పారిశ్రామికవేత్తలు పారిపోతున్నారు... జగన్ తీరుపై మరో పత్రిక సంచలన కథనం...

Publish Date:Feb 10, 2020

Advertisement

ఏపీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి తీరుపైనా, ప్రభుత్వ విధానాలపైనా విమర్శల వర్షం కురుస్తూనే ఉంది. కియా తరలిపోతోందంటూ కియాపై రాయిటర్స్ రాసిన కథనంతో రాష్ట్రంలో కల్లోలం చెలరేగగా, ఇఫ్పుడు మరో ప్రముఖ వార్తా సంస్థ ప్రచురించిన ఆర్టికల్ మరింత కలవరం రేపుతోంది. జగన్మోహన్ రెడ్డి తీసుకుంటున్న రివర్స్ నిర్ణయాలతో పెట్టుబడిదారులను భయభ్రాంతులకు గురిచేస్తోందని ది ఎకనమిక్ టైమ్స్ సంచలన కథనం ప్రచురించింది. జగన్ విధానాలను ఒక రేంజులో ఏకిపారేసింది. జగన్ తీరుతో కొత్తగా పెట్టుబడిదారులు ఇన్వెస్ట్ మెంట్స్ పెట్టేందుకు జంకుతుండగా... ఆల్రెడీ పెట్టుబడి పెట్టిన పారిశ్రామికవేత్తలు రాష్ట్రం వదిలి పారిపోతున్నారంటూ డేరింగ్ కథనం ప్రచురించింది. రివర్స్ స్వింగ్ పేరుతో రాసిన ఆర్టికల్లో జగన్ ప్రభుత్వ తీరును తీవ్రస్థాయిలో ఎండగట్టింది.

కేంద్ర వాణిజ్యశాఖ, ప్రపంచబ్యాంక్, సింగపూర్ నేషనల్ యూనివర్శిటీ సర్వేల ప్రకారం చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం పెట్టుబడులకు వాణిజ్యానికి అనుకూలందని, అయితే... జగన్మోహన్ రెడ్డి సీఎం పగ్గాలు చేపట్టాక... వైసీపీ ప్రభుత్వం తీసుకుంటోన్న రివర్స్ నిర్ణయాలతో పెట్టుబడిదారులు భయపడిపోతున్నారని కథనంలో తెలిపింది. జగన్ నిర్ణయాలతో ప్రస్తుత, భవిష్యత్ పెట్టుబడుదారులకు ముప్పు ఏర్పడిందంటూ విశ్లేషించింది. విండ్ అండ్ సోలార్ పవర్ టారిఫ్ ల పునసమీక్ష... పలు ఇన్ఫ్రా ప్రాజెక్టుల రద్దు... ఆయా కంపెనీలకు కేటాయించిన భూములను వాపస్ తీసుకోవడంలాంటి నిర్ణయాలతో ప్రమాదకర సంప్రదాయానికి జగన్ శ్రీకారం చుట్టారని కథనంలో రాసుకొచ్చింది. ఏపీలో పెట్టుబడులు పెట్టాలనుకున్నందుకు చాలా పశ్చాత్తాపడుతున్నామని అతిపెద్ద సోలార్ విద్యుదుత్పత్తి సంస్థ అక్మె సోలార్ హోల్డింగ్స్ వ్యాఖ్యానించడాన్ని ప్రస్తావించింది. 

ఇక, కియా తరలిపోతోందంటూ రాయిటర్స్ రాసిన కథనం తర్వాత అలాంటిదేమీ లేదంటూ ఇటు రాష్ట్ర ప్రభుత్వం.... అటు కియా యాజమాన్యం ఖండించినా... జగన్ ప్రభుత్వానికి-కియా కంపెనీకి మధ్య ఘర్షణ వాతావరణం ఉన్నమాట మాత్రం వాస్తవమని... అయినా నిప్పు లేనిదే పొగ రాదు కదా అంటూ అభిప్రాయపడింది.

