తలైవి.. రాజకీయ శివంగి..

Publish Date:Mar 24, 2021

Advertisement

'తలైవా' అంటే రజనీకాంత్ అని చాలామందికి తెలుసు. మరి, 'తలైవి' అంటే? "తలైవి" ఈ పేరు ఇప్పుడు కోలివుడ్ సిల్వర్ స్క్రీన్‌పై సంచలనం. తమిళనాడు రాజకీయాల్లో ప్రకంపణం. 'పురచ్చితలైవి'గా ఖ్యాతిగాంచిన జయలలిత పొలిటిక్ స్టోరీనే ఈ తలైవి సినిమా. ఏప్రిల్ 23న రిలీజ్. తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల తర్వాతే విడుదల. ఇప్పటికే రిలీజ్ అయిన ట్రైలర్.. తమిళ పాలిటిక్స్‌లో ప్రకంపణలు సృష్టిస్తోంది. 'అమ్మ'ను మరోసారి గుర్తు చేస్తోంది. 

జస్ట్ 3 నిమిషాల ట్రైలర్. ఆడపులి జయలలిత రాజకీయ ప్రస్థానంలోని అనేక కోణాలను టచ్ చేస్తోంది. సినీ రంగం నుంచి సీఎం సీటు వరకూ జయ చేసిన పోరాటాన్ని, ఆరాటాన్ని, అవమానాన్ని, అందలాన్ని.. అన్నిటినీ టచ్ చేసింది తలైవి ట్రైలర్. ఈ మూడు నిమిషాలు.. ఆరుసార్లు ముఖ్యమంత్రిగా చేసిన జయలలిత పాలనను గుర్తుకు చేసింది. ఇక మూడు గంటల సినిమాలో.. 40 ఇయర్స్ పొలిటికల్ ఇండస్ట్రీ ఎపిసోడ్ మొత్తం కళ్లకు కట్టడం ఖాయం. 

కంగనా రనౌత్. బాలీవుడ్ ఫైర్ బ్రాండ్. జయలలిత లీడ్ రోల్‌లో రచ్చ రచ్చ చేసింది. ఫిజికల్ పర్సనాలిటీలో సరిపోలక పోయినా.. ఆటిట్యూడ్, అగ్రెసివ్‌నెస్‌లో అచ్చం అచ్చు గుద్దినట్టు జయలలితను గుర్తు చేసింది. ఆనాడు తమిళనాడు అసెంబ్లీలో ప్రతిపక్ష నేత జయలలితకు జరిగిన దుశ్శాసన పర్వాన్ని మరోసారి ఈ తరం ప్రేక్షకుల ముందు సాక్షాత్కరింపజేశారు. అసెంబ్లీలో జయలలిత చీర లాగే సీన్‌లో కంగనా నటన అద్భుతం. ట్రైలర్‌లోనే ఆ సీన్ అంత బీభత్సంగా పండితే.. ఇక సినిమాలో మరింత సెన్సేషనలే. ఎమ్జీఆర్ అంతిమయాత్ర సమయంలో జయలలితకు జరిగిన అవమానాన్ని కూడా ట్రైలర్‌లో చూడొచ్చు. ఎమ్జీఆర్ పార్థీవదేహం దగ్గర నుంచి జయలలితను లాగి పారేసే ఘటన.. ట్రైలర్‌లో చూపించారు. 

జయలలిత సినిమా కెరీర్.. ఎమ్జీఆర్‌తో సన్నిహితం, సాన్నిహితం.. ఏఐఏడీఎంకేలో ఎంట్రీ.. ఎమ్జీఆర్ మరణం.. సీఎంగా సంచలనం.. ఇలా జయలలిత జీవితంలోని అన్ని యాంగిల్స్‌తో ఫుల్లీ ప్యాక్డ్ పవర్‌ఫుల్ మూవీగా ఉండనుంది తలైవి. ట్రైలర్ చూస్తే ఆ విషయం స్పష్టమవుతోంది. "మహా భారతానికి మరో పేరు జయ" అనే డైలాగ్ అదుర్స్. "నన్ను అమ్మగా చూస్తే నా హృదయంలో మీకు చోటుంటుంది. నన్ను కేవలం ఒక ఆడదానిగా చూస్తే.." అనే ఇన్‌కంప్లీట్ డైలాగ్‌తో ట్రైలర్‌ను ఎండ్ చేయడం ట్రైలర్‌కే హైలైట్.

