మహా సాగరంలో అరుదైన ఖనిజాల వేట ముమ్మరం!

Publish Date:Aug 10, 2025

Advertisement

మానవుడు తన మనుగడ కోసం, తన అవసరాల, తన స్వార్థం, విలాసవంతమైన సౌకర్యాల కోసం మహా సాగరాలను కూడా చెరబడుతున్నాడు.  భూగోళంపై 71శాతం నీరే కాబట్టి భూమి మీద కన్నా సముద్రగర్భంలోనే రెండు రెట్లు అధికంగా ఖనిజాలు ఉన్నాయి. కాబట్టి,   సాంకేతికంగా ముందున్న దేశాలు సముద్ర గర్భం నుంచి అరుదైన లోహాలను తవ్వి తీయడానికి పోటీ పడుతున్నాయి. ఈ ఖనిజాల వేట మహా సాగర జలాలను కలుషితం చేసి.. సాగర జీవులకు ముప్పు తెస్తున్నాయి. పర్యావరణాన్ని విధ్వంసం చేస్తున్నాయి. అసలే కర్బన ఉద్గారాల వల్ల పర్యావరణానికి జరుగుతున్న హాని మరింత ఎక్కువ అవుతోంది. ప్రపంచ వ్యాప్తంగా 300 కోట్ల మంది ప్రజలకి   జీవనాధారం  సముద్ర తీర   ప్రాంత వనరులపై ఆధారపడి ఉంటుంది. వాళ్లందరి జీవనభృతికి ఇప్పుడు ప్రమాదం పొంచి ఉంది.  
సముద్రంలో 5,580 రకాల జీవజాతులుండగా, వాటిలో 430 జీవ జాతులను మాత్రమే ఇప్పటి వరకూ మనం గుర్తించగలిగాం. సముద్ర గర్భంలో  ఖనిజ కణికల కోసం చేపట్టే అన్వేషణ భారీ నష్టాన్ని కలిగిస్తుంది  కాబట్టి అరుదైన ఖనిజాల అన్వేషణ తక్షణం ఆపాలని ఫ్రాన్స్, జర్మనీ, న్యూజిలాండ్, చిలీ, కోస్టారికా దేశాలు కోరుతున్నాయి. 
మానవ మనుగడ, అవసరాలు, నూతన ఆవిష్కరణలైన ఎలక్ట్రిక్ వాహనాలు, సెమీ కండక్టర్ల పరిశ్రమల ఉత్పత్తుల కోసం లిథియం, కోబాల్ట్, టైటానియం, గాలియం, రాగి, నికేల్, మ్యాంగనీస్ వంటి అరుదైన లోహాలు అవసరం ఏంతైనా ఉంది. వీటి అన్వేషణ కోసం ప్రపంచ దేశాలు పోటీ పడుతున్నాయి. 

సముద్రగర్భంలో 600 కోట్ల టన్నుల మ్యాంగనీసు, 27 కోట్ల టన్నుల నిఖీలు, 23 కోట్ల టన్నల రాగి, 5 కోట్ల టన్నుల కోబాల్ట్ నిక్షేపాలున్నాయనీ, వీటిని వెలికి తీస్తే, అరుదైన లోహాల కోసం చైనాపై ఆధారపడాల్సిన అగత్యం తప్పుతుందని పాశ్చ్యాత్త దేశాలు భావిస్తున్నాయి. ప్రస్తుతం హవాయి నుంచి మెక్సికో వరకూ పసిఫిక్ మహాసముద్రంలో విస్తరించిన క్లారియం, క్లిప్పర్టన్ క్యాప్చర్ జోన్  (సీసీజడ్ )లో  అరుదైన ఖనిజాల కోసం వేట ముమ్మరమైంది. 

సముద్రాలను విచ్చలవిడిగా ఉపయోగిస్తే.. జీవజాతులకు, పర్యావరణానికి తీవ్ర నష్టం కలుగుతుంది. దీనిని నివారించడానికి ఐక్యరాజ్య సమితి ఛత్రం కింద కుదిరిన సముద్ర చట్టం ఒప్పందం 1994 నవంబర్ 16 నుంచి అమలులోకి వచ్చింది. దీని కింద ప్రతి దేశానికి తమ తీరం నుంచి సముద్రంలో 12 నాటికల్ మైళ్లు (22.22 కిలోమీటర్లు) దూరం వరకూ ఉన్న జలాలపై సార్వభౌమ హక్కు ఉంటుంది. వీటిని అంతర్గత జలాలు అంటారు. ఖండపు అంచుల నుంచి 220 నాటికల్ మైళ్లు (370.4 కిలోమీటర్లు) వరకూ విస్తరించిన ప్రాదేశిక జలాలను ప్రత్యేక ఆర్థిక మండళ్లుగా పిలుస్తారు. అంతర్గత, ప్రాదేశిక జలాల పరిధికి అవతల ఉన్నదంతా అంతర్జాతీయ జలాలే. అంటే..  ఏ దేశానికి ఆ దేశ సముద్ర గర్భంలోని అరుదైన ఖనిజాల అన్వేషణపై సమన్వయం పాటించాలన్నమాట. వాస్తవానికి సముద్ర గర్భ అన్వేషణకు ఐఎస్ఏ (అంతర్జాతీయ సముద్రగర్భ ప్రాధికారిక సంస్థ) నుంచి అనుమతి పొందాల్సి ఉంది. ఐఎస్ఏలో  170 సభ్య దేశాలు ఉన్నాయి.

