తెలుగుదేశం, జనసేన పొత్తు గ్యారంటీ.. బీజేపీ పరిస్థితేంటి?

Publish Date:Feb 11, 2023

Advertisement

ప్రస్తుతం బీజేపీ మిత్ర పక్షంగా ఉన్న జనసేన వచ్చే ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీతో కలిసి సాగేందుకు ఇప్పటికే ఓ అవగాహనకు వచ్చింది.   ప్రభుత్వ వ్యతిరేక ఓటును చీలనివ్వమని పవన్‌ పదేపదే చెప్పడం వెనుక అంతరార్థం ఇదేనని ఇరు పార్టీలూ కూడా చెబుతున్నాయి. ఇక సీట్ల సర్దుబాటు కుదరడం, పొత్తుపై అధికారిక ప్రకటన వెలువడటం తరువాయి అన్న రీతిలో ప్రచారం జరుగుతోంది. ఆంధ్రప్రదేశ్ లో  తెలుగుదేశం,  జనసేనల ఎన్నికల పొత్తుపై సందేహాలు అనవసరం అని పరిశీలకులు సైతం జరిగిన, జరుగుతున్న పరిణామాలపై విశ్లేషణల్లో స్పష్టం చేస్తున్నారు.  పవన్‌, చంద్రబాబు ఇటీవల విజయవాడలో ఒక సంయుక్త సమావేశంలో కూడా   ఉభయులు వచ్చే ఎన్నికలలో కలిసి పోటీ చేయబోతునట్లు, ఇందులో భాగంగా త్వరలో   రోడ్‌ మ్యాప్‌ రూపొందించబోతున్నట్లు తెలిపారు. ఇక్కడే జనసేన, బీజేపీ మైత్రి విషయం సంగతేమిటన్న చర్చ తెరమీదకు వస్తోంది.

జరుగుతున్న పరిణామాలను నిశితంగా గమనిస్తే జనసేన, బీజేపీల మధ్య ఉన్న మైత్రీ బంధం దాదాపు తెగిపోయినట్లేనని చెబుతున్నారు. బీజేపీతో మైత్రి కొనసాగినా, కొనసాగకపోయినా.. పెద్దగా ఫరఖ్ పడదని జనసేనాని భావిస్తున్నట్లు పరిశీలకులు చెబుతున్నారు.  జనసేన తెలుగుదేశంతో పొత్తు పెట్టుకుని ఎన్నికల బరిలోకి దిగితే.. ఆ కూటమి విజయం నల్లేరు మీద బండినడకేనన్న అభిప్రాయం.. రాజకీయ వర్గాలలోనే కాదు.. సామాన్య ప్రజానీకంలో కూడా వ్యక్త మౌతోంది. ఇరు పార్టీలకూ కలిసి కనీసం 44శాతం ఓట్లు ఉంటాయన్నది ఆ పార్టీల అంచనా,  అదే సమయంలో రాష్ట్రంలో అధికార పార్టీపై రోజు రోజుకూ పెరుగుతున్న వ్యతిరేకత తెలుగుదేశం, జనసేన కూటమికి మరింత బలంగా మారుతుందన్న విశ్లేషణలు కూడా చేస్తున్నారు. ముఖ్యంగా ఉత్తరాంధ్ర, గోదావరి, కృష్ణా జిల్లాలలో తెలుగుదేశం, జనసేన పొత్త ప్రభావం చాలా చాలా ఎక్కువగా ఉంటుందని పరిశీలకులు చెబుతున్నారు.

