జగన్ కు నాడు కలిసి వచ్చిన ఆ రెండు సంఘటనలే ఇప్పుడు ప్రతికూలం?

Publish Date:Mar 13, 2023

Advertisement

2019 ఎన్నికలలో వైసీపీ విజయానికి ప్రధాన కారణాలలో ముందువరుసలో ఉన్న ఆ రెండు సంఘటనలే ఇప్పుడు 2024 ఎన్నికలలో అదే వైసీపీకి ప్రతికూలంగా మారనున్నాయా? అంటే వైసీపీ శ్రేణుల నుంచి సామాన్య జనం వరకూ ఔననే అభిప్రాయాన్నే వ్యక్తం చేస్తున్నారు. ఇంతకీ ఆ రెండు సంఘటనలూ ఏమిటంటే.. ఒకటి విశాఖ విమానాశ్రయంలో అప్పటికి విపక్ష నేతగా ఉన్న జగన్ పై జరిగిన కోడి కత్తి దాడి కాగా రెండోది..   జగన్ సొంత బాబాయ్ వివేకానందరెడ్డి పులివెందులలోని తన స్వగృహంలో దారుణ హత్యకు గురి కావడం. ఈ రెండు సంఘటనలూ   జగన్ 2019 ఎన్నికలలో విజయం సాధించడానికి దోహదపడ్డాయనడంలో సందేహం లేదు.

సరే ఆ తరువాత ఎన్నికలలో విజయం సాధించి జగన్ అధికారంలోకి వచ్చి కూడా నాలుగు సంవత్సరాలు కావస్తోంది. ఈ నాలుగేళ్ల కాలంలోనూ ఈ రెండు సంఘటనలకు సంబంధించిన కేసులూ ఇప్పటికీ అపరిష్కృతంగానే ఉన్నాయి. కోడి కత్తి కేసు విషయానికి వస్తే.. తనపై దాడి జరిగిందంటూ అప్పట్లో ఊరూవాడా ఏకం చేసి ఎన్ఐఏ దర్యాప్తును సాధించుకున్న జగన్ తాను ముఖ్యమంత్రి అయ్యాకా.. ఆ కేసు ను పట్టించుకున్న దాఖలాలే లేవు. పైపెచ్చు ఈ కేసు ముందుకు సాగాలంటే.. బాధితుడిగా జగన్ కోర్టుకు హాజరు కావాలని ఎన్ఐఏ కోర్టు పేర్కొన్నా.. జగన్ హాజరు కావడం లేదు. ఈ నాలుగేళ్లుగా ఈ కేసులో నిందితుడైన జనుపల్లి శ్రీను అనే యువకుడు రిమాండ్ ఖైదీగానే మగ్గిపోతున్నాడు. తనపై హత్యాయత్నం కేసు విచారణ పూర్తై నిందితుడికి శిక్ష పడాలన్న భావన జగన్ లో  ఏ కోశానా కనిపించడం లేదు. అసలా సంఘటనే జరగలేదన్నట్లుగా ఆయన తీరు కనిపిస్తోంది. 

ఇక సొంత బాబాయ్ వైఎస్ వివేకానందరెడ్డి హత్య విషయాన్నే తీసుకుంటే.. అప్పట్లో అప్పటి అధికార పక్షమే ఈ దారుణానికి కారణమంటూ గగ్గోలు పెట్టిన జగన్.. విపక్ష నేతగా ఈ హత్య కేసు దర్యాప్తు సీబీఐకి అప్పగించాలని డిమాండ్ చేశారు. తీరా అధికారంలోకి వచ్చిన తరువాత ముఖ్యమంత్రి హోదాలో సీబీఐ విచారణ అవసరం లేదన్నారు. కానీ వైఎస్ వివేకా కుమార్తె డాక్టర్ సునీత తన తండ్రి హంతకులకు శిక్ష పడాల్సిందేననీ, ఈ హత్య వెనుక పాత్రధారులు, సూత్రధారులు వెలుగులోనికి రావాల్సిందే అంటూ పట్టుబట్టి సీబీఐ దర్యాప్తును సాధించారు. ఆ తరువాత సీబీఐ దర్యాప్తునకు ఏపీలో అడుగడుగునా..అడ్డంకులు అవాంతరాలు కలగడంతో మళ్లీ సునీతే సుప్రీం ను ఆశ్రయించి కేసు విచారణను మరో రాష్ట్రానికి బదలీ చేయాలని కోరింది.

