లెన్స్కార్ట్ డ్రెస్ కోడ్ వివాదం.. ఒక ఐడెంటిటీ క్వశ్చన్

Publish Date:Apr 23, 2026

Advertisement

భారత కార్పొరేట్ ప్రపంచంలో  డ్రెస్ కోడ్ అనే పదం సాధారణంగా ప్రొఫెషనలిజం, బ్రాండ్ ఇమేజ్, కస్టమర్ ఫేసింగ్ రోల్స్ తో  అనుసంధానమై ఉంటుంది. అయితే ఇటీవల లెన్స్కార్ట్ సంస్థకు సంబంధించిన ఒక అంతర్గత  స్టాఫ్ యూనిఫామ్ అండ్ గ్రూమింగ్ గైడ్  డాక్యుమెంట్ బయటకు రావడంతో.. ఈ చర్చ  వ్యక్తిగత ఐడెంటిటీ, మత స్వేచ్ఛ, సాంస్కృతిక హక్కుల దిశగా మలుపు తిరిగింది. ఈ డాక్యుమెంట్ లో హిజాబ్, టర్బన్లను అనుమతిస్తూ..  బొట్టు, తిలకం, చేతి తాడు.. ఇలా కొన్ని మత చిహ్నాలపై నిషేధం ఉన్నట్లు బయటపడింది. దీంతో సెలెక్టివ్ టార్గెటింగ్  ఆరోపణలు వెల్లువెత్తాయి. 

వివాదానికి కేంద్రబిందువైన డాక్యుమెంట్లో  ఆన్నదేంటంటే?

సోషల్ మీడియాలో వైరల్ అయిన లెన్స్ కార్ట్ స్టాఫ్ యూనిఫారం అండ్  గ్రూమిగ్ గైడ్  పేరుతో ఉన్న డాక్యుమెంట్లో ముఖ్యంగా మూడు అంశాలు పెద్ద చర్చకు దారి తీశాయి. ఒకటి..  హిజాబ్, టర్బన్ అనుమతి.. అంటే నల్లరంగు హిజాబ్, నల్ల టర్బన్ ధరించవచ్చు.  హిజాబ్ ఛాతీ వరకు కవరేజ్ ఉండాలి, కంపెనీ లోగో కనిపించేలా ఉండాలి. అయితే  బుర్ఖా మాత్రం స్టోర్లో అనుమతించబడదని గైడ్లో ఉంది.
 రెండు..బొట్టు, తిలకం చేతితాడుపై నిషేధం.. ఆ డాక్యమెంట్ లో మత చిహ్నం అయిన తిలకం, బింది, స్టిక్కర్ లకు అనుమతి లేదని స్పష్టంగా ఉంది. అలాగే మతపరంగా చేతికి కట్టుకుని తాడు కూడా నిషేధం అని విస్పష్టంగా ఉంది. ఇక మూడు సిందూర్ పై పరిమితి. వివాహిత మహిళలు సిందూర్ ను పరిమితంగానే పెట్టుకోవాలి. అది నుదుటిపై పడకూడదు అనే సూచన కూడా ఆ డాక్యుమెంట్ లో ఉంది.  ఇక్కడ ప్రత్యేకంగా చెప్పుకోవలసిందేమిటంటే.. హిజాబ్ ఓకే, బొట్టు నాట్ ఓకే అని ఆ డాక్యుమెంట్ లో పేర్కొనడమే. ఇదే వివాదానికి దారి తీసింది. సెలెక్టివ్ గా వివక్ష చూపుతున్నారన్న విమర్శకు కేంద్రంగా మారింది. దీనిపై నెక్సార్ట్ సీఈవో  దీనిపై వివరణ ఇస్తూ ఇది ప్రస్తుత విధానం కాదనీ, ఆ డాక్యుమెంట్ పాతదనీ చెప్పారు.  వివాదం తీవ్రరూపం దాల్చిన తర్వాత లెన్స్కార్ట్ వ్యవస్థాపకుడు, సీఈవె  పేయుష్ బన్సల్ పబ్లిక్గా స్పందించారు. ఆయన సామాజిక మాఆధ్యమ వేదిక ఎక్స్ లో చేసిన ఓ పోస్టులో  సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న డాక్యుమెంట్  సరికాదనీ, అది తమ సఃసంస్థ ప్రస్తుత మార్గదర్శకాలను ప్రతిబింబించదని స్పష్టం చేశారు.  అంతే కాకుండా ప్రస్తుత పాలసీపై స్పష్టత ఇచ్చారు. తమ సంస్థలో మతపరమైన వ్యక్తీకరణలపై ఎటువంటి ఆంక్షలూ లేవని పేర్కొన్నారు. తిలకం, బిందిలపై నిషేధం లేదని వివరించారు.    అయితే నెటిజనులు మాత్రం ఈ డాక్యుమెంట్ ఫిబ్రవరి 2026 తేదీతో ఉందానీ, ఇది పాతది అని వివరణ ఇచ్చి చేతులు దులుపుకుంటే సరిపోదనీ అంటున్నారు.   “సెలెక్టివ్ టార్గెటింగ్” ఆరోపణ.. డైవర్సిటీనా, డబుల్ స్టాండర్డ్సా? అన్న ప్రశ్న ఈ వివాదంలో ప్రముఖంగా తలెత్తుతోంది. 