ఈ నేపథ్యంలోనే ఇంత వరకూ వైనాట్ 175 అంటూ ధీమా వ్యక్తం చేస్తూ వచ్చిన సీఎం జగన్ స్వరంలో కూడా మార్పు కనిపించింది. ఎలాగోలా అధికారంలోకి వస్తే చాలన్నట్లుగా ఆయన  మాటలూ, చేతలూ మారిపోయాయి. వరుస సమావేశాలతో పార్టీ శ్రేణులకూ దిశా నిర్దేశం చేయడానికి సిద్ధమౌతున్నారు. అదే సమయంలో జగన్ ప్రజలలోకి వెళ్లడానికి కూడా కార్యాచరణ రూపొందించుకున్నారు. అయితే పరిశీలకులు మాత్రం ఇవన్నీ దింపుడు కళ్లెం ఆశలేనని అంటున్నారు.  ఎందుకంటే ప్రజా వ్యతిరేకతను ఓట్లుగా మార్కుకునేందుకు అవసరమైన పటిష్టమైన పార్టీ నిర్మాణం, యంత్రాగం, నెట్ వర్క్ తెలుగుదేశం పార్టీకి ఉంది. అదే సమయంలో క్రౌడ్ పుల్ చేయగలిగిన కరిష్మా జనసేనాని పవన్ కల్యాణ్ కు ఉంది. అందుకే తెలుగుదేశం, జనసేనల పొత్తు ప్రభంజనం సృష్టిస్తుందన్న గుబులు అధికార వైసీపీలో రోజు రోజుకూ పెరిగిపోతుంది.  ఈ పరిస్థితుల్లో వైసీపీ ఆశ మొత్తం బీజేపీపైనే పెట్టుకుంది. ఆ పార్టీకి ఏపీలో ఓటు బ్యాంకు లేకపోయినా.. కేంద్రంలో అధికారంలో ఉంది కనుక తెరవెనుక సాయం చేస్తే చేకూరే ప్రయోజనంపైనే ఇప్పుడు వైసీపీ తన ఆశలన్నీ పెట్టుకుంది.   పవన్‌తోనే మా మైత్రి అని బీజేపీ ఏపీ అధ్యక్షుడు ఇటీవల ప్రకటించినా అది నాలుక చివరి మాటే తప్ప మరొకటి కాదని ఎవరికైనా ఇట్టే అర్దమైపోతుంది. ఎందుకంటే.. టీడీపీ జనసేనల మధ్య పొత్తు దాదాపు ఖరారైనట్లుగా పరిస్థితులు తేటతెల్లం చేస్తున్నా.. జనసేనతో తమ కున్న మైత్రిని పదిలం చేసుకోవడానికి, మరింత పటిష్టం చేసుకోవడానికి బీజేపీ నుంచి ఇంత వరకూ వీసమెత్తు ప్రయత్నం కూడా జరగలేదు.  మరో వైపు జనసేన, బీజేపీ మైత్రి కొనసాగాలనీ, ఆ రెండు పార్టీలతో కలిసి పొత్తు ఉంటే విజయం నల్లేరు మీద బండి నడకే అవుతుందని తెలుగుదేశం భావిస్తోంది.

అందుకే తెలంగాణలో అడుగులు బలంగా వేస్తోంది. తెలంగాణలో తెలుగుదేశం పార్టీకి అధికారం చేజిక్కించుకునేంత బలం లేకపోయినా.. కనీసం పాతిక, ముఫ్ఫై నియోజకవర్గాలలో గెలుపు ఓటములను ప్రభావితం చేయగలిగే సత్తా ఆ పార్టీకి ఉంది. అందుకే తెలంగాణలో ఎలాగైనా అధికారంలోకి రావాలన్న పట్టుదలతో ఉన్న బీజేపీ.. తెలంగాణలో తెలుగుదేశం సహకారం ఉంటే మేలని భావించేందుకు వీలుగా.. ఆ రాష్ట్రంలో బలప్రదర్శనకు చంద్రబాబు రెడీ అవుతున్నారు. ఇప్పటికే ఖమ్మంలో నిర్వహించిన బహిరంగ సభతో తెలుగుదేశం తెలంగాణలో ఇప్పటికీ ఒక బలీయమైన శక్తి అన్నది చాటిన చంద్రబాబు. త్వరలో మరి కొన్ని బహిరంగ సభలతో బీజేపీ దృష్టిని ఆకర్షించాలన్న వ్యూహంతో ఉన్నారు.

అంటే తెలంగాణలో బీజేపీకి తెలుగుదేశం సహాయం, ఏపీలో తెలుగుదేశం పార్టీకి బీజేపీ సహకారం అన్న ఒప్పందం దిశగా కమలం పార్టీపై ఒత్తిడి తీసుకురావడమే చంద్రబాబు ఎత్తుగడగా పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.  ఆ ఎత్తుగడ ఫలిస్తే.. అటు తెంగాణలో బీజేపీకి అధికారం, ఇటు ఏపీలో తెలుగుదేశం విజయం తథ్యమని పరిశీలకులు అంటున్నారు. అందుకే బీజేపీ రాష్ట్ర నాయకుల విమర్శలు, వ్యాఖ్యలపై తెలుగుదేశం నేతలు స్పందించడం లేదనీ పరిశీలకులు అంటున్నారు. మొత్తం మీద తెలంగాణలో తెలుగుదేశం సహకారం కోసం.. బీజేపీ అనివార్యంగా ఏపీలో తెలుగుదేశం కూటమికి చేరకతప్పని పరిస్థితులు ముందు ముందు ఎదురౌతాయని పరిశీలకులు అంచనా వేస్తున్నారు. 

