బాబుదే అధికార పీఠం ఎలాగంటే..?

Publish Date:Aug 16, 2022

Advertisement

ఆంధ్రప్రదేశ్ శాసనసభ సాధారణ ఎన్నికలకు చాలా సమయం ఉన్నప్పటికీ రాష్ట్రంలో ఇప్పటికే ఎన్నికల ఫీవర్ వచ్చేసింది. ఒక పక్కన అధికార వైసీపీ, మరో పక్కన ప్రతిపక్ష టీడీపీ, ఇంకో వైపున జనసేన, బీజేపీలు తమ తమ పార్టీ శ్రేణుల్లో ఉత్సాహం నింపడంలో తలమునకలై ఉన్నాయి. మరో పక్కన పబ్లిక్ సర్వేల పేరుతో పలు సంస్థలు నివేదికలు కూడా ప్రకటిస్తున్నాయి. ఇప్పటికిప్పుడు ఏపీలో ఎన్నికలు జరిగితే.. అనే ప్రాతిపదికన ఆయా సర్వేలు నిర్వహించి, ఫలితాలు ప్రకటిస్తున్నాయి. ఆయా సర్వేల నివేదికల ఫలితాల ప్రకారం ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరిగితే సీట్లు తగ్గినా అధికార వైసీపీదే మళ్లీ అధికారం అని చెబుతున్నాయి.

అయితే.. సుమారు ఏడాదిన్నర తర్వాత జరిగే ఎన్నికల వరకు ఇదే మూడ్ ఓటర్లలో ఉంటుందా? అంటే దానికి అవునని మాత్రం చెప్పలేకపోతున్నాయి. ప్రస్తుత పరిస్థితిని బట్టి చూస్తే సంక్షేమ పథకాల ద్వారా వైసీపీ సర్కార్ దిగువ స్థాయి, మధ్య తరగతిలోని కొన్ని వర్గాల ఓట్లను రాబట్టుకోగలుగుతుందనీ, ఉన్నత వర్గాలు, మధ్యతరగతిలోని కొన్ని వర్గాల వారు, తటస్థులు అధిక శాతం మంది పోలింగ్ బూత్ లకు వచ్చి ఓటు వేసే పరిస్థితి అంతగా ఉండదనీ అంటున్నారు. అలాంటప్పుడు పోలింగ్ శాతం తక్కువ నమోదవుతుంది. అలా ఓటు వేసేది దిగువ, కిందిస్థాయి వర్గాల వారే అయి ఉంటారు. సంక్షేమ పథకాలతో లబ్ధి పొందుతున్న వారు అధికార పార్టీ వైపు మొగ్గుచూపే అవకాశాలే ఎక్కువగా ఉంటాయి. అదే.. పోలింగ్ శాతం అధికంగా పెరిగితే మాత్రం అధికార వైసీపీకి చెక్ చెప్పినట్లే అనే విశ్లేషణలు వస్తున్నాయి.

నిజానికి ఉన్నతస్థాయి, మధ్యతరగతి వర్గాలు, తటస్థులను పోలింగ్ బూత్ లకు గనుక రప్పించ గలిగితే ప్రతిపక్ష  టీడీపీకే ప్రయోజనం కలుగుతుందంటున్నారు. పోలింగ్ శాతం పెరగడం అంటే.. అధికార పక్షంపై వ్యతిరేకత ఒకటైతే.. ఉన్నత, మధ్యతరగతి, తటస్థంగా ఉండే వర్గాల ఓట్లు పోలవడం మరో కారణం అవుతుంది. అదే జరిగితే అధికార వైసీపీకి మూడినట్లే అనే అంచనాలు వస్తున్నాయి. అదే సమయంలో టీడీపీకి విజయావకాశాలు పెరుగుతాయంటున్నారు.