తమిళనాడులో అసెంబ్లీ ఎన్నికలకు పట్టుమని పది రోజుల సమయం కూడా లేదు. ఈ టైమ్‌లో "తలైవి" ట్రైలర్ రాజకీయంగా దుమారం రేపుతోంది. ఇది ఎన్నికలను ప్రభావితం చేసే అవకాశముందని ప్రతిపక్ష పార్టీలు అభ్యంతరం చెబుతున్నాయి. అధికార అన్నాడీఎంకేకి తలైవి అనుకూలం కానుంది. తమిళనాట ఏఐఏడీఎంకే, బీజేపీలు కలిసి పోటీ చేస్తుండటం.. బీజేపీ సానుభూతిపరురాలిగా ముద్ర ఉన్న కంగనా రనౌత్ నటించడం.. ఎన్నికల వేళ 'పురచ్చితలైవి'ని తమిళ ప్రజలకు గుర్తు చేసేలా కీలక సమయంలో తలైవి ట్రైలర్ రిలీజ్ చేయడం.. అంతా అధికార పార్టీ పొలిటికల్ స్ట్రాటజీలో భాగమేనంటున్నారు విమర్శకులు. తలైవి.. జస్ట్ 3 నిమిషాల సినిమా ట్రైలరే అయినా.. అది జయలలిత జీవిత గాధ అవటం.. అది రిలీజ్ అయిన సమయం, సందర్భం.. తమిళనాడు అసెంబ్లీ ఎన్నికలను విశేషంగా ప్రభావితం చేయనుంది. తలైవినా.. మజాకా... 