ఆ సందర్భంగా సర్వోన్నత న్యాయస్థానానికి సీబీఐ కూడా సునీత చెప్పిన ప్రతి మాటా అక్షర సత్యమని నివేదించింది. దీంతో కేసు విచారణ తెలంగాణకు మారింది. అప్పటి నుంచీ దర్యాప్తులో వేగం పెరిగింది. కేసు దర్యాప్తు వేగంగా వివేకా హత్య వెనుక సూత్రధారులు, పాత్ర ధారులు ఎవరన్నది లేల్చే దిశగా సాగుతోందన్న అభిప్రాయమూ అందరిలో కలిగింది. సరిగ్గా ఈ తరుణంలో ఈ కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న వైసీపీ ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డి సీబీఐ దర్యాప్తు తీరు సరిగా లేదని ఆరోపిస్తూ, కొన్ని సంచలన వ్యాఖ్యలు చేశారు. తనను అరెస్టు చేయకుండా సీబీఐని ఆదేశించాలంటూ కోర్టుకు వెళ్లారు. ఆ సందర్భంగా ఈ హత్య వైఎస్ వివేకా అల్లుడే చేశాడంటూ ఆరోపించారు. సరే ఇదంతా కొద్ది సేపు పక్కన పెడితే..

కోడికత్తి కేసు, వివేహా హత్య కేసు ఈ రెండిటి విషయంలో వైసీపీ వ్యవహరిస్తున్న తీరు ఆ పార్టీ ప్రతిష్టను మసకబార్చిందనడంలో సందేహం లేదు. విపక్షంలో ఉన్న సమయంలో ఒకలా, అధికారంలోకి వచ్చాకా మరోలా వ్యవహరించడం వల్ల ఈ రెండు సంఘటనల్లో గతంలో జగన్ ఆరోపణలు వాస్తవాలు కావన్న అభిప్రాయం జనంలోకి బలంగా వెళ్లిందని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.  ముఖ్యంగా సొంత బాబాయ్ వైఎస్ వివేకా హత్య విషయంలో విపక్షంలో ఉన్న సమయంలో అప్పటి అధికార పార్టీ అధినేత ముఖ్యమంత్రి చంద్రబాబుపైనా, తెలుగుదేశం పార్టీపైనా విమర్శలు గుప్పించిన వైసీపీ ఇప్పుడు ఆయన హత్య వెనుక ఉన్నది తెలుగుదేశం కాదు, వివేకా కుటుంబ సభ్యులే అనడంతో వైసీపీ, జగన్ ల మాటలలో విశ్వసనీయత కరవైందన్న అభిప్రాయం వ్యక్తం అవుతోంది. ముఖ్యంగా వైఎస్ ఫ్యామిలీ ప్రతిష్ట మసకబారిందన్న భావన కలుగుతోందని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. వైఎస్ జీవించి ఉన్న కాలంలో రామలక్ష్మణులకు ప్రతీకగా వైఎస్ రాజశేఖరరెడ్డి, వైఎస్ వివేకానందరెడ్డిలను జనం చెప్పుకునే వారు.  అయితే వైఎస్ హెలికాప్టర్ ప్రమాదంలో మరణించిన తరువాత నుంచీ పరిస్థితుల్లో మార్పు వచ్చింది.  

