ముగిసిన నాదెండ్ల భాస్కరరావు ప్రస్థానం

Publish Date:Apr 22, 2026

Advertisement

 

ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి, సీనియర్ రాజకీయ నాయకుడు నాదెండ్ల భాస్కరరావు (90) కన్నుమూశారు. వృద్ధాప్య సమస్యలు, అనారోగ్యంతో కొంతకాలంగా హైదరాబాద్‌లోని కాంటినెంటల్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న ఆయన పరిస్థితి విషమించడంతో బుధవారం తుదిశ్వాస విడిచినట్లు కుటుంబసభ్యులు తెలిపారు. గుంటూరు జిల్లాలో 1935 జూన్ 23న జన్మించిన నాదెండ్ల భాస్కరరావు, వృత్తిరీత్యా న్యాయవాది. ఉస్మానియా విశ్వవిద్యాలయం నుండి లా పట్టా పొందిన ఆయన, కొంతకాలం న్యాయవాదిగా సేవలందించారు.

అనంతరం రాజకీయాలపై ఆసక్తితో కాంగ్రెస్ పార్టీలో చేరి ప్రజా జీవితంలోకి అడుగుపెట్టారు. 1978లో విజయవాడ తూర్పు నియోజకవర్గం నుంచి కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేసి తొలిసారి ఎమ్మెల్యేగా గెలుపొందారు. ఆ సమయంలో డాక్టర్ మర్రి చెన్నారెడ్డి, టంగుటూరి అంజయ్య మంత్రివర్గాల్లో ఆయన కీలక బాధ్యతలు నిర్వర్తించారు. 1982లో నందమూరి తారక రామారావు స్థాపించిన తెలుగుదేశం పార్టీలో చేరిన భాస్కరరావు, ఎన్టీఆర్‌కు సన్నిహితుడిగా నిలిచారు. 1983లో టీడీపీ విజయం సాధించిన తర్వాత ఆయనకు ఆర్థిక శాఖ బాధ్యతలు అప్పగించారు.

అయితే 1984లో ఎన్టీఆర్ గుండె శస్త్రచికిత్స కోసం అమెరికా వెళ్లిన సమయంలో, రాష్ట్ర రాజకీయాల్లో సంచలన పరిణామాలు చోటుచేసుకున్నాయి. కాంగ్రెస్ (ఐ) ఎమ్మెల్యేలు, కొంతమంది టీడీపీ ఎమ్మెల్యేల మద్దతుతో, అప్పటి గవర్నర్ రామ్‌లాల్ సహకారంతో నాదెండ్ల భాస్కరరావు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు. ఈ ఘటన రాష్ట్ర రాజకీయాల్లో పెద్ద కలకలం రేపింది.

అమెరికా నుంచి తిరిగి వచ్చిన ఎన్టీఆర్ ‘ప్రజాస్వామ్యాన్ని కాపాడండి’ అనే నినాదంతో భారీ ఉద్యమం చేపట్టారు. నల్ల దుస్తులు ధరించి ‘ధర్మయుద్ధం’ పేరుతో రాష్ట్రవ్యాప్తంగా యాత్ర నిర్వహించారు. ఈ ఉద్యమానికి నారా చంద్రబాబు నాయుడు నాయకత్వం వహించగా, దేశవ్యాప్తంగా ప్రతిపక్ష పార్టీల మద్దతు లభించింది. ఉద్యమం తీవ్రతకు కేంద్ర ప్రభుత్వం దిగివచ్చి, గవర్నర్ రామ్‌లాల్‌ను వెనక్కి పిలిపించింది. అనంతరం ఎన్టీఆర్‌ను తిరిగి ముఖ్యమంత్రిగా నియమించింది.

కేవలం 31 రోజుల పాటు ముఖ్యమంత్రిగా కొనసాగిన నాదెండ్ల భాస్కరరావు, మెజారిటీ నిరూపించలేక రాజీనామా చేయాల్సి వచ్చింది. 1984 ఆగస్టులో చోటుచేసుకున్న ఈ రాజకీయ సంక్షోభం ‘ఆగస్టు సంక్షోభం’గా చరిత్రలో నిలిచిపోయింది. ఈ ఘటన ఆయన రాజకీయ జీవితంపై ముద్ర వేసింది. అనంతరం టీడీపీ నుంచి బహిష్కరణకు గురైన ఆయన తిరిగి కాంగ్రెస్ పార్టీలో చేరారు.

1989లో తెనాలి నుంచి కాంగ్రెస్ ఎమ్మెల్యేగా గెలిచిన భాస్కరరావు, 1998లో ఖమ్మం లోక్‌సభ నియోజకవర్గం నుంచి ఎంపీగా ఎన్నికయ్యారు. తర్వాత క్రియాశీల రాజకీయాలకు దూరంగా ఉన్న ఆయన, 2019లో అమిత్ షా సమక్షంలో బీజేపీలో చేరినా, వయోభారం కారణంగా రాజకీయాల్లో చురుకుగా వ్యవహరించలేదు.

