ఈ సారి హైదరాబాద్ లో.. తెలంగాణలో తెలుగుదేశం కు పూర్వ వైభవమే లక్ష్యంగా అడుగులు

Publish Date:Feb 27, 2023

Advertisement

తెలంగాణలో టీడీపీకి మళ్లీ పూర్వ వైభవం తీసుకు వచ్చేందుకు ఆ పార్టీ జాతీయ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు వ్యూహాత్మకంగా అడుగులు వేస్తున్నారు. ఆ క్రమంలో ఇప్పటికే ఆయన అధ్యక్షతన ఖమ్మం వేదికగా నిర్వహించిన భారీ బహిరంగ సభ సూపర్ డూపర్ సక్సెస్ అయింది. అలాగే తాజాగా హైదరాబాద్‌లోని ఎన్టీఆర్ భవన్‌లో ఇంటింటికి తెలుగుదేశం కార్యక్రమాన్ని చంద్రబాబు ప్రారంభించారు. మరోవైపు మార్చి 29వ తేదీ..తెలుగు దేశం పార్టీ వ్యవస్థాపక దినోత్సవం. ఈ నేపథ్యాన్ని పురస్కరించుకొని.. హైదరాబాద్‌లో భారీ బహిరంగ సభ నిర్వహించాలని ఆ పార్టీ అగ్రనాయకత్వం నిర్ణయించినట్లు సమాచారం. తెలంగాణ గెడ్డ.. అదీ హైదరాబాద్ నడిబొడ్డు ఓల్డ్ ఎమ్మెల్యే కోర్టర్స్‌లో తెలుగుదేశం పార్టీ ఆవిర్భవించన విషయం తెలిసిందే.  దీంతో హైదరాబాద్‌ వేదికగా సభ నిర్వహించనున్నట్లు తెలుస్తోంది. 

2014లో ఓ వైపు రాష్ట్ర విభజన జరగగా.. మరోవైపు సార్వత్రిక ఎన్నికలు జరిగాయి. ఈ ఎన్నికల్లో ఆంధ్రప్రదేశ్‌లో టీడీపీ అధికారంలోకి వచ్చినా.. తెలంగాణలో మాత్రం తెరాస( ఇప్పుడు బీఆర్ఎస్) అధికారం చేజిక్కించుకుంది. దీంతో ఆ పార్టీ అధినేత కేసీఆర్‌ ముఖ్యమంత్రి అయ్యారు. అయితే ఆ ఎన్నికల్లో తెలుగుదేశం కొన్ని అసెంబ్లీ, లోక్‌సభ స్థానాలను కైవసం చేసుకొంది. అయితే రాష్ట్రంలో చోటు చేసుకున్న వరుస పరిణామాల నేపథ్యంలోతెలుగుదేశం టికెట్ పై గెలిచిన వారంతా వారంతా.. దాదాపుగా కేసీఆర్ నేతృత్వంలోని అధికార పార్టీలోకి జంప్ చేసేశారు. దీంతో తెలంగాణలోని పసుపు పార్టీ శ్రేణుల్లో ఓ విధమైన నిశ్శబ్దం  ఆవరించింది. 

మరోవైపు తెలంగాణ నినాదంతో... ప్రత్యేక రాష్ట్రాన్ని తెచ్చుకోవడమే కాదు.. ముఖ్యమంత్రి పీఠాన్ని   కైవసం చేసుకున్న గులాబీ బాస్ కేసీఆర్, ఇటీవల టీఆర్ఎస్‌లో తెలంగాణ పదాన్ని పక్కన పెట్టి.. ఆ స్థానంలో భారత్ అనే పదాన్ని ఆయన చేర్చారు. దీంతో టీఆర్ఎస్  కాస్తా బీఆర్ఎస్‌ గా రూపాంతరం చెందింది. దీంతో కేసీఆర్ ఏర్పాటు చేసిన ప్రాంతీయ పార్టీ కాస్తా.. బీఆర్ఎస్ పార్టీగా మారి .. జాతీయ పార్టీగా మారిపోయింది. ఇక ఈ ఏడాది చివరలో తెలంగాణ అసెంబ్లీకి ఎన్నికలు జరగనున్నాయి. దీనిని దృష్టిలో పెట్టుకొని.. తెలుగుదేశం నేతలు..వచ్చే ఎన్నికల్లో పసుపు పార్టీ సత్తా చాటాలని గట్టి పట్టుదలతో ఉన్నారు.   ఆ క్రమంలో ప్రస్తుత ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలతో... గతంలో టీడీపీ ప్రభుత్వ హయాంలో ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలను పోల్చుతూ.. ప్రజల్లోకి వెడుతున్నారు. అలాగే ఉమ్మడి రాష్ట్రంలో అదీ టీడీపీ ప్రభుత్వ హయాంలో పరిపాలన, అభివృద్ధి, శాంతి భద్రతలు, ఉద్యోగ కల్పన.. రాజధాని హైదరాబాద్ నగరాభివృద్ధి, ఐటీ పరిశ్రమ, సైబరాబాద్ నిర్మాణం తదితర అంశాలను సైతం ప్రజల్లోకి బలంగా తీసుకు వెళ్లేందుకు ఆ పార్టీ శ్రేణులు ఇప్పటికే సమాయత్తం అయ్యాయి. 

