Publish Date:Jul 21, 2026
వైసీపీలోని కాపు సామాజిక వర్గ నేతలు తిరుగుబావుటా ఎగుర వేస్తున్నారా? సొంత పార్టీ లైన్ నే దాటుతూ, పార్టీ అధినేతకు తమ ధిక్కార స్వరం వినిపిస్తున్నారా? అంటే జరుగుతున్న పరిణామాలను గమనిస్తే ఔననే సమాధానం వస్తున్నది. పార్టీలో కాపు సామాజికవర్గ నేతల తీరు వైసీపీకి గుబులు పుట్టిస్తోందన్న విశ్లేషణలు వెల్లువెత్తుతున్నాయి. ముఖ్యంగా వైసీసీకి చెందిన కాపు సామాజికవర్గ నేత, ఎమ్మెల్సీ తోట త్రిమూర్తులు పార్టీ లైన్ ను ఇసుమంతైనా ఖాతరు చేయకుండా కాపు ఐక్యత జెండాను భుజానకెత్తుకోవడం పార్టీలో కలకలం రేపింది. ఒక వైపు వైసీపీ అధినేత జగన్.. అంబటి రాంబాబును పార్టీలో కాపు సామాజికవర్గ ఐకాన్ గా ప్రమోట్ చేస్తుంటే.. తోట త్రిమూర్తులు ముద్రగడ పద్మనాభం సంస్మరణ సభలను వేదిక చేసుకుని పార్టీలతీతంగా కాపు నేతలందరూ ఐక్యం కావాలని పిలుపునివ్వడం పార్టీలో కలకలం రేపింది.
ఈ క్రమంలోనే టీడీపీకి చెందిన ఎమ్మెల్యే బొండా ఉమ విజయవాడలో నిర్వహించతలపెట్టిన కాపుల ఐక్యత సభకు తాను హాజరవుతానని తోట త్రిమూర్తులు ప్రకటించడం వైసీపీకి మింగుడు పడటం లేదు. వైసీపీ అధినేత జగన్ నిర్ణయాలతో సంబంధం లేకుండా తోట త్రిమూర్తులు స్వతంత్రంగా కాపు సామాజికవర్గ ఐక్యత నినాదంతో ముందుకు సాగుతుండటంతో వైసీపీ ఏం చేయాలో తెలియని పరిస్థితుల్లో పడింది.
అదు విధంగా వైసీపీలో సీనియర్ మోస్ట్ నాయకుడు, మాజీ మంత్రి బొత్స సత్యనారాయణ సైతం కాపు రిజర్వేషన్లు, కాపు సామాజిక వర్గ హక్కుల విషయంలో ఇండిపెండెంట్ లైన్ తీసుకోవడం కూడా వైసీపీలో కలవరం రేపుతోంది. కాపు సామాజికవర్గానికి మేలు జరగాలంటే.. హక్కుల కోసం పోరాడాలి అంటూ బొత్స సంచలన వ్యాఖ్యలు చేశారు. ముద్రగడ సంస్మరణ సభలు వేదికగా తోట త్రిమూర్తులు, బొత్స సత్యనారాయణ లు జ్యోతుల నెహ్రూతో వేదిక పంచుకోవడం, తోట త్రిమూర్తులు బోండా ఉమా ఆధ్వర్యంలో కాపు ఐక్యత సభకు హాజరౌతానని ప్రకటించడంతో.. రానున్న రోజులలో కాపు సామాజికవర్గ ఐక్యత రాష్ట్రంలో కొత్త రాజకీయ సమీకరణాలకు తెరలేపే అవకాశాలున్నాయన్న చర్చ రాజకీయవర్గాలలో జోరుగా సాగుతోంది. ఉన్నట్లుగా కనిపిస్తోంది.
Tense in ycp, botsa, totatrimurthulu, Kapu, Leaders, Cross, Partyline Telugu One
By Teluguone
en-us
Political News
http://www.teluguone.com/news/content/tense-in-ycp-39-226660.html
2019 ఎన్నికలలో వైసీపీ విజయంలో అప్పటి జగన్ పాదయాత్ర కీలక పాత్ర పోషించిన సంగతి తెలిసిందే. అయితే అప్పట్లో.. జగన్ వాగ్దానాలపై ప్రజలలో నమ్మకం ఉండేది. ప్రజలతో ఆయన మమేకమయ్యేవారు.
