పాక్ హైకమిషన్ లోకి కేక్.. సంబరాల కోసమే అంటూ జనాగ్రహం.. ఢిల్లీలో తీవ్ర ఉద్రిక్తత

Publish Date:Apr 24, 2025

Advertisement

ఢిల్లీలోని  పాకిస్తాన్  హైకమిషన్ కార్యాలయం వద్ద తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. వేల సంఖ్యలో జనం ఢిల్లీలోని పాకిస్థాన్ హైకమిషన్ కార్యాలయం వద్దకు చేరుకుని ఆ దేశానికి వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ కార్యాలయం లోనికి వెళ్లేందుకు ప్రయత్నించారు. అయితే పోలీసులు వారి ప్రయత్నాన్ని అడ్డుకున్నారు. బారికేడ్స్ అడ్డుపెట్టి జనాలను నిలువరించారు. విషయమేంటంటే..
పెహల్గాం ఉగ్రదాడిలో 27 మంది మరణించిన ఘటనపై దేశం యావత్తూ శోకసంద్రంలో మునిగి ఉన్న సమయంలో పాక్ హైకమిషన్ కార్యాలయం కేక్ ఆర్డర్ చేసి సంబరాలు జరుపుకోవడానికి సిద్ధమైందన్న వార్త సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. 

ఓ వైపు ఉగ్రదాడి మృతుల అంత్యక్రియలు జరుగుతున్న వేళ.. ఓ వ్యక్తి కేక్ తీసుకుని పాకిస్థాన్ హైకమిషన్ కార్యాలయంలోకి వెడుతున్న వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. ఆ వీడి యోలో ఓ వ్యక్తి చేతిలో కేక్ తో పాక్ హైకమిషన్ కార్యాలయంలోకి వడివడిగా నడుచుకువెడుతున్నాడు. అక్కడ ఉన్న మీడియా అతనిని ప్రశ్నిస్తోంది. అయితే మీడియా ప్రతినిథులకు సమాధానం ఇవ్వకుండా ఆ కేక్ ను డెలివరీ చేయడానికి వచ్చిన వ్యక్తి వెళ్లిపోవడం మరిన్ని అనుమానాలకు తావిచ్చింది. ఈ వీడియోపై నెటిజనులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. 

పెహల్గాం ఉగ్రవాదిలో మరణించిన వారి కోసం యావత్ దేశం కన్నీరు పెడుతుంటే, శోక సంద్రంలో మునిగిపోయి ఉంటే.. పాకిస్థాన్ సంబరాలు చేసుకుంటోందంటూ ఆగ్రహంతో ఊగిపోయారు. అదీ భారత గడ్డ మీద పాక్ హైకమిషన్ కార్యాలయం ఈ సంబరాలకు వేదిక కావడం ఆ దేశం తెంపరి తనానికి, పైశాచికత్వానికి నిలువెత్తు నిదర్శనమంటూ తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. పాక్ హైకమిషన్ లో సంబరాలు అంటూ వార్త   వేగంగా వ్యాపించింది. భారత్ విషాద సాగరంలో మునిగి ఉన్న సమయంలో అదే గడ్డ మీద పాకిస్థాన్ సంబరాలా అంటూ జనం ఆగ్రహంతో ఊగిపోయారు. ఎవరికి వారు స్వచ్ఛందంగా భారత్ హైకమిషన్ వద్దకు చేరుకున్నారు. కార్యాలయంలోకి చొచ్చుకుపోవడానికి ప్రయత్నించారు.  అదలా ఉంటే.. పెహల్గాం ఉగ్రదాడి తరువాత కూడా పాకిస్థాన్ తన కవ్వింపు చర్యలను కొనసాగిస్తోంది.  

సింధు నదీ జలాల్లో ప్రతి నీటిబొట్టూ పాకిస్థాన్ కే చెందుతుందంటూ ఆ దేశ మంత్రి అవాయిస్ లెఘారీ పేర్కొన్నారు. ఇండస్ వాటర్ ట్రయిటీ నుంచి భారత్  ఏకపక్షంగా వైదలగడాన్ని తాము ఎట్టి పరిస్థితుల్లోనూ అంగీకరించబోమనడమే కాకుండా, భారత్ నిర్ణయాన్ని రాజకీయంగా, న్యాపరంగా ఎదుర్కొంటామనీ, భారత్ కు గట్టి గుణపాఠం చెబుతామని సవాల్ విసిరారు. అంతర్జాతీయ సంస్థలకు కుదిర్చిన ఒప్పందం నుంచి భారత్ ఏకపక్షంగా వైదలగజాలదనీ, భారత్ కు ఆ హక్కు లేదనీ పేర్కొన్నారు. 

