ఎపిలో పించన్ల పంపిణీ పట్ల  కేంద్రఎన్నికల సంఘం అసంతృప్తి 

Publish Date:Apr 27, 2024

Advertisement

పించన్ల పంపిణీ విషయంలో జగన్ ప్రభుత్వం అనుసరిస్తున్న విధానాల పట్ల కేంద్ర ఎన్నికల సంఘం అసంతృప్తి వ్యక్తం చేసింది. ఈ మేరకు తగిన మార్గదర్శకాలను సూచించింది
పింఛన్ దారులకు ఇబ్బంది లేకుండా సకాలంలో పెన్షన్లను అందించాలని ఏపీ ప్రభుత్వానికి కేంద్ర ఎన్నికల సంఘం ఆదేశాలు జారీ చేసింది. ఎన్నికల కోడ్ అమల్లో ఉన్న నేపథ్యంలో లబ్ధిదారులకు ఇబ్బంది లేకుండా చూడాలని ఆదేశించింది. పింఛన్ సహా, నగదు బదిలీ పథకాలకు సంబంధించి మార్చి 30న జారీ చేసిన మార్గదర్శకాలను పాటించాలని సూచించింది. తమ మార్గదర్శకాలను వాస్తవిక దృష్టితో ఆలోచించి అమలు చేయాలని సీఎస్ జవహర్ రెడ్డికి స్పష్టం చేసింది. పెన్షన్ల పంపిణీకి శాశ్వత ఉద్యోగులకు మాత్రమే వినియోగించుకోవాలని ఎన్నికల సంఘం స్పష్టం చేసింది. ఇంటింటికీ పెన్షన్లను పంపిణీ చేసేందుకు వాలంటీర్లకు ప్రత్యామ్నాయంగా ప్రభుత్వ ఉద్యోగులను వినియోగించుకోవాలని ఆదేశించింది. పింఛన్ల పంపిణీ విషయంలో ప్రభుత్వం అనుసరిస్తున్న తీరుపై చాలా ఫిర్యాదులు వచ్చాయని తెలిపింది. లబ్ధిదారులు కూడా చాలా ఇబ్బందులకు గురైనట్టు తమ దృష్టికి వచ్చిందని వెల్లడించింది. శాశ్వత ఉద్యోగులు, ఎలక్ట్రానిక్ విధానాల ద్వారా ఎలాంటి ఇబ్బందులు లేకుండా పంపిణీ చేయవచ్చని గత మార్గదర్శకాల్లోనే సూచించామని తెలిపింది.

