Publish Date:Apr 30, 2024
తిరుమలలో భక్తుల రద్దీ సాధారణంగా ఉంది. బుధవారం (మే 1)ఉదయం శ్రీవారి దర్శనం కోసం వేచి ఉన్న భక్తులతో ఆరు కంపార్ట్ మెంట్లు నిండిపోయాయి.
Publish Date:Apr 30, 2024
వామ్మో... రోజులు మరీ దారుణంగా మారిపోతున్నాయి. ఇటీవల కర్నాటకలో ఇంటర్మీడియట్ పరీక్షల ఫలితాలు విడుదలయ్యాయి.
Publish Date:Apr 30, 2024
శుభకార్యాలకు ముహూర్తాలు లేవని పండితులు తేల్చారు. ఈ మూడు నెలలు వైశాఖ, జ్యేష్ట, ఆషాడ మాసాలు కావడంతో ముహుర్తాలు లేవని పండితులు చెబుతున్నారు. దీంతో పెళ్లిళ్లతో పాటు నూతన గృహ ప్రవేశాలు, దేవతా విగ్రహ ప్రతిష్టాపనలు, శంకుస్థాపనల వంటి కార్యాలకు విరామం వచ్చింది.
Publish Date:Apr 30, 2024
టీడీపీ సంక్షేమ పథకాల ముందు జగన్ నవరత్నాలు వెలవెల పోతున్నాయి. గతంలో జగన్‌కు ఓటు వేసిన వారంతా ఇప్పుడు కూటమి మేనిఫెస్టో కే జై అంటున్నారు. ముఖ్యంగా పెన్షన్లు రూ.4 వేలకు పెంపు, ఏడాదికి 3 ఉచిత గ్యాస్ సిలిండర్లు, మహిళలకు ఉచిత ఆర్టీసీ ప్రయాణం మొత్తం ఏపీ రాజకీయ ముఖచిత్రాన్నే మార్చివేసింది.
Publish Date:Apr 30, 2024
తెలుగుదేశం పార్టీ, జనసేన పార్టీ ‘జనగళం’ పేరుతో విడుదల చేసిన ఉమ్మడి మేనిఫెస్టోలో ప్రతి హామీ పద్ధతిగా వుంది. చంద్రబాబు విజన్‌ని ప్రతిఫలించేలా వుంది.
Publish Date:Apr 30, 2024
ఛత్తీస్ గఢ్ లో నక్సల్స్ కు మరోసారి ఎదురుదెబ్బ తగిలింది. నారాయణపూర్, కాంకేర్ జిల్లాల సరిహద్దుల్లో జరిగిన ఎదురుకాల్పుల్లో ఏడుగురు మావోలు మృతి చెందారు. మృతుల్లో ఇద్దరు మహిళా నక్సల్స్ ఉన్నట్టు పోలీసులు తెలిపారు. ఘటన స్థలంలో ఒక ఏకే-47 రైఫిల్, ఇతర ఆయుధాలు స్వాధీనం చేసుకున్నారు. ఈ దాడుల్లో డీఆర్ జీ, ఎస్టీఎఫ్ బలగాలు పాల్గొన్నాయి
Publish Date:Apr 30, 2024
కూటమి ఉమ్మడి మేనిఫెస్టో మంగళవారం విడుదల చేసింది. ఇప్పటికే అధికార వైసీసీ నవరత్నాలు ప్లస్ అంటూ మేనిఫెస్టోను విడుదల చేసిన సంగతి తెలిసిందే. దీంతో కూటమి మేనిఫెస్టోతో జగన్ మేనిఫెస్టోను పోలుస్తూ జనం చర్చించుకుంటున్నారు. జగన్ కొత్తగా ఇచ్చేదేమీ లేకపోగా, నవరత్నాలుప్లస్ అని గత ఎన్నికలలో విఫల హామీలకే కొద్ది పాటి నగదును చేర్చి ప్రకటించారన్న పెదవి విరుపు వైసీపీ వర్గాల నుంచే వ్యక్తం అవుతోంది.
Publish Date:Apr 30, 2024
గాజుగ్లాసు గుర్తు ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా పెద్ద ఎత్తున చర్చలో ఉంది. గాజు గ్లాసు గుర్తును జనసేనకు రిజర్వ్ చేసిన ఎన్నికల సంఘం ఆ పార్టీ పోటీ చేయని స్థానాలలో మాత్రం ఆ గుర్తును స్వతంత్ర అభ్యర్థులకు కేటాయించింది. ఏపీలో తెలుగుదేశం, జనసేన, బీజేపీ పొత్తు పెట్టుకుని కూటమిగా పోటీలో ఉన్న సంగతి తెలిసిందే.
Publish Date:Apr 30, 2024
60 వేల కోట్ల రూపాయలతో మూసీ సుందరీకరణ ప్రాజెక్టును మొదలుపెట్టడానికి రేవంత్ సర్కార్ సిద్ధమవుతోంది. ఈ ప్రాజెక్టు విజయవంతం కావాలంటే మూసీలో ప్రతిరోజూ నీటి ప్రవాహం ఉండాలి. అందు కోసం గజ్వేల్ నియోజకవర్గంలోని కొండ పోచమ్మ రిజర్వాయర్ నుంచి పైపులైను ద్వారా 15 టీఎంసీల తాగునీటిని హైదరాబాద్‌కు తరలించడం ద్వారా రాజధాని పరిధిలో 10 టీఎంసీల నీరు తాగునీటి అవసరాలకు సంపూర్ణంగా తీర్చడంతోపాటు , 5 టీఎంసీల నీటిని మురికికూపంగా మారిన మూసీనది ప్రక్షాళనకు ఉపయోగించబోతున్నారు
Publish Date:Apr 30, 2024
అది మే నెల 7వ తేదీ... 2014 సంవత్సరం. పులివెందులలో వాతావరణం సందడిగా వుంది. ఆరోజు అసెంబ్లీ ఎన్నికలకు పోలింగ్ జరుగుతోంది.
Publish Date:Apr 30, 2024
విజయవాడలో దారుణం జరిగింది. ఒకే కుటుంబానికి చెందిన ఐదుగురు వ్యక్తులు అనుమానాస్పదండగా మరణించారు.
Publish Date:Apr 30, 2024
ఏలూరు లోక్ సభ నియోజకవర్గంలోనూ, ఆ నియోజకవర్గ పరిధిలోని అసెంబ్లీ సెగ్మెంట్లలోనూ తెలుగుదేశం కూటమి దూసుకుపోతున్నది. ఏలూరు లోక్ సభ స్థానంతో పాటు ఆ నియోజకవర్గ పరిధిలోని అసెంబ్లీ సెగ్మంట్లన్నిటిలోనూ కూటమి అభ్యర్థులు ముందంజలో ఉన్నారు.
Publish Date:Apr 30, 2024
జిల్లాలో ఆ కుటుంబంలో నిట్టనిలువుగా వచ్చిన చీలిక కారణంగా.. ఇప్పటి వరకూ ఎన్నడూ చూడని దృశ్యాలు కూడా కనిపిస్తున్నాయి. వైఎస్ కుటుంబీకులకు ఎదురు నిలిచి మాట్లాడే పరిస్థితే ఉండేది కాదు. అలాంటిది ఇప్పుడు ఆ కుటుంబానికి చెందిన వారితో ఎదురుపడి మాట్లాడటమే కాదు, నిలబెట్టి ప్రశ్నిస్తున్న సంఘటనలు కూడా చోటు చేసుకుంటున్నాయి.