తమిళ తెరపై తెలుగు రాజకీయం !

Publish Date:Jul 11, 2025

Advertisement

తమిళనాడు శాసన సభ ఎన్నికల సమయం సమీపిస్తున్న కొద్దీ రాజకీయం వేడెక్కుతోంది.  ముఖ్యంగా.. కొత్తగా రాజకీయ అరంగేట్రం చేసిన  హీరో విజయ్, ఆయన స్థాపించిన టీవీకే (తమిళగ వెట్రి కళగం) పార్టీ పరిస్థితి ఏమిటి?  తమిళ రాజకీయాల్లో ఆ పార్టీ ప్రభావం ఎంత?  టీవీకే 2026 ఎన్నికల్లో ఏ మేరకు ఓటర్లను ప్రభావితం చేస్తుంది. అధికార డిఎంకే, ప్రధాన ప్రతిపక్షం ఎఐడిఎంకేల సారథ్యంలోని కూటములలో, ఏ కూటమిని ఏ మేరకు టీవీకే ప్రభావితం చేస్తుంది?  అనే చర్చ రాష్ట్ర రాజకీయ వర్గాల్లోనే కాదు.. జాతీయ స్థాయిలోనూ జోరుగా సాగుతోంది. నిజానికి  ఇప్పడు తమిళనాడు రాజకీయాల గురించిన ఏ చర్చ వచ్చినా..  విజయ్ ప్రస్తావన లేకుండా ముగియడం లేదనడం ఇసుమంతైనా అతిశయోక్తి కాదు.  

నిజానికి తమిళ రాజకీయాల్లో మొదటి నుంచి సినీతారల ప్రభావం బలంగా ఉంటూనే వుంది. హీరో ఇమేజ్ తో అనేక మంది ప్రముఖ హీరోలు రాజకీయ అరంగేట్రం  చేశారు. అయితే, సుక్సెస్ రేట్  చాల తక్కువ. విజయ్ కు ముందు ఐదేళ్ళ కిందట 2021 అసెంబ్లీ ఎన్నికల సమయంలో కమలహాసన్  పొలిటికల్ ఎంట్రీ  ఇచ్చారు.  ఎంఎన్ఎం (మక్కల్ నీతి మైమ్) పార్టీని స్థాపించారు.  అసెంబ్లీ ఎన్నికల్లో పోటీచేశారు. ఆయనతో సహా ఎంఎన్ఎం టికెట్ పై పోటీ చేసిన ప్రతి ప్రతి ఒక్కరూ ఒడి పోయారు. ఎంఎన్ఎం ఖాతా తెరవలేదు. చట్ట సభల్లో కాలు పెట్టాలనే కమల్ హసన్  కల అప్పుడు  తీర లేదు. చివరకు డిఎంకే’ పంచన చేరి రాజ్యసభలో అడుగుపెట్టారు. 

అయితే విజయ్ పరిస్ధితి కూడా అంతేనా.. అంటే కాక పోవచ్చని తమిళనాడు రాజకీయాలను దగ్గరగా చూస్తున్న పరిశీలకులు అంటున్నారు. అంతేకాదు.. విజయ్ రాజకీయాలను కమలహసన్  రాజకీయంతో కంటే..  మెగా స్టార్ చిరంజీవి రాజకీయ ప్రస్థానంతో పోల్చవచ్చని అంటున్నారు. ఉమ్మడి ఆంధ్ర ప్రదేశ్ లో మెగా స్టార్’ చిరంజీవి ప్లే చేసిన రోల్..  తమిళనాడులో విజయ్ ప్లే చేసే అవకాశం ఉందని రాజకీయ పండితులు విశ్లేషిస్తున్నారు.

ఉమ్మడి ఆంధ్ర ప్రదేశ్ లో 2009 అసెంబ్లీ ఎన్నికలకు ముందు మెగాస్టార్ చిరంజీవి స్థాపించిన ప్రజారాజ్యం పార్టీ (పీఆర్పీ) ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర రాజకీయ గతిని మార్చి వేసిన విషయాన్ని పరిశీలకులు గుర్తు చేస్తున్నారు. నిజానికి,ఆ ఎన్నికల్లో పీఆర్పీ ఆశించిన మేరకు సీట్లు గెలుచుకోలేదు. మొత్తం 294 స్థానాలున్న అసెంబ్లీలో కేవలం 18 స్థానాలను మాత్రమే గెలుచుకుంది.  కానీ..  16.32శాతం  ప్రభుత్వ వ్యతిరేక ఓటును గణనీయంగా  శాతం  చీల్చడం ద్వారా అధికార కాంగ్రెస్ పార్టీ విజయానికి.. వైఎస్ రాజశేఖర రెడ్డి రెండవసారి ముఖ్యమంత్రి కావడానికి పరోక్షగా దోహదం చేసింది. ఆ తర్వాత మొత్తానికే చిరంజీవి  ప్రజారాజ్యం పార్టీని కాంగ్రెస్ పార్టీలో విలీనం చేసి..  రాజ్యసభ సీటును, కేంద్రంలో మంత్రి పదవిని కానుకగా పొందారు. అది వేరే విషయం.