మరోవైపు, పీపీఏల రద్దు దిశగా జగన్ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంతో రాష్ట్ర డిస్కములపై పెద్దఎత్తున రుణభారం పడుతుందని విశ్లేషించింది. ఆయా విద్యుదుత్పత్తి సంస్థలకున్న బకాయిలతో కలిపి 21వేల కోట్ల రూపాయల రుణభారం డిస్కములపై పడుతుందని తెలిపింది. అయితే, ఇలా ఒప్పందాలను రద్దు చేసుకుంటూపోతే పెట్టుబడిదారుల్లో విశ్వాసం సన్నగిల్లుతుందని... ఇప్పుడు పీపీఏలపై పునసమీక్షించిన ప్రభుత్వం... ముందుముందు మిగతా రంగాల్లో జరగొచ్చని, ఇది ఆంధ్రప్రదేశ్ కు మంచిది కాదంటూ అభిప్రాయపడింది. మొత్తానికి జగన్ ప్రభుత్వంపై జాతీయ అంతర్జాతీయ వార్తా సంస్థలు ప్రచురిస్తోన్న కథనాలు ఏపీలో ప్రకంపనలు సృష్టిస్తున్నాయి. ముఖ్యంగా ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి తీరును... అలాగే, ప్రభుత్వ విధానాలను ఎండగడుతూ కథనాలు ప్రచురించడం కలకలం రేపుతున్నాయి.