 ఒక మత చిహ్నానికి గౌరవం, ఇంకొక మత చిహ్నానికి నిషేధం  అనే భావన స్పష్టంగా కనిపిస్తోంది.  హిజాబ్, టర్బన్లను అనుమతిస్తూ, బొట్టు, తిలక్, కళావ వంటి చిహ్నాలను నిషేధించడం స్పష్టంగా మత వివక్షే అన్న అభిప్రాయం వ్యక్తమౌతోంది.  అదే సమయంలో కంపెనీ పబ్లిక్ ఇమేజ్ లో డైవర్సిటీ, ఇన్క్లూజన్, కల్చరల్ ప్రైడ్ వంటి పదాలను విస్తృతంగా వాడుకోవడం, ఈ రెండింటి మధ్య వ్యత్యాసం  కార్పొరేట్ హిపోక్రసీ”గా సోషల్ మీడియాలో  విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.  “స్క్రీన్ మీద సంస్కృతి సెలబ్రేషన్, ఆఫీసులో  సంస్కృతి రిస్ట్రిక్షన్.. ఇదే ఈ వివాద సారాంశంగా పలువురు వ్యాఖ్యానిస్తున్నారు. 
ఉద్యోగి హక్కులు, మత స్వేచ్ఛ: చట్టపరమైన కోణం

భారత రాజ్యాంగం ప్రకారం, ఆర్టికల్ 25  వ్యక్తిగత మత స్వేచ్ఛను, ఆర్టికల్  19 వ్యక్తిగత వ్యక్తిత్వ, అభివ్యక్తి స్వేచ్ఛను రక్షిస్తుంది. అయితే ప్రైవేట్ కార్పొరేట్ సంస్థలు..  తమ బ్రాండ్ ఇమేజ్, యూనిఫామ్ పాలసీ పేరుతో కొన్ని పరిమితులు విధించగలవు.అయితే.. డ్రెస్ కోడ్ ఎక్కడ వరకు న్యాయసమ్మతం?  సేఫ్టీ, హైజీన్, యూనిఫామ్ స్టాండర్డ్ వంటి కారణాల కోసం కొన్ని నియమాలు సాధారణంగా అంగీకరించబడతాయి. మత చిహ్నాలపై సెలెక్టివ్  నిషేధం న్యాయపరంగా నిలుస్తుందా?  ఒక మత చిహ్నాన్ని అనుమతిస్తూ, ఇంకొక మత చిహ్నాన్ని నిషేధించడం ప్రత్యక్షంగా లేదా పరోక్షంగా వివక్షకిందే పరిగణించాలా?  అనే ప్రశ్న న్యాయ, సామాజిక వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. మత చిహ్నాలు ధరించినందుకు ఉద్యోగుల పనితీరు పాయింట్లు తగ్గించారనే ఆరోపణలు వస్తే.. అది కేవలం డ్రెస్ కోడ్ సమస్య కాకుండా, పని ప్రదేశంలో వివక్ష సమస్యగా మారుతుంది.  డిస్క్రిమినేషన్ సమస్యగా మారుతుంది.  

ఎగ్జామ్ సెంటర్లు, పోలీస్ రిక్రూట్మెంట్, ఇతర రంగాల్లోనూ  ఇదే ధోరణి?