ఆ ఎన్నికల్లో పీఆర్పీ ఎంట్రీ వలన.. అప్పటి  ప్రతిపక్ష  తెలుగు దేశం పార్టీ భారీగా నష్ట పోయింది. ఒకటి రెండు కాదు.. 294 అసెంబ్లీ స్థానాలకు గానూ 235 స్థానాల్లో పీఆర్పీ, ప్రతిపక్ష టీడీపీ ఓటును 10,000 కంటే ఎక్కువ చీల్చించి.. వాటిలో 147 స్థానాల్లో 20,000 మరో 92 స్థానాల్లో 30.000 ఓట్లను చీల్చింది. మరో వంక ఇంచు మించుగా 40 అసెంబ్లీ స్థానాల్లో టీడీపీ కేవలం 5000 ఓట్ల కంటే తక్కువ ఓట్ల తేడాతో అప్పటి ఎన్నికలలో ఓడిపోయింది.

అదలా ఉంటే తాజా సర్వేల ప్రకారం హీరో విజయ్  పార్టీ ఓటు షేర్  16 శాతం క్రాస్ చేసింది. ఈ నేపధ్యంలో.. ఇదే ట్రెండ్ 2026 అసెంబ్లీ ఎన్నికల వరకు కొనసాగితే,విజయ్ తమిళ చిరంజీవి అవుతారని అంటున్నారు. అయితే, విజయ్ పూర్తిగా ప్రతిపక్షం ఒటునే చీలుస్తారా? అధికార పార్టీ ఓటును కొల్లగొడతారా? అంటే..  రెండు ప్రధాన ద్రవిడ పార్టీలకు విజయన్ గండి కొట్టడం ఖాయమని అంటున్నారు. అయితే ఎన్నికలకు ఇంకా ఆరేడు నెలల సమయం ఉన్నందున ఈలోగా ఏదైనా జరగచ్చని.. విశ్లేషకులు అంటున్నారు.

ఇదంతా ఒకెత్తయితే.. నగరి మాజీ ఎమ్మెల్యే, మాజీ మంత్రి ఆర్కే రోజా కూడా తమిళరాజకీయాలపై చెప్పుకోదగ్గ ఆసక్తి చూపుతున్నారు. నటిగా రోజాకు తెలుగు రాష్ట్రాలలోనే కాకుండా తమిళనాట కూడా మంచి క్రేజ్ ఉంది. గతంలో హీరోయిన్ గా ఆమెకు తమిళ ప్రేక్షకులు కూడా నీరాజనాలు పట్టారు. అంతకు మించి రోజా భర్త సెల్వమణి మంచి గుర్తింపు ఉన్న దర్శకుడు. తమిళ సినీరంగంలో మంచి పలుకుబడి కలిగిన వ్యక్తి కావడంతో రోజా తమిళ రాజకీయాలపై దృష్టి సారించారని అంటున్నారు. 

గతంలో అంటే గత ఏడాది జరిగిన ఏపీ అసెంబ్లీ ఎన్నికలలో వైసీపీ ఘోర పరాజయం తరువాత కొంత కాలం పాటు రోజా పూర్తిగా తమిళనాడుకే పరిమితమయ్యారు. అప్పటిలోనే ఆమె విజయ్ పార్టీలో చేరి చక్రం తిప్పుతారన్న వార్తలు రాజకీయవర్గాలలో గట్టిగా వినిపించాయి. అయితే తరువాత ఆమె యథా ప్రకారం వైసీపీ తరఫున మీడియా ముందుకు వచ్చి రాష్ట్రంలో తెలుగుదేశం నేతృత్వంలోని కూటమి సర్కార్ పై తనదైన శైలిలో విరుచుకుపడుతున్నారు. తాను ఒక వైపు ఏపీ రాజకీయాలలో ఉంటూనే , తన భర్త సెల్వమణిని విజయ్ పార్టీకి దగ్గర చేస్తున్నారని అంటున్నారు.  మొత్తం మీద రోజా ఏదో ఒక మేరకు తమిళ రాజకీయాలలోనూ తన ప్రభావం చూపే అవకాశాలు ఉన్నాయంటున్నారు. 