By
en-us Political News

  
ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో కీలక పరిణామం చోటుచేసుకుంది.
చంద్రబాబుతో భేటీలో  ప్రధానంగా చెన్నై నగర తాగునీటి అవసరాలు,  తెలుగు గంగ ప్రాజెక్టు ద్వారా అదనపు నీటి కేటాయింపులపై చర్చ జరిగింది.  
జగన్ అక్రమాస్తులకు సంబంధించిన కేసులలో విచారణ ప్రక్రియను మరింత వేగవంతం చేయాలని సీబీఐ ప్రత్యేక కోర్టు నిర్ణయించింది.  సీబీఐ నమోదు చేసిన కేసులతో పాటు ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) పరిధిలోని కేసులన్నింటినీ కూడా  రోజు వారీగా విచారణ చేపట్టాలని కోర్టు నిర్ణయించింది. 
 వివేకా హత్య కేసులో  మనీలాండరింగ్ అంశంపై జరుగుతున్న విచారణలో భాగంగా  కడప ఎంపీ, వైసీపీ సీనియర్ నేత  వైఎస్ అవినాశ్ రెడ్డి హైదరాబాద్‌లోని ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్  కార్యాలయంలో విచారణకు హాజరయ్యారు.  
గతంలో ప్రజారాజ్యం పార్టీలో పవన్ కల్యాణ్‌తో కలిసి రాధ పనిచేశారు. 2004 ఎన్నికల్లో ఎమ్మెల్యేగా గెలిచారు. 2024 ఎన్నికల్లో టీడీపీ తరఫున స్టార్ క్యాంపెయినర్‌గా రాష్ట్ర వ్యాప్తంగా ప్రచారం చేశారు. ప్రస్తుతం ఆయన జనసేన చేరికపై అధికారిక ప్రకటన వెలువడాల్సి ఉంది.  
తనపై నమోదైన   పరువునష్ట కేసును కొట్టివేయాలని కోరుతూ రాహుల్‌ గాంధీ గతంలో బాంబే హైకోర్టును ఆశ్రయించారు. కానీ, ఆయన చే పిటిషన్‌ను బాంబే హైకోర్టు తోసిపుచ్చింది. కేసును కొట్టివేయలేమని స్పష్టం చేస్తూ గతంలో హైకోర్టు ఇచ్చిన ఆదేశాలను సవాల్ చేస్తూ రాహుల్ గాంధీ సుప్రీం కోర్టును ఆశ్రయించారు.
సరే పలు కేసులలో అరెస్టై కొన్ని నెలల పాటు జైలులో గడిపి బయటకు వచ్చారు. ఆ తరువాత అయితే పూర్తిగా అజ్ణాత వాసంలో ఉన్నారా అన్నట్లుగా వంశీ పూర్తిగా మౌనం వహించారు. ఇంత సుదీర్ఘ విరామం తరువాత ఏమైందో ఏమో కానీ.. ఒక్కసారిగా తాను రాజకీయంగా యాక్టివ్ అవుతున్నట్లు ప్రకటించారు.
కవైపు కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీతో భేటీ, మరోవైపు ప్రధాన మంత్రి నరేంద్ర మోదీతో  వేదికపై పంచుకుంటూ మెట్రో రైలులో ప్రయాణించడం రాజకీయ వర్గాల్లో ఆసక్తి  రేకెత్తిస్తోంది.
ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో మరోసారి అత్యంత కీలక పరిణామాలు చోటుచేసుకుంటున్నాయి.
తమిళనాడు ముఖ్యమంత్రి విజయ్ భిన్నమైన వైఖరిని ప్రదర్శించారు.  ప్రధాని మోదీతో ఆదివానం ఒకే వేదిక పంచకున్న తమిళనాడు సీఎం విజయ్.. ఆ బహిరంగ వేదికపైనే  రాష్ట్ర సమస్యలను, అలాగే  రావాల్సిన నిధులను ప్రస్తావించి అందరి దృష్టినీ ఆకర్శించారు. ప్రధాని వేదికపైనే ఆసీనులై ఉన్నప్పటికీ, ఏమాత్రం సంకోచించకుండా రాష్ట్ర ప్రయోజనాలే తమకు అత్యంత ముఖ్యమని విజయ్ కుండబద్దలు కొట్టారు. 
 సొంత పార్టీకి చెందిన ఎమ్మెల్యేయే ప్రభుత్వ విధానాలపై న్యాయపోరాటానికి దిగడం, తనకు జరిగిన అన్యాయంపై పార్టీ హైకమాండ్ కూ, సీఎం రేవంత్ రెడ్డి తీరుపై అగ్రనేత రాహుల్ కు ఫిర్యాదు చేస్తానంటూ హెచ్చరికలు జారీ చేయడం సంచలనంగా మారింది.  
జగన్ అక్రమాస్తులకేసుల విచారణను వేగవంతం చేయాలని ఈడీ కోర్టును ఆశ్రయించడాన్ని సమర్ధించిన తెలుగుదేశం ఎమ్మెల్యే సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి.. ఈ కేసులను  కేవలం రోజువారీ విచారణ కాకుండా, ప్రతి రోజూ, రోజంతా విచారణ జరిగేలా చర్యలు తీసుకోవాలన్నారు.  
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.