వివేకానందరెడ్డి కాంగ్రెస్ లోనే ఉండటం, జగన్ వైసీపీ పార్టీ ప్రారంభించడం, ఆ తరువాత వివేకా వైసీపీలోకి వచ్చిన తరువాత జరిగిన ఎమ్మెల్సీ ఎన్నికలలో ఆయన స్వయంగా పరాజయం పాలు కావడంతో వివేకా, జగన్ మధ్య విభేదాలున్నాయా అన్న అనుమానాలు అప్పట్లోనే పొడసూపాయి. ఇక వైఎస్ వివేకా హత్య, తదననంతర పరిణామాలు  వైపీపీ ప్రతిష్ట మసకబార్చడమే కాకుండా, వైఎస్ ఫ్యామిలీ ప్రతిష్టను కూడా మసకబార్చాయంటున్నారు.  వైఎస్సార్ ఫ్యామిలీ ప్రతిష్టకు భంగం వాటిల్లిందనీ చెబుతున్నారు.   కేసు దర్యాప్తు ముందుకు సాగేకొద్దీ మరెన్ని విషయాలు బయటకు వస్తాయో అన్న అనుమానాలు కూడా వ్యక్తం చేస్తున్నారు. 

By
en-us Political News

  
దేశ రక్షణ రంగంలో అత్యంత కలకలం రేపిన ఉదంతం వెలుగులోకి వచ్చింది.
సినిమా తరహాలో పక్కా ప్లాన్ వేశాడు.. పోలీసులకు ఎలాంటి ఆధారాలు దొరకవని భావించాడు.. కానీ చివరకు చేసిన చిన్న పొరపాటే అతడిని పోలీసులకు పట్టించింది.
అంతర్జాతీయ విమానయాన రంగంలో కలకలం సృష్టించిన ఫ్లైదుబాయ్ విమాన హైజాక్ యత్నం కేసులో విచారణ వేగవంతం కాగా, ఊహించని సంచలన విషయాలు వెలుగులోకి వచ్చాయి.
దేశం కోసం ప్రాణాలర్పించిన ఓ వీర జవాన్ కుటుంబంలో తీవ్ర విషాదం అలుముకుంది.
ఆశిష్ అనే యువకుడు జొమాటో డెలివరీ బాయ్‌గా పనిచేస్తున్నాడు
హైదరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసుల కేసు.. దర్యాప్తు ముమ్మరం.!
ఆంధ్రప్రదేశ్‌లో పేదల సొంతింటి కలను సాకారం చేసే దిశగా కూటమి ప్రభుత్వం మరో కీలక అడుగు వేసింది
చిన్నారి జీవితాన్ని విషాదంగా మార్చిన బిస్కెట్.!
ఆకాశంలో ఓ పక్షి.. విమానంలో వందలాది మంది ప్రయాణికులు.. క్షణాల్లో ఏం జరుగుతుందోనన్న ఉత్కంఠ! శంషాబాద్‌ అంతర్జాతీయ విమానాశ్రయంలో ఇండిగో విమానానికి పక్షి ఢీకొట్టినట్లు అనుమానం
న్యాయవాది ఖాజా మొయిజుద్దీన్ హత్య కేసు మరోసారి చర్చనీయాంశంగా మారింది.
అమెరికాలో మరోసారి విషాదం చోటుచేసుకుంది. ఉపాధి కోసం అగ్రరాజ్యానికి వెళ్లిన తెలంగాణకు చెందిన ఓ మహిళ రోడ్డు ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయారు.
భారత పైలట్ చెప్పిన షాకింగ్ నిజాలు..!
ప్రభుత్వ రంగ టెలికాం దిగ్గజం భారత్ సంచార్ నిగమ్ లిమిటెడ్ (BSNL) తన చందాదారులను ఆకట్టుకునేందుకు మరో వినూత్నమైన ఆఫర్‌ను ముందుకు తెచ్చింది.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.