By
en-us Political News

  
పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో రాజకీయ వాతావరణం మరింత వేడెక్కింది.
ఎమ్మెల్యేల పనితీరును ప్రజల నుంచే తెలుసుకోవాలని చంద్రబాబు నిర్ణయించారు. మే 1 నుంచే ఆ ప్రక్రియకు శ్రీకారం చుట్టారు. ప్రజల నుంచి వచ్చే స్పందన ఆధారంగా ఎమ్మెల్యేలు పనితీరు మార్చుకోవాల్సి ఉంటుందని చంద్రబాబు నాయుడు స్పష్టం చేశారు.
స్ట్రాంగ్ రూమ్ వద్ద సిసిటివి దృశ్యాలను టీవీలో చూసినప్పుడు తనకు అనుమానం కలిగిందనీ.. అందుకే స్వయంగా తనిఖీ చేయడానికి వచ్చానని మమతా బెనర్జీ తెలిపారు. అక్కడ జరుగుతున్న పరిణామాలపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రాణాలకు తెగించి అయినా సరే ప్రజా తీర్పును కాపాడుకుంటామన్న మమతా బెనర్జీ.. ఓట్ల లెక్కింపులో ఎలాంటి అవకతవకలు జరిగినా సహించేది లేదని హెచ్చరించారు.
తెలుగువన్ వాస్తవ వేదికలో ప్రస్తుత ఆంధ్రప్రదేశ్ రాజకీయ పరిస్థితులపై విస్తృత చర్చ జరిగింది.
తెలంగాణ రాజకీయ యవనికపై మరో కొత్త పార్టీ అధికారికంగా అడుగుపెట్టింది.
మొత్తం 140 అసెంబ్లీ స్థానాలున్న కేరళలో, ఈ నెల 23న ఒకే విడతలో ఎన్నికలు జరిగిన సంగతి తెలిసిందే. రాష్ట్రంలో అధికార పగ్గాలు అందుకోవాలంటే మ్యాజిక్ ఫిగర్ 71. బుధవారం వెలువడిన ఎగ్జిట్ పోల్స్ అన్నీ ముక్తకంఠంతో యూడీఎఫ్‌కే అధికారమని అంచనా వేశాయి.
తమిళనాట అధికారం చేపట్టడానికి అవసరమైన మ్యాజిక్ ఫిగర్ 117 కాగా.. విజయ్ టీవీకే పార్టీ 98 నుంచి 120 సీట్లు గెలిచే అవకాశం ఉందని యాక్సిస్ మై ఇండియా సర్వే అంచనా వేసింది.
ప్రకాష్ రాజ్ తన విమర్శల్లో ప్రధానంగా పవన్ కళ్యాణ్ స్పందనల్లో ఉన్న వైవిధ్యాన్ని వేలెత్తి చూపారు. తిరుమల లడ్డూ వివాదంపై జాతీయ స్థాయిలో చర్చ జరగాలని కోరుతున్న పవన్ కల్యాణ్.. గతంలో దేశాన్ని కుదిపేసిన ఇతర కీలక సంఘటనల సమయంలో ఎందుకు మౌనంగా ఉన్నారని నిలదీశారు.
యాక్సిస్ మై ఇండియాతన అంచనాలలో తృణమూల్ కాంగ్రెస్‌కు స్పష్టమైన ఆధిక్యాన్ని కట్టబెట్టింది. ఈ సంస్థ అంచనా ప్రకారం టీఎంసీ 165 నుంచి 185 స్థానాలను గెలుచుకునే అవకాశం ఉండగా.. బీజేపీ 95 నుంచి 110 స్థానాలకే పరిమితం కావచ్చని ఆ సర్వే ఫలితం పేర్కొంది. ఇక సీ-ఓటర్ సర్వే కూడా మమతా బెనర్జీపైనే బెంగాల్ ప్రజలు విశ్వాసం ఉంచారని పేర్కొంది.
పదవి వచ్చిందనే అహంకారం వద్దనీ, అందరినీ కలుపుకుని ముందుకుసాగాలని టీడీపీ నేషనల్ వర్కింగ్ ప్రెసిడెంట్ మంత్రి నారా లోకేష్ పేర్కొన్నారు
యువతను పార్టీ వైపు ఆకర్షించడంలోనూ, క్షేత్రస్థాయిలో పార్టీని బలోపేతం చేయడంలోనూ లోకేశ్ పోషించిన పాత్రకు గుర్తింపుగా ఆయనకు పార్టీలో జాతీయ కార్యనిర్వాహక అధ్యక్షుడిగా ప్రమోషన్ ఇచ్చిన సంగతి తెలిసిందే. లోకేష్ తో పాటుగా కొత్తగా ఎంపికైన కమిటీ సభ్యులందరితో చంద్రబాబు స్వయంగా ప్రమాణం చేయించారు.
బెంగాల్ ఎన్నికలలో తొలి విడతలో రికార్డు స్థాయిలో 93 శాతానికి పైగా పోలింగ్ జరగడంతో.. తుది విడతలోనూ అదే స్థాయిలో పోలింగ్ జరిగే అవకాశాలున్నాయంటున్నారు. రెండో విడతలో దక్షిణ బెంగాల్ ప్రాంతంలో మమతా బెనర్జీకి కంచుకోట వంటి కోల్‌కతా, హౌరా, నాడియా, హూగ్లీ వంటి కీలక జిల్లాల్లో పోలింగ్ జరుగుతుండటంతో రాజకీయ వాతావరణం వేడెక్కింది.
ఒడిశాకు చెందిన ఒక నిరుపేద వ్యక్తి తన సోదరి మరణానంతరం ఆమె బ్యాంకు ఖాతాలో ఉన్న ఇరవై వేల రూపాయలు విత్ డ్రా చేసుకోవడానికి బ్యాంకును సంప్రదించాడు. ఆ డబ్బుతో ఆమె అంత్యక్రియల తాలూకు ఖర్చులు లేదా ఇతర అవసరాలు తీర్చుకోవాలని చెప్పాడు.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.