లెన్స్కార్ట్ వివాదంతో పాటు, పరీక్షా కేంద్రాల్లో, పోలీస్ రిక్రూట్మెంట్లో, కొన్ని ప్రభుత్వ పరీక్షల్లో చేతి తాళ్లు, జంధ్యాలు, మత చిహ్నాలు తొలగించమని చెప్పిన ఘటనలు గతంలో కూడా తరచుగా వార్తల్లోకి వచ్చాయి. స్మార్ట్ వాచ్, ఎలక్ట్రానిక్ గాడ్జెట్లు నిషేధించడం లాజిక్ కు నిలబడుతుంది కానీ,   కానీ నూలు తాడు, జంద్యాలు, సాధారణ మత చిహ్నాలను కూడా  చీటింగ్  పేరుతో నిషేధించడం పట్ల ప్రజల్లో అసంతృప్తి, అవమాన భావనకు దారి తీస్తోంది.ఇక్కడ కూడా ప్రశ్న అదే.. సెక్యూరిటీ, ఫెయిర్ నెస్ పేరుతో తీసుకునే నిర్ణయాలు, వ్యక్తిగత గుర్తింపు.. మత స్వేచ్ఛను ఎంతవరకు దెబ్బతీస్తున్నాయి?
బ్రాండ్ ఇమేజ్  వర్సెస్ వ్యక్తిగత గుర్తింపు కార్పొరేట్ కల్చర్ కు పెద్ద పరీక్ష.

ఇప్పటి గ్లోబల్, మల్టీకల్చరల్  పని ప్రదేశాలలో  కంపెనీలు ఒకవైపు  డైవర్సిటీ & ఇన్క్లూజన్ ను తమ బ్రాండ్ కథనంలో ప్రధానంగా ప్రొజెక్ట్ చేస్తాయి. పండగల సమయంలో ప్రకటనల్లో బొట్టు, పూజ, సంప్రదాయ దుస్తులు, కుటుంబ విలువలు  బ్రాండ్ కమ్యూనికేషన్లో ప్రధాన పాత్ర పోషిస్తాయి. అదే సమయంలో, ఆఫీసులో  ఉద్యోగి అదే చిహ్నాలతో వస్తే, ఇది తీసేయండి, అది వద్దు అనే రూల్స్ అమలైతే..  అది బ్రాండ్ మెసేజ్, గ్రౌండ్ రియాలిటీ మధ్య గల అగాధాన్ని  బహిర్గతం చేస్తుంది.
 
 డైవర్సిటీ  ఒక స్లైడ్లో ఉండే పదమా? లేక ఉద్యోగి ముఖంపై, చేతిపై, నుదిటిపై కనిపించే చిహ్నాలనూ గౌరవించే విలువా? ఇదే అసలు ప్రశ్న. లెన్స్కార్ట్ కేసు.. ఒక కంపెనీ వివాదమా, పెద్ద ట్రెండ్ కు ప్రతిబింబమా? లెన్స్కార్ట్ వివాదం కేవలం ఒక కంపెనీ విధాన తప్పిదమేనా, లేక భారత కార్పొరేట్ ప్రపంచంలో మెల్లగా పెరుగుతున్న  సాంస్కృతిక డిస్కనెక్ట్ కు సంకేతమా అనే ప్రశ్న ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. ఒకవైపు  గ్లోబల్ స్టాండర్డ్స్ పేరుతో యూనిఫామ్, గ్రూమింగ్ పాలసీలు కఠినమవుతుండగా..  మరోవైపు భారతీయ ఉద్యోగులు తమ మత, సాంస్కృతిక చిహ్నాలను ప్రైవేట్ స్పేస్ లోకి మాత్రమే పరిమితం చేయాల్సిన ఒత్తిడిని అనుభవిస్తున్నారనే భావన పెరుగుతోంది. ఈ నేపథ్యంలో, లెన్స్కార్ట్ సీఈవో  ఇచ్చిన వివరణ.. పాలసీ మారింది, మత చిహ్నాలపై ఎలాంటి నిషేధం లేదు అనే స్పష్టీకరణ, ఒక డ్యామేజ్ కంట్రోల్ ప్రయత్నం మాత్రమే కాకుండా, భవిష్యత్తులో ఇతర కంపెనీలకు కూడా ఒక హెచ్చరికగా చూడవచ్చు.   డ్రెస్ కోడ్  పేరుతో తీసుకునే ప్రతి నిర్ణయం, ఉద్యోగి కేవలం యూనిఫారం మాత్రమే కాదు, తన అస్థిత్వాన్ని కూడా తాకుతుందనే విషయాన్ని కార్పొరేట్ ప్రపంచం గుర్తించాల్సిన సమయం వచ్చింది. 

