ప్రసాదం కౌంటర్ లో దొంగలు పడ్డారు

Publish Date:Jan 25, 2023

Advertisement

తిరుమల వెంకన్న దేవుడు మహిమగల దేవుడు. ఆయన లీలలు ఇన్నీ అన్నీ కాదు. అందుకే ఎక్కడెక్కడి నుంచో భక్తులు స్వామివారి దర్శనానికి వస్తుంటారు. మొక్కులు తీర్చుకుంటారు. కానుకలు సమర్పించుకుంటారు. వెంకన్న  దేవుని ఆదాయమ లక్షల్లో కాదు కోట్లలో ఉంటుంది.  ఆ నిధులన్నీ ఎటు పోతున్నాయో ఏమవుతున్నాయో, ఎప్పటికీ ఒక శేష ప్రశ్న గానే ఉండి పోతోంది.

ఇవన్నీ ఒకెత్తు అయితే వెంకన్న దేవుని లీలల కంటే, కొండ మీద జగనన్న దేవుని లీలలే ప్రముఖంగా పతాక శీర్షికలకు ఎక్కుతున్నాయి. జగన్ రెడ్డి ముఖ్యమంత్రిగా, ఆయన గారి బాబాయ్ గారు,     సుబ్బారెడ్డి  టీటీడీ చైర్మన్ అయినప్పటి నుంచి ఒక దాని వెంట ఒకటిగా ఎన్నో అపశ్రుతులు, అక్రమాలు వెలుగు చూస్తున్నాయి. భక్తుల హృదయాలను కలతకు గురు చేస్తున్నాయి. కొద్ది రోజుల క్రితం   కొండపై ఉన్న టీటీడీ వసతి గృహాలలో రూము రెంట్ ను అడ్డగోలుగా పెంచేశారు. భక్తులు గగ్గోలు పెట్టారు. అయినా జరిగింది ఏమీ లేదు. చిన్న గీత పక్కన పెద్ద గీత పెట్టారు. అంతకు మించిన మరో పెద్ద సమస్యను తెరమీదకు తెచ్చారు. 

గదుల అద్దె వివాదం పూర్తిగా సమసి పోక ముందే, మరో వివాదం తెరపై కొచ్చింది. నిబంధనలు కాదు, ఆగమ శాస్త్ర విరుద్ధంగా శ్రీవారి ఆలయంపై డ్రోన్ చక్కర్లు కొట్టింది, చిత్రాలు తీసింది. ఆ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. అప్పటికి గానీ ఘనత వహించిన టీటీడీ ప్రభువులు ఏమి జరిగిందనేడి గుర్తించనే లేదు. ఇంకా చిత్ర  విచిత్రం ఏమంటే, టీటీడీ చైర్మన్ సుబ్భారెడ్డి డ్రోన్ మాయను తెలుసుకునేందుకు అర్జెంటుగా ఒక కమిటిని వేశారు. ఆ కమిటీ, హైదరాబాద్  కు చెందిన   ఫలానా కంపెనీ  డ్రోన్ కొండ మీద  చక్కర్లు కొట్టిందని కనిపెట్టేసింది.  చైర్మన్ అదంతా తమ ఘనతగా చెప్పుకున్నారు. కానీ, అసలు జరిగింది, ఏమిటంటే, అది ఎవరో చేసిన తప్పుకాదు, స్వయంగా టీటీడీ కార్యనిర్వహణ అధికారి, (ఈఓ) ధర్మారెడ్డి అనుమతి ప్రకారం జరిగిన పుణ్య కార్యమని తెలిసింది.