ఆయన రాజకీయ వారసుడిగా కుమారుడు నాదెండ్ల మనోహర్ రాజకీయాల్లో కొనసాగుతున్నారు. కాంగ్రెస్ ద్వారా రాజకీయాల్లోకి వచ్చిన మనోహర్, 2004, 2009లో తెనాలి ఎమ్మెల్యేగా గెలిచి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ స్పీకర్‌గా పనిచేశారు.

ప్రస్తుతం జనసేన పార్టీలో కీలక నాయకుడిగా ఉన్న ఆయన, 2024లో తెనాలి నుంచి మరోసారి విజయం సాధించి ఆంధ్రప్రదేశ్ కేబినెట్‌లో పౌర సరఫరాల శాఖ మంత్రిగా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. సుదీర్ఘ రాజకీయ అనుభవం కలిగిన నాదెండ్ల మృతి పట్ల పలువురు నేతలు సంతాపం వ్యక్తం చేస్తున్నారు. గురువారం (23-04-2026) సాయంత్రం 4 గంటలకు హైదరాబాద్ పంజాగుట్ట శ్మశానవాటికలో అంత్యక్రియలు నిర్వహించనున్నట్లు కుటుంబసభ్యులు తెలిపారు.

By
en-us Political News

  
ముఖ్యంగా తెలుగుదేశం కూటమి భాగస్వామ్య పక్షమైన జనసేన రాష్ట్రంలో మరింత బలోపేతం కావడమే లక్ష్యంగా కార్యాచరణ రూపొందిస్తోంది. ప్రణాళికా బద్ధంగా పావులు కదుపుతోంది. ఇందులో భాగంగానే గత ఎన్నికలలో ఘోర పరాజయంతో కుదేలై ఉన్న వైసీపీని మరింత బలహీన పరిచే దిశగా వ్యూహాలు రచిస్తోంది.
పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి తాజాగా తీసుకుంటున్న రాజకీయ నిర్ణయాలు పార్టీ శ్రేణులతో పాటు.. ఆయన పార్టీకే చెందిన సొంత సామాజిక వర్గ నేతలు కూడా తీవ్ర అసంతృప్తి అసహనం వ్యక్తం చేస్తున్నారు.
హైదరాబాద్‌లో బసవతారకం ఆస్పత్రి రజతోత్సవాలు
కర్ణాటకలోని కాంగ్రెస్ ప్రభుత్వం కావేరి నదిపై నిర్మించ తలపెట్టిన మేకేదాటు డ్యామ్ ప్రతిపాదనను విజయ్ వ్యతిరేకించారు. తమిళనాడుకు వచ్చే నీటి ప్రవాహాన్ని నియంత్రించే ఏ ప్రాజెక్టునైనా సహించేది లేదని ఆయన శాసనసభ వేదికగా కుండబద్దలు కొట్టారు.
ఇప్పుడు బీజేపీ సమాజ్‌వాదీ పార్టీని నిట్టనిలువుగా చీల్చేందుకు. ఆ పార్టీ ఎంపీలకు గాలం వేస్తున్నట్లు రాజకీయవర్గాలలో జోరుగా చర్చ జరుగుతోంది. ఉత్తరప్రదేశ్ మంత్రి, బీజేపీ మిత్రపక్ష నేత అయిన ఓం ప్రకాష్ రాజ్‌భర్ తాజాగా చేసిన వ్యాఖ్యలతో ఏ క్షణంలోనైనా అఖిలేష్ యాదవ్ నేతృత్వంలోని సమాజ్ వారీ పార్టీ ఎంపీలు కమలం గూటికి చేరే అవకాశాలున్నాయన్న చర్చకు బలం చేకూరుతోంది.
ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి పరిపాలనా నగరంగానే కాకుండా.. ప్రపంచస్థాయి పెట్టుబడులకు, అత్యాధునిక సాంకేతికతకు కేంద్రబిందువుగా మార్చేందుకు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పకడ్బందీ ప్రణాళికలతో ముందుకు సాగుతున్నారు. గతంలో హైదరాబాద్ మహానగరాన్ని గ్లోబల్ ఐటీ హబ్‌గా తీర్చిదిద్దిన ఆయన ఇప్పుడు అమరావతిని అంతకు మించి.. అన్నట్లుగా ముందుకు తీసుకువెడుతున్నారు.
దేశంలో లోక్‌సభ సెగ్మెంట్ల డిలిమిటేషన్‌పై పీఎం ఆర్థిక సలహా మండలి కీలకమైన ప్రతిపాదనలు చేసింది.
