తెలుగుదేశం కొత్త ఫైర్ బ్రాండ్ కావలి గ్రీష్మ.. మహానాడు ప్రసంగంతో పార్టీలో జోష్

Publish Date:Jun 1, 2022

Advertisement

  ఒంగోలు వేదికగా జరిగిన మహానాడులో పార్టీకి ఒక కొత్త ఫైర్ బ్రాండ్ దొరికింది. ఆమె కావలి గ్రీష్మ. కావలి గ్రీష్మ ప్రసంగం   తెలుగుదేశం కేడర్ లో  ఓ కొత్త జోష్ ను నింపింది. ముఖ్యంగా కావలి గ్రీష్మ మాటల్లో వాడి, వేడి  యమా సూపర్ అని కేడర్ పేర్కొంటోంది. ఇక ఇదే వేదికపై నుంచి ముఖ్యమంత్రి జగన్ ను మిస్టర్ సీఎం అంటూ ఏకవచనంతో సంబోధించడమే కాదు..  ఆయనకు నేరుగా తొడగొట్టి మరీ సవాల్ విసరడం పట్ల పార్టీ సీనియర్ నేతలు సైతం అభినందనలు తెలుపుతున్నారని పార్టీ శ్రేణులు చెబుతున్నాయి.  తన ప్రసంగంలో   అధికార   పార్టీపై గ్రీష్మ నిప్పులు చెరిగింది.     జగన్ దావోస్ పర్యటనపై ఆమె సంధించిన సెటైర్లు, కామెంట్లు  ఇప్పడు పార్టీలో హాట్ టాపిక్ గా మారిపోయాయి. మహానాడు వేదికగా గ్రీష్మ ప్రసంగిస్తున్నంత సేపూ  లీడర్ నుంచి కేడర్ వరకు  అందరూ మెస్మరైజ్ అయ్యారని కూడా పార్టీ వర్గాలు చెబుతున్నాయి.  

ఇటీవలే కావలి గ్రీష్మను పార్టీ అధికార ప్రతినిధిగా తెలుగుదేశం నాయకత్వం నియమించింది. పార్టీ అధికార ప్రతినిధిగా నియమితురాలైన కొద్ది రోజులలోనే ఆమె తన వాగ్ధాటితో మహానాడు వేదికగా విపక్షానికి సవాల్ విసిరారు. వైసీపీలో  కొడాలినాని, పేర్ని నాని వంటి వారికి   దీటుగా బదులిచ్చే బలమైన గళాలు తెలుగుదేశం పార్టీలోనూ ఉన్నాయని మహానాడు వేదికగా గ్రీష్మ ప్రసంగం తిరుగులేని విధంగా నిరూపించిందని పార్టీ శ్రేణుల్లో చర్చ సాగుతోంది.  

