అంతర్జాతీయ విమానయాన రంగం కుదేలు!

Publish Date:Apr 27, 2026

Advertisement

మిడిల్ ఈస్ట్ లో నెలకొన్న యుద్ధ వాతావరణం యూరప్ ఖండాన్ని అతలాకుతలం చేస్తోంది. ముఖ్యంగా ఇరాన్, అమెరికా, ఇజ్రాయెల్ మధ్య ఉద్రిక్తతలు పెరగడంతో ప్రపంచ ఇంధన సరఫరా వ్యవస్థకు గొంతుకగా ఉన్న హోర్ముజ్ జలసంధి మూతపడటం అంతర్జాతీయ విమానయాన రంగాన్ని కుదేలు చేస్తోంది. అతలాకుతలం చేస్తోంది. కుదిపేస్తోంది. హెర్మూజ్ మూత కారణంగా జెట్ ఇంధన ధరలు ఆకాశాన్ని తాకాయి. అదే సమయంలో ఇంధన లభ్యత విషయంలోనూ తీవ్ర  అంతరాయం ఏర్పడింది. యుద్ధం మొదలైనప్పటి నుండి ఇంధన ధరలు దాదాపు రెట్టింపు  అయ్యియి. ఈ పరిస్థితి యూరప్‌లోని ప్రముఖ విమానయాన సంస్థలు తమ సర్వీసులను భారీగా తగ్గించుకోవడానికి దారి తీసింది.

ప్రపంచ చమురు వాణిజ్యంలో అత్యంత కీలకమైన హెర్ముజ్ జలసంధి ద్వారా   20 శాతం చమురు, 30 శాతం వరకు జెట్ ఇంధనం సరఫరా అవుతుంది. ప్రస్తుత పరిస్థితులలో ట్యాంకర్ల రాకపోకలు నిలిచిపోవడంతో ఐరోపా దేశాలకు అందే ఇంధన నిల్వలు అడుగంటుతున్నాయి. అంతర్జాతీయ ఇంధన సంస్థ (ఐఈఏ) అంచనా ప్రకారం, ఒకవేళ ఈ దిగ్బంధనం ఇలాగే కొనసాగితే యూరప్ వద్ద ఉన్న నిల్వలు   మరో ఆరు వారాలకు సరిపోవడమే గగనం. ఇది చరిత్రలోనే అతిపెద్ద ఇంధన భద్రతా సంక్షోభంగా మారుతుందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఈ సంక్షోభానికి అద్దం పడుతూ జర్మనీకి చెందిన దిగ్గజ ఎయిర్‌లైన్  లుఫ్తాన్సా సంచలన నిర్ణయం తీసుకుంది. ప్రస్తుత వేసవి సీజన్ నుంచి శరదృతువు వరకు దాదాపు ఇరవై వేల విమానాలను రద్దు చేస్తున్నట్లు ప్రకటించింది. ముఖ్యంగా లాభదాయకం కాని చిన్నపాటి దూరాల   ప్రయాణాలను నిలిపివేస్తోంది. ఇంధన వినియోగాన్ని తగ్గించుకుంటూ ఖర్చులను నియంత్రించడమే లక్ష్యంగా ఈ నిర్ణయం తీసుకుంది. కేవలం లుఫ్తాన్సా మాత్రమే కాకుండా కేఎల్ఎం, ఎస్ఏఎస్  వంటి ఇతర సంస్థలు కూడా ఇదే బాటలో నడుస్తున్నాయి. 

పర్యాటక రంగంపై ఈ ప్రభావం ఊహించని స్థాయిలో ఉండనుంది. సాధారణంగా వేసవిలో యూరప్ పర్యాటక రంగం ద్వారా బిలియన్ల కొద్దీ ఆదాయం, మిలియన్ల కొద్దీ ఉద్యోగాలు లభిస్తాయి. కానీ ప్రస్తుత ధరల పెరుగుదల..  విమానాల రద్దు వల్ల పర్యాటకులకు ప్రత్యామ్నాయాలు తగ్గిపోయాయి. మిగిలి ఉన్న కొన్ని విమానాల్లో కూడా టికెట్ ధరలు భారీగా పెరగడంతో పాటు, చెక్-ఇన్ బ్యాగేజీ మరియు ఇతర సేవలపై అదనపు రుసుములు వసూలు చేస్తున్నారు. పరిస్థితి ఇలాగే ఉంటే భవిష్యత్తులో ఇంధన రేషనింగ్ విధానాన్ని కూడా అమలు చేయాల్సి రావచ్చని అంతర్జాతీయ విమాన రవాణా సంస్థ ఐఏటిఏ అంచనావేస్తోంది.  మరోవైపు, అమెరికా వంటి దేశాలు సొంతంగా ఇంధన ఉత్పత్తిని కలిగి ఉండటం వల్ల యూరప్‌తో పోలిస్తే కొంత మేర రక్షణలో ఉన్నాయి. అయితే ఆసియాలోని వియత్నాం, థాయ్‌లాండ్ వంటి దేశాలు మాత్రం మధ్యప్రాచ్య చమురుపై ఆధారపడటం వల్ల ఇప్పటికే షెడ్యూల్ కోతలను ఎదుర్కొంటున్నాయి. గ్లోబల్ మార్కెట్‌లో ఒక చోట ఏర్పడిన ఇంధన ఒత్తిడి ప్రపంచమంతటా  విస్తరిస్తోంది. దీర్ఘకాలికంగా చూస్తే, ఈ సంక్షోభం విమానయాన రంగానికి కొత్త పాఠాలు నేర్పుతోంది.