By
en-us Political News

  
రాయలసీమ అభివృద్ధిపై ప్రతిపక్ష నేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డిని తీవ్రస్థాయిలో ఎండగట్టారు మంత్రి నారా లోకేష్. గత ఐదేళ్లలో సీమ ప్రాజెక్టులను నిర్లక్ష్యం చేస్తూ జగన్ ఈ ప్రాంతానికి క్యాన్సర్ గడ్డలా మారారని విమర్శించారు.
ప్రముఖ రాజకీయ విశ్లేషకుడు ప్రొఫెసర్ కె. నాగేశ్వర్‌పై ఆంధ్రప్రదేశ్‌లో కేసు నమోదైంది. టీవీ డిబేట్‌లో కేంద్ర హోంమంత్రి అమిత్ షా, ఏపీ డిఫ్యూటీ సీఎం పవన్ కల్యాణ్‌లపై చేసిన వివాదాస్పద వ్యాఖ్యల నేపథ్యంలో జనసేన ఫిర్యాదుతో పోలీసులు ఈ చర్య తీసుకున్నారు.
నెల్లూరు జిల్లాలో నిర్వహించనున్న 2026 మహానాడును స్త్రీ శక్తి థీమ్‌తో నిర్వహించాలని టీడీపీ పొలిట్‌బ్యూరో నిర్ణయించింది.
నెల్లూరు జిల్లా ఆత్మకూరు టీడీపీ ఎమ్మెల్యే, మంత్రి ఆనం రామనారాయణరెడ్డికి వ్యతిరేకంగా సొంత పార్టీ సీనియర్ నేతలే కూటమి కట్టడం హాట్ టాపిక్‌గా మారింది.
గత కొంత కాలంగా ప్రదాని నరేంద్ర మోడీ తన మంత్రివర్గ పునర్వ్యవస్థీకరణపై కసరత్తు చేస్తున్నారు. కేబినెట్ లో పనితీరు సరిగా లేని వారికి ఉద్వాసన పలికి, కొత్తవారికి అవకాశం ఇవ్వాలని ప్రధాని భావిస్తున్నట్లు ప్రభుత్వ వర్గాలే అంటున్నాయి. ఆ మేరకు ఇప్పటికే కసరత్తు పూర్తయ్యిందని కూడా చెబుతున్నారు.
కూటమిలో వైరుధ్యాలు లేవని, ఇటీవల ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఏపీ పర్యటనకు వచ్చినప్పుడు చంద్రబాబు, పవన్ కళ్యాణ్ నివాసాలకు వెళ్లి విలువైన సమయం గడపడమే ఇందుకు నిదర్శనమని అప్పసాని రాజేష్ అన్నారు. ఒకరి కాళ్ళ దగ్గర మాటలను తాకట్టు పెట్టి, వారు విసిరే ఎంగిలి మెతుకుల కోసం కొందరు కిరాయి రాజకీయ విశ్లేషకులుగా మారారని నాగేశ్వర్ ఉద్దేశించి అప్పసాని రాజేష్ ఘాటు వ్యాఖ్యలు చేశారు.
జనసేన అధినేత పవన్ కళ్యాణ్ సోదరుడు.. పార్టీ ప్రధాన కార్యదర్శి కొణిదెల నాగబాబు ప్రస్తుతం ఎమ్మెల్యే కోటాలో ఎమ్మెల్సీగా ఉన్నారు. కూటమి ప్రభుత్వంలో జనసేనకు దక్కే రాజ్యసభ సీటు ద్వారా నాగబాబును ఢిల్లీకి పంపించి, జాతీయ స్థాయిలో పార్టీ వాయిస్‌ను వినిపించేలా చేయాలన్న‌ ఆలోచనలో జ‌న‌సేన‌ అధిష్టానం ఉన్నట్లు తెలుస్తోంది.
బైరెడ్డి సిద్దార్థ్ రెడ్డి ఉద్దేశపూర్వకంగా  తన వ్యక్తిగత ప్రతిష్టను, సమాజంలో ఉన్న గౌరవాన్ని దెబ్బతీసేలా మాట్లాడారని మంత్రి భరత్ తన ఫిర్యాదులో పేర్కొన్నారు.  
మళ్ళీ తేర మీదకి కర్ణాటక సీఎం కుర్చీ పంచాయతీ.
వైసీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి జగన్ రాజకీయ కార్యకలాపాలకు, ప్రజా క్షేత్రానికి దూరంగా ఉండటంతో పార్టీ క్యాడర్ నిస్తేజంలోకి వెళ్లిపోయింది. జగన్ తీరు పట్ల పార్టీలో తీవ్ర అసంతృప్తి వ్యక్తమౌతోంది. పార్టీ ద్వితీయ శ్రేణి నాయకులు అంతర్గత సంభాషణల్లో జగన్ తీరు పట్ల పెదవి విరుస్తున్నారు. అసెంబ్లీ ఎన్నికల్లో వైసీపీ పరాజయం పాలై, అధికారం కోల్పోయిన తరువాత, జగన్ బహిరంగంగా పెద్దగా కనిపించడంలేదు. ఏవో నాలుగైదు సందర్భాలలో పరామర్శలంటూ వచ్చి ర్యాలీలు నిర్వహించినా అవి వివాదాలకే దారి తీశాయి.
జీహెచ్ఎంసీ గత ఎన్నికల్లో ఊహించని రీతిలో భారీగా స్థానాలను గెలుచుకున్న బీజేపీ, అదే ఊపును 2023 అసెంబ్లీ మరియు 2025 లోక్‌సభ ఎన్నికల్లోనూ కొనసాగించింది. ఈ నేపథ్యంలో, 2026 గ్రేటర్ ఎన్నికల్లో కూడా ఆంధ్రప్రదేశ్‌లోని తమ మిత్రపక్షాలైన తెలుగుదేశం, జనసేన పార్టీలతో కలిసి పోటీ చేసి నగరంలో మరింత పట్టు సాధిస్తుందని రాజకీయ వర్గాల్లో విస్తృతంగా చర్చ జరిగింది.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.