2024 ఎన్నికలలో ఆయన వైసీపీ పార్టీ కేవలం 11 స్థానాలకే పరిమితమైనప్పటికీ.. ఆయన శైలిలో ఇసుమంతైనా మార్పు రాలేదు. ప్రస్తుత కూటమి ప్రభుత్వం విజయవంతంగా రెండేళ్ల పరిపాలనను పూర్తి చేసుకున్న తరుణంలో.. జగన్ ప్రభుత్వంపై విమర్శలు గుప్పించేందుకు ఎంచుకున్న అంశాలు.. ఆయనను నవ్వుల పాలు చేసేవిగా ఉన్నాయని పరిశీలకులు సైతం విశ్లేషణలు చేస్తున్నారు.
జగన్ ను రానున్న రోజులలో న్యాయపరమైన చిక్కులు చుట్టుముట్టే అవకాశాలు మెండుగా కనిపిస్తున్నాయని అంటున్నారు. ఆ చిక్కుల కారణంగా ఆయన రాజకీయంగా కూడా ఇబ్బందులు ఎదుర్కొనక తప్పదని అంటున్నారు. జగన్ హయాంలో జరిగిన కొన్ని కీలక అంశాలు ఇప్పుడు ఆయనకు అవరోధాలుగా మారే అవకాశాలు ప్రస్ఫుటంగా కనిపిస్తున్నాయని చెబుతున్నారు. మరీ ముఖ్యంగా వైసీపీ హయాంలో జరిగినట్లుగా చెబుతున్న ఏపీ మద్యం కుంభకోణం కేసు ఆయన మెడకు చుట్టుకునే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయంటున్నారు.
చంద్రబాబు నాయుడు నియోజకవర్గ ఇన్‌ఛార్జ్ బాధ్యతల కాంచర్ల శ్రీకాంత్‌ను తొలగిస్తూ సంచలన నిర్ణయం తీసుకున్నారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన కొద్దిరోజులకే కుప్పంలోని ద్వితీయ శ్రేణి నాయకులు, క్షేత్రస్థాయి కార్యకర్తల్లో శ్రీకాంత్ పనితీరుపై తీవ్ర అసంతృప్తి మొదలైంది. నియోజకవర్గంలోని సీనియర్ నేతలు పి.ఎస్. మునిరత్నం, డాక్టర్ సురేష్ బాబు, కాంచర్ల శ్రీకాంత్ ల మధ్య సమన్వయ లోపం ప్రస్ఫుటంగా బహిర్గతమైంది.
టీఎమ్ సీ తిరుగుబాటు పర్వం ఇప్పుడు జాతీయ స్థాయిలోనూ చోటు చేసుకుంది. ఒకవైపు బీజేపీ నేతృత్వంలోని ఎన్డీయే కూటమిని ఎలా ఎదుర్కోవాలనే వ్యూహాలపై చర్చించేందుకు మమతా బెనర్జీ ఢిల్లీలో ఇండియా కూటమి సమావేశానికి హాజరయ్యారు. సరిగ్గా అదే సమయంలో ఆమె సొంత పార్టీకి చెందిన దాదాపు 20 మంది లోక్‌సభ ఎంపీలు తిరుగుబాటుకు రెడీ అవ్వడం రాజకీయంగా అత్యంత ప్రాధాన్యత సంతరించుకుంది.
తమిళనాడు బీజేపీ మాజీ అధ్యక్షుడు అణ్ణామలైది. ఐపీఎస్ ఉద్యోగాన్ని వదిలిపెట్టి, ఆవేశంతో, ఆశయంతో రాజకీయాల్లోకి అడుగుపెట్టి రాష్ట్రంలో బీజేపీని ముందుకు నడిపించడంలో కీలక పాత్ర పోషించారు. కానీ పార్టీలో ఎదురైన అంతర్గత పరిణామాలు, మారుతున్న రాజకీయ సమీకరణాలతో ఆయన విసుగుచెందారు.
పవన్ కళ్యాణ్ చేసిన ఆరోపణలను తీవ్రంగా ఖండించిన కేవీపీ వైఎస్ ప్రతిష్ట మసకబార్చేలా మాట్లాడటం సరికాదనీ, పవన్ కళ్యాణ్ తాను చేసిన ఆరోపణలు నిజమని నిరూపిస్తే, ముఖ్యమంత్రి సహాయనిధికి తన సొంత సొమ్ము నుంచి 10 కోట్ల రూపాయలు విరాళంగా ఇస్తాననీ, నిరూపించలేకపోతే.. పవన్ కళ్యాణ్ ముక్కు నేలకు రాసి వైఎస్ కుటుంబానికి, ఆయన అభిమానులకు బహిరంగం క్షమాపణ చెప్పాలని సవాల్ విసిరారు చేశారు.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.