బీఆర్ఎస్ లో తెలుగు, తెలంగాణ మాయం

Publish Date:Jan 28, 2023

Advertisement

తానే మారెనో, తలపే మారెనో.. తెలంగాణ ఊసే మరిచెనో అన్నట్లుగా తయారైంది తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ తీరు. తెలంగాణ  రాష్ట్ర సమితి.. తెలంగాణ సాధన కోసం ఏర్పాటైన ఉద్యమ పార్టీ.. ఆ తరువాత ఫక్తు రాజకీయ పార్టీగా ప్రకటించిన  ఆ పార్టీ నేత  పార్టీలో ఉద్యమ స్ఫూర్తికి చరమ గీతం పాడేశారు. ఆ  తరువాత టీఆర్ఎస్ ను జాతీయ పార్టీగా మార్చి.. తెలంగాణ పదాన్ని తొలగించారు. దానితో పాటే తెలంగాణ ఆత్మకూ తిలోదకాలిచ్చేశారు.

ఇక ఇప్పుడు విస్తరణలో భాగంగా తెలుగు భాషకూ చెల్లు చీటీ పాడేశారు. నిజమే బీఆర్ఎస్ ఇప్పుడు జాతీయ పార్టీ.. ప్రాంతం, భాష తారతమ్యాలు లేకుండా అన్ని ప్రాంతాలకూ, భాషలకూ సమ ప్రాధాన్యత ఇవ్వాలి. అంత వరకూ అయితే అభ్యంతరం లేదు. అందుకు తగినట్లుగానే బీఆర్ఎస్ లో ఇతర రాష్ట్రాల వారు ఎవరన్నా చేరితే ఆ రాష్ట్ర భాషలో కండువాలు తయారు చేయించి కప్పుతున్నారు. అంత వనరై ఓకే. కానీ తెలంగాణ రాజధానికి వచ్చి బీఆర్ఎస్ లో చేరే వారిని పార్టీలోకి ఆహ్వానించే సందర్భంలో కూడా తెలుగుకు, తెలంగాణకు ఇసుమంతైనా ప్రాధాన్యత ఇవ్వకపోవడాన్ని బీఆర్ఎస్ శ్రేణులే జీర్ణించుకోలేకపోతున్నాయి.

ఇటీవల ఒడిశా మాజీ సీఎం గిరిధర్ గమాంగ్, ఆయన తనయుడు ప్రగతి భవన్ లో కేసీఆర్ సమక్షంలో బీఆర్ఎస్ గూటికి చేరారు. కేసీఆర్ వారికి పార్టీ కండువా కప్పి ఆహ్వానించారు. అయితే ఆ సందర్భంగా ఏర్పాటు చేసిన బ్యానర్లు, ఫ్లెక్సీలలో ఎక్కడా తెలంగాణ కనిపించలేదు. తెలుగు భాష కనిపించలేదు. భారత దేశం మ్యాప్, హిందీ, ఇంగ్లీషు, ఒరియాలలో బ్యానర్లు మాత్రమే దర్శనమిచ్చాయి.    తెలంగాణ భవన్ లో జరిగే బీఆర్ఎస్ కార్యక్రమాలలో సైతం పార్టీ బ్యానర్లు కేవలం హిందీ, ఇంగ్లీషు భాషలోనే దర్శనమిస్తున్నాయి. ఇక ఇతర రాష్ట్రాల వారి చేరికల సందర్భంగా ఏర్పాటు చేసే బ్యానర్లలో  ఆయా రాష్ట్రాల భాషలో మాత్రమే బ్యానర్లు దర్శనమిస్తున్నాయి.  ఈ ఏడాది తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. ఈ పరిస్థితుల్లో రాష్ట్రంలో ప్రజలను ఏ భాషలో ఓట్లు అడగాలని బీఆర్ఎస్ నాయకులు మధన పడుతున్నారు.  

రాష్ట్ర సమస్యలు, రాష్ట్ర ప్రయోజనాల గురించి ఇటీవలి కాలంలో కేసీఆర్ అసలు ప్రస్తావించడం లేదనీ, ఎంత సేపూ కేంద్రంపై విమర్శలు, ఇతర రాష్ట్రాలకు చెందిన వారితో భేటీలు, సమావేశాలూ, చర్చలకే పరిమితమౌతున్నారనీ, దీంతో తెలంగాణ రాష్ట్ర ప్రజలకు పార్టీ దూరం అవుతోందని పార్టీ శ్రేణులే ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. రెండు సార్లు పార్టీని రాష్ట్రంలో అధికారంలోకి తీసుకువచ్చిన తెలంగాణను విస్మరించడమంటే మూలాలను వదిలేయడమేనని అంటున్నారు. బీఆర్ఎస్ విస్తరణ సంగతి అలా ఉంచి ఇదే తీరు కొనసాగితే.. తెలంగాణలో బీఆర్ఎస్ పరిస్థితి ఏమౌతుందో కేసీఆర్ ఆలోచించాల్సిన అవసరం ఉందని అంటున్నారు. 

