అభినయానికి ప్రాణమిచ్చిన నాటక రంగం.. 

Publish Date:Apr 16, 2025

Advertisement

 

కళలకు భారతదేశం పెట్టింది పేరు.  ఇప్పుడు సినిమా హాళ్లలో సినిమాలు ఇంతగా వస్తున్నాయి కానీ.. కొన్ని సంవత్సరాల క్రితం వీధులలో నాటకాల రూపంలో వివిధ కథలు, చారిత్రాత్మక సంఘటనలను ప్రదర్శించేవారు. ఇలా పుట్టిందే నాటక రంగం. రాత్రి సమయాల్లో లాంతర్లు,  దివిటీలు పెట్టి నాటకాలను ప్రదర్శించేవారు.  పగలంతా కష్టం చేసిన ఆనాటి ప్రజలకు రాత్రయ్యే సరికి ఇదొక మంచి వినోదంగా ఉండేది. ఈ కోవలో హరికథలు,  బుర్రకథలు, తోలుబొమ్మలాట వంటివి ఎన్నో ఉన్నాయి. కానీ సినీ పరిశ్రమ ఇంత ఎత్తు ఎదగడానికి కారణమైనది మాత్రం నాటక రంగమే..  ప్రతి ఏడాది ఏప్రిల్ 16వ తేదీని తెలుగు నాటక రంగ దినోత్సవం గా జరుపుకుంటారు.  అయితే ఇందులో ఉన్న ప్రత్యేకత ఏమిటంటే.. ఈ తెలుగు నాటక రంగ దినోత్సవం అనేది ప్రముఖ సంఘసంస్కర్త కందుకూరి విరేశలింగం పంతులు గారి జన్మదినోత్సవం సందర్బంగా  జరుపుకుంటారు.  తెలుగు ప్రజల గుండెల్లో చెరగని ముద్ర వేసుకున్న కందుకూరి విరేశలింగం పంతులు గారి జన్మదినోత్సవం తెలుగు నాటక రంగ దినోత్సవంగా ఎలా మారింది?   తెలుగు నాటక రంగ దినోత్సవం గురించి పూర్తీగా తెలుసుకుంటే..


కందుకూరి వీరేశలింగం పంతులు తెలుగు నాటక రంగానికి మార్గదర్శకుడు (రచయిత). బహుముఖ ప్రజ్ఞాశాలి అయిన ఆయన నాటకాలు, నవలలు,  సామాజిక వ్యంగ్య రచనలు రాశారు. ఇవి తెలుగు సాహిత్యంపై గొప్ప ప్రభావాన్ని చూపాయి. అన్నింటికంటే మించి వీరేశలింగం గొప్ప సంఘ సంస్కర్త కూడా. ఆయన తన రచనల ద్వారా జాతి వివక్ష,  అనేక ఇతర సామాజిక దురాచారాలకు వ్యతిరేకంగా పోరాడారు. ఆ సమయంలో అరుదుగా ఉండే వితంతు పునర్వివాహాలను ఆయన ప్రోత్సహించారు.  మొదటి తెలుగు నాటకం కందుకూరి రాసిన వ్యవహార ధర్మ బోధని మొదటిసారిగా ప్రదర్శించబడింది.

2007లో, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కందుకూరి వీరేశలింగం పుట్టినరోజును 'తెలుగు నాటకరంగ దినోత్సవం'గా జరుపుకుంటామని ప్రకటించింది. అప్పటి నుండి నాటక కార్యకర్తలు ఏప్రిల్ 16ని తెలుగు నాటక దినోత్సవంగా జరుపుకుంటున్నారు.


కందుకూరి విరేశలింగం పంతులు గారు ఆధునిక నాటక ప్రదర్శనకు రూపం ఇచ్చిన వారిలో ఒకరు. విరేశలింగం పంతులు గారు డైలాగ్స్ రూపంలో బ్రాహ్మ వివాహము అనే నాటకాన్ని హాస్య సంజీవని అనే పత్రికలో రచించారు.  ఆ తరువాత వ్యవహార ధర్మభోధిని  అనే నాటకాన్ని ప్రకటించారు. ఆనాటి గ్రాంథిక భాష కాలంలో వ్యవహారిక బాషలో ఒక నాటకాన్ని సాగించడం పెద్ద సాహసమనే చెప్పాలి.  వేదిక మీద ప్రదర్శించిన తొలి నాటకం ఇది. తెలుగు రాష్ట్రంలో  తొలి నాటక సమాజాన్ని స్థాపించిన ఘనత కందుకూరి విరేశలింగం పంతులు గారిదే. ఈ కారణంగానే కందుకూరి విరేశలింగం పంతులు గారి జన్మదినోత్సవాన్ని తెలుగు నాటక రంగ దినోత్సవంగా జరుపుకుంటున్నారు.


                                *రూపశ్రీ.
 

