యువతులకు ఉగ్ర శిక్షణ.. సైదా బేగం విచారణలో విస్తుపోయే వాస్తవాలు!

Publish Date:Apr 8, 2026

Advertisement

విజయవాడ టెర్రర్ లింక్  కేసులో హైదరాబాద్ సైదా బేగం విచారణలో  సంచలన విషయాలు వెలుగులోకి వచ్చాయి.  కొద్ది రోజుల కిందట విజయవాడ టెర్రర్ లింక్ లో హైదరా బాద్ కు చెందిన సైదా బేగం ఉన్నట్లుగా అధికారులు గుర్తించి, ఆమెను అదుపులోకి తీసు కొని విచారించిన సంగతి తెలిసిందే.  ఈ విచారణ లో సంచలమైన అంశాలు బయటపడ్డాయి. సైదా బేగం భర్త నుండి విడిపోయి పుట్టింటికి వచ్చి నివాసం ఉంటుంది. ఆమె పలు ఇళ్లలో పనిచేస్తూ రీల్స్ చేసి సోషల్ మీడియాలో పోస్ట్ చేసేది. ఆ విధంగా ఒక వ్యక్తితో పరిచయం ఏర్ప డింది. అలా ఆమె ఉగ్రవాదం వైపు మరలింది. అంతటితో ఆగకుండా ఈ సైదా బేగం మహిళలను ఉగ్రవాదం వైపు ఆకర్షించేలా బాధ్యత తీసుకున్నట్లు పోలీసులు భావిస్తున్నారు. ఇలా సైదా బేగం ద్వారా మహిళ లను రిక్రూట్ చేసేలా చేయడమే ఉగ్రవా దుల టార్గెట్.. ఇప్పటివరకు సుమారు 42 మంది యువ తులను సైదా బేగం రిక్రూట్ చేసినట్లుగా ప్రాథమిక ఆధారాలు లభించాయి. సైదా బేగం ఖవాతీన్ పేరుతో ప్రత్యేకంగా వాట్సాప్ గ్రూపు నిర్వహిస్తూ యువతులను లక్ష్యంగా చేసుకున్నట్లు అధి కారులు గుర్తించారు. ఇందు కొరకు సైదా బేగం తన ఇన్స్టాగ్రామ్ లో దాదాపు 40 అకౌంట్లు సృష్టించి జిహాద్ భావజా లానికి సంబంధించిన వీడియోలు పోస్టు చేస్తూ యూత్ లో ఐడియాలజీ నింపినట్లు పోలీసులు గుర్తించారు.

అయితే దర్యాప్తులో భాగంగా సైదా బేగం వద్ద నుండి తీసుకున్న ఫోన్లో వాట్స్అప్, ఇన్స్టాగ్రామ్ అకౌంట్లలో ఉగ్రవాద భావ జాలాన్ని ప్రోత్సహించే పలు వీడియోలు, పిడిఎఫ్ ఫైల్స్ ఉన్నట్లుగా వెల్లడైంది. వాటి లో పేలుడు పదార్థాల తయారీ, బ్లాక్ పౌడర్ తయారీ వంటి వీడియోలు కూడా ఉన్నట్లుగా పోలీ సులు తెలిపారు.వీటన్నిటిని స్వాధీనం చేసుకున్నారు. సైదా బేగం... యువతులను ప్రభావితం చేయడానికి ఒసామా బిన్ లాడెన్, జాకీర్ నాయక్ వీడియోలు షేర్ చేస్తూ అమ్మాయిలను ఉగ్రవాదం వైపు మళ్ళిం చింది.... అమ్మాయిలకు స్నిప్పర్ రైఫిల్, షూటింగ్ వంటి వాటిలో ట్రైన్ ఇవ్వాలని ఉగ్రవాదులు సైదా బేగానికి ఆదేశాలు జిహాద్ గ్రూపుల నుండి వచ్చినట్లుగా విచారణలో వెల్లడైంది.

 స్నిప్పర్ రైఫిల్, షూటింగ్ వంటి అంశాల్లో శిక్షణ ఇవ్వాలని ప్రణాళిక ఉన్నట్లు అధికారులు తెలిపారు.ఈ నేపథ్యంలోనే సైదా బేగం మొదటగా మదర్సాల్లో మతపరమైన శిక్షణ అయ్యాక వెపన్ ట్రైనింగ్ కు సన్నాహాలు చేసినట్లుగా పోలీసులు గుర్తించారు. ఈ కేసులో మరిన్ని విషయాలు వెలుగులోకి వచ్చే అవకాశం ఉందని...సైదా బేగం నెట్వర్క్ కు సంబంధించి మరింత లోతైన దర్యాప్తు కొనసాగుతుందని పోలీసులు వెల్లడించారు.

