జాతీయ హోదా వస్తేనే పండగ కాదు...

Publish Date:May 2, 2015

Advertisement



మన తెలుగులో ఒక మంచి సామెత వుంది... ఇల్లలకగానే పండగ కాదు అని... ఈ సామెత నుంచి ప్రతి తెలుగువారు పాఠాన్ని నేర్చుకోవచ్చు... ఇప్పుడు జాతీయ హోదాను సాధించాలని ఉవ్విళ్ళూరుతున్న తెలుగుదేశం పార్టీ కూడా ఈ సామెత నుంచి పాఠాన్ని నేర్చుకోవలసిన అవసరం వుంది. మూడు దశాబ్దాల క్రితం విస్తరించి, తెలుగు ప్రజల జీవితంలో మమేకం అయిపోయిన తెలుగుదేశం పార్టీ ఇప్పటికే రెండు రాష్ట్రాల్లో విస్తరించి వుంది. ఇంకా మరో రెండు రాష్ట్రాల్లో కూడా విస్తరింపజేసి తెలుగుదేశం పార్టీకి జాతీయ పార్టీ హోదా పొందాలన్న ఆలోచనలో పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు, యువ నేత నారా లోకేష్ వున్నారు. అయితే, ఇల్లలకగానే పండగ కాదన్నట్టుగా... పార్టీ అభివృద్ధి చెంది, మరింత అభ్యున్నతిలోకి వెళ్ళాలంటే కేవలం జాతీయ పార్టీ హోదా వస్తే చాలదు... పార్టీ ఆలోచనలలో కొత్తదనం రావాలి, పార్టీ కార్యకర్తలలో ఉత్సాహం పెరగాలి, కొత్త ఆలోచనలలో, కొత్త రక్తంతో ముందుకు దూసుకువెళ్ళాలి... అప్పుడే పార్టీకి సరైన పండగ.

 తెలుగుదేశం పార్టీ ముందు  ఇప్పుడు అనేక సవాళ్ళు వున్నాయి. తెలుగుదేశం పార్టీ మీద ఎంతో నమ్మకంతో అధికారం అప్పగించిన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని అభ్యున్నతి పథంలో నడిపించాలి. అధికారం కోల్పోయి, ఎమ్మెల్యేలను టీఆర్ఎస్ బారి నుంచి కాపాడుకునే పరిస్థితిలో వున్న తెలంగాణ రాష్ట్రంలో పుంజుకోవాలి... మళ్ళీ అధికారాన్ని సంపాదించాలి. అయితే లక్ష్యాలు భారీగా వున్నాయి. పార్టీని అ లక్ష్యాలకు చేర్చేవారే తక్కువగా వున్నారు. పల్లకినీ ఎక్కేవారే తప్ప, మోసేవారు తక్కువగా వున్నారు. అదే పార్టీకి పెద్ద సమస్య. పార్టీ నాయకుడు, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, యువ నాయకుడు లోకేష్ పార్టీ కోసం రోజుకు 20 గంటలు శ్రమిస్తున్నారు. అయితే వారిద్దరి శ్రమ సరిపోతుందా... వారు రోజుకు 20 గంటలు పనిచేస్తుంటే, వారు పదవులిచ్చి ప్రోత్సహించినవారు మాత్రం రోజుకు రెండు గంటలు కూడా పనిచేయలేని పరిస్థితిలో వున్నారు. ఇప్పుడు పార్టీలో, ప్రభుత్వంలో పదవులు పొందిన చాలామంది చంద్రబాబు వేగాన్ని అందుకోలేక చతికిలపడ్డారు. ఇతర పార్టీల నుంచి గోడదూకి వచ్చినవారు, వయసు మళ్ళినవారు, దర్జాగా తిరగడమే తప్ప చెమటోడ్చడం తెలియనివారు, పాత చింతకాయ పచ్చడి లాంటి నాయకులు, మా తాతలు నేతులు తాగారని చెప్పుకుంటూ ఆ వారసత్వంతో పదవులు పొందిన నాయకులు... ఇలాంటి తాలు విత్తనాలు పదవుల్లో దర్జా వెలగబెడుతున్నారు. తాలు విత్తనాలతో పంట పండుతుందా? ఇలాంటి వారిని నమ్ముకుని పార్టీని జాతీయ స్థాయికి తీసుకెళ్ళాలని అనుకుంటే దేనితోకో పట్టుకుని గోదారి ఈదాలని అనుకోవడమే అవుదా?

తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకుడు నందమూరి తారక రామారావు నడిపిన బాటలో పార్టీని నడపటమే ఇప్పుడు తెలుగుదేశం పార్టీకి ‘శ్రీరామరక్ష’ అవుతుంది. పాతతరం నాయకులనే నమ్మకుని, వారికే బాధ్యతలు అప్పగించే పొరపాటు ఇప్పుడు అలవాటుగా మారింది. ముఖ్యంగా దాన్ని మార్చుకోవాలి. ఎన్టీఆర్ కొత్తతరం నాయకులను ఎంతో ప్రోత్సహించేవారు. చురుకైన, ఉత్సాహవంతులైన, పార్టీకోసం ప్రాణంపెట్టే యువ నాయకులను పదవులిచ్చి ప్రోత్సహించేవారు. ఆయన ప్రోత్సహించిన వారే ఇప్పుడు ఏపీ, తెలంగాణ రాష్ట్రాల్లో రాజకీయంగా ఉన్నత స్థానాల్లో వున్నారు. ఇప్పటికీ తెలుగుదేశం పార్టీలో ఉత్సాహవంతులైన, ప్రతిభావంతులైన కార్యకర్తలు, నాయకులకు కొదువ లేదు. అలాంటి వారి సేవలను వినియోగించుకోవాలి. వారి పనితీరును, పాతతరం నాయకుల పనితీరును బేరీజును వేసుకుంటే ఇంతకాలం ఈ విషయంలో పార్టీ చేసిన పొరపాటు ఏమిటో అర్థమవుతుంది. పార్టీ నాయకత్వం ఇంతకాలం చేసిన పొరపాటును సరిదిద్దుకుని కొత్తరక్తాన్ని ఉపయోగించుకుంటే తెలుగుదేశం పార్టీ జాతీయ స్థాయిని పొందడమే కాదు... మరోసారి జాతీయ స్థాయిలో తన సత్తాను చాటే అవకాశం వుంటుంది.