సంకలనం, సేకరణ :సీతారాం కంఠంనేని

References:
1.    https://www.hindustantimes.com/trending/lenskart-under-fire-for-hijab-allowed-bindi-banned-rule-peyush-bansal-reacts-101776311485594.html?utm_source=copilot.com 
2.    https://www.wionews.com/india-news/lenskart-in-soup-over-no-bindi-kalawa-rule-in-dress-code-while-allowing-hijab-ceo-issues-clarification-1776334184761?utm_source=copilot.com 
3.    https://www.timesnownews.com/india/lenskart-ceo-peyush-bansal-on-hijab-allowed-bindi-banned-viral-dress-code-says-document-outdated-article-154093177?utm_source=copilot.com 
4.    https://www.livemint.com/companies/news/lenskarts-viral-style-guide-row-bindi-tilak-banned-but-hijab-allowed-peyush-bansal-responds-11776319876088.html?utm_source=copilot.com 
5.    https://www.indiatoday.in/india/story/lenskart-hijab-tilak-bindi-kalawa-guidelines-row-controversy-eyewear-founder-peyush-bansal-shark-tank-2896971-2026-04-16?utm_source=copilot.com 
 

By
en-us Political News

  
మీమ్ పేజీలు, మీడియా సంస్థలు, యూట్యూబ్ ఛానెళ్లు,  సోషల్ మీడియా యూజర్లు ఎవరైనా సరే ఈ వైరల్ కంటెంట్‌ను రీపోస్ట్ చేయడం, అప్‌లోడ్ చేయడం,  షేర్ చేయడం తక్షణమే ఆపాలని సురేఖ వాణి  పేర్కొన్నారు.
అమెరికాలో వైద్యులను సంప్రదించకుండా చాట్‌జీపీటీ సలహా మేరకు మూర్ఛ మందుల మోతాదును తగ్గించిన సాఫ్ట్‌వేర్ ఇంజినీర్ బోవెన్ వాన్ ఆకస్మిక మృతి చెందింది. ఈ ఘటనపై ఆమె తల్లిదండ్రులు OpenAIపై వేసిన సంచలన దావా వివరాలు.
హైదరాబాద్‌ పర్యటనకు వచ్చిన కేంద్ర హోంమంత్రి అమిత్ షాను వారిరువురూ బేగంపేటలో  ఐటీసీ కాకతీయ హోటల్‌లో సోమవారం (నవంబర్ 2)న కలిశారు.  ఈ సందర్భంగా వారు సినీ పరిశ్రమ ఎదుర్కొంటున్న  సైబర్ సవాళ్ల ను వివరించారు. ప్రధానంగా ఏఐ టెక్నాలజీ దుర్వినియోగం, డీప్ ఫేక్, మార్ఫింగ్ ద్వారా సినీ ప్రముఖుల ఫొటోలు, వీడియోలను అసభ్యకరంగా, అనుచిత రీతిలో అభ్యంతరకరంగా సామాజిక మాధ్యమంలో ప్రచారం చేస్తున్నారని ఈ సందర్భంగా చిరంజీవి అమిత్ షాకు తెలిపారు.
భారతదేశానికి జంబుద్వీపం అనే పేరు ఎలా వచ్చింది? పూజల సంకల్పంలో జంబుద్వీపం అని ఎందుకు అంటారు? పురాణాలు మరియు చరిత్ర తెలిపే ఆసక్తికరమైన విషయాలు తెలుసుకోండి.
Before choosing a group health insurance plan, you should consider the eligibility criteria and check whether the insurer has a smooth claim processing. Let us explore what are the group health insurance benefits in more detail.
