ఆ ఓటమి ఓ పీడకల.. కపిల్ దేవ్

Publish Date:Aug 25, 2022

Advertisement

దేశంలో క్రికెట్ ఒక మతం.. సినిమా స్టార్లు, రాజకీయ నాయకులకు ఉన్న పాపులారిటీ కంటే.. మ్యాచ్ లో ఓ సెంచరీ చేసిన ఆటగాడికి రాత్రికి  రాత్రి వచ్చేసే పాపులారిటీ అంత కంటే ఎక్కువ.1983లో ఇంగ్లాండ్ లో జరిగిన ప్రుడెన్షియల్ వరల్డ్ కప్ ఫైనల్ లో అంతకు ముందు వరుసగా రెండు సార్లు వరల్డ్ చాంపియన్ గా నిలిచిన విండీస్ ను మట్టి కరిపించిన కపిల్ డెవిల్స్(భారత జట్టు) దేశంలో క్రికెట్ కు ఆదరణ  పెంచేసింది.

ఒక్క  సారిగా దేశంలో క్రికెట్ మానియా పెరిగిపోయింది. ఆ తరువాత నుంచి ఆడిన ప్రతి మ్యాచ్ లోనూ ఇండియానే గెలవాలి అని అభిమానులు ఆశించారు. అందుకు విరుద్ధంగా జరిగితే ఆగ్రహంతో రగిలిపోయేవారు. ఆటగాళ్ల  ఇళ్లపై దాడులకు దిగిన సంఘటనలూ ఉన్నాయి. అయితే  ఇవ్వన్నీ ఒకెత్తు.. దాయాది దేశం పాకిస్థాన్ తో జరిగే మ్యాచ్ ఒకెత్తులా మారిపోయింది. భారత్ - పాకిస్థాన్ మధ్య క్రికెట్ మ్యాచ్ అంటే రెండు జట్ల మధ్య మ్యాచ్ లా కాకుండా రెండు దేశాల మధ్య యుద్ధం అంత టెన్షన్ ఇరు దేశాల్లోనూ నెలకొని ఉంటుంది. ఆటగాళ్లలోనూ ఒక విధమైన తెలియని ఉద్వేగం నిండి ఉంటుంది.

ఇరు దేశాల మధ్యా సంబంధాల కారణంగా గత కొన్నేళ్ల నుంచీ ఇరు దేశాల మధ్యా సిరీస్ లు జరగడంలేదు. కానీ ఆసియాకప్, వరల్డ్ కప్ టోర్నమెంట్లలో మాత్రం ఇరు జట్లూ తలపడే అవకాశం మాత్రం లభిస్తోంది. ఇంగ్లాండ్- ఆస్ట్రేలియా జట్ల మధ్య జరిగే ‘యాషెస్’ సిరీస్ ను ప్రపంచ వ్యాప్తంగా ఉన్న క్రికెట్ అభిమానులంతా ఆసక్తిగా తిలకిస్తారు. ఆ సిరీస్ ఏదో ఇరు దేశాల ప్రతిష్టకూ సంబంధించిన అంశంగా పరిగణిస్తారు. అలాగే  ఇరు జట్లూ కూడా యాషెస్ గెలవడం కోసం సర్వశక్తులూ ఒడ్డి ఆడతాయి. అయితే  భారత్- పాకిస్థాన్ జట్ల మధ్య మ్యాచ్ అంటే యాషస్ ను మించిన ఉత్కంఠ ఉంటుంది. యాషస్ సీరీస్ ను మించిన ఆసక్తి ఉంటుంది.

