సాధారణంగా తమ వాళ్లు తప్పి పోయినప్పుడు వారిని వెతికే క్రమంలో పోలీసులకు ఫిర్యాదు చేయడంతో పాటు.. కూడళ్లలో, బస్టాండ్ లలో, రైల్వే స్టేషన్లలో వారి ఫొటోలతో కనిపించడం లేదు అంటూ పోస్టర్లు అంటించడం కద్దు. అలాగే తప్పిపోయిన తమ వారి ఆచూకీ తెలిపిన వారికి బహుమతి ఇస్తామంటూ నజరానా కూడా ఆ పోస్టర్లో ప్రకటిస్తారు. ఇక ఇటీవలి కాలంలో తమ పెంపుడు జంతువులు తప్పిపోయిన సందర్భంలో కూడా పలువురు వాటి కోసం పెద్ద ఎత్తున గాలిస్తున్నారు. పోలీసులను ఆశ్రయిస్తున్నారు. పోస్టర్లు కూడా వేస్తున్నారు. అలా తప్పి పోయిన పెంపుడు జంతువుల కోసం ఆరాటపడే వారిలో అత్యధికులు కుక్క, పిల్లి వంటి వాటి కోసం వెతుకులాట చేయడం చూశాం. ఇటీవల ఓ ఉన్నతాధికారి తన పెంపుడు కుక్కను గాలించేందుకు ఏకంగా వందల సంఖ్యలో పోలీసులను వినియోగించి వివాదాస్పదమైన సంగతి కూడా తెలిసిందే. అయితే తాజాగా సామాజిక మాధ్యమంలో తన పెంపుడు చిలుక ఆచూకీ తెలిపిన వారికి పది వేల రూపాయలు బహుమతి అంటూ వెలిసిన పోస్టర్లు నెట్టింట వైరల్ అయ్యాయి. మధ్యప్రదేశ్ దమోహ్ జిల్లాకు చెందిన దీపక్ సోనీ పెంపుడు చిలుక ఎటో ఎగిరిపోయింది.
ఆ చిలుక ఫొటోలతో పోస్టర్లు వేసి ఆచూకీ చెప్పినవారికి రూ.10 వేలు రివార్డు ఇస్తామని ప్రకటించారు. ఊరంతా పోస్టర్లు వేసి, ఆటోకు మైకులు పెట్టి మరీ తన పెంపుడు చిలక ఆచూకీ కనుక్కోవడానికి విశ్వ ప్రయత్నం చేస్తున్నారు. నిజానికి దీపక్ సోనీ చిలుక ఇలా పారిపోవడం ఇదేమీ తొలిసారి కాదు. గత నెలలో ఒకసారి ఇలాగే ఎగిరిపోయి మళ్లీ దానంతటదే ఇంటికి తిరిగొచ్చింది.
ఇప్పుడు మళ్లీ ఎగిరిపోయింది. రోజులు గడుస్తున్నా అది తిరిగి రాకపోవడంతో దీపక్ సోనీ కుటుంబ సభ్యులు ఆందోళన పడుతున్నారు. ఆ చిలుక సరిగా ఎగరలేకపోతోందనీ, దానికి ఏదైనా హాని జరిగిందా అన్న ఆందోళన కలుగుతోందని దీపక్ సోనీ అంటున్నారు.
By Teluguone
en-us
Political News
http://www.teluguone.com/news/content/the-parrot-missing-25-159414.html
ప్రభుత్వ రంగ టెలికాం దిగ్గజం భారత్ సంచార్ నిగమ్ లిమిటెడ్ (BSNL) తన చందాదారులను ఆకట్టుకునేందుకు మరో వినూత్నమైన ఆఫర్‌ను ముందుకు తెచ్చింది.
ఏళ్ల తరబడి పెండింగ్‌లో ఉన్న భూ సమస్యల పరిష్కారంపై తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది.
భాగ్యనగరంలో వరుస ఘటనలు తీవ్ర కలకలం రేపుతున్నాయి.
పాతబస్తీ రాజకీయాల్లో కీలక నేతగా, ఎంఐఎం శాసనసభా పక్ష నేతగా కొనసాగుతున్న అక్బరుద్దీన్ ఓవైసీ చేసిన తాజా వ్యాఖ్యలు రాజకీయ వర్గాల్లో ఆసక్తికర చర్చకు తెరలేపాయి.
తెలంగాణ సాంస్కృతిక ఆత్మకు ప్రతీక అయిన బతుకమ్మ సంబరాలను ఈ ఏడాది అత్యంత వైభవంగా నిర్వహించేందుకు రాష్ట్ర ప్రభుత్వం సర్వం సిద్ధం చేసింది.
భార్యాభర్తల బంధం అంటే కష్టసుఖాల్లో ఒకరికొకరు తోడుగా నిలవడం.. జీవితాంతం కలిసి నడవడం. కానీ.. మధ్యప్రదేశ్‌లో ఓ భర్త డబ్బు కోసం ఆ బంధానికే తూట్లు పొడిచాడు.
దుబాయ్ నుంచి టెల్ అవీవ్ వెళ్తున్న ఫ్లైదుబాయ్ విమానంలో భారత సంతతి పైలట్ స్మిత్ మచ్చర్‌పై కో-పైలట్ హమామ్ అల్ హమామీ దాడికి పాల్పడిన ఘటన ప్రపంచవ్యాప్తంగా తీవ్ర కలకలం రేపింది.
భారతదేశంలో విప్లవాత్మక మార్పులు తెచ్చిన యూపీఐ డిజిటల్ చెల్లింపుల వ్యవస్థలో కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయాలు తీసుకుంది.
పెట్రోల్‌లో ఇథనాల్ కలపడాన్ని ప్రోత్సహిస్తున్న కేంద్ర ప్రభుత్వ తాజా విధానాలు ఇప్పుడు సామాన్యుల వంటగదిపై తీవ్ర ప్రభావం
జిల్లాలో పార్టీ పరిస్థితి వేగంగా దిగజారిపోతోంది. మజ్జి పార్టీని వీడటంతో జాగ్రత్త పడాల్సిన పార్టీ హైకమాండ్, అలాగే బొత్స సత్యనారాయణ చేతులెత్తేసినట్లు కనిపిస్తోంది. అంతే కాకుండా కూర్చున్న కొమ్మనే నరుక్కున్న చందంగా అసంతృప్తులను బుజ్జగించాల్సింది పోయి వారిపై సస్పెన్షన్ వేటు వేయడంతో జిల్లాలో పార్టీని జీరో నుంచి బిల్డ్ చేద్దామనుకుంటున్నారా? లేక జిల్లా పార్టీని వదిలేశారా అన్న అనుమానాలు పార్టీ శ్రేణుల నుంచే వస్తున్నాయి.
వికారాబాద్ జిల్లాలోని ప్రముఖ పర్యాటక ప్రాంతమైన అనంతగిరి హిల్స్ సమీపంలో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది.
హైదరాబాద్ నగరంలో మరో దారుణ ఘటన వెలుగు చూసింది.
గాంధీ జయంతి సందర్భంగా హైదరాబాద్‌లోని చారిత్రాత్మక బాపూఘాట్ వద్ద జాతిపిత మహాత్మా గాంధీకి రాష్ట్ర ప్రభుత్వం ఘనంగా నివాళులు అర్పించింది.