అసలు పొటాషియం శరీరానికి ఎందుకు అంత ముఖ్యం తెలుసా?

Publish Date:Feb 21, 2025

Advertisement

 

శరీరం ఆరోగ్యంగా ఉండటానికి అనేక రకాల విటమిన్లు,  మినరల్స్,  ఖనిజాలు అవసరం అవుతాయి. అలాంటి వాటిలో పొటాషియం కూడా ఒకటి. ఇది శరీరంలో చాలా రకాల పనులు జరగడానికి అవసరం. కానీ చాలామందికి పొటాషియం గురించి అవగాహన లేదు.  అసలు పొటాషియం శరీరానికి ఎందుకు అవసరం. ఇది శరీరంలో నిర్వహించే పనులు ఏంటి? ఏ ఆహారాలు తీసుకుంటే పొటాషియం శరీరానికి పుష్కలంగా లభిస్తుంది.  వివరంగా తెలుసుకుంటే..


పొటాషియం శరీరానికి అవసరమైన ఖనిజాలలో ప్రముఖమైనది.  ఇది గుండె, కండరాలు, నాడీ వ్యవస్థ,  మూత్ర పిండాలను ఆరోగ్యంగా ఉంచడానికి చాలా ముఖ్యం. శరీరానికి తగినంత పొటాషియం అందుతూ ఉంటేనే పై అవయవాలు ఆరోగ్యంగా తమ విధులు అవి సమర్థవంతంగా నిర్వహిస్తాయి. కానీ పొటాషియం లోపిస్తే మాత్రం చాలా ఇబ్బందులు ఎదుర్కోవాలి.


పొటాషియం లోపం వల్ల బలహీనత, కండరాల తిమ్మిరి,  రక్తపోటు.. వంటి సమస్యలు వస్తాయి.  ఈ సమస్యలు రాకూడదు అంటే సమతుల ఆహారంలో పొటాషియం సమృద్దిగా ఉండే ఆహారాన్ని తీసుకోవాలి. ఇలా తీసుకుంటేనే శరీరం శక్తివంతంగా ఉంటుంది.


పొటాషియం రక్తపోటును నియంత్రించడంలో సహాయపడుతుంది.  తద్వారా గుండె జబ్బుల ప్రమాదాన్ని తగ్గిస్తుంది. గుండె సంబంధ సమస్యలు ఉన్నవారు,  కుటుంబంలో ఎవరికైనా గుండె సంబంధ సమస్యలు ఉంటే ఆ కుటుంబ సభ్యులు గుండె ఆరోగ్యం మీద దృష్టి పెట్టాలి.


శరీరానికి పొటాషియం ఎందుకు ముఖ్యం అంటే.. ఇది శరీరంలో కాల్షియం తగిన మోతాదులో ఉండేలా చేస్తుంది.  ఎముకల బలానికి పొటాషియం తీసుకోవడం కూడా చాలా అవసరం.


అంతేకాదు.. పొటాషియం శరీరానికి సరిపడినంత తీసుకోవడం వల్ల మెదడుకు రక్తప్రసరణ మెరుగు పడుతుంది. తద్వారా స్ట్రోక్ ప్రమాదం కూడా తగ్గుతుంది.  అంటే.. మెదడు సంబంధ సమస్యలు రావద్దని అనుకుంటే పొటాషియం  గల ఆహారాన్ని బాగా తీసుకోవాలి.

పొటాషియం బాగా తీసుకోవాలి అని అనిపించినా పొటాషియం ఎందులో ఎక్కువ ఉంటుంది అనే విషయం చాలా మందికి తెలియదు. అలాంటి వారు పొటాషియం రిచ్ ఫుడ్స్ గురించి తెలుసుకోవాలి.  బంగాళదుంపలు,  పాలకూర,  అవకాడో, నారింజ వంటి ఆహారాలు తీసుకోవడం వల్ల పొటాషియం బాగా లభిస్తుంది.


                                            *రూపశ్రీ.


 