ఇందుకు సంబంధించి  తాజాగా టీటీడీ ఈవో ధర్మారెడ్డి స్పందించారు. తిరుమలలో డ్రోన్ సర్వేకు ఐవోసీఎల్‌  కంపెనీకి  పర్మిషన్ ఇచ్చింది వాస్తమేనని అన్నారు. కారిడార్ ఏర్పాటు చేసుకునేందుకు అన్నదానం దగ్గర నుంచి గార్బెజ్ సెంటర్ వరకు డ్రోన్ సర్వేకు ఐవోసీఎల్‌ పర్మిషన్ అడిగితే ఇచ్చామని చెప్పారు. ఆ ప్రాంతంలో మాత్రమే సర్వేకు అనుమతి ఉందన్నారు. అయితే వాళ్లు అత్యుత్సాహంతో ఇది చేశారా? ఎవరైనా ఏదైనా టెక్నాలజీ ఉపయోగించి వీడియోను క్రియేట్ చేశారా? అనేది తెలియాల్సి ఉందన్నారు. ఆ వీడియోను ఫోరెన్సిక్ డిపార్టమెంట్‌కు పంపించి ఎలా చేశారనేది గుర్తించడం జరుగుతుందని చెప్పారు. ఇందుకు సంబంధించి ఇప్పటికే ఎఫ్‌ఐఆర్ నమోదు చేయడం జరిగిందన్నారు. వైరల్ అయిన వీడియోలు నిజమైనవా లేక ఫేక్ వీడియోలా అని తేలాల్సి ఉందని చెప్పారు. అత్యుత్సాహంతో చేసినా, ఏ విధంగా చేసినా తప్పు తప్పేనని అన్నారు. కానీ అసలు  డ్రోన్ కొండమీదకు రావడం ఏమిటి? అందుకు సంబంధించి కనీసం చైర్మన్ కు ముందస్తు సమాచారం లేక పోవడం ఏమిటి? అంత జరిగినా, ఈఓ ఇంత నిర్లక్ష్యంగా సమాధానం చెప్పడం  ఏమిటి? అంటే ఈ ప్రశ్నలు వేటికీ సమాధానం లేదు. 

అదలా ఉంటే ఇప్పుడు తాజాగా మరో వివాదం, మరో విషాదం వెలుగు చూసింది. తిరుమల లడ్డూ కౌంటర్‌లో దొంగతనం జరిగింది. కొద్ది రోజుల క్రితం చోటు చేసుకున్న ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. కౌంటర్ నెంబర్ 36 వద్ద ఈ ఘటన జరిగింది. కౌంటర్ బాయ్ నిద్ర మత్తులో వుండగా దొంగ లోపలికి చొరబడి రూ.2 లక్షలు చోరి చేసినట్లు టీటీడీ గుర్తించింది. దీనిపై తిరుపతి వన్‌టౌన్ పోలీసులకు టీటీడీ అధికారులు ఫిర్యాదు చేశారు. సీసీటీవీ కెమెరాల ద్వారా నిందితుడిని గుర్తిస్తున్నారు. ఇతను గతంలోనూ పలు చోరీలకు పాల్పడినట్లుగా తెలుస్తోంది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. 

అయితే  ఇది ఇంటి దొంగల పనే అని అంటున్నారు. దొంగతనానికి పాల్పడింది పాత దొంగే అనే సీసీ కెమెరాలు చెపుతున్నాయంటే, ఇది ఇంటి దొంగల పనే అని అంటున్నారు. నిజానికి, ఇలాంటి సంఘటనలు పై వారి అసీస్సులతోనే జరుగు తున్నాయన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.