ఇక తెలంగాణలో ఆంధ్ర సెటిలర్లు అత్యధికంగా ఉన్న పలు జిల్లాలు, ప్రాంతాలపై   తెలుగుదేశం పార్టీ ఫోకస్ పెట్టింది.  ఆయా ప్రాంతాల్లో సభలు, సమావేశాలు నిర్వహించే దిశగా తెలుగుదేశం అగ్రనాయకత్వం అడుగులు వేస్తోంది.  ఇక తెలంగాణ తెలుగుదేశం అధ్యక్షుడిగా కాసాని జ్జానేశ్వర్‌ పగ్గాలు అందుకున్న తర్వాత    పార్టీలో   నయా జోష్ కొట్టొచ్చినట్లు కనిపిస్తోంది. ఇంకోవైపు.. తెలంగాణ సీఎం కేసీఆర్.. ఆంధ్రప్రదేశ్‌లో బీఆర్ఎస్ పార్టీని ప్రజల్లోకి  తీసుకు వెళ్లేందుకు,  సాధ్యమైనంత త్వరలో అక్కడ భారీ బహిరంగ సభ నిర్వహించేందుకు సన్నాహాలు చేస్తున్నారని తెలుస్తోంది. 

ఇక వచ్చే ఎన్నికల్లో తెలంగాణలో అధికార పగ్గాలు చేపట్టాలని బీజేపీ కృతనిశ్చయంతో ఉంది. అందుకోసం ఆ పార్టీ కేంద్ర నాయకత్వమే కాదు.. రాష్ట్ర నాయకత్వం సైతం ప్రణాళికలు సిద్దం చేసుకొంటూ.. ముందుకు సాగుతోంది. అలాంటి వేళ.. అటు బీఆర్ఎస్ కి, ఇటు బీజేపీకి వచ్చే ఎన్నికల్లో పోటీ ఇచ్చే దిశగా సైకిల్ పార్టీ అధినేత చంద్రబాబు.. తన రాజకీయ చాణక్యాన్ని ప్రదర్శించేందుకు సిద్దమవుతోన్నట్లు తెలుస్తోంది.