 ఇప్పటి వరకు వచ్చిన సర్వేల ప్రకారం పేదలు, గ్రామీణ ఓటర్లలో మాత్రం వైసీపీ పట్ల కొంత సానుకూలత ఉంది. ఈ కారణంతోనే ప్రస్తుత పరిస్థితుల్లో ఏపీలో మళ్లీ వైసీపీకే అధికారం అనే అంచనాలు వస్తున్నాయి. సంక్షేమ పథకాలు అందుకుంటున్నవారు వైసీపీ పట్ల సంతోషంగానే ఉంటారు. అయితే.. ఏపీలో అభివృద్ధి అసలే లేదనే చర్చ ఉన్నతస్థాయి మధ్యతరగతి వర్గాల్లోని విద్యావంతుల్లో కొనసాగుతోంది. వీరితో పాటు తటస్థుల్లో కూడా ఇలాంటి చర్చే జరుగుతోంది. ఈ మూడు వర్గాల్లోనే వైసీపీ వ్యతిరేక ఓటు ఉంటుంది. అందుకే ఈ మూడు వర్గాలను ఆకట్టుకోగలిగితే.. టీడీపీకి సానుకూలత పెరుగుతుందనే అంచనాలు వస్తున్నాయి.

పోలింగ్ బూత్ లకు ఉన్నత వర్గాలు రారు అనే బలమైన భావన ఉంది. మధ్యతరగతి వర్గాల్లో అధికశాతం మంది పోలింగ్ కు గైర్హాజరవుతుంటారు. తటస్థులైతే ఎవరికి ఓటు వేస్తే ఏం ప్రయోజనం అనే వేదాంత ధోరణిలో ఓటింగ్ కు దూరంగా ఉంటుంటారు. వాస్తవానికి ఈ మూడు వర్గాలు తలచుకుంటే మాత్రం ఫలితాలను తారుమారు చేయగల స్థితిలో ఉన్నాయి. ఒకవేళ వారు బయటికి వచ్చి ఓట్లు వేస్తే మాత్రం.. బలమైన మార్పు తప్పదనే భావించాలి. ఏపీలో మళ్లీ వైసీపీ అధికారంలోకి వస్తే రాష్ట్రం కచ్చితంగా ఇబ్బందుల్లో పడుతుందనే భావన ఈ మూడు వర్గాల్లోనూ ఉంది. అయితే.. అది ఉద్యమ స్థాయిలో లేదనే చెప్పాలి. ఈ భావననే ఏపీ ప్రజల్లో రాజేసేందుకు టీడీపీ అహరహం కృషి చేస్తోంది. టీడీపీ ప్రయత్నాలు ఉన్నత, మధ్యతరగతి, తటస్థ వర్గాలను ఆకర్షించగలిగితే.. వైసీపీకి ప్రమాద ఘంటికలు మోగించినట్లే అంటున్నారు. 

చూడాలి మరి.. 2024లో ఏపీలో ఏమి జరుగుతుందో.. టీడీపీ గనుక ఆ మూడు వర్గాలను పోలింగ్ బూత్ లకు రప్పించ గలిగితే భారీ పోలింగ్ జరుగుతుంది. అదే జరిగితే అధికార మార్పిడి తప్పదంటున్నారు రాజకీయ విశ్లేషకులు.

