ఆసీస్ తో తొలి టెస్టు.. టీమ్ ఇండియా భారీ విజయం

Publish Date:Feb 11, 2023

Advertisement

ఆస్ట్రేలియాతో నాలుగు టెస్టుల సిరీస్ ను టీమ్ ఇండియా ఘన విజయంతో ప్రారంభించింది. తొలి టెస్టులో  టీమ్ ఇండియా ఇన్నింగ్స్ 132 పరుగుల భారీ ఆధిక్యంతో విజయం సాధించింది. స్పిన్ కు అనుకూలించిన నాగ్ పూర్ పిచ్ పై ఆస్ట్రేలియా పూర్తిగా తేలిపోయింది.

బౌలింగ్ లో, బ్యాటింగ్ లో ఇండియా పూర్తిగా పై చేయి సాధించింది. భారత్ 400 పరుగులు చేసిన ఇదే పిచ్ పై ఆస్ట్రేలియా రెండో ఇన్నింగ్స్ లోనూ కలిపి కూడా ఆ మాత్రం పరుగులు చేయలేకపోయింది. స్పిన్ పిచ్ కోసం ఆస్ట్రేలియా ముందుగానే సిద్ధమై ముగ్గురు స్పిన్నర్లతో రంగంలోనికి దిగినా ఫలితం లేకపోయింది. తొలి టెస్టు ఆడుతున్న మర్ఫీ వినా మిగిలిన వారెవరూ భారత బ్యాటర్లను ఏ మాత్రం ఇబ్బంది పెట్టలేకపోయారు.

మర్ఫి తన తొలి టెస్ట్ తొలి ఇన్నింగ్స్ లోనే 7 వికెట్లు పడగొట్టి సత్తా చాటాడు.  ఇక మ్యాచ్ విషయానికి వస్తే ఆస్ట్రేలియాతో నాలుగు టెస్ట్ ల సిరీస్ లో భాగంగా నాగపూర్ వేదికగా జరిగిన మొదటి టెస్ట్ లో టీమిండియా ఇన్నింగ్స్ 132 పరుగుల ఆధిక్యతతో విజయం సాధించింది. మ్యాచ్ మూడో రోజే ముగిసింది. స్పిన్ కు అనుకూలించిన ఈ పిచ్ పై భారత్ పూర్తి ఆధిపత్యం చెలాయించింది. తొలి ఇన్నింగ్స్ లో ఆస్ట్రేలియాను 177 పరుగలకే ఆలౌట్ చేసిన ఇండియన్ బౌలర్లు, రెండో ఇన్నింగ్స్ లో ఆసీస్ ఇన్నింగ్స్ ను 92 పరుగులకే చాప చుట్టేశారు.

తొలి ఇన్నింగ్స్ లో భారత్ 400 పరుగులు చేసిన సంగతి విదితమే. స్కిప్పర్ రోహిత్ శర్మ అద్భుత సెంచరీతో చెలరేగాడు. ఆ తరువాత జడేజా, అక్షర్ పటేల్ లు హాఫ్ సెంచరీలతో మెరవడంతో టీమ్ ఇండియాకు  222 పరుగుల ఆధిక్యత లభించింది. జడేజా 70 పరుగులు చేయగా, అక్షర్ పటేల్ 84 పరుగులు చేశాడు.  రెండో ఇన్నింగ్స్ లో ఆస్ట్రేలియా బ్యాటింగ్ ఆర్డర్ ను భారత బౌలర్లు కుప్ప కూల్చారు. తొలి ఇన్నింగ్స్ లో జడేజా 5 వికెట్ల పడగొట్టగా, అశ్విన్ 3 వికెట్లు పడగొట్టాడు. రెండో ఇన్నింగ్స్ లో అశ్విన్ ఐదు వికెట్లు పడగొట్టాడు. జడేజా 2 వికెట్లు తీసుకున్నాడు.ఇక షమి 2 వికెట్లు, అక్షర్ పటేల్ 1 వికెట్ తీసుకున్నారు.   

