కోర్టు ధిక్కరణ కేసులో ఏపీ డీజీపీ రాజేంద్రనాథ్ రెడ్డి

Publish Date:Feb 27, 2023

Advertisement

ఏపీ ముఖ్యమంత్రి జగన్ హయాంలో రాష్ట్రంలోని  బ్యూరోక్రాట్లకు కోర్టు మెట్లు ఎక్కడం అన్నది రోజూ డ్యూటీకి హాజరైనట్లుగా మారిపోయినట్లుగా కనిపిస్తోంది. తాజాగా ఏపీ డీజీపీ రాజేంద్రనాథ్ రెడ్డి   కోర్టు ధిక్కరణ  కేసులో కోర్టుకు హాజరయ్యారు. పోలీసు ఇన్ స్పెక్టర్ బదలీ విషయంలో దాఖలైన కోర్టు ధిక్కరణ కేసులో ఆయన సోమవారం (ఫిబ్రవరి 27) కోర్టులో హాజరయ్యారు.

ఇన్ స్పెక్టర్ పదోన్నతి వ్యవహారంలో కోర్టు ఆదేశాలను పూర్తి స్థాయిలో అమలు కాలేదని పేర్కొన్న న్యాయస్థానం పూర్తి వివరాలతో కౌంటర్ అఫిడవిట్ దాఖలు చేయాలని ఆదేశించింది. ఇదే కేసులో మాజీ డీజీపీ, ప్రస్తుత ఏపీపీఎస్సీ చైర్మన్ గౌతం సవాంగ్ కూడా హాజరు కావాల్సి ఉండగా.. ఆయనకు మినహాయింపు కోరుతూ ప్రభుత్వ న్యాయవాది అనుబంధ పిటిషన్ దాఖలు చేశారు. విజయనగరం జిల్లా పోలీసు ట్రైనింగ్ కాలేజీ ఇన్ స్పెక్టర్ రాజశేఖర్ కు గతంలో అంటే 1999లో జారీ చేసిన జీవో ప్రకారం పదోన్నతి కల్పించాల్సి ఉందనీ, ఆ విషయాన్ని పరిగణనలోనికి తీసుకుని పదోన్నతి కల్పించాలని కోర్టు 2019 సెప్టెంబర్ లో ఆదేశాలు జారీ చేసింది.

అయితే ఇప్పటి వరకూ ఆ ఆదేశాలు అమలు కాలేదంటూ ఇన్ స్పెక్టర్ రాజశేఖర్ కోర్టు ధిక్కరణ వ్యాజ్యం దాఖలు చేశారు. ఆయన పిటిషన్ పైవిచారణ జరిపిన న్యాయస్థానం ప్రస్తుత డీజీపీ రాజేంద్రనాథ్ రెడ్డి, మాజీ డీజీపీ గౌతం సవాంగ్ లు స్వయంగా విచారణకు రావాలంటూ ఆదేశాలు జారీ చేసింది. దీంతో డీజీపీ రాజేంద్రనాథ్ హాజరయ్యారు.   కాగా, రాజశేఖర్ యాన్యువల్ కాన్ఫిడెన్షియల్ రిపోర్టు బాగా లేనందునే ఆయన పదోన్నతి వ్యవహారాన్ని ప్రమోషనల్ కమిటీ పరిగణనలోకి తీసుకోలేదని ప్రభుత్వ ప్రత్యేక న్యాయవాది కోర్టుకు తెలిపారు.

పూర్తి వివరాలతో కౌంటర్ వేసేందుకు సమయం ఇవ్వాలని కోరడంతో కోర్టు అందుకు అంగీకరిస్తూ విచారణను వాయిదా వేసింది. తదుపరి విచారణకు హాజరుపై డీజీపీకి మినహాయింపు ఇచ్చింది.  ఇలా ఉండగా ఏపీలో ఐఏఎస్, ఐపీఎస్ అధికారులు కోర్టు ధిక్కరణ కేసులలో న్యాయస్థానాల ఎదుట హాజరు కావడం ఇదే మొదటి సారి కాదు. జగన్ కు సన్నిహితంగా మెలుగుతూ, ఆయన అడుగులకు మడుగులొత్తే పలువురు  ఐఏఎస్‌లు ఇప్పటికే పలు మార్లు కోర్టు మెట్లు ఎక్కారు.  సిన్సియర్ అధికారిగా గుర్తింపు పొందిన పూనం మాలకొండయ్య, చిరంజీవి చౌదరిలకూ కోర్టు ముందు నిలుచోక తప్పలేదు.   విలేజ్‌ హార్టీకల్చర్‌ అసిస్టెంట్‌ పోస్టుల భర్తీ విషయంలో  కోర్టు ఉత్తర్వులు అమలు చేయలేదంటూ  హర్టీకల్చర్, సెరీకల్చర్ కమిషనర్‌ చిరంజీవి చౌదరి.. వ్యవసాయ శాఖ స్పెషల్ చీఫ్ సెక్రటరీ  పూనం మాలకొండయ్యలు కోర్టు అభిశంసనను ఎదుర్కొన్న సంగతి తెలిసిందే.  