By
en-us Political News

  
వయసు పైబడితే చాలు విశ్రాంతి కోరుకుంటారు ఎవరైనా. 60 ఏళ్లు దాటాయంటే మోకాళ్ల నొప్పులని, ఓపిక లేదని ఇంటికే పరిమితమవుతారు.
దేశ రాజధాని ఢిల్లీలోని పార్లమెంట్ ప్రాంగణం శనివారం ఒక అరుదైన మరియు ఆత్మీయ దృశ్యానికి వేదికైంది.
డిజిటల్ చెల్లింపులు వేగంగా విస్తరిస్తున్న ఈ రోజుల్లో, టెక్నాలజీ ప్రభావం సమాజంలోని ప్రతి వర్గానికీ ఎలా చేరుతోందో చూపించే ఆసక్తికర ఉదాహరణ ఇది.
తెలంగాణ రాష్ట్రవ్యాప్తంగా లక్షలాది మంది విద్యార్థులు ఎంతో ఉత్కంఠగా ఎదురుచూస్తున్న ఇంటర్మీడియట్ వార్షిక పరీక్షల ఫలితాలను విద్యాశాఖ బుధవారం విడుదల చేసింది.
వరంగల్ జిల్లా దుగ్గొండి మండలంలోని గిర్నిబావి గ్రామంలో ఓ రైతు పొలం ఇప్పుడు అందరి దృష్టిని ఆకర్షిస్తోంది.
సాధారణంగా బీఎండబ్ల్యూ వంటి లగ్జరీ కార్లు కొనుగోలు చేయడానికి ప్రధాన కారణం—ప్రాణ భద్రత.
77 ఏళ్ల గణపతి ప్రస్తుతం తీవ్రమైన అనారోగ్య సమస్యలతో అంటే డయాబెటిస్, కీళ్లనొప్పులు, ఇతర వృద్ధాప్య సమస్యలతో బాధపడుతున్నట్టు తెలుస్తోంది. ఆయనకు మెరుగైన వైద్యం అందించేందుకు పార్టీ ఆయనను అడవుల నుంచి బయటకు పంపిందని సమాచారం.
అమెరికా విధించిన రెడ్ లైన్స్ వెనుక బలమైన కారణం ఉందన్న జేడీ వాన్స్, ఇరాన్ గనుక అణ్వాయుధాన్ని సాధిస్తే, అది ప్రపంచంలో అత్యంత ప్రమాదకరమైన ఆయుధ పోటీకి దారితీస్తుందన్నారు. ఇరాన్ అణు కార్యక్రమం ఒక్క అమెరికాకు మాత్రమే కాదు ప్రపంచ శాంతికే ముప్పన్నారు.
హైదరాబాద్ వాతావరఖ కేంద్రం విడుదల చేసిన తాజా బులిటెన్ మేరకు రాష్ట్ర వ్యాప్తంగా గరిష్ఠ ఉష్ణోగ్రతలు సాధారణం కంటే 2 నుంచి 4 డిగ్రీలు అధికంగా నమోదయ్యే అవకాశాలున్నాయి. . రానున్న పది రోజుల్లో పగటి ఉష్ణోగ్రతలు 44 నుంచి 45 డిగ్రీల సెల్సియస్ వరకూ చేరే అవకాశం ఉందని వాతావరణ శాఖ పేర్కొంది.
చెన్నై చెపాక్ స్టేడియం వేదికగా జరిగిన ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచిన చెన్నైతొలుత బ్యాటింగ్ ఎంచుకుంది. నిర్ణీత 20 ఓవర్లలో కేవలం రెండు వికెట్లు మాత్రమే కోల్పోయి 212 పరుగుల భారీ స్కోరు సాధించింది. వికెట్ కీపర్ బ్యాటర్ సంజు శాంసన్ ఆరంభం నుంచే ఢిల్లీ బౌలర్లపై విరుచుకుపడ్డాడు. కేవలం 56 బంతుల్లోనే 15 ఫోర్లు, 4 భారీ సిక్సర్లతో 115 పరుగులు చేసి అజేయంగా నిలిచాడు.
ఈ దుర్ఘటనలో ప్రముఖ న్యాయవాది బొద్దులూరి శ్రీనివాస్ రావు అక్కడికక్కడే మృతి చెందినట్లు తెలిసింది. ఈ వార్త న్యాయవాదుల వర్గాల్లో తీవ్ర విషాదాన్ని నింపింది. ఈ ఘటనపై పలువురు న్యాయవాదులు సంతాపం తెలిపారు.
నీతి, నిజాయితీలతో కార్యకర్తలను ఆర్థికంగా బలోపేతం చేసేందుకు ఎథికల్ ఎకనమిక్ ఎంపవర్మెంట్ (ఈ3) కార్యక్రమం చేపడతామన్నారు.
బీహార్‌కు చెందిన యువ క్రికెట్ సంచలనం వైభవ్ సూర్యవంశీ ప్రస్తుతం గూగుల్‌లో అత్యధికంగా సెర్చ్ చేయబడుతున్న క్రీడాకారుల్లో ఒకరిగా నిలిచాడు. 2025-26 సంవత్సరాల్లో గూగుల్ ట్రెండ్స్ ప్రకారం, నెటిజన్లు సూర్యవంశీ గురించి పలు ప్రశ్నలు సంధించారు. అందులో మొదటిది- వైభవ్.. వయసు, పుట్టిన తేదీ వివరాలు. ఇది నెటిజన్లు వేసిన టాప్ క్వశ్చిన్ గా నిలుస్తోంది. కేవలం 13-14 ఏళ్లకే ఐపీఎల్ వంటి మెగా టోర్నీలో ఆడటం వల్ల వైభవ్ సూర్యవంశీ రియల్ ఏజ్ అనే పదం ఎక్కువగా ట్రెండ్ అవుతోంది.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.