 కేవలం మధ్యప్రాచ్యంపైనే ఆధారపడకుండా ఇంధన సరఫరా మార్గాలను వైవిధ్యం చేసుకోవాల్సిన అవసరం ఏర్పడింది. పర్యావరణ హితమైన సస్టైనబుల్ ఏవియేషన్ ఫ్యూయల్ (ఎస్ఏఎఫ్) వంటి ప్రత్యామ్నాయాలపై పెట్టుబడులను వేగవంతం చేయాలని నిపుణులు సూచిస్తున్నారు. అలాగే, ఎయిర్‌లైన్స్ తమ పాత, ఎక్కువ ఇంధనాన్ని వినియోగించే విమానాలను పక్కన పెట్టి ఆధునిక సాంకేతికత వైపు మళ్ళాల్సిన సమయం ఆసన్నమైంది.  వేసవి సెలవుల కోసం ప్లాన్ చేసుకుంటున్న ప్రయాణికులు ప్రస్తుతానికి జాగ్రత్తగా ఉండాలని నిపుణులు హెచ్చరిస్తున్నారు. ట్రావెల్ ఇన్సూరెన్స్ తీసుకోవడం, ఫ్లెక్సిబుల్ టికెట్లను ఎంచుకోవడం  అలాగే..  ఎయిర్‌లైన్స్ ఇచ్చే తాజా సమాచారాన్ని ఎప్పటికప్పుడు గమనించడం మేలని అంటున్నారు. ఆకాశంలో ఎగిరే విమానాల వెనుక ఇప్పుడు కేవలం ఇంజిన్ శక్తి మాత్రమే కాదు, అంతర్జాతీయ రాజకీయాలు,  ఇంధన సమీకరణాలు కూడా కీలకంగా మారాయి.

-సీతారాం కంఠంనేని

By
en-us Political News

  
విశాఖపట్నం నగరంలోని చారిత్రాత్మక ఆంధ్రా విశ్వవిద్యాలయం శత వసంతాలను పూర్తి చేసుకుంది.
రంగారెడ్డి జిల్లాలోని శంషాబాద్, మహేశ్వరం మండలం పరిసర ప్రాంతాల్లో సోమవారం సాయంత్రం భారీ వర్షం కురిసింది.
పోలీస్ సిబ్బంది సంక్షేమాన్ని దృష్టిలో ఉంచుకుని తెలంగాణ పోలీస్ శాఖ కీలక నిర్ణయం తీసుకుంది.
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి కుటుంబ సమేతంగా లండన్ పర్యటనలో ఉన్నారు.
డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క సీపీఆర్వో గా పనిచేస్తున్న మారబోయిన మధుసూదన్ ఆకస్మిక మృతి పట్ల ముఖ్యమంత్రి ఏ. రేవంత్ రెడ్డి తీవ్ర దిగ్భ్రాంతిని వ్యక్తం చేశారు
హైదరాబాద్ నగర సమీపంలోని శంకర్పల్లి ప్రాంతంలో సోమవారం సాయంత్రం సమయంలో విషాదకరమైన ఘటన చోటుచేసుకుంది.
విశాఖపట్నం నగరానికి గర్వకారణమైన ఆంధ్రా యూనివర్సిటీ వందేళ్ల ఉత్సవాల ముగింపు వేడుకలు అత్యంత ఘనంగా జరిగాయి.
కేంద్రపాలిత ప్రాంతమైన లద్దాఖ్‌లో పరిపాలనా వ్యవస్థను మరింత బలోపేతం చేసే దిశగా కేంద్ర ప్రభుత్వం చారిత్రాత్మక నిర్ణయం తీసుకుంది.
ఈ సమీక్షకు పౌర సరఫరాల శాఖామంత్రి నాదెండ్ల మనోహర్, జిల్లా కలెక్టర్లు, ఎస్పీలు, సివిల్ సప్లై ఉన్నతాధికారులు, పెట్రోలియం కంపెనీల ప్రతినిధులు హాజరయ్యారు. ఈ సమస్య పరిష్కారానికి ఆదివారం రాత్రి నుంచి ఇప్పటి వరకూ తీసుకున్న చర్యలపై సీఎం అధికారులను వివరణ కోరారు.
తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుపై బీజేపీ ఎంపీ తేజస్వీ సూర్య చేసిన అనుచిత వ్యాఖ్యలపై కేసీఆర్ తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు.
అంబర్‌పేట్ చే నంబర్ చౌరస్తా వద్ద సోమవారం మధ్యాహ్నం భారీ అగ్నిప్రమాదం చోటుచేసుకుంది.
సాంకేతిక నిపుణులకు ఆండ్రాయిడ్ అందించే డెవలపర్ ఆప్షన్స్ ఒక అద్భుతమైన వరం. ఐఫోన్‌లో ఇటువంటి నియంత్రణ పొందాలంటే ఎక్స్-కోడ్ వంటి పరికరాల సహాయం తీసుకోవాల్సి ఉంటుంది. కానీ ఆండ్రాయిడ్‌లో నేరుగా ఫోన్ నుండే యానిమేషన్ వేగాన్ని మార్చుకోవడం.. బ్యాక్‌గ్రౌండ్ ప్రాసెస్ నియంత్రించడం వంటి వాటి ద్వారా ఫోన్ వేగాన్ని పెంచుకోవచ్చు.
తెలంగాణ రాజకీయాల్లో మరోసారి ఉత్కంఠ వాతావరణం నెలకొంది.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.