అలాగే గత ఏడాది  ప్రభుత్వ స్థలాల్లో , పాఠశాలల ప్రాంగణాల్లో గ్రామ సచివాలయ భవనాలు నిర్మించడం పై హైకోర్టు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తూ… వాటిని వెంటనే తొలగించాలని జారీ చేసిన ఆదేశాలను పట్టించుకోకపోవడంతో ఎనిమిది మంది సీనియర్ ఐఏఎస్ అధికారులు  విజయ్‌కుమార్, శ్యామలరావు, గోపాలకృష్ణ ద్వివేది, బుడితి రాజశేఖర్‌, శ్రీలక్ష్మి, గిరిజాశంకర్‌, వాడ్రేవు చినవీరభద్రుడు, ఎంఎం నాయక్‌ లకు రెండు వారాల పాటు జైలు శిక్ష విధిస్తూ తీర్పునిచ్చింది.   ఐఏఎస్ లు కోర్టుకు క్షమాపణలు చెప్పడంతో జైలుశిక్షకు బదులుగా ఏడాది పాటు ప్రతినెలలో ఒకరోజు సంక్షేమ హాస్టల్‌కు వెళ్లి సేవ చేయాలని, అదేవిధంగా ఏడాది పాటు సంక్షేమ హాస్టల్‌లో ఒక్కపూట భోజనం పెట్టాలని హై కోర్టు ఆదేశాలు జారీ చేసింది కోర్టు ఆదేశాలు ఇచ్చినా అమలు విషయంలో ప్రభుత్వం అనుమతి ఇవ్వకపోవడం వల్లనే తాము కోర్టు ధిక్కరణ కేసులు ఎదుర్కొనాల్సి వస్తోందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. 