By
en-us Political News

  
ఎంఐఎం ఎమ్మెల్యే అక్బరుద్దీన్ ఒవైసీ మరోసారి కీలక వ్యాఖ్యలు చేశారు.
చిన్న శ్రీనుకు విజయనగరం జిల్లా తెలుగుదేశం అధ్యక్ష బాధ్యతలను అప్పగించనున్నారన్న ప్రచారం జోరుగా సాగుతోంది. అయితే ఈ విషయంలో అధికారికంగా తెలుగుదేశం హై కమాండ్ నుంచి ఎటువంటి ప్రకటన కానీ, సంకేతం కానీ రాలేదు. 
బీజేపీ, తెలుగుదేశం పొత్తు విచ్చిన్నం చేయడంలో అప్పట్లో తాను సక్సెస్ అయ్యానని విజయసాయి రెడ్డి విస్పష్టంగా చెప్పడంతో.. అసలు నాడు ఈ రెండు పార్టీల పొత్త విచ్ఛిన్నం కావడానికి దారి తీసిన పరిస్థితులపై పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది.
నిన్నగాక మొన్న ఇదే మోడీ నాయకత్వంలోని ఎన్డీయే సర్కార్ కు వ్యతిరేకంగా పోరాడటానికి సిద్ధంగా ఉన్నానని ప్రకటించిన జగన్, ఇప్పుడు ఆదే మోడీ నాయకత్వాన్ని ప్రస్తుతిస్తూ ప్రశంసలు కురిపించడం ద్వంద్వ వైఖరి కాక మరేమిటని పరిశీలకులు ప్రశ్నిస్తున్నారు.
. ఇక షర్మిల విజయ్ ను కలిసి తన కుమార్తె వివాహానికి హాజరు కావాల్సిందిగా కోరుతూ పెళ్లి శుభలేక అందించడం ప్రాధాన్యత సంతరించుకుంది. ఎందు కంటే కేంద్ర స్థాయిలో కాంగ్రెస్ తో పొత్తు విషయంలో విజయ్ నేతృత్వంలోని టీవీకే పార్టీ కూడా కీలకంగా ఉంది. అలాగే తమిళనాడులో విజయ్ నేతృత్వంలోని ప్రభుత్వంలో కాంగ్రెస్ భాగస్వామి.  
లౌకిక స్వభావం కలిగిన ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లోకి మతపరమైన అంశాలను జొపపించడానికి విజయసాయి ప్రయత్నిస్తున్నారని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. ఇక తమ ప్రసంగాల్లో, మీడియా సమావేశాలలో విజయసాయిరెడ్డి ప్రస్తావిస్తున్న అంశాలు ఆ విశ్లేషణలకుబలం చేకూరుస్తున్నాయి.
ఇప్పటికే తనపై 45 ఎఫ్ఐఆర్ లు ఉన్నాయన్న ఆయన తన టార్గెట్ వంద ఎఫ్ఐఆర్ లు అని చెప్పారు. అంతే కాదు.. వాటిని తాను ప్రజల పక్షాన నిలబడినందుకు దక్కిన మెడల్స్ గా భావిస్తానన్నారు. రాహుల్ చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు దేశ వ్యాప్తంగా హాట్ టాపిక్ గా మారాయి.
విపక్షాల నిరసనల నేపథ్యంలో   పోలీసులు ఢిల్లీలో విస్తృత బందోబస్తు ఏర్పాట్లు చేశారు.  పలు ప్రాంతాల్లో బారికేడ్లు ఏర్పాటు చేయడంతో పాటు వేలాది మంది భద్రతా సిబ్బందిని మోహరించారు. ట్రాఫిక్ మళ్లింపులు కూడా చేపట్టారు. జంతర్ మంతర్, పార్లమెంట్ పరిసరాలు, ఎన్నికల సంఘం కార్యాలయం వైపు వెళ్లే మార్గాల్లో ప్రత్యేక నిఘా కొనసాగుతోంది. 
 ధనుష్‌ తన కొత్త రాజకీయ పార్టీ కోసం  తమిళగ ఎళుచ్చి కళగం అనే పేరును ఖరారు చేసినట్లు  ప్రచారం జరుగుతోంది. అలాగే.. ఈ పేరుతో ఇప్పటికే కేంద్ర ఎన్నికల సంఘం వద్ద పార్టీ రిజిస్ట్రేషన్ ప్రక్రియ కూడా పూర్తయ్యిందని అంటున్నారు.
ఒక దశలో తన రిటైర్మెంట్ తరువాత టీడీపీలో చేరేందుకు కూడా తాను సిద్ధపడ్డాననీ, అవసరమైతే  ఎన్నికల బరిలో దిగడానికి కూడా రెడీ అయ్యాయనీ చెప్పిన ఏబీ వెంకటేశ్వరరావు, అ
బీసీ మోర్చా రాష్ట్ర అధ్యక్షుడు ప్రకాశ్ పాల్, ప్రముఖ దళిత నేత, మాజీ ఎంపీ విద్యాసాగర్ సోన్‌కర్, అలాగే అలహాబాద్ హైకోర్టు బార్ అసోసియేషన్ అధ్యక్షుడిగా రెండుసార్లు బాధ్యతలు నిర్వర్తించిన రాధాకాంత్ ఓఝా వంటి వారికి చోటు లభించింది.
జిల్లాలో పార్టీ పరిస్థితి వేగంగా దిగజారిపోతోంది. మజ్జి పార్టీని వీడటంతో జాగ్రత్త పడాల్సిన పార్టీ హైకమాండ్, అలాగే బొత్స సత్యనారాయణ చేతులెత్తేసినట్లు కనిపిస్తోంది. అంతే కాకుండా కూర్చున్న కొమ్మనే నరుక్కున్న చందంగా అసంతృప్తులను బుజ్జగించాల్సింది పోయి వారిపై సస్పెన్షన్ వేటు వేయడంతో జిల్లాలో పార్టీని జీరో నుంచి బిల్డ్ చేద్దామనుకుంటున్నారా? లేక జిల్లా పార్టీని వదిలేశారా అన్న అనుమానాలు పార్టీ శ్రేణుల నుంచే వస్తున్నాయి. 
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.