By
en-us Political News

  
జగన్ ఎలా తయారయ్యాడంటే, తన విషయంలో ఏది జరిగినా దాని వెనుక వున్నది చంద్రబాబే. జగన్‌కి నరాల వీక్నెస్ వచ్చినా దానికి కారణం చంద్రబాబే. ఎంచక్కా బాబాయ్‌ని పైకి పంపేసి, ఆ నేరాన్ని చంద్రబాబు నెత్తిన వేశాడు.
ఆంధ్రప్రదేశ్ లో పోలింగ్ సరళి ఎలా ఉండబోతోందో పోస్టల్ బ్యాలెట్ ఓటింగ్ తీరు తేల్చి చెప్పేసింది. ఏపీలో ప్రభుత్వోద్యోగులు, టీచర్లు మున్నెన్నడూ ఎరుగని విధంగా ఓ విధమైన కసితో పోస్టల్ బ్యాలెట్ ను ఉపయోగించుకున్న తీరు ప్రభుత్వంపై వారి వ్యతిరేకత, ఆగ్రహం ఏ స్థాయిలో ఉందో తేటతెల్లం చేసింది.
ఎన్నికల పండగ వచ్చింది.. హైదరాబాద్ ఖాళీ అవుతుంది..! ఎప్పుడూ పండగల సమయంలో ఖాళీ అయ్యే హైదరాబాద్ ఈసారి ఎన్నికల నేప‌థ్యంలో ఖాళీ అవుతోంది. డిమాండ్ ను దృష్టిలో పెట్టుకొని ప్రైవేట్ బస్సు టికెట్ల ధరలు ఆకాశాన్నంటేస్తున్నాయి. దసరా, దీపావళి, సంక్రాంతి లాంటి పండగలకు పెంచే దానికంటే అధికంగానే ఉన్నాయి టికెట్ ధరలు. ఒక్కో టికెట్ రెండు వేల రూపాయ‌ల నుంచి మూడు వేల రూపాయ‌ల ధ‌ర వ‌సూలు చేస్తున్నారు.
ఈ నెల 13న ఏపీలో అసెంబ్లీ, లోక్ సభ ఎన్నికలు జరగనున్నాయి. ఈ నేపథ్యంలో, హైదరాబాద్ నుంచి ఆంధ్ర ప్రదేశ్ వాస్తవ్యులు  భారీ ఎత్తున సొంత రాష్ట్రం ఏపీకి తరలివస్తున్నారు. ఆంధ్రప్రదేశ్ లోని స్వగ్రామాలకు, సొంత పట్టణాలకు తరలివస్తున్న వారితో హైదరాబాద్ నుంచి వస్తున్న బస్సులు క్రిక్కిరిసి ఉంటున్నాయి
అమ్మా న్యాయం చేయండి.. ఐదేళ్లుగా అక్కాచెల్లెళ్లు న్యాయం కోసం పోరాడుతున్నారు.. మ‌న తెలుగు సాంప్ర‌దాయం ప్ర‌కారం ఆడ బిడ్డ‌లు పుట్టింటికి వ‌స్తే చీర‌సారె పెట్టి పంపిస్తారు.. మీ ఆడ బిడ్డ‌లు పుట్టింటికి వ‌చ్చి చీర‌సారె అడ‌గ‌డం లేదు.. కొంగు చాపి న్యాయం అడుగుతున్నారు.
జగన్ బటన్ నొక్కుడు బండారం సందేహాలకు అతీతంగా బట్టబయలైపోయింది. ఎన్నికల లబ్ధి కోసమే ఆయన బటన్ నొక్కుడు వ్యవహారం అంతా సాగిందని సామాన్యులకు కూడా అర్ధమైపోయింది. ప్రభుత్వ ఖర్చుతో ఎన్నికల ప్రచారం నిర్వహించుకునే వ్యూహంతోనే ఈ ఏడాది జనవరి నుంచి మార్చి వరకూ బటన్ నొక్కుడు సభలు నిర్వహించారని తేటతెల్లమైపోయింది.
మెగా పవర్ స్టార్ పవన్ కల్యాణ్ తన బాబాయ్ కోసం పిఠాపురం వెళ్లనున్నారు. తన తల్లి సురేఖతో కలిసి ఆయన శనివారం పిఠాపురం వెడుతున్నారు. ఆయన నేరుగా పవన్ కల్యాణ్ కు మద్దతుగా ప్రచారం చేయరు. ఆయన తన తల్లితో కలిసి కుక్కుటేశ్వరస్వామి దేవాలయంలో ప్రత్యేక పూజలు నిర్వహిస్తారు.
తిరుమలలో భక్తుల రద్దీ స్వల్పంగా పెరిగింది. శనివారం (మే 11) ఉదయం శ్రీవారి దర్శనం కోసం వేచి ఉన్న భక్తులతో 31 కంపార్ట్ మెంట్లు నిండిపోయాయి.
ఒక దుర్మార్గుడు పాలకుడై రైతుల జీవితాలతో ఆడుకుంటుంటే, ఆ దుర్మార్గుడిపై తిరగబడి, రైతులు సాధించిన విజయం ఈ చిత్రం. 
ఆమ్ ఆద్మీ పార్టీ జాతీయ కన్వీనర్, ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్‌కి బెయిల్ లభించిన నేపథ్యంలో ఆయన తీహార్ జైల్ నుంచి విడుదలయ్యారు.
మాచర్ల నియోజకవర్గ ప్రజలను పలకరించడానికి చంద్రబాబు వెళ్ళాలని అనుకున్నారు. అయితే అనుకోకుండా భారీ వర్షం కురవడం వల్ల చంద్రబాబు మాచర్ల పర్యటన రద్దు చేసుకోవలసి వచ్చింది.
వైసీపీకి ఓటు వేయకపోతే చెప్పుచ్చుకుని కొడతానని అద్దంకి అసెంబ్లీ నియోజకవర్గం నుంచి వైసీపీ అభ్యర్థిగా పోటీ చేస్తున్న పాణెం హనిమిరెడ్డి నియోజకవర్గంలోని ప్రజలకు వార్నింగ్ ఇచ్చారు
ఎన్నికలకు ఇంకా రెండు రోజుల సమయం మాత్రమే ఉంది.రాజకీయ నాయకులంతా ప్రచారాల్లో నిమగ్నమయ్యారు. ఇన్ని రోజులు మండుటెండలో ప్రచారం సాగించిన నేతలు ఇప్పుడు అకాల వర్షాలతో సతమతమవుతున్నారు. ఓ వైపు భహిరంగ సభలు, రోడ్​ షోలతో కార్యకర్తలు తీరిక లేకుండా ప్రజల మద్ధతు కూడగడుతుంటే వర్షం ప్రారంభమైంది.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.