By
en-us Political News

  
అమరావతి రైతులు.. మళ్లీ అరసవల్లి యాత్రకు బయలుదేరనున్నారు. శనివారం (ఏప్రిల్ 1 ప్రత్యేక బస్సుల్లో రాజధాని ప్రాంతంలోని తుళ్లూరు శిబిరం నుంచి రైతులు, మహిళలు అరసవల్లికి బయలుదేరుతున్నారు. ఆ క్రమంలో రైతులు అమరావతి నుంచి అరసవల్లి వరకు చేపట్టిన పాదయాత్రలో వెంట తీసుకు వెళ్లిన శ్రీవారి రథానికి ప్రత్యేక పూజలు నిర్వహించనున్నారు.
ఇంత కాలం కేంద్ర దర్యాప్తు సంస్థలే కేంద్రం పంజరంలో చిలుకగా మారిపోయాయని అనుకున్నాం. అయితే ఇప్పుడు కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ ఏకంగా ప్రాంతీయ పార్టీలనే బంధిత పార్టీలు (captive parties)గా మార్చేసుకుందా? అంటే ఔననే అంటున్నారు సీపీఐ జాతీయ నాయకుడు నారాయణ.
తమిళుల భాషాభిమానం గురించి కొత్తగా ఇప్పుడు చెప్పాల్సిన అవసరం లేదు. తమిళ ప్రజలు దేన్నైనా సహిస్తారు కానీ, మాతృ భాషకు అవమానం జరిగితే ఊరుకోరు. మాతృ భాషకు అవమానమనే కాదు, జాతీయ భాష హిందీ డామినేషన్ ను సైతం ఇసుమంతైనా సహించరు. అలా తమిళ భాషకు ఏ చిన్న అవమానం జరిగినా వెంటనే తమిళ జనం రోడ్డు ఎక్కేస్తారు.
కేంద్రం, రాష్ట్రాల మధ్య పెరుగుపై నెలకొన్న వివాదానికి ఎట్టకేలకు తెరపడింది. ముఖ్యంగా అసెంబ్లీ ఎన్నికలు జరగబోతున్న కర్నాటక రాష్ర్టం నుంచి వ్యక్తమైన తీవ్ర వ్యతిరేకత కారణంగా కేంద్రంలోని మోడీ సర్కార్ దిగి వచ్చింది. పెరుగుకు హిందీ పదం దహీకి బదులుగా కర్డ్ అని వాడుకోవచ్చని కేంద్ర ఆహార భద్రతా ప్రమాణాల సంస్థ అనుమతి ఇచ్చింది.  రాష్ట్రాల నుంచి దహీ అన్న పేరుకు తీవ్ర వ్యతిరేకత రావడంతో  కేంద్రం దిగిరాక తప్పలేదు.
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నోటితో చెప్పేదొకటి.. చేతల్లో చేసేదొకటి. గత నాలుగేళ్లుగా ఆయన పాలన సాగిస్తున్న విధం ఇదే. ఇప్పుడు తాజాగా పార్టీ సర్కిల్స్ లో మంత్రివర్గ పునర్వ్యవస్థీకరణపై పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది. ఇప్పుడ ఇహనో ఆయన కేబినెట్ రీషఫుల్ చేస్తారనీ, కొత్తగా నలుగురైదుగురికి కేబినెట్ లోకి తీసుకుంటారనీ పార్టీ వర్గాలు గట్టిగా చెబుతున్నాయి. అదే సమయంలో కొందరికి ఉద్వాసన తప్పదనీ అంటున్నారు.
కొడలి నాని, మాజీ మంత్రి, గుడివాడ ఎమ్మెల్యే కొడాలి నాని మళ్లీ తన బూతుల పంచాంగం దుమ్ము దులిపారు. మంత్రిగా ఉన్న సమయంలో నిత్యం విపక్ష నేతపై విమర్శలతో విరుచుకుపడిన నాని.. మంత్రి పదవి నుంచి ఉద్వాసనకు గురయ్యాకా.. తన వాగ్ధాటికి కొంత బ్రేక్ వేశారు.
తెలంగాణ స్కూళ్లకు ఏప్రిల్ 25 నుంచి వేసవి సెలవలను రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించింది. ఏప్రిల్ 25 నుంచి జూన్ 11 వరకూ రాష్ట్రంలోని విద్యాసంస్థలకు వేసవి సెలవులు ప్రకటిస్తే విద్యాశాఖ ఉత్తర్వులు జారీ చేసింది.
వేదంలా ఘోషించే గోదావరి... అమర ధామంలా శోభిల్లే రాజమహేంద్రి... శతాబ్దాల చరితగల సుందర నగరం .. గత వైభవ దీప్తులతో కమ్మని కావ్యం.. అలాంటి రాజమహేంద్రవరం మహానగరం పసుపు శోభ సంతరించుకోనుంది.
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్ ముచ్చటగా మూడోసారి తన కేబినెట్‌ పునర్వ్యవస్థీకరణకు సిద్ధమయ్యారా? అంటే ఔననే అంటున్నారు పరిశీలకులు. ఇందుకోసం ముహూర్తం కూడా ఖరారైందని అందుకే ఇటీవల గవర్నర్ అబ్దుల్ నజీర్‌తో భేటీ అయ్యారనీ, ఆ భేటీలో మంత్రివర్గ పునర్వ్యవస్థీకరణ గురించే ఆయనతో చర్చించారనీ అంటున్నారు. రేపో మాపో..ఇంకా స్పష్టంగా చెప్పాలంటే మార్చి 31 లేదా ఏప్రిల్ మొదటి వారంలో జగన్ కేబినెట్ పునర్వ్యవస్థీకరణ ఉంటుందని చెబుతున్నారు.
రౌడీయిజం, ఫ్యాక్షనిజంలో కక్షలు కార్పణ్యాలు ఉంటాయి. అందులోనూ రాయలసీమ రాజకీయాల్లో ఫ్యాక్షనిజం గురించి ప్రత్యేకంగా చెప్పవలసిన అవసరం లేదు. అది అభిలషణీయం కాదు. అయినా అదొక రకం. ఇప్పుడు విషయం అది కాదు. ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వం ఉపాధ్యాయులపై కక్ష సాధింపు కోసం విద్యార్థుల ప్రాణాలతో చెలగాటమాడుతోందని, రేపల్లె ఎమ్మెల్యే అనగాని సత్యప్రసాద్‌ ఆరోపిస్తున్నారు.
రాష్ట్ర విభజన తర్వాత, ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో ఏదైనా అభివృద్ధి జరిగిందంటే, అది తెలుగు దేశం పార్టీ అధికారంలో ఉన్న తొలి ఐదేళ్లలోనే జరిగింది. అలాగే రాష్ట్రానికి పెట్టుబడులు, పరిశ్రమలు, ఉద్యోగ, ఉపాధి అవకాశాలు వచ్చాయన్నా, అదీ ఆ ఐదేళ్ల కాలంలోనే అంటే చంద్రబాబు హయాంలోనే. ఇందులో మరో అభిప్రాయానికి తావు లేదు.
కాంగ్రెస్ మాజీ అధ్యక్షుడు రాహుల్‌ గాంధీపై అనర్హత వేటు నేపథ్యంలో ఖాళీ అయిన కేరళలోని వయనాడ్ లోక్‌సభ నియోజకవర్గం ఉపఎన్నిక ఎప్పుడు జరుగుతుంది? ఉప ఎన్నిక జరిగితే కాంగ్రెస్ పార్టీ తరపున ఎవరు పోటీ చేస్తారు? అనే విషయంలో ఢిల్లీ రాజకీయ వర్గాల్లో ఆసక్తి కర చర్చ జరుగుతోంది.
14వ ఆర్థిక సంఘం ప్రత్యేక కేటగిరీ హోదా రాష్ట్రాలు, సాధారణ కేటగిరీ రాష్ట్రాల మధ్య వివక్ష చూలేదు కనుకే అందుకే ప్రత్యేక కేటగిరీ హోదా స్థానంలో ఆంధ్రప్రదేశ్ కు ప్రత్యేక ఆర్థిక ప్యాకేజీని కేటాయించినట్టు కేంద్ర స్పష్టం చేయడం ఏపీకి ఏవిధంగా నైనా షాకింగ్ న్యూస్ కాదు.. గత కొన్నేళ్లుగా కేంద్ర చెబుతునన మాట ఇదే.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.