By
en-us Political News

  
మనం తినే ఆహారాన్ని ఎంత ఎక్కువగా ఉడికిస్తే అంత మంచిదని చాలామంది భావిస్తుంటారు. కానీ అధికంగా ఉడికించడం వల్ల కొన్ని పోషకాలు తగ్గిపోయే అవకాశం ఉంటుందని ప్రముఖ సెలబ్రిటీ న్యూట్రిషనిస్ట్,
పెళ్లయ్యాక ప్రతి భార్యాభర్త పిల్లలను కనడంపై శ్రద్ద పెడతారు. పిల్లలను కనడం,  అమ్మ నాన్న అనిపించుకోవడం జీవితంలో ఒక మధురమైన అనుభూతిగా భావిస్తారు. అయితే నేటికాలంలో ఆడవారు మాత్రమే కాకుండా...
నేటి కాలంలో ప్రపంచవ్యాప్తంగా గుండె సంబంధిత వ్యాధులు వేగంగా పెరుగుతున్నాయి. అందువల్ల, వైద్యులు క్రమం తప్పకుండా వ్యాయామం చేయమని చెబుతుంటారు.   గుండెను ఆరోగ్యంగా ఉంచుకోవడానికి  చాలామంది..
ప్రోటీన్ శరీరానికి అవసరమైన పదార్థం. శరీరంలో కండరాల నిర్మాణానికి, శక్తికి,కణాల అభివృద్దికి, ఎముకల నిర్మాణానికి ఇలా చాలా విషయాలకు ప్రోటీన్ అవసరం అవుతుంది. శరీరానికి ప్రోటీన్ కోసం చాలా మంది గుడ్లు, పాలు, పాల పదార్థాలు అయిన పనీర్ వంటివి తీసుకుంటారు...
ఏదైనా కొనడానికి వెళ్ళాలని అనుకుంటాం. కానీ తీరా అక్కడికి వెళ్లాకా ఏం తీసుకోవాలని వచ్చామో అదే మర్చిపోతుంటాం. ఇది చాలా మందికి జరుగుతూ ఉంటుంది.  కానీ ఎవరూ దీని గురించి పెద్దగా పట్టించుకోరు....
మన శరీరానికి అవసరమైన ముఖ్యమైన ఖనిజాల్లో మెగ్నీషియం (Magnesium) ఒకటి. ఇది కండరాల పనితీరు, నరాల వ్యవస్థ, గుండె ఆరోగ్యం..
మంచి ఆరోగ్యానికి ఆరోగ్యకరమైన ఆహారం చాలా అవసరం.  తరచుగా ఏమి తినాలి అనే దానిపై చాలా మంది దృష్టి పెడతారు.  నిజానికి ఆరోగ్యం కోసం ఏం తినాలో అనే కాదు..  ఎప్పుడు తినాలనే విషయం  కూడా అంతే ముఖ్యమని..
డయాబెటిస్ ఉన్నవారిలో సైలెంట్ హార్ట్ ఎటాక్ వచ్చే అవకాశాలు ఎంత? నార్మల్ షుగర్ లెవల్స్, HbA1c విలువలు, ప్రీ-డయాబెటిస్, డయాబెటిస్ కంప్లికేషన్స్ గురించి డా. హరిచరణ్ వివరించిన పూర్తి సమాచారం...
ఈ రోజుల్లో, ఫిట్‌గా , ఆరోగ్యంగా ఉండటానికి చాలా మంది జిమ్‌కు వెళ్తున్నారు.  శరీరాకృతి మెరుగ్గా కనిపించాలని,  ఫిట్‌నెస్ కోసం చేసే ఈ ప్రయత్నంలో, చాలా మందికి తెలియకుండానే కొన్ని తప్పులు జరుగుతాయి...
అధిక బరువు, బెల్లీ ఫ్యాట్ సమస్యలను సహజంగా తగ్గించుకోవాలనుకుంటున్నారా? ప్రముఖ ఆయుర్వేద వైద్య నిపుణుడు డా. చిట్టిబొట్ల మధుసూదన శర్మ సూచించిన ఆయుర్వేద చిట్కాలు, జీవనశైలి మార్పులు, ఆహార నియమాలు ఈ వీడియోలో తెలుసుకోండి. ఆయుర్వేద ద్రవ్యాల ప్రయోజనాలు, శరీరంలో కొవ్వు తగ్గించే మార్గాలు, ఆరోగ్యకరమైన బరువు నియంత్రణపై ఉపయోగకరమైన సమాచారం అందించబడింది. ఆరోగ్యంగా బరువు తగ్గాలనుకునేవారికి ఈ వీడియో ఎంతో ఉపయోగపడుతుంది...
నేటికాలంలో వేగవంతమైన జీవనశైలి , సరైన ఆహారపు అలవాట్లు లేకపోవడం వల్ల, బరువు పెరగడం ప్రజలకు ఒక పెద్ద సమస్యగా మారుతోంది. ఊబకాయం శారీరక దృఢత్వాన్ని ప్రభావితం చేయడమే కాకుండా, మధుమేహం, అధిక రక్తపోటు, గుండె జబ్బులు , అనేక ఇతర తీవ్రమైన అనారోగ్యాల ప్రమాదాన్ని కూడా పెంచుతుంది. అధిక బరువు వల్ల ఆరోగ్యానికి ప్రమాదం అని తెలుసుకున్న తర్వాత చాలామంది బరువు తగ్గడానికి చాలా ప్రయత్నాలు చేస్తారు...
స్కూల్‌కి వెళ్లే పిల్లలకు ఎలాంటి ఆహారం ఇవ్వాలి... వారి శారీరక, మానసిక ఎదుగుదలకు అవసరమైన పోషకాహారం ఏమిటి.. జంక్ ఫుడ్ వల్ల కలిగే నష్టాలు, బ్రేక్‌ఫాస్ట్ ప్రాముఖ్యత, టిఫిన్‌లో పెట్టాల్సిన ఆరోగ్యకరమైన ఆహారాల గురించి ప్రముఖ న్యూట్రిషనిస్ట్ డా. పి. జానకి శ్రీనాథ్ వివరించిన ముఖ్యమైన సూచనలు ఈ వీడియోలో తెలుసుకోండి...
కాలక్రమేణా అంటువ్యాధులు సర్వసాధారణం అవుతున్నాయి. ఒకవైపు  రోగనిరోధక శక్తి బలహీనం కావడం, మరొకవైపు వైరస్‌లు , బ్యాక్టీరియాల కొత్త రకాలు కూడా తీవ్ర ముప్పును కలిగిస్తున్నాయి. గత నెలరోజులుగా..
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.