By
en-us Political News

  
లోకేష్‌తో పాటు ఇటీవల ప్రకటించిన 252 మందితో కూడిన జాతీయ, రాష్ట్ర స్థాయి నూతన కార్యవర్గం కూడా ఈ కార్యక్రమంలో ప్రమాణ స్వీకారం చేసింది. కీలక నేతలందరూ పార్టీ పట్ల తమ విధేయతను ప్రకటిస్తూ బాధ్యతలు స్వీకరించారు.
వైసీపీకి చెందిన పలువురు ఎమ్మెల్సీలు ఆ పార్టీని వీడి టీడీపీ, జనసేన, బీజేపీల్లో చేరారు. వీరిలో కొందరు తమ సభ్యత్వాలకు రాజీనామాలు చేశారు. అయితే, నిబంధనల ప్రకారం రాజీనామాలు సమర్పించినా.. చైర్మన్ వాటిని ఆమోదించకుండా పెండింగ్‌లో పెడుతున్నారని ఎమ్మెల్సీలు ఆరోపిస్తున్నారు. ఇటీవలే ఎమ్మెల్సీ జయమంగళ వెంకటరమణ సమర్పించిన రాజీనామాను సరైన ఫార్మాట్‌లో లేదని, సహేతుక కారణాలు చూపలేదని పేర్కొంటూ చైర్మన్ తిరస్కరించడం రాజకీయంగా దుమారం రేపింది.
ఉద్యమ నేత కుమార్తె అన్న ఇమేజ్‌కు తగ్గట్లుగానే తెలంగాణ పాలిటిక్స్‌లో ఆమె ఫైటర్‌లా తన పాత్ర పోషించేందుకు సిద్ధమయ్యారు.
ఈ ఘటనపై ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సీరియస్ అయ్యారు. ప్రోటోకాల్ విషయంలో గానీ, ఫ్లెక్సీల విషయంలో గానీ బహిరంగంగా ఘర్షణలకు దిగడం పార్టీ ప్రతిష్టను దెబ్బతీస్తుందనీ.. ఏదైనా సమస్య ఉంటే పార్టీ పెద్దల దృష్టికి తీసుకురావాలి తప్ప రోడ్డెక్కడం సరికాదని వర్మను గట్టిగా మందలించారు.అంతే కాకుండా పార్టీ అధ్యక్షుడు పల్లా శ్రీనివాస్‌ను భవిష్యత్ లోఇలాంటివి పునరావృతం కాకుండా వర్మకు తగిన సూచనలు చేయాలని ఆదేశించారు.
ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి, సీనియర్ రాజకీయ నాయకుడు నాదెండ్ల భాస్కరరావు (90) కన్నుమూశారు.
నేను చావ‌ను కొ*కా! అని కేసీఆర్ అన్న‌ది బూత‌నుకోవాలా? అయితే ఇప్ప‌టి వ‌ర‌కూ కేసీఆర్, రేవంత్ ఇలాంటి బూతులు ఎన్ని వాడారు?
గతంలో 1976లో ఇందిరా గాంధీ హయాంలో.. ఆ తర్వాత 2001లో వాజ్‌పేయి ప్రభుత్వ సమయంలో ఈ ప్రక్రియను వాయిదా వేస్తూ వచ్చారు. అయితే, 2026 గడువు సమీపిస్తుండటంతో ఈసారి డీలిమిటేషన్ జరగడం ఖాయంగా కనిపిస్తోంది. దీనిని కేవలం ఉత్తరాది రాష్ట్రాల ప్రయోజనాల కోసమే చేస్తున్న కుట్రగా చూడలేమనీ, ఇది దశాబ్దాలుగా పెండింగ్‌లో ఉన్న రాజ్యాంగ డెడ్ లైన్ అని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.
చదువుల కల్పవల్లి ఆంధ్ర విశ్వవిద్యాలయం శతాబ్ది ఉత్సవాలు ఘనంగా ప్రారంభమయ్యాయి.
గత ఎన్నికల ఫలితాలు, జిల్లా వారీగా జనాభా గణాంకాలు, ఓటర్ల జాబితాను నిశితంగా పరిశీలిస్తే, ఈ ముస్లిం వీటో అనే వాదనలో అతిశయోక్తి ఎక్కువగా ఉందనే విషయం విస్పష్టంగా తెలుస్తుంది.
కార్య‌క‌ర్త‌లను, వారి అవ‌స్థ‌ల‌ను ద‌గ్గ‌రి నుంచి ప‌రిశీలించిన లోకేష్.. వారికంటూ ఒక జీతం ఉండాలని మొద‌ట‌ కోరుకున్నారు. అది త‌ర్వాతి రోజుల్లో జ‌న్మ‌భూమి క‌మిటీల‌కు ప్రేర‌ణ‌గా మారింది. అంతే కాదు.. వాలంటీర్ వ్య‌వ‌స్థ‌కూ ఇదే స్ఫూర్తి. క‌నీసం వారికి బీమా సౌక‌ర్యం ఉండాల‌ని కోరుకున్నారాయ‌న‌. దీన్ని వ‌ర్క‌వుట్ చేయ‌గ‌లిగారు. పార్టీ కేడ‌ర్ కి లైఫ్ ఇన్ స్యూరెన్స్ చేసిన తొలి పార్టీ తెలుగుదేశం అయితే, అందుకు కార‌కుడు లోకేష్.
దేశంలో ఎన్నికల ప్రక్రియ అనగానే కేవలం ఓటింగ్, ఫలితాలే గుర్తొస్తాయి.
పార్టీ కార్యకర్తలపై నమోదైన కేసుల విషయంలో ఆయన నేరుగా రంగంలోకి దిగి వారికి భరోసా కల్పించారు. కార్యకర్తల సంక్షేమం కోసం ప్రత్యేక విభాగాన్ని ఏర్పాటు చేయడం ద్వారా, పార్టీ అంటే కేవలం ఎన్నికల యంత్రాంగం మాత్రమే కాదు, ఒక కుటుంబం అనే భావనను ఆయన పాదుకొల్పారు. ఈ నేపథ్యంలోనే ఆయనకు వర్కింగ్ ప్రెసిడెంట్ బాధ్యతలు ఇవ్వడం సరైన నిర్ణయమని పార్టీ వర్గాలు అభిప్రాయపడుతున్నాయి.
అమెరికా-ఇరాన్ మధ్య ఒక చారిత్రాత్మక ఒప్పందం కుదిరేందుకు కేవలం అంగుళాల దూరం మాత్రమే మిగిలి ఉన్న పరిస్థితుల్లో, ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహు రంగంలోకి దిగడంతో పరిస్థితులు తలకిందులయ్యాయి. అమెరికా ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్‌తో నెతన్యాహు జరిపిన టెలిఫోన్ సంభాషణ తర్వాత చర్చల గమనం పూర్తిగా మారిపోయింది.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.