ఇలా ఉంటే.. పాక్ ఆక్రమిత కాశ్మీర్  నుంచి భారత్ లో చొరబడి విధ్వంసం సృష్టించడానికి ఉగ్రవాదులు భారీ ప్రణాళిక రచించినట్లు భద్రతా బలగాలు చెప్పాయి. పీకోకేలో ఇందు కోసం ఉగ్రవాదులు  42 లాంచ్ ప్యాడ్లను సిద్ధం చేశాయని గుర్తించినట్లు భద్రతాబలగాలు వెల్లడించాయి. దాదాపు 130 మంది టెర్రరిస్టులు భారత్ లో చొరబడేందుకు తమ బాస్ ల ఆదేశాల కోసం ఎదురు చేస్తున్నారని పేర్కొన్నాయి.   

By
en-us Political News

  
YS Jagan Mohan Reddy, Pulivendula Elections, YS Jagan Protest, YSRCP, Bengaluru, Municipal Elections, Polling Irregularities, Andhra Pradesh Politics, YS Jagan News, Pulivendula Polling
దిల్లీలోని ప్రఖ్యాత కనాట్ ప్లేస్ ప్రాంతంలో దుకాణాలను అధికార భారతీయ జనతా పార్టీ (BJP) బలవంతంగా మూసివేయించిందని లోక్‌సభ ప్రతిపక్ష నేత, కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ తీవ్ర ఆరోపణలు గుప్పించారు.
పులివెందుల మున్సిపల్‌ ఎన్నికల్లో పోలింగ్‌ అక్రమాలు చోటుచేసుకున్నాయని వైసీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ఆరోపించారు
ఆంధ్రప్రదేశ్‌లో పట్టణ స్థానిక సంస్థల ఎన్నికల పోలింగ్ వేళ.. కడప జిల్లా పులివెందులలో రాజకీయ ఉద్రిక్తతలు చోటుచేసుకున్నాయి.
ఆంధ్రప్రదేశ్‌లో పట్టణ స్థానిక సంస్థల ఎన్నికల పోలింగ్ ప్రారంభమైంది.
సమాజంలో రోజురోజుకూ పెరిగిపోతున్న దారుణాలు, హేయమైన నేరాలు తీవ్ర ఆందోళన కలిగిస్తున్నాయి.
రేపే మున్సిపల్‌ ఎన్నికల పోలింగ్‌.. ప్రశాంతంగా సాగేనా.?
గర్ల్స్ హాస్టల్ ముసుగులో అండాల అక్రమ దందా గుట్టురట్టు
బెంగళూరు నగరంలోని ఒక ప్రతిష్టాత్మక లగ్జరీ హోటల్‌లో చోటుచేసుకున్న ఘోర ప్రమాదం స్థానికంగా తీవ్ర కలకలం రేపింది.
అర్నబ్ తుపాను నష్టాల నుంచి రాష్ట్రాన్ని సాధారణ స్థితికి తీసుకొచ్చే పునరుద్ధరణ పనులను వేగవంతం చేయడంతో
ఆంధ్రప్రదేశ్‌లో అత్యంత ఉత్కంఠ రేకెత్తిస్తున్న మున్సిపల్ ఎన్నికల ప్రక్రియ తుది దశకు చేరుకుంది.
జమ్ము కశ్మీర్ ముఖ్యమంత్రి ఒమర్ అబ్దుల్లా తన వ్యక్తిగత జీవితంలో ఓ సరికొత్త అధ్యాయాన్ని ప్రారంభించారు.
దేశ రాజధాని ఢిల్లీలో మరోసారి రాజకీయ వేడి తారాస్థాయికి చేరింది. కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ పిలుపునిచ్చిన భారీ నిరసన ర్యాలీ అంశం ప్రస్తుతం దేశవ్యాప్తంగా తీవ్ర చర్చనీయాంశంగా మారింది.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.