ఇక అధికార పార్టీపై ప్రజల్లో ఉన్న అసంతృప్తిని ఎండగట్టేందుకు కావలి గ్రీష్మ  రూపంలో బలమైన ఆయుధం దొరికిందని పార్టీ శ్రేణులు సంబరపడుతున్నాయని పార్టీ వర్గాలే చెబుతున్నాయి. పార్టీ అధినేత చంద్రబాబు సైతం ఆమె ప్రసంగాన్ని మెచ్చుకున్నారని అంటున్నారు.  ఇంత కాలం తెలుగుదేశం పార్టీలో వైసీపీలోని బూతుల నేతలకు దీటుగా సమాధానం ఇచ్చే విషయంలో కొద్ది పాటి వెనుకబాటు తనం కనిపించిందనీ, అయితే గ్రీష్మ ప్రసంగ తరువాత మరింత మంది ఆమెలా ధాటిగా, ప్రత్యర్థుల విమర్శలకు దీటుగా సమాధానం ఇవ్వడానికి ముందుకు వస్తారని పార్టీ శ్రేణులు భావిస్తున్నారు. మోహమాటం లేకుండా కుండబద్దలు కొట్టినట్లు ప్రత్యర్థి విమర్శలకు దీటుగా బదులివ్వడమే కాకుండా, ప్రతి విమర్శలతో చెలరేగిపోయే గ్రీష్మ లాంటి యువత  అవసరం ఇప్పుడు ఉందని పార్టీ వర్గాలు అంటున్నాయి. వైసీపీలో ఆర్కే రోజా, అంబటి రాంబాబు
విజయసాయిరెడ్డి, జోగి రమేష్ తదితరుల   అసంబద్ధ విమర్శలు, అనుచిత వ్యాఖ్యలను దీటుగా తిప్పిగొట్టగలిగే కావలి గ్రీష్మ వంటి యువత ఇప్పుడు మరింత దూకుడుగా వ్యవహరించాలని, మహానాడు వేదికగా గ్రీష్మ ప్రసంగం అందుకు ఆరంభం మాత్రమేనని పార్టీ వర్గాలు చెబుతున్నాయి.  మహానాడు వేదికగా గ్రీష్మ చేసిన ప్రసంగంతో ఆమె పార్టీకు పార్టీ క్యాడర్ లోనే కాదు, రాష్ట్ర వ్యాప్తంగా మంచి గుర్తింపు వచ్చింది.     గ్రీష్మ.. ఖాళీ సమయాల్లో కరాటే, కర్రసాము సాధన చేస్తున్న వీడియోలు ఇప్పుడు సామాజిక మాధ్యమంలో  వైరల్ అవుతున్నాయి.  

ఇంతకీ కావలి గ్రీష్మ ఎవరు అంటూ మహానాడు తర్వాత నెటిజన్లు గూగుల్ లో విపరీతంగా సెర్చి చేశారట. ఇంతకీ ఆమె ఎవరంటే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో అసెంబ్లీ స్పీకర్‌గా పని చేసిన కావలి ప్రతిభా భారతి కుమార్తె.  2017లో పార్టీలోకి ఎంట్రీ ఇచ్చిన గ్రీష్మ అప్పటి నుంచీ పార్టీ కోసం పని చేస్తున్నారు. ప్రస్తుతం ఆమె రాజాం నియోజకవర్గం తెలుగుదేశం ఇన్‌ఛార్జ్‌గా  వ్యవహరిస్తున్నారు. ఇటీవలే అధికార ప్రతినిధిగా పార్టీ బాధ్యతలు  చేపట్టారు. 