By
en-us Political News

  
కోల్‌కతాలోని కాళీఘాట్‌లోని మమతా బెనర్జీ అధికారిక నివాసం వద్ద భారీగా పోలీసులు, కేంద్ర బలగాలను మోహరించడం ఈ ఆరోపణలకు బలాన్ని చేకూరుస్తోంది. మమత నివాసానికి వెళ్లే అన్ని ప్రధాన మార్గాలను పోలీసులు తమ అధీనంలోకి తీసుకుని, భారీ పోలీసు వాహనాలతో పూర్తిగా దిగ్బంధించారు.
అనంతపురం జిల్లాకు ఎప్పుడూ ఒక ప్రత్యేకమైన స్థానం ఉంటుంది.
సుదీర్ఘ రాజకీయ ప్రస్థానం ఉన్న ఆమంచి కృష్ణమోహన్.. 2014 అసెంబ్లీ ఎన్నికల్లో చీరాల నియోజకవర్గం నుండి స్వతంత్ర అభ్యర్థిగా రంగంలోకి దిగి విజయం సాధించారు. ఈ తరువాత ఆయన తెలుగుదేశం పార్టీకి మద్దతు ఇచ్చారు. అయితే.. 2019 ఎన్నికలకు ముందు తెలుగుదేశం పార్టీని వీడి, వైసీపీ పంచన చేరారు.
తెలంగాణ ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డి ప్రజా జీవితంలో అరుదైన మైలురాయిని చేరుకున్నారు.
ఈసీ ఆదేశాల మేరకు కవిత తన టీఆర్ఎస్ పార్టీ పేరుకు ప్రత్యామ్నాయంగా మూడు పేర్లను ఈసీకి పక్షం రోజుల్లోగా సమర్పించాల్సి ఉంటుంది. నిర్దేశిత గడువులోగా మూడు ప్రత్యామ్నాయ పేర్లను సూచించకుంటే దరఖాస్తున్న మూసేస్తామని హెచ్చరించింది. అంతే కాకుండా టీఆర్ఎస్ పేరును కొనసాగించేందుకు అనుమతి ఉండదని విస్పష్టంగా పేర్కొంది.
ఆ పార్టీ ప్రధాన ఆరోపణ ఏంటంటే.. క్షేత్రస్థాయిలో తెలుగుదేశం పార్టీ అనుకూల సిబ్బందితో అర్హులైన వైసీపీ మద్దతుదారుల ఓట్లను ఉద్దేశపూర్వకంగా తొలగించేందుకు కుట్ర జరుగుతోందని. గతంలో అంటే.. 2014 నుండి 2019 మధ్య కాలంలో కూడా ఇలాగే పెద్ద ఎత్తున దొంగ ఓట్లను చేర్చారని, ఇప్పుడు తమ పార్టీకి అండగా నిలిచే ఓటర్లను లక్ష్యంగా చేసుకుని జాబితా నుండి తొలగిస్తున్నారని వైసీపీ ఆరోపిస్తున్నది.
పైకి వైసీపీతోనూ, జగన్ కోటరీతోనూ విసిగిపోయానని, అందుకే బయటకు వచ్చేశాననీ విజయసాయి చెబుతున్నా.. ఆయన మాటలూ చేతలూ అన్ని జగన్ కు ప్రయోజనం చేకూర్చడానికే అన్నట్లుగా ఉంటాయి. ఉంటున్నాయి.
విశాఖపట్నం పరిపాలన రాజధాని అన్న జగన్ విధానాన్ని ధర్మాన బలంగా ప్రజలలోకి తీసుకువెళ్లడానికి శతధా ప్రయత్నించారు. ఉత్తరాంధ్ర సెంటిమెంట్‌ను రగిలిస్తూ, గ్రామగ్రామాన సభలు, సమావేశాలు ఏర్పాటు చేసి ప్రచారం చేశారు. అదేమీ ఫలించలేదని 2024 ఎన్నికల ఫలితాలు తేల్చేశాయి.
వైసీపీ కోసం ఎంతగానో పరితపించిన ముద్రగడ.. కాపు రిజర్వేషన్ కోసం, కాపుల కోసం పోరాటం చేసి సంపాదించుకున్న ప్రాముఖ్యతనూ, ప్రతిష్టనూ..జగన్ కోసం ఔను కేవలం జగన్ కోసం వదులుకున్నారు. అటువంటి ముద్రగడ తీవ్ర అనారోగ్యంతో బాధపడుతూ వెంటిలేటర్ పై చికిత్స పొందుతుంటే…జగన్ ఆయనను కనీసం పరామర్శించను కూడా పరామర్శించలేదు.
ఎన్నికల్లో ఘోర పరాజయంతో కేవలం 11 సీట్లకు పరిమితమైన తర్వాత, సరికొత్తగా మావిగన్ రాగం అందుకున్నారని విమర్శించారు.
పైపెచ్చు.. జిల్లాకు చెందిన పలువురు ముఖ్య నాయకులు జగన్ పాల్గొన్న కార్యక్రమాలకు ముఖం చాటేశారు. కొందరైతే తూతూమంతరంగా అలా వచ్చి, ఇలా వెళ్లిపోయారు.
ఆలా కిందపడిపోయిన పోలీసులు  ఆ తరువాత కల్వకుంట్ల కవితతో దురుసుగా వ్యవహరించిన తీరు పట్ల సర్వత్రా నిరసన వ్యక్తం అవుతోంది.  కవితను పోలీసులు  పోలీస్ వాహనంలోకి దురుసుగా నెట్టేయడం సరికాదన్న భావన సర్వత్రా వ్యక్తం అవుతున్నది.
ఆంధ్రప్రదేశ్ రాజకీయం ఎల్లప్పుడూ అత్యంత ఆసక్తికరమైన సంక్లిష్టమైన మలుపులకు వేదికగా నిలుస్తుంది.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.