాగం వృధా కాలేదన్న సంతృప్తి నిర్వాసితుల కళ్లల్లో కనిపించింది. దీంతో పరిశీలకులు నాడుపోల ‘వారం’ అంటూ ప్రాజెక్టు పనులను పరుగులెత్తించిన చంద్రబాబు నేడు  పొల‘వరం’ అందిస్తున్నారని విశ్లేషిస్తున్నారు. 

By
en-us Political News

  
తెలంగాణ అసెంబ్లీ స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్‌పై అనుచిత, అభ్యంతరకర వ్యాఖ్యలు చేశారన్న ఆరోపణలతో అరెస్టయిన ఇద్దరు బీఆర్ఎస్ ఎమ్మెల్సీలకు నాంపల్లి న్యాయస్థానం బెయిల్ మంజూరు చేసింది
టీడీపీ కేంద్ర కార్యాలయంలో రెండో రోజు నిర్వహిస్తున్న లీడర్‌షిప్ కాంక్లేవ్‌లో పొలిటికల్ కమ్యూనికేషన్ అండ్ పబ్లిక్ ఓరియంటేషన్ అంశంపై టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, మంత్రి నారా లోకేష్ మాట్లాడారు.
అసలాయన రాజకీయ పార్టీ ఏర్పాటు ఉద్దేశమేంటో? లక్ష్యమేంటో ఆయనకైనా స్పష్టత ఉందా అనిపించేలా ఆయన మీడియా సమావేశం సాగింది.  
ఇటు రాష్ట్రంలోనూ, అటు కేంద్రంలోనూ కూడా తెలుగుదేశం పార్టీ ఎన్డీయేలో కీలకమైన భాగస్వామ్య పక్షంగా ఉన్న నేపథ్యంలో తన పోరాటాలకు ఇండియా కూటమి అండ అవసరమని భావిస్తున్నారని చెబుతున్నారు
తన రాజకీయ విజయానికి మహిళలే ప్రధాన కారణమని ఉద్ఘాటించిన  విజయ్, మహిళలకు తగిన గౌరవం ఇవ్వాల్సిన బాధ్యత అందరిపై ఉందన్నారు.  మన ఇంట్లోనూ తల్లులు, చెల్లెళ్లు ఉంటారు. మహిళలను ఎవరైనా అవమానిస్తే చట్టం చూస్తూ ఊరుకోదని విజయ్ హెచ్చరించారు.
తెలంగాణ వ్యవహారాల ఇన్ చార్జ్ ఆబ్సెన్స్ లో రేవంత్  తన కేబినెట్ పునర్వ్యవస్థాకరణ విషయంలో మరింత స్వేచ్ఛగా నిర్ణయాలు తీసుకునే అవకాశాలుంటాయని పరిశీలకులు అంటున్నారు.  పార్టీలో, ప్రభుత్వంలో అసంతృప్తికి చెక్ పెట్టి, తన నిర్ణయాలను అమలు చేయడానికి రేవంత్ కు ఇది అనువైన సమయంగా రాజకీయవర్గాలు చెబుతున్నాయి.
2014 నుంచి ఆంధ్రప్రదేశ్ లో రెండు ప్రధాన రాజకీయ పార్టీల మధ్యే అధికారం మారుతూ వస్తోంది. వైపీపీ, తెలుగుదేశం మధ్య ద్విముఖ పోరే నెలకొని ఉంది. ఈ పరిస్థితుల్లో విజయసాయిరెడ్డి కొత్త పార్టీ  రాష్ట్రంలో రాజకీయ సమీకరణాలలో మార్పు తీసుకువచ్చే అవకాశాలు లేకపోలేదని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.  
కాషాయం పార్టీ రాష్ట్ర నేతలు కొండా బీజేపీ ఎంట్రీపై ఒక్కొక్కరూ ఒక్కోలా మాట్లాడుతున్నారు. వీటికి తోడు సకుటుంబ సపరివార సమేతంగా అయితేనే కాషాయం కండువా కప్పుకుంటానంటూ కొండా సురేఖ కండీషన్లు పెడుతున్నట్లు వస్తున్న వార్తలు ఆమెకు బీజేపీ ఎంట్రీ కూడా మూసుకుపోయిందా అన్న అనుమానాలకు కలిగిస్తున్నాయి. 
కొండా సుశ్మీత మీడియా సమావేశం ఏర్పాటు చేసి.. తన వ్యాఖ్యలకు తానే బాధ్యురాలిననీ, తన తల్లిపై వేటు వేయడం సరికాదనీ ఆవేదన వ్యక్తం చేశారు.  తన వ్యాఖ్యలకు తన తల్లిని శిక్షించడం సరికాదన్నారు.  తెలంగాణ కాంగ్రెస్ పార్టీలో వ్యక్తిగత అభిప్రాయాలకు, స్వతంత్రంగా మాట్లాడే మహిళల గొంతుకకు విలువ లేకుండా పోతోందని ఆవేదన వ్యక్తం చేశారు.
పార్టీ అధిష్టానం సీఎఉం మాటకు ఎంత ప్రాధాన్యత ఇస్తుందో, ఆయనకు వ్యతిరేకంగా అసమ్మతి గళం ఎత్తే సీనియర్ నేతలకూ అంతే ప్రాధాన్యత ఇస్తుంది. దీంతో  కాంగ్రెస్ సీఎం ఇబ్బందులు ఎదుర్కొనే పరిస్థితి ఏర్పడుతుంది.  కాంగ్రెస్ అధికారంలో ఉన్న పార్టీ సీఎంలు ఎదుర్కొంటున్న ప్రధాన సమస్య ఇదేనని చెప్పాలి.
ఒక్క ఆంధ్రప్రదేశ్ అనే కాదు.. దేశంలోని అన్ని రాష్ట్రాలలోనూ సొంత కాళ్లపై నిలబడాలన్నదే బీజేపీ విధానమని విష్ణువర్ధన్ రెడ్డి చెప్పారు.   గతంలో ఏపీలో బీజేపీ  మద్దతు  వల్లే రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిందనీ, ఈ  వాస్తవాన్ని సీఎం  చంద్రబాబు నాయుడు, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్   బహిరంగ వేదికలపై స్పష్టంగా చెప్పారని విష్ణువర్ధన్ రెడ్డి గుర్తు చేశారు. 
రాయలసీమను హార్టికల్చర్ హబ్‌గా తీర్చిదిద్దేందుకు, రాష్ట్రంలో ఇరిగేషన్ సదుపాయాలను మెరుగుపరిచేందుకు చంద్రబాబు నాయుడు ప్రభుత్వం పకడ్బందీ ప్రణాళికలతో ముందుకు వెళ్తోందని స్పష్టం చేశారు. రాష్ట్రంలో సాగునీటి ప్రాజెక్టులు ఒక్కొక్కటిగా పూర్తవుతుండటంతో, ఇరిగేషన్ రంగంపై మాట్లాడటానికి ప్రతిపక్షానికి ఎలాంటి అవకాశాలు లేకుండా పోయాయని ఆయన కుండబద్దలు కొట్టారు. 
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.