ఇప్పుడు వరల్డ్ కప్ ముంగిట 1986 ఆసియాకప్ ఫైనల్ లో భారత్- పాకిస్థాన్ తలపడిన మ్యాచ్ గురించి గుర్తు చేసుకోవడం అప్రస్తుతం ఎంతమాత్రం కాదు. చివరి బంతి వరకూ అత్యంత ఉత్కంఠ భరితంగా సాగిన మ్యాచ్ గురించి అప్పటి భారత జట్టు కెప్టెన్ కపిల్ దేవ్ అదో పీడకల అన్నాడు. అసలింతకీ 1986లో ఆషియా కప్ ఫైనల్ మ్యాచ్ గురించి అప్పటి ఇండియన్ కెప్టెన్ కపిల్ దేవ్ ఏమన్నాడంటే.. గెలిచేశామనుకున్న మ్యాచ్ లో చివరి బంతికి పరాజయం పాలయ్యాం. అది నిజంగా నమ్మలేని సంఘటన. ఆ మ్యాచ్ గురించి తలుచుకుంటే నిద్ర పట్టదు. ఇప్పటి దాకా అలాంటి నిద్ర లేని రాత్రులెన్నో గడిపాను అంటాడు.

ఇంతకీ ఆ మ్యాచ్ లో ఏం జరిగిందంటే.. పాకిస్థాన్ గెలవాలంటే చివరి బంతికి నాలుగు చేయాలి. క్రిజ్ లో మియాందాద్ ఉన్నాడు. బౌలర్ చేతన్ శర్మ. చివరి బంతికి నాలుగు పరుగులు అంటే ఒక్క బౌండరీ చాలు. ఆ బౌండరీ ఇవ్వకూడదన్న పట్లుదలతో భారత జట్టు ఫీల్డింగ్ ను మోహరించింది. అయితే చివరి బంతికి సిక్సర్ కొట్టి మియాందాద్ భారత్ చేతుల్లోంచి మ్యాచ్ ను ఎగరేసుకు వెళ్లిపోయాడు. భారత జట్టులో నిరాశ, బాధ.. పాక్ శిబిరంలో సంబరాలు. చివరి బంతికి ఓటమిని కెప్టెన్ కపిల్ దేవ్, జట్టు సభ్యులు జీర్ణించుకోలేకపోయారు. కపిల్ అయితే చాలా ఏళ్ల వరకూ ఆ ఓటమి ఓ పీడకలలా వెంటాడిందని చెబుతాడు.  

