మావోయిస్టుల మకాంతో కర్రె గుట్టలపై టెన్షన్ వాతావరణం

Publish Date:Apr 11, 2025

Advertisement

మావోయిస్టులు  శాంతి చర్చలు జరపడానికి సిద్దమై రెండు వారాలు గడుస్తున్నప్పటి కేంద్రం   ఇంత వరకు స్పందించక పోవడంతో టెన్షన్ వాతావరణం నెలకొంది. రానున్న రోజుల్లో ఎన్ కౌంటర్లకు దారి తీసే అవకాశం ఉందని విశ్లేషకులు చెబుతున్నారు.  వచ్చే మార్చికల్లా నక్సల్ రహిత దేశం తయారు చేస్తామని కేంద్రం ప్రకటించిన సంగతి తెలిసిందే.  కర్రెగుట్టలపై మావోయిస్టు లు షెల్టర్ జోన్ ఏర్పాటు చేసుకోవడంతో  తెలంగాణ ప్రభుత్వం భధ్రతా  బలగాలను రంగంలో దించినట్లు తెలుస్తోంది. కర్రెగుట్టలు దాదాపు 150 కిలో మీటర్ల దూరం వరకు వ్యాపించి ఉన్నాయి. ఎత్తయిన ఈ గుట్టలపై పోలీసులు వెళ్లలేని పరిస్థితి ఉంది. ఒకవేళ కర్రెగుట్టలపై వెళితే భారీ ప్రాణ నష్ట సంభవించే అవకాశం ఉంది. ఇప్పటికే మావోయిస్టులు వివిధ  కమిటిల పేరిట లేఖలు విడుదల చేస్తున్నారు.  కర్రెగుట్టలపై రావొద్దనేది  ఆ లేఖల సారాంశం.  అమాయక గిరిజనులు కర్రెగుట్టలపై రావొద్దని  ఓ వైపు మావోయిస్టులు చెబుతుంటే పోలీసులు మాత్రం కర్రెగుట్టలపై వెళ్లి అడవి సంపదను వినియోగించుకోవాలని చెబుతున్నారు. తాజాగా శుక్రవారం  మలుగు ఎస్పీమీడియా సమావేశం ఏర్పాటు  చేసి గిరిజనులు కర్రెగుట్టల వైపు వెళ్లాలని కోరుతున్నారు. గిరిజనులు కర్రెగుట్టలపై ఉన్న ఇప్పపువ్వు వంటి అడవి సంపదపై ఆధారపడ్డ గిరిజనులు కర్రెగుట్టల వైపు వెళ్లి ప్రాణాల మీదికి తెచ్చుకున్నారు. కర్రెల గుట్టల్లో మావోయిస్టులు ఎక్కువకాలం ఉండలేరు. తినే పదార్థాలు, వైద్య సదుపాయాల కోం మావోయిస్టులు గుట్టలు దిగే పరిస్థితి ఉంది.  మావోయిస్టులు కర్రెగుట్టల క్రిందకు దిగే సమయంలో అరెస్ట్ లు జరుగుతున్నాయి. అనారోగ్యంతో ఉన్న మావోయిస్టులు కర్రెగుట్టలు దిగే సమయంలో లొంగిపోతున్నారని మావోయిస్టులు విడుదల చేసిన లేఖల్లో పేర్కొన్నారు. కేంద్ర కమిటీ నాయకత్వంతో బాటు వివిధ రాష్ట్రాల నాయకత్వం కర్రెగుట్టలపై మకాం వేసినట్టు తెలుస్తోంది. కర్రెగుట్టలు ఎక్కువ భాగం చత్తీస్ గడ్ లో ఉన్నాయి. తెలంగాణలోని ములుగు జిల్లాలో కొంత భాగం ఉంది.  చత్తీస్ గడ్ లో వరుస ఎన్ కౌంటర్లు  జరుగుతున్నాయి. వందలాది మంది మావోయిస్టులు చనిపోయారు. ఇటీవల కాలంలో ఎక్కువ సంఖ్యలో మావోయిస్టులు లొంగిపోతున్నారు. వారికి తెలంగాణ ప్రభుత్వం నగదు పారితోషికం ఇచ్చి పునరావాసం కల్పించడంతో మావోయిస్టులు శాంతి చర్చలకు సిద్దమైనట్లు తెలుస్తోంది. 

By
en-us Political News

  
హైదరాబాదు నగరంలో తీవ్ర సంచలనం సృష్టించిన మాజీ డీజీపీ వినయ్ రంజన్ రాయ్ సతీమణి తనూజ హత్య కేసులో తెలంగాణ స్పెషల్ టీం కీలక పురోగతి సాధించారు.
పండుగకు చెల్లిని ఇంటికి తీసుకెళ్లాలని వచ్చాడు.. కుటుంబమంతా కలిసి ఆనందంగా పండుగ జరుపుకోవాలని ఆశపడ్డాడు.
ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ఎప్పుడూ చర్చనీయాంశంగా ఉండే బెజవాడ రాజకీయం మరోసారి వేడెక్కింది.
పశ్చిమ బెంగాల్‌ రాజధాని కోల్‌కతాలో దుర్గాపూజ ఉత్సవాల వేళ తీవ్ర విషాదం చోటుచేసుకుంది.
పండుగ వేళ ఆ కళాశాలలో నవ్వులు విరిశాయి.. స్నేహితుల సందడి, దాండియా నృత్యాలతో ప్రాంగణమంతా కోలాహలంగా మారింది.
మధ్యప్రదేశ్‌లోని గ్వాలియర్‌ జిల్లాలో శనివారం అర్ధరాత్రి దాటాక అత్యంత హృదయ విదారకమైన ఘటన చోటుచేసుకుంది
కలియుగ ప్రత్యక్ష దైవమైన తిరుమల తిరుపతి వేంకటేశ్వర స్వామి వారి సన్నిధిలో భక్తుల తాకిడి ఒక్కసారిగా భారీగా పెరిగింది.
బర్త్‌డే నాడే భార్యను చంపి సూసైడ్ చేసుకున్న టెకీ.!
చిన్నారుల ఆరోగ్యాన్ని దృష్టిలో ఉంచుకుని దేశీయ ఆహార భద్రతా నియంత్రణ సంస్థ కీలకమైన ముసాయిదా నిబంధనను తెరపైకి తెచ్చింది.
భారతీయ సైన్యంలో అత్యున్నత ప్రమాణాలుగా భావించే క్రమశిక్షణను ఉల్లంఘించిన ఘటన దేశవ్యాప్తంగా సంచలనం సృష్టిస్తోంది.
విజయవాడ ఇంద్రకీలాద్రిపై కొలువుదీరిన శ్రీ కనకదుర్గమ్మవారిని ప్రముఖ సినీ నటులు విజయ్ దేవరకొండ, రష్మిక మందన్న దంపతులు దర్శించుకున్నారు
ఢిల్లీలో తీవ్ర సంచలనం సృష్టించిన పరిణామాల మధ్య కాక్రోచ్ జనతా పార్టీ (CJP) వ్యవస్థాపకుడు అభిజీత్ దీప్కేకు న్యాయస్థానం ఊరటనిచ్చింది.
ప్రేమించిన వ్యక్తిని పెళ్లి చేసుకోలేకపోయాననే అసంతృప్తి.. కొత్తగా తన జీవితంలోకి వచ్చిన భర్తపై ద్వేషంగా మారిందా? కాపురం ప్రారంభమై నెల రోజులు కూడా గడవకముందే ఓ నవవధువు తీసుకున్న నిర్ణయం
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.