పులివెందులలో జగన్ కు మరో షాక్: జడ్పీటీసీ తెలుగుదేశం కైవసం.!

Publish Date:Nov 7, 2026

Advertisement

మునిసిపోల్స్ లో పులివెందులలో వైసీపీకి ఎదురైన ఘోర పరాభవం నుంచి తేరుకోకముందే పరిషత్ ఎన్నికలలోనూ ఆ పార్టీకి బిగ్ షాక్ తగిలింది. నిన్నటి వరకూ జగన్ కు పెట్టని కోటలా నిలిచిన పులివెందులలో ఇప్పుడు తెలుగుదేశం జెండా ఘనంగా ఎగురుతోంది.  సుదీర్ఘకాలంగా వైసీపీకి తిరుగులేని కంచుకోటగా ఉన్ పులివెందుల పరిధిలో తెలుగుదేశం పార్టీ తన ఉనికిని బలంగా చాటుకుంటోంది. పులివెందుల మునిసిపాలిటీని కోల్పోయిన రోజుల వ్యవధిలోనూ వైసీపీ పులివెందుల జడ్పీటీసీ స్థానాన్ని కూడా కోల్పోయింది. . తాజాగా నిర్వహించిన స్థానిక సంస్థల పరిషత్ ఎన్నికల లెక్కింపు ప్రక్రియలో పులివెందుల జడ్పీటీసీ   స్థానాన్ని టీడీపీ  భారీ ఆధిక్యతతో గెలుచుకుంది.  

ఈ పరిషత్ పోరులో తెలుగుదేశం పార్టీ తరఫున పోటీ చేసిన అభ్యర్థి భారతి ఓట్ల లెక్కింపు ప్రారంభం నుంచి ప్రత్యర్థిపై నిలకడగా ఆధిక్యాన్ని కనబరుస్తూ వచ్చారు. తుది ఫలితం వెలువడేసరికి ఆమె తన  సమీప ప్రత్యర్థి  వైసీపీ అభ్యర్థిపై 1,463 ఓట్ల మెజార్టీతో ఘన విజయం సాధించారు. ఫలితం వెలువడగానే కౌంటింగ్ కేంద్రం వెలుపల అలాగే నియోజకవర్గవ్యాప్తంగా టీడీపీ మద్దతుదారులు పెద్ద ఎత్తున సంబరాలు జరుపుకున్నారు.

కొద్దిరోజుల క్రితమే నిర్వహించిన పులివెందుల మున్సిపల్ ఎన్నికల ఫలితాల్లోనూ తెలుగుదేశం పార్టీ విజయ దుందుభి మోగించిన సంగతి తెలిసిందే. పట్టణ ప్రాంతంలో లభించిన ఆ అనూహ్య మద్దతు కాకతాళీయం కాదని, గ్రామీణ ప్రాంత పరిధిలోకి వచ్చే ఈ జడ్పీటీసీ ఎన్నికలలోనూ తెలుగుదేశం విజయం, పులివెందులలో వైసీపీ పట్టు కోల్పోయిందనడానికి తార్కానమని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. వరుసగా మున్సిపాలిటీ, పరిషత్ స్థానాల్లో   వైసీపీ పరాజయం పాలుకావడం ఆ పార్టీ శ్రేణులను తీవ్ర  ఆందోళనకు గురిచేయడమే కాకుండా, వారిలో నిరాశను, నిస్ఫృహను నింపింది. 

 ఫలితాలు అధికారికంగా వెలువడిన వెంటనే స్థానిక నాయకులు బాణాసంచా కాల్చి, ఒకరికొకరు మిఠాయి  తినిపించుకుంటూ సంబరాలు చేసుకున్నారు. స్థానిక స్థాయిలో  సాధించిన ఈ వరుస విజయాలు రాబోయే రోజుల్లో పులివెందుల రాజకీయ సమీకరణాలను పూర్తిగా మార్చివేస్తాయని తెలుగుదేవం శ్రేణులు ధీమా వ్యక్తం చేస్తున్నాయి. 

ఇది కూడా చదవండి: ఎస్కార్ట్ నంటూ నీడలా వెంబడించి: చెవిరెడ్డికి చెమటలు పట్టించి, చుక్కలు చూపించిన సుధారెడ్డి.!