By
en-us Political News

  
బీఆర్ఎస్ ప్రతిష్ఠాత్మకంగా నిర్వహించనున్న యువ సంగ్రామ సభకు తెలంగాణ హైకోర్టు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది.
ఢిల్లీలోని జంతర్ మంతర్ వేదికగా సోనమ్ వాంగ్ చుక్ నిరవధిక నిరశన సాగుతోంది. గత 20 రోజులుగా ఆయన నిరాహార దీక్ష చేస్తుండటంతో.. ఆరోగ్య పరిస్థితి క్రమంగా క్షీణిస్తోందని వైద్య వర్గాలు తెలిపాయి. ఆరోగ్యం క్షీణిస్తున్న నేపథ్యంలో, దేశవ్యాప్తంగా ప్రజల్లో, సామాజిక మాధ్యమాల్లోఆయనకు మద్దతు అనూహ్యంగా పెరిగింది.
తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సోనమ్ వాంగ్ చుక్ తో భేటీకి హస్తిన పర్యటనకు సిద్ధమవుతున్నట్లు తెలుస్తోంది. నేడో రేపో రేవంత్ రెడ్డి దిల్లీకి చేరుకుని, జంతర్ మంతర్ వద్ద దీక్ష చేస్తున్న సోనమ్ వాంగ్‌చుక్‌ను స్వయంగా కలిసి సంఘీభావం ప్రకటించనున్నారని కాంగ్రెస్ లో అత్యంత విశ్వసనీయవర్గాల ద్వారా తెలుస్తోంది.
ఆంధ్రప్రదేశ్ రాజకీయాలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ (YCP) ప్రస్తుతం తీవ్రమైన వ్యూహాత్మక అయోమయంలో కొట్టుమిట్టాడుతోంది.
ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో జూనియర్ ఎన్టీఆర్ (తారక్) రాజకీయ అరంగేట్రం గురించిన చర్చ
అమర్ రాజాకు కాలుష్య నియంత్రణ మండలి నిబంధనల పేరుతో నోటీసులు ఇవ్వడం, విద్యుత్ కనెక్షన్లు కట్ చేయడం వంటి చర్యలతో నాటి ప్రభుత్వం ఎలా ఇబ్బందులకు గురి చేసిందో.. పారిశ్రామిక వర్గాలు గుర్తుచేసుకుంటున్నాయి. ఏపీలో పుట్టి పెరిగిన ఒక ప్రతిష్టాత్మక సంస్థ, తన భవిష్యత్తు విస్తరణ, వృద్ధి ప్రస్థానం కోసం రాష్ట్రం దాటి వెళ్లాల్సిరావడంపై సర్వత్రా ఇప్పుడు మరోసారి చర్చ మొదలైంది.
వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధికారిక డిజిటల్ వేదికగా రూపొందించిన జగన్ 2.0 సూపర్‌యాప్‌ను వైసీపీ అధినేత జగన్‌ గురువారం తాడేపల్లిలోని పార్టీ కేంద్ర కార్యాలయంలో ఆవిష్కరించారు.
భీమవరం, కిర్లంపూడి లలో పర్యటించారు. రెండు చోట్లా కూడా గందరగోళ పరిస్థితులు నెలకొన్నాయి. ప్రజలలో పట్టు నిరూపించుకోవడానికి ఆయన చేపట్టిన ఏ పర్యటన అయినా సరే.. ఉద్రిక్తతలు, గందరగోళం మధ్యే సాగుతున్నాయి.
కిర్లంపూడి పోలీస్ స్టేషన్‌లో ఆయనతో పాటు మరికొందరు  వైసీపీ నేతలపై  పోలీసులు  ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. ప్రభుత్వ నిబంధనల ప్రకారం విధుల్లో ఉన్న పోలీసు సిబ్బందిని అడ్డుకుని, వారిపై భౌతిక దాడికి దిగారనే ఆరోపణలపై ఈ చర్యలు తీసుకున్నారు. 
రేవంత్ రెడ్డి ప్రభుత్వానికి కౌశిక్ రెడ్డి ఒక ఛాలెంజ్ విసిరారు. కన్నెపల్లి పంప్ హౌస్ ద్వారా నీటిని వెంటనే ఎత్తిపోయాలని, ఆ నీటిని అన్నారం, సుందిళ్ల బ్యారేజీల మీదుగా ఎల్లంపల్లికి తరలించాలని డిమాండ్ చేశారు. ఒకవేళ ఆ విధంగా నీటిని ఎత్తిపోసే ప్రక్రియలో అన్నారం లేదా సుందిళ్ల బ్యారేజీలకు ఏవైనా నష్టాలు లేదా ప్రమాదాలు జరిగితే, దానికి పూర్తి బాధ్యత తమదేనన్నారు.
ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి కొణిదెల పవన్ కల్యాణ్.. ముద్రగడ సమాజానికి చేసిన సేవలను గుర్తించి ఈ గౌరవాన్ని కల్పించాలని నిర్ణయించారు. ఈ మేరకు అంత్యక్రియల ఏర్పాట్లను పర్యవేక్షించాలని, అన్ని రకాల ప్రభుత్వ మర్యాదలు లోటు లేకుండా చూడాలని ఉన్నతాధికారులను ప్రభుత్వం ఆదేశించింది.
ల్పపీడన ప్రభావంతో జులై మూడో వారంలో దేశవ్యాప్తంగా వర్షాలు మళ్లీ ఊపందుకోనున్నాయి. ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్, తెలంగాణతో పాటు మధ్య భారతదేశం, తూర్పు రాష్ట్రాలలో విస్తారంగా వర్షాలు కురుస్తాయని భారత వాతావరణ శాఖ పేర్కొంది.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.