By
en-us Political News

  
ప్రతి తల్లిదండ్రులు తమ కూతురు జీవితంలో విజయవంతంగా, బలంగా, ఆత్మవిశ్వాసంతో ఉండాలని కోరుకుంటారు. దీనికి మంచి విద్య, మంచి విలువలు చాలా అవసరం. ఇవన్నీ ఉన్నా సరే.. కొంతమంది అమ్మాయిలు తమ జీవితంలో చాలా ఇబ్బందులు ఎదుర్కుంటారు...
వేసవి కాలం రాగానే, చెమట నీళ్ళు కుమ్మరించినట్టు కారిపోతూ ఉంటుంది.  ఎంతమంచి బట్టలు వేసుకున్నా చెమట కారణంగా పాడైపోతూ ఉంటాయి.పైగా చెమట కారణంగా దుర్వాసన కూడా వస్తుంది. చెమట వాసన చాలా..
పుదీనా ఎంతో సువాసనగా, ఆహ్లాదాన్ని ఇచ్చే మొక్క.  ఎన్నో రకాల కూరల నుండి పచ్చళ్ల తయారీ  వరకు పుదీనాను  ఉపయోగిస్తారు.   ఇక వేసవి కాలంలో అయితే షర్బత్ నుండి నిమ్మరసం, ఆమ్ పన్నా, మసాలా మజ్జిగ ఇలా..
భారతదేశంలో ధనికుల కంటే పేదవారే ఎక్కువ.  పేదవారిలో కూడా చాలా పేదవారు,  ఒక మోస్తరు పేదవారు అని కూడా ఉంటారు. అయితే కాలం ఎంత గడిచినా జీవితాలలో ఏ మాత్రం మార్పు లేకుండా పేదవారిగానే ఉండిపోయే...
పిల్లలు జీవితంలోని ప్రతి దశలో  ఆత్మవిశ్వాసంతో, బాధ్యతాయుతంగా నిలబడాలని ప్రతి తల్లిదండ్రులు కలలు కంటారు. నేటికాలంలో మంచి పేరెంటింగ్ అంటే కేవలం మంచి విద్యను అందించడం లేదా..
వేసవికాలం అనగానే మండే ఎండలు గుర్తుకు వస్తాయి.  ప్రతి ఏడాది ఈ ఎండల ప్రభావం పెరుగుతూనే ఉంటోంది. ఈ కారణంగానే చాలామంది ఇళ్లలో ఏసీలు పెట్టించుకుంటారు.  అయితే ఏసీ పెట్టించుకునే అంత స్తోమత లేనివారు కనీసం కూలర్ అయినా...
వివాహం అనేది కేవలం ఇద్దరు వ్యక్తుల కలయిక మాత్రమే కాదు, రెండు కుటుంబాలు , రెండు విభిన్న మనస్తత్వాల కలయిక కూడా.  పెళ్లి తర్వాత ప్రతి జంట తమ సంబంధాన్ని మెరుగుపరుచుకోవడానికి ప్రయత్నిస్తుంది..
నేటి కాలంలో ఫిట్‌నెస్‌పై అవగాహన పెరుగుతోంది. ముఖ్యంగా జిమ్ వెళ్లేవారు తమ ఆహారం విషయంలో చాలా జాగ్రత్తలు తీసుకుంటారు...
మీ జుట్టు మీ అందానికి ఒక కిరీటం వంటిది. కానీ నేటి ఒత్తిడితో కూడిన జీవనశైలి, కాలుష్యం మరియు రసాయనాల వాడకం వల్ల జుట్టు ఆరోగ్యం దెబ్బతింటోంది. మీ జుట్టును ఒత్తుగా, పొడవుగా మరియు ఆరోగ్యంగా ఎలా ఉంచుకోవాలో ఈ కథనంలో వివరంగా తెలుసుకుందాం...
ప్రేమించిన వారిని వదిలి వేరొకరిని పెళ్లి చేసుకుంటున్నారా? మీ జీవితం మరియు మీ భాగస్వామి భవిష్యత్తు కోసం ఈ విషయాలు తప్పక తెలుసుకోండి...
ఈ రోజుల్లో చాలా మంది ఎదుర్కొంటున్న అతి పెద్ద ఆరోగ్య సమస్య హార్మోన్ల అసమతుల్యత (Hormonal Imbalance). మనం ఎంత ప్రయత్నించినా బరువు తగ్గకపోవడం, ఎప్పుడూ అలసటగా అనిపించడం, మానసిక ఒత్తిడి.. ఇవన్నీ మీ హార్మోన్లు పంపే సంకేతాలు కావచ్చు...
పుట్టిన తర్వాత పిల్లలు పెద్దగా అయినా.. వారు చదువులు పూర్తయ్యి,  పెళ్ళి చేసుకుని, వారు కూడా పిల్లలను కన్నా సరే.. తల్లిదండ్రులకు మాత్రం తమ పిల్లలు ఎంతవాళ్లైనా ఇంకా చిన్న పిల్లలు గానే అనిపిస్తూ ఉంటుంది...
జీవితంలో విజయం సాధించాలని ప్రతి ఒక్కరూ కోరుకుంటారు. కానీ విజయం కొందరే సాధిస్తారు. దీనికి కారణాలు చాలా ఉంటాయి...
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.