By
en-us Political News

  
రాజకీయ కక్షలను పక్కనపెట్టి, రాష్ట్రాభివృద్ధి, స్థానిక స్వపరిపాలన బలపడే దిశగా అన్ని పార్టీలు అడుగులు వేయాలి. ప్రజాస్వామ్య విలువలను కాపాడుకుంటూ, ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా పారదర్శకమైన ఎన్నికలను నిర్వహించడమే ఏ ప్రభుత్వానికైనా, వ్యవస్థకైనా అసలైన పరీక్షగా నిలుస్తుంది.
గతంలో స్థానిక ఎన్నికల సందర్భంగా చోటుచేసుకున్న దౌర్జన్యాలు, హింసాత్మక ఘటనలకు సంబంధించిన వీడియోలను ప్రదర్శించి, నాడు జగన్ హయాంలో అరాచకం ఏ రకంగా స్వేరవిహారం చేసిందో చూపి మరీ ఆ పార్టీ తీరును దుయ్యబట్టారు.  
వందలాది మంది కొత్త వ్యక్తులు వస్తే తనకు  ప్రాణహాని ఉందని, కెమెరాలు, ఫోటోలతో ఇంటి భద్రత బయటపడుతుందని జగన్  షర్మిల కుమార్తె వివాహం ఎలహంక ప్యాలెస్ లో వద్దనడానికి కారణంగా తన లేఖలో పేర్కొన్నారు. అయితే దీనికి వైఎస్ కుటుంబ సభ్యులు, షర్మిల కుటుంబం తప్పుపడుతోంది. ఈ నేపథ్యంలో   షర్మిల కుటుంబ సభ్యులు జగన్ కు సంధించిన లేఖాస్త్రంలో  వైఎస్ రాజశేఖరరెడ్డి హయాంలో జరిగిన కుటుంబ వేడుకలను ప్రస్తావిస్తూ.. జగన్ ను వైఎస్సార్ కంటే గొప్పవాడివా అంటూ నిలదీశారు.
అధికారిక భేటీ ముసుగులో జరిగిన ఈ గోప్యతా ఉల్లంఘన ఉదంతం ఒక్కసారిగా రాష్ట్రంలో పొలిటికల్ హీట్ ను పెంచేసింది. ఒక వార్తా ఛానెల్‌కు ఇచ్చిన  ఇంటర్వ్యూలో డీకే శివకుమార్ ఈ అంశానికి సంబంధించిన వివరాలను వెల్లడించారు.
దేశ రాజధాని ప్రాంతంలో జరిగిన ఒక అత్యంత విషాదకరమైన ఘటన ప్రస్తుతం దేశవ్యాప్తంగా తీవ్ర చర్చనీయాంశమైంది.
7.75 లక్షల విలువైన 1,035 కిలోల ఆహార పదార్థాలు సీజ్.!
తెలంగాణలో ఎల్‌నినో ప్రభావంతో రాబోయే రోజుల్లో కరువు పరిస్థితులు తీవ్రరూపం దాల్చే అవకాశం ఉందని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి హెచ్చరించారు.
అమెరికా గడ్డపై మరో తెలుగు కుటుంబంలో తీవ్ర విషాదం చోటుచేసుకుంది.
ప్రకృతి మారుతున్న తీరు ఒకవైపు ఆందోళన కలిగిస్తుంటే, మరోవైపు ప్రభుత్వాల నిర్లక్ష్యం సామాన్యుడి బతుకును మరింత ఛిన్నాభిన్నం చేస్తోంది.
దేవీ నవరాత్రుల సందర్భంగా గ్రామంలో నిర్వహించిన దుర్గామాత నిమజ్జన వేడుకల్లో భాగంగా ఏర్పాటు చేసిన భారీ డీజే సౌండ్ హోరుకు ఓ పాత ఇందిరమ్మ బిల్డింగ్ స్లాబ్ పెచ్చులు కూలిపడ్డాయి.
జడ్పీ చైర్మన్ కావాలంటే ముందుగా జెడ్పీటీసీగా విజయం సాధించాల్సి ఉంటుంది. ఈ నేపథ్యంలోనే కదిరి నియోజకవర్గంలోని నల్ల చెరువు జెడ్పీటీసీ స్థానంలో పరిటాల రవి నామినేషన్ వేయనున్నారు.  పరిటాల శ్రీరామ్  విజయం కోసం క్షేత్రస్థాయిలో పార్టీ శ్రేణులను సమాయత్తం చేస్తూ భారీ విజయంపై తెలుగుదేశం కన్నేసింది.  
ఉత్తరాఖండ్‌లో నెలకొన్న దుర్భర రవాణా పరిస్థితులను అధికారుల దృష్టికి తీసుకువెళ్లేందుకు ఓ నవవధువు ఎంచుకున్న మార్గం అందరినీ విస్మయానికి గురిచేసింది.
కంటికి రెప్పలా కాపాడుకోవాల్సిన పసిపాప.. క్షణాల వ్యవధిలోనే కన్నుమూసింది.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.