వైసీపీకి కంచుకోట అయిన పులివెందులలో చోటుచేసుకున్న ఈ రాజకీయ మార్పు   వెనుక స్థానిక ప్రజల నాడిలో వచ్చిన మార్పే కారణమంటున్నారు.  వరుస ఓటములతో వైసీపీకి తమ సొంత నియోజకవర్గంలోనే ఓటర్ల నుంచి వ్యతిరేకత వ్యక్తమవుతోందా అన్న అంతర్మథనంలో వైసీపీ ఉంది.  రాబోయే రోజుల్లో   పులివెందులలో తెలుగుదేశం పార్టీ తన పట్టును మరింత పటిష్టం చేసుకునే దిశగా ముందుకు సాగుతుందనడంలో సందేహం లేదు. నియోజకవర్గవ్యాప్తంగా   స్థానిక సమస్యలపై దృష్టి సారిస్తూ ప్రజల్లోకి వెళ్లేందుకు పార్టీ వ్యూహాలు సిద్ధం చేస్తోంది. మరోవైపు, వరుస పరాజయాల నుంచి కోలుకుని తిరిగి పుంజుకునేందుకు వైసీపీ ఏ విధమైన దిద్దుబాటు చర్యలు చేపడుతుందో వేచి చూడాల్సి ఉంది.  

మీకు నచ్చవచ్చు: పోటీ నుంచి వైదొలగిన వైసీపీ జడ్పీటీసీ అభ్యర్థలు: మైదుకూరు, చిన్నమండెంలో వైసీపీకి బిగ్ షాక్.!

పులివెందులలో ఉద్రిక్తత: పార్నపల్లె వద్ద అవినాష్ రెడ్డిని అడ్డుకున్న పోలీసులు.!

[Telugudesham Bags Pulivendula ZPTC, Jagan Bastion, Collapse, YCP, Shock, TeluguOne]

By
en-us Political News

  
తెలుగు చలనచిత్ర పరిశ్రమలో మరో విషాద ఛాయలు అలుముకున్నాయి.
తెలంగాణ కాంగ్రెస్ రాజకీయ వర్గాల్లో గత కొంతకాలంగా నెలకొన్న ఉత్కంఠకు అఖిల భారత కాంగ్రెస్ కమిటీ (ఏఐసీసీ) అధికారికంగా తెరదించింది.
తెలుగు చలనచిత్ర పరిశ్రమలో తీవ్ర విషాదం చోటుచేసుకుంది.
తీపి పదార్థమనుకుని నోట్లో పెట్టుకున్నాడు.. చివరకు విగతజీవిగా మారాడు!
డిజిటల్ ఆర్థిక వ్యవస్థలో కీలక పాత్ర పోషిస్తున్న గిగ్ వర్కర్ల సంక్షేమానికి తెలంగాణ ప్రభుత్వం కీలక అడుగులు వేస్తోంది.
బంగారం ప్రియులకు ఇది నిజంగానే ఊరటనిచ్చే శుభవార్త అని చెప్పవచ్చు
తెలంగాణను ప్రపంచ పెట్టుబడులకు అనుకూలమైన రాష్ట్రంగా నిలబెట్టడమే లక్ష్యంగా ప్రభుత్వం ముందుకు సాగుతోందని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్నారు.
హానీట్రాప్ ఉచ్చులో పడిన వాయుసేన అధికారి.. షాకింగ్ నిజాలు వెల్లడించిన ఛార్జ్‌షీట్.!
మినీ బస్‌ను ఢీకొన్న ట్రక్కు.. 23 మంది మృతి.!
రాష్ట్రంలో 25 పారిశ్రామిక ఎకోసిస్టమ్ లను అభివృద్ధి చేస్తాం: లోకేష్
ఈ నేపథ్యంలో వైయస్ జగన్మోహన్ రెడ్డికి అత్యంత సన్నిహితుడైన చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి వైసీపీ తరపున తొలిసారిగా విజయసాయి పార్టీపై స్పందించారు. అయితే, ఆయన తన స్పందనను చాలా సాధారణంగా, క్లుప్తంగా ముగించడమే కాకుండా విజయసాయి రెడ్డిని   తేలికగా తీసుకున్నట్లు కనిపించింది.
1999లో ఎయిర్‌పోర్టుల గురించి ఎవరూ పెద్దగా ఆలోచించని సమయంలోనే.. సీఎం చంద్రబాబు నాయుడు శంషాబాద్‌లో అంతర్జాతీయ విమానాశ్రయం నిర్మాణంపై దృష్టి పెట్టారు.
ఇంట్లో ఆడపిల్ల జన్మిస్తే ఆ ఇంటికి మహాలక్ష్మి వచ్చినట్టేనని పెద్దలు అంటారు.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.