By
en-us Political News

  
ఎంఐఎం ఎమ్మెల్యే అక్బరుద్దీన్ ఒవైసీ మరోసారి కీలక వ్యాఖ్యలు చేశారు.
చిన్న శ్రీనుకు విజయనగరం జిల్లా తెలుగుదేశం అధ్యక్ష బాధ్యతలను అప్పగించనున్నారన్న ప్రచారం జోరుగా సాగుతోంది. అయితే ఈ విషయంలో అధికారికంగా తెలుగుదేశం హై కమాండ్ నుంచి ఎటువంటి ప్రకటన కానీ, సంకేతం కానీ రాలేదు. 
బీజేపీ, తెలుగుదేశం పొత్తు విచ్చిన్నం చేయడంలో అప్పట్లో తాను సక్సెస్ అయ్యానని విజయసాయి రెడ్డి విస్పష్టంగా చెప్పడంతో.. అసలు నాడు ఈ రెండు పార్టీల పొత్త విచ్ఛిన్నం కావడానికి దారి తీసిన పరిస్థితులపై పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది.
నిన్నగాక మొన్న ఇదే మోడీ నాయకత్వంలోని ఎన్డీయే సర్కార్ కు వ్యతిరేకంగా పోరాడటానికి సిద్ధంగా ఉన్నానని ప్రకటించిన జగన్, ఇప్పుడు ఆదే మోడీ నాయకత్వాన్ని ప్రస్తుతిస్తూ ప్రశంసలు కురిపించడం ద్వంద్వ వైఖరి కాక మరేమిటని పరిశీలకులు ప్రశ్నిస్తున్నారు.
. ఇక షర్మిల విజయ్ ను కలిసి తన కుమార్తె వివాహానికి హాజరు కావాల్సిందిగా కోరుతూ పెళ్లి శుభలేక అందించడం ప్రాధాన్యత సంతరించుకుంది. ఎందు కంటే కేంద్ర స్థాయిలో కాంగ్రెస్ తో పొత్తు విషయంలో విజయ్ నేతృత్వంలోని టీవీకే పార్టీ కూడా కీలకంగా ఉంది. అలాగే తమిళనాడులో విజయ్ నేతృత్వంలోని ప్రభుత్వంలో కాంగ్రెస్ భాగస్వామి.  
లౌకిక స్వభావం కలిగిన ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లోకి మతపరమైన అంశాలను జొపపించడానికి విజయసాయి ప్రయత్నిస్తున్నారని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. ఇక తమ ప్రసంగాల్లో, మీడియా సమావేశాలలో విజయసాయిరెడ్డి ప్రస్తావిస్తున్న అంశాలు ఆ విశ్లేషణలకుబలం చేకూరుస్తున్నాయి.
ఇప్పటికే తనపై 45 ఎఫ్ఐఆర్ లు ఉన్నాయన్న ఆయన తన టార్గెట్ వంద ఎఫ్ఐఆర్ లు అని చెప్పారు. అంతే కాదు.. వాటిని తాను ప్రజల పక్షాన నిలబడినందుకు దక్కిన మెడల్స్ గా భావిస్తానన్నారు. రాహుల్ చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు దేశ వ్యాప్తంగా హాట్ టాపిక్ గా మారాయి.
విపక్షాల నిరసనల నేపథ్యంలో   పోలీసులు ఢిల్లీలో విస్తృత బందోబస్తు ఏర్పాట్లు చేశారు.  పలు ప్రాంతాల్లో బారికేడ్లు ఏర్పాటు చేయడంతో పాటు వేలాది మంది భద్రతా సిబ్బందిని మోహరించారు. ట్రాఫిక్ మళ్లింపులు కూడా చేపట్టారు. జంతర్ మంతర్, పార్లమెంట్ పరిసరాలు, ఎన్నికల సంఘం కార్యాలయం వైపు వెళ్లే మార్గాల్లో ప్రత్యేక నిఘా కొనసాగుతోంది. 
 ధనుష్‌ తన కొత్త రాజకీయ పార్టీ కోసం  తమిళగ ఎళుచ్చి కళగం అనే పేరును ఖరారు చేసినట్లు  ప్రచారం జరుగుతోంది. అలాగే.. ఈ పేరుతో ఇప్పటికే కేంద్ర ఎన్నికల సంఘం వద్ద పార్టీ రిజిస్ట్రేషన్ ప్రక్రియ కూడా పూర్తయ్యిందని అంటున్నారు.
ఒక దశలో తన రిటైర్మెంట్ తరువాత టీడీపీలో చేరేందుకు కూడా తాను సిద్ధపడ్డాననీ, అవసరమైతే  ఎన్నికల బరిలో దిగడానికి కూడా రెడీ అయ్యాయనీ చెప్పిన ఏబీ వెంకటేశ్వరరావు, అ
బీసీ మోర్చా రాష్ట్ర అధ్యక్షుడు ప్రకాశ్ పాల్, ప్రముఖ దళిత నేత, మాజీ ఎంపీ విద్యాసాగర్ సోన్‌కర్, అలాగే అలహాబాద్ హైకోర్టు బార్ అసోసియేషన్ అధ్యక్షుడిగా రెండుసార్లు బాధ్యతలు నిర్వర్తించిన రాధాకాంత్ ఓఝా వంటి వారికి చోటు లభించింది.
జిల్లాలో పార్టీ పరిస్థితి వేగంగా దిగజారిపోతోంది. మజ్జి పార్టీని వీడటంతో జాగ్రత్త పడాల్సిన పార్టీ హైకమాండ్, అలాగే బొత్స సత్యనారాయణ చేతులెత్తేసినట్లు కనిపిస్తోంది. అంతే కాకుండా కూర్చున్న కొమ్మనే నరుక్కున్న చందంగా అసంతృప్తులను బుజ్జగించాల్సింది పోయి వారిపై సస్పెన్షన్ వేటు వేయడంతో జిల్లాలో పార్టీని జీరో నుంచి బిల్డ్ చేద్దామనుకుంటున్నారా? లేక జిల్లా పార్టీని వదిలేశారా అన్న అనుమానాలు పార్టీ శ్రేణుల నుంచే వస్తున్నాయి. 
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.