By
en-us Political News

  
బీఆర్ఎస్ ప్రతిష్ఠాత్మకంగా నిర్వహించనున్న యువ సంగ్రామ సభకు తెలంగాణ హైకోర్టు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది.
ఢిల్లీలోని జంతర్ మంతర్ వేదికగా సోనమ్ వాంగ్ చుక్ నిరవధిక నిరశన సాగుతోంది. గత 20 రోజులుగా ఆయన నిరాహార దీక్ష చేస్తుండటంతో.. ఆరోగ్య పరిస్థితి క్రమంగా క్షీణిస్తోందని వైద్య వర్గాలు తెలిపాయి. ఆరోగ్యం క్షీణిస్తున్న నేపథ్యంలో, దేశవ్యాప్తంగా ప్రజల్లో, సామాజిక మాధ్యమాల్లోఆయనకు మద్దతు అనూహ్యంగా పెరిగింది.
తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సోనమ్ వాంగ్ చుక్ తో భేటీకి హస్తిన పర్యటనకు సిద్ధమవుతున్నట్లు తెలుస్తోంది. నేడో రేపో రేవంత్ రెడ్డి దిల్లీకి చేరుకుని, జంతర్ మంతర్ వద్ద దీక్ష చేస్తున్న సోనమ్ వాంగ్‌చుక్‌ను స్వయంగా కలిసి సంఘీభావం ప్రకటించనున్నారని కాంగ్రెస్ లో అత్యంత విశ్వసనీయవర్గాల ద్వారా తెలుస్తోంది.
ఆంధ్రప్రదేశ్ రాజకీయాలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ (YCP) ప్రస్తుతం తీవ్రమైన వ్యూహాత్మక అయోమయంలో కొట్టుమిట్టాడుతోంది.
ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో జూనియర్ ఎన్టీఆర్ (తారక్) రాజకీయ అరంగేట్రం గురించిన చర్చ
అమర్ రాజాకు కాలుష్య నియంత్రణ మండలి నిబంధనల పేరుతో నోటీసులు ఇవ్వడం, విద్యుత్ కనెక్షన్లు కట్ చేయడం వంటి చర్యలతో నాటి ప్రభుత్వం ఎలా ఇబ్బందులకు గురి చేసిందో.. పారిశ్రామిక వర్గాలు గుర్తుచేసుకుంటున్నాయి. ఏపీలో పుట్టి పెరిగిన ఒక ప్రతిష్టాత్మక సంస్థ, తన భవిష్యత్తు విస్తరణ, వృద్ధి ప్రస్థానం కోసం రాష్ట్రం దాటి వెళ్లాల్సిరావడంపై సర్వత్రా ఇప్పుడు మరోసారి చర్చ మొదలైంది.
వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధికారిక డిజిటల్ వేదికగా రూపొందించిన జగన్ 2.0 సూపర్‌యాప్‌ను వైసీపీ అధినేత జగన్‌ గురువారం తాడేపల్లిలోని పార్టీ కేంద్ర కార్యాలయంలో ఆవిష్కరించారు.
భీమవరం, కిర్లంపూడి లలో పర్యటించారు. రెండు చోట్లా కూడా గందరగోళ పరిస్థితులు నెలకొన్నాయి. ప్రజలలో పట్టు నిరూపించుకోవడానికి ఆయన చేపట్టిన ఏ పర్యటన అయినా సరే.. ఉద్రిక్తతలు, గందరగోళం మధ్యే సాగుతున్నాయి.
కిర్లంపూడి పోలీస్ స్టేషన్‌లో ఆయనతో పాటు మరికొందరు  వైసీపీ నేతలపై  పోలీసులు  ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. ప్రభుత్వ నిబంధనల ప్రకారం విధుల్లో ఉన్న పోలీసు సిబ్బందిని అడ్డుకుని, వారిపై భౌతిక దాడికి దిగారనే ఆరోపణలపై ఈ చర్యలు తీసుకున్నారు. 
రేవంత్ రెడ్డి ప్రభుత్వానికి కౌశిక్ రెడ్డి ఒక ఛాలెంజ్ విసిరారు. కన్నెపల్లి పంప్ హౌస్ ద్వారా నీటిని వెంటనే ఎత్తిపోయాలని, ఆ నీటిని అన్నారం, సుందిళ్ల బ్యారేజీల మీదుగా ఎల్లంపల్లికి తరలించాలని డిమాండ్ చేశారు. ఒకవేళ ఆ విధంగా నీటిని ఎత్తిపోసే ప్రక్రియలో అన్నారం లేదా సుందిళ్ల బ్యారేజీలకు ఏవైనా నష్టాలు లేదా ప్రమాదాలు జరిగితే, దానికి పూర్తి బాధ్యత తమదేనన్నారు.
ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి కొణిదెల పవన్ కల్యాణ్.. ముద్రగడ సమాజానికి చేసిన సేవలను గుర్తించి ఈ గౌరవాన్ని కల్పించాలని నిర్ణయించారు. ఈ మేరకు అంత్యక్రియల ఏర్పాట్లను పర్యవేక్షించాలని, అన్ని రకాల ప్రభుత్వ మర్యాదలు లోటు లేకుండా చూడాలని ఉన్నతాధికారులను ప్రభుత్వం ఆదేశించింది.
ల్పపీడన ప్రభావంతో జులై మూడో వారంలో దేశవ్యాప్తంగా వర్షాలు మళ్లీ ఊపందుకోనున్నాయి. ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్, తెలంగాణతో పాటు మధ్య భారతదేశం, తూర్పు రాష్ట్రాలలో విస్తారంగా వర్షాలు కురుస్తాయని భారత వాతావరణ శాఖ పేర్కొంది.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.