రాష్ట్ర విభజన తరువాత తెలంగాణలో తెలుగుదేశం పార్టీ అధికార రేసులో లేకపోయినప్పటికీ.. రాష్ట్ర రాజకీయాలను ప్రభావితం చేస్తూనే ఉంది. అందుకే రాష్ట్రంలో రాజకీయ వేడ రగిలిన ప్రతి సందర్భంలోనూ తెలుగుదేశం ప్రస్థావన వస్తూనే ఉంటుంది.
తెలంగాణ రాజకీయాల్లో గత కొన్ని రోజులుగా తీవ్ర దుమారం రేపుతున్న పరిణామాలు ఇప్పుడు అత్యంత ఆసక్తికర మలుపు తిరిగాయి.
తాజాగా ఆమె చేసిన వ్యాఖ్యలు ఆమె చూపు బీఆర్ఎస్ వైపు మళ్లిందా అన్న అనుమానాలకు తావిచ్చింది. కేబినెట్ నుంచి తనకు ఉద్వాసన పలికిన తరువాత మీడియాకు వరుస ఇంటర్వ్యూలు ఇస్తూ సంచలన వ్యాఖ్యలు చేస్తున్న కొండా సురేఖ.. తాజాగా బీఆర్ఎస్ అధినేత, మాజీ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావుపై ప్రశంసల వర్షం కురిపించారు.
పిడిక్కీ బియ్యానికీ ఒకే మంత్రం అన్నట్లుగా ఆమె తన బర్త్ రఫ్ కూ తెలుగుదేశం పార్టీకీ ముడి పెట్టారు. సీఎం రేవంత్ రెడ్డిది తెలుగుదేశం రక్తం కనుకనే తనకు కేబినెట్ నుంచి బర్త్ రఫ్ చేశారంటూ మీడియా సమావేశంలో కొండా సురేఖ చేసి కామెంట్స్ రాజకీయవర్గాలలో సంచలనంగా మారాయి.
ఈ ప్రాజెక్టుల నిర్మాణంలో తమ పాత్రే కీలకమని పేర్కొంటూ వైసీపీ క్రెడిట్ వార్ కు తెరతీసింది. సోషల్ మీడియా వేదికగా వైసీపీ వారు పోలవరం ప్రాజెక్టును దివంగత వైఎస్ రాజశేఖరరెడ్డి కలల ప్రాజెక్ట్‌గా అభివర్ణిస్తూ పోస్టులు షేర్ చేస్తోంది.
కోమటిరెడ్డి కుటుంబానికి నల్గొండ జిల్లాలో గట్టి పట్టు ఉంది. ఈ నేపథ్యంలో తాను కేవలం మంత్రి పదవిని మాత్రమే ఆశించే నాయకుడిని కాననీ.. వైఎస్ ఆశయాలను ముందుకు తీసుకువెళ్లే నాయకుడిననీ ఆయన అంటున్నారు.
ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో అధికార కూటమి భాగస్వామ్య పక్షాలైన తెలుగుదేశం, జనసేన మధ్య సంబంధాలు పైకి కనిపించేంత సజావుగా లేవనే సంకేతాలు స్పష్టమవుతున్నాయి.
తెలంగాణ రాజకీయాల్లో ఒక్కసారిగా తీవ్ర కలకలం రేగింది
దివంగత సీఎం వైఎస్ రాజశేఖర్ రెడ్డి వర్ధంతి సందర్భంగా బుధవారం (సెప్టెంబర్ 2) నిర్వహించిన ఒక ర్యక్రమంలో పాల్గొన్న కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి.. తాము ఏనాడు కూడా పదవుల కోసం సిద్ధాంతాలను తాకట్టు పెట్టలేదంటూ.. వైఎస్ రాజశేఖరరెడ్డి ఆశయాల బాటలో నడిచేందుకు రాజకీయాల్లోకి ప్రవేశించామన్నారు.
ఆమె మాటలను బట్టి పరిశీలకులు కొండా సురేఖ పార్టీకీ, ఎమ్మెల్యే పదవికీ కూడా రాజీనామే చేసే అవకాశాలు కనిపిస్తున్నాయని విశ్లేషిస్తున్నారు. అదే జరిగితే.. ఆమె ప్రాతినిథ్యం వహిస్తున్న వరంగల్ తూర్పు నియోజకవర్గానికి ఉప ఎన్నిక అనివార్యమౌతుంది.
నా కూతురికి పెళ్లైంది.. తనకు తాను స్వతంత్రంగా మాట్లాడింది..!
ఉన్నది మాట్లాడితే చర్యలా.. సురేఖ సంచలన వ్యాఖ్యలు..!