By
en-us Political News

  
తెలంగాణ కాంగ్రెస్ రాజకీయ వర్గాల్లో గత కొంతకాలంగా నెలకొన్న ఉత్కంఠకు అఖిల భారత కాంగ్రెస్ కమిటీ (ఏఐసీసీ) అధికారికంగా తెరదించింది.
ఈ నేపథ్యంలో వైయస్ జగన్మోహన్ రెడ్డికి అత్యంత సన్నిహితుడైన చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి వైసీపీ తరపున తొలిసారిగా విజయసాయి పార్టీపై స్పందించారు. అయితే, ఆయన తన స్పందనను చాలా సాధారణంగా, క్లుప్తంగా ముగించడమే కాకుండా విజయసాయి రెడ్డిని   తేలికగా తీసుకున్నట్లు కనిపించింది.
వైసీపీకి సుదీర్ఘకాలం పాటు అత్యంత సన్నిహితుడిగా, కీలక నేతగా వ్యవహరించిన విజయసాయిరెడ్డి సొంతంగా కొత్త రాజకీయ పార్టీని ప్రకటించడం రాష్ట్ర రాజకీయ వర్గాల్లోచర్చకు తెరతీసింది.
పేద,  మధ్యతరగతి ప్రజల ఆదాయాన్ని పెంచేలా చర్యలు తీసుకోవడం వంటి హామీలను ప్రకటించారు. రాజకీయాల్లో పాత పద్ధతులకు స్వస్తి చెప్పి, ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా పరిపాలన అందించడమే తమ పార్టీ విధానమని విజయసాయిరెడ్డి చెప్పారు, 
విజయ్ ప్రభంజనంతో ఎంతోమంది సామాన్య అభ్యర్థులు సైతం ఎమ్మెల్యేలుగా విజయం సాధించారు. అయితే.. ప్రజలు అందించిన ఈ భారీ విజయాన్ని కొందరు ప్రజాప్రతినిధులు సరిగ్గా ఉపయోగించుకోలేకపోతున్నారనే విమర్శలు వ్యక్తమవుతున్నాయి.
కడప జిల్లా రాజకీయాల్లో ఆసక్తికర పరిణామాలు చోటుచేసుకుంటున్నాయి.
ప్రతి ఒక్కరికీ నిర్దిష్ట పాత్రలు ఉండేలా చంద్రబాబు    రూపొందించిన వ్యవస్థ వల్ల  కుటుంబంలో అంతర్గత విభేదాలు రాకుండా, ఎవరికీ తక్కువ అనే భావన కలగకుండా ఉందనీ, కుటుంబంలో అందరం సమానమేననీ చెప్పారు.
నిన్నటి వరకూ జగన్ కు పెట్టని కోటలా నిలిచిన పులివెందులలో ఇప్పుడు తెలుగుదేశం జెండా ఘనంగా ఎగురుతోంది.  సుదీర్ఘకాలంగా వైసీపీకి తిరుగులేని కంచుకోటగా ఉన్ పులివెందుల పరిధిలో తెలుగుదేశం పార్టీ తన ఉనికిని బలంగా చాటుకుంటోంది.
వైసీపీ అధినేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి తీరుపై ఆ పార్టీ నుంచి బయటకు వచ్చిన మాజీ ఎంపీ విజయసాయి రెడ్డి తీవ్రస్థాయిలో మండిపడ్డారు.
తుఫాను కారణంగా చీరాల మన్సిపాల్టీలో ఓట్ల లెక్కింపు శుక్రవారం (నవంబర్ 5) జరుగుతోంది. ఇప్పటి వరకు ఎక్కడా కనీసం డిపాజిట్ కూడా దక్కని కాంగ్రెస్ ఖాతాలో  తొలి విజయం నమోదైంది. కాంగ్రెస్ పార్టీ చీరాల మునిసిపోల్స్ లో గట్టి పోటీ ఇచ్చింది. 25వ వార్డులో విజయం సాధించింది.  25వ వార్డు నుంచి బరిలోకి దిగిన కాంగ్రెస్ అభ్యర్థి వెంకట్రావు విజయం సాధించారు. 
పోలింగ్ సరళి, వెలువడిన ఫలితాలు వైసీపీ శిబిరంలో ఆందోళన కలిగిస్తుంటే వైసీపీ అధినేత, మాజీ సీఎం జగన్ మాత్రం మేకపోతు గాంభీర్యం ప్రదర్శిస్తూ, అధికార తెలుగుదేశం కూటమి అరాచకాలు, అధికార దుర్వినియోగం తమ ఓటమికి కారణాలుగా చూపడానికి ప్రయత్నిస్తున్నారు.  ఎన్నికల ఫలితాల వెల్లడి తర్వాత వైఎస్ జగన్ నిర్వహించిన ఈ మీడియా సమావేశంలో జగన్ చెప్పిందే చెప్పారు. 
కాంగ్రెస్, కమ్మూనిస్టుల మద్దతుతో ఎన్నికల బరిలోకి దిగిన ఏబీవీకి ఘోర పరాజయం ఎదురైన సంగతి తెలిసిందే. కమ్యూనిస్టులకు అంతో ఇంతో పట్టున్న ప్రాంతాలలో కూడా ఆయనకు ఓట్లు రాలలేదు. ఇక కాంగ్రెస్ మద్దతు ఆయనకు ఎందుకూ కొరగాకుండా పోయింది. 
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.