By
en-us Political News

  
ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో కీలక పరిణామం చోటుచేసుకుంది.
చంద్రబాబుతో భేటీలో  ప్రధానంగా చెన్నై నగర తాగునీటి అవసరాలు,  తెలుగు గంగ ప్రాజెక్టు ద్వారా అదనపు నీటి కేటాయింపులపై చర్చ జరిగింది.  
జగన్ అక్రమాస్తులకు సంబంధించిన కేసులలో విచారణ ప్రక్రియను మరింత వేగవంతం చేయాలని సీబీఐ ప్రత్యేక కోర్టు నిర్ణయించింది.  సీబీఐ నమోదు చేసిన కేసులతో పాటు ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) పరిధిలోని కేసులన్నింటినీ కూడా  రోజు వారీగా విచారణ చేపట్టాలని కోర్టు నిర్ణయించింది. 
 వివేకా హత్య కేసులో  మనీలాండరింగ్ అంశంపై జరుగుతున్న విచారణలో భాగంగా  కడప ఎంపీ, వైసీపీ సీనియర్ నేత  వైఎస్ అవినాశ్ రెడ్డి హైదరాబాద్‌లోని ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్  కార్యాలయంలో విచారణకు హాజరయ్యారు.  
గతంలో ప్రజారాజ్యం పార్టీలో పవన్ కల్యాణ్‌తో కలిసి రాధ పనిచేశారు. 2004 ఎన్నికల్లో ఎమ్మెల్యేగా గెలిచారు. 2024 ఎన్నికల్లో టీడీపీ తరఫున స్టార్ క్యాంపెయినర్‌గా రాష్ట్ర వ్యాప్తంగా ప్రచారం చేశారు. ప్రస్తుతం ఆయన జనసేన చేరికపై అధికారిక ప్రకటన వెలువడాల్సి ఉంది.  
తనపై నమోదైన   పరువునష్ట కేసును కొట్టివేయాలని కోరుతూ రాహుల్‌ గాంధీ గతంలో బాంబే హైకోర్టును ఆశ్రయించారు. కానీ, ఆయన చే పిటిషన్‌ను బాంబే హైకోర్టు తోసిపుచ్చింది. కేసును కొట్టివేయలేమని స్పష్టం చేస్తూ గతంలో హైకోర్టు ఇచ్చిన ఆదేశాలను సవాల్ చేస్తూ రాహుల్ గాంధీ సుప్రీం కోర్టును ఆశ్రయించారు.
సరే పలు కేసులలో అరెస్టై కొన్ని నెలల పాటు జైలులో గడిపి బయటకు వచ్చారు. ఆ తరువాత అయితే పూర్తిగా అజ్ణాత వాసంలో ఉన్నారా అన్నట్లుగా వంశీ పూర్తిగా మౌనం వహించారు. ఇంత సుదీర్ఘ విరామం తరువాత ఏమైందో ఏమో కానీ.. ఒక్కసారిగా తాను రాజకీయంగా యాక్టివ్ అవుతున్నట్లు ప్రకటించారు.
కవైపు కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీతో భేటీ, మరోవైపు ప్రధాన మంత్రి నరేంద్ర మోదీతో  వేదికపై పంచుకుంటూ మెట్రో రైలులో ప్రయాణించడం రాజకీయ వర్గాల్లో ఆసక్తి  రేకెత్తిస్తోంది.
ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో మరోసారి అత్యంత కీలక పరిణామాలు చోటుచేసుకుంటున్నాయి.
తమిళనాడు ముఖ్యమంత్రి విజయ్ భిన్నమైన వైఖరిని ప్రదర్శించారు.  ప్రధాని మోదీతో ఆదివానం ఒకే వేదిక పంచకున్న తమిళనాడు సీఎం విజయ్.. ఆ బహిరంగ వేదికపైనే  రాష్ట్ర సమస్యలను, అలాగే  రావాల్సిన నిధులను ప్రస్తావించి అందరి దృష్టినీ ఆకర్శించారు. ప్రధాని వేదికపైనే ఆసీనులై ఉన్నప్పటికీ, ఏమాత్రం సంకోచించకుండా రాష్ట్ర ప్రయోజనాలే తమకు అత్యంత ముఖ్యమని విజయ్ కుండబద్దలు కొట్టారు. 
 సొంత పార్టీకి చెందిన ఎమ్మెల్యేయే ప్రభుత్వ విధానాలపై న్యాయపోరాటానికి దిగడం, తనకు జరిగిన అన్యాయంపై పార్టీ హైకమాండ్ కూ, సీఎం రేవంత్ రెడ్డి తీరుపై అగ్రనేత రాహుల్ కు ఫిర్యాదు చేస్తానంటూ హెచ్చరికలు జారీ చేయడం సంచలనంగా మారింది.  
జగన్ అక్రమాస్తులకేసుల విచారణను వేగవంతం చేయాలని ఈడీ కోర్టును ఆశ్రయించడాన్ని సమర్ధించిన తెలుగుదేశం ఎమ్మెల్యే సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి.. ఈ కేసులను  కేవలం రోజువారీ విచారణ కాకుండా, ప్రతి రోజూ, రోజంతా విచారణ జరిగేలా చర్యలు తీసుకోవాలన్నారు.  
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.