ప్రాథమిక సమాచారం ప్రకారం, ఆసుపత్రి నిర్వహణకు సంబంధించిన ఆర్థిక వనరులు, లావాదేవీలపై ఐటీ   ప్రత్యేక దృష్టి పెట్టింది. గత కొంతకాలంగా పెద్ద మొత్తంలో జరిగిన నగదు లావాదేవీలకు సరైన లెక్కలు లేకపోవడం, పన్ను చెల్లింపుల్లో వ్యత్యాసాలు ఉండటమే ఈ దాడులకు ప్రధాన కారణంగా తెలుస్తోంది.
అలాంటి అరుదైన, విలక్షణమైన వన్యప్రాణుల జాబితాలో ఇండోనేషియాలోని సులవేసి ద్వీపానికి చెందిన  మ్యాక్రోసెఫాలోన్ మెలియో పక్షి  జాతి ఒకటి. సాధారణ పక్షుల వలె చెట్లపై గూళ్లు కట్టుకుని, గుడ్లను పొదిగే సంప్రదాయ పద్ధతికి ఇది పూర్తి భిన్నం. ఈ పక్షి జీవన శైలి  అడవి కోడిని పోలి ఉంటుంది.
ఈ ఆధునిక సాంకేతిక పరిజ్ఞానం, వాతావరణ రాడార్లు అందుబాటులోకి రాకముందే..   పూర్వీకులు చెట్లను, జంతువులను, కీటకాలను గమనించి రానున్న విపత్తులను అంచనా వేశారు. ఆ అంచనాలు దాదాపు కచ్చితంగా ఉండేవి. పర్యావరణంలో వచ్చే చిన్న చిన్న మార్పులను,  భూగర్భంలో జరిగే అలజడిని మనుషుల కంటే ముందుగా వృక్షజాలం పశుపక్ష్యాదులు పసిగడతాయని శాస్త్రీయ అధ్యయనాలుచెబుతున్నాయి.
ఈనాడు సంస్థల వ్యవస్థాపకుడు చెరుకూరి రామోజీరావు జీవిత విశేషాలు, ఆయన అవలంబించిన వ్యాపార విధానాలు మరియు ఎదుర్కొన్న రాజకీయ సవాళ్లపై ప్రముఖ సీనియర్ జర్నలిస్ట్ డి.ఎన్. ప్రసాద్  తెలుగువన్ ది జర్నలిస్ట్ మూడో  ఎపిసోడ్‌లో  తెలుగువన్ ఎండీ  రవిశంకర్ తో పంచుకున్నారు.  
ఉపాధి కోసం వలస వెళ్లిన కుటుంబంలో తీవ్ర విషాదం చోటుచేసుకుంది. బట్టలు ఉతికేందుకు కుంటకు వెళ్లిన ముగ్గురు నీటిలో మునిగి దుర్మరణం చెందారు. ఈ హృదయవిదారక ఘటన వివరాలు ఇక్కడ తెలుసుకోండి.
న్యూయార్క్ సమీపంలోని ఆల్బనీ ప్రాంతంలో  నివాసముంటున్న ఆమె అమెరికా కాల మానం ప్రకారం గురువారం రాత్రి ఏడు గంటల సమయంలో ఖమ్మంలో ఉన్న తన తండ్రి నల్లమల్ల ఆనంద్ కుమార్ తో ఫోన్ లో మాట్లాడుతున్నారు. అలా మాట్లాడుతుండగానే  గుండె నొప్పితో కుప్పకూలిపోయారు.
జామో పోలీస్ స్టేషన్ పరిధిలోని ఆలంపూర్ గ్రామంలో ఉన్న ఒక బాణసంచా తయారీ యూనిట్లో  భారీ పేలుడు సంభవించింది.   శుక్రవారం సాయంత్రం చోటుచేసుకున్న ఈ ప్రమాదంలో నలుగురు వ్యక్తులు అక్కడికక్కడే దుర్మరణం చెందగా, పలువురు తీవ్రంగా గాయపడ్డారు  
తెలంగాణలో కూడా వచ్చేమూడు రోజులూ పలు చోట్ల ఓ మోస్తరు నుంచి భారీ వర్షాలు కురుస్తాయని పేర్కొంది. వర్షాలు కురిసే సమయాల్లో పిడుగుపాటుకు అవకాశాలున్నందున విద్యుత్ స్తంభాలు, చెట్లకింద నిలబడవద్దని హెచ్చరించింది.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.