By
en-us Political News

  
ర్నాబ్ తుపానుతో అతలాకుతలమైన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో తుపాను ప్రభావిత ప్రాంతాలలో విద్యుత్ సరఫరాను సత్వరమే పునరుద్ధరించడానికి తమిళనాడు సహాయాన్ని కోరింది. ఈ మేరకు మంత్రి గొట్టిపాటి రవికుమార్ తమిళనాడు ప్రభుత్వాన్ని  రాష్ట్రంలో తుపాను ప్రభావిత ప్రాంతాలలో విద్యుత్ పునరుద్ధరణ  వేగవంతం చేయడానికి  అదనపు విద్యుత్ శాఖ సిబ్బందిని, పరికరాలను కోరారు.
సాధారణంగా వైసీపీ ఎకో సిస్టమ్ ఎలా ఉంటుందంటే.. ఎవరైనా సరే  ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడిని , ఆయన పాలనా విధానాలను పొగిడితే వెంటనే ఆ పొగిడిన వారిపై విమర్శలు గుప్పించేస్తుంది. ఇందుకు గతంలో చాలా చాలా ఉదాహరణలు ఉన్నాయి.
పులివెందుల మునిసిపోల్ రణరంగంగా మారే అవకాశం ఉందని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. గత అనుభవాలను దృష్టిలో ఉంచుకుని పోలీసులూ అప్రమత్తమయ్యారు. ఎలాంటి హింసాత్మక ఘటనలకూ తావులేకుండా భారీ బందోబస్తు ఏర్పాట్లు చేశారు. అవసరమైతే  ఇటు తెలుగుదేశం కూటమి, అటు వైసీపీకి చెందిన ముఖ్య నేతలను హౌస్ అరెస్టు చేసేందుకైనా వెనుకాడబోమని పోలీసులు విస్పష్ట హెచ్చరికలు జారీ చేశారు.
గతంలో రాష్ట్ర రాజకీయాలలో  కొండా సురేఖ కేటీఆర్ పై చేసిన వ్యక్తిగత విమర్శలు  దుమారం రేపిన సంగతి తెలిసిందే. ఇప్పుడు ఆ వ్యాఖ్యలకు బేషరతుగా క్షమాపణ చెప్పిన కొండా సురేఖ వాటిని ఉపసంహరించుకున్నారు.   గతంలో కేటీఆర్ పై తాను చేసిన అనుచిత వ్యాఖ్యలను  పూర్తిగా వెనక్కి తీసుకుంటున్నట్లు సోషల్ మీడియా వేదికగా  పేర్కొన్నారు. 
తెలంగాణ రాజకీయాలలో ఏ పార్టీతోనూ పొత్తు లేదు లేదంటూనే జనసేనతో పొత్తుకు తహతహలాడుతోంది. తెలంగాణలో స్వంతంగానే బరిలోకి దిగుతామని కుండబద్దలు కొట్టిన బీజేపీ ఇప్పుడు జనసేనతో అంతర్గత పొత్తు కుదుర్చుకుందన్న ప్రచారం జోరుగా సాగుతోంది. 
నియోజకవర్గంలో రాబోయే మున్సిపల్ చైర్మన్ ఎన్నికలను తెలుగుదేశం కూటమి గెలుచుకుంటుందన్న ధీమా వ్యక్తం చేశారు. వైసీపీకి పులివెందుల ఇంకెంత మాత్రం కంచుకోట కాదని విస్పష్టంగా పేర్కొన్నారు.  దశాబ్దాలుగా తిరుగులేని ఆధిపత్యం చెలాయిస్తున్న పులివెందులలో కూటమి నేతలు నేరుగా సవాళ్లు విసురుతుండటం పులివెందులలో మసకబారిన వైసీపీ ప్రతిష్ఠకు, పలుకుబడికి నిదర్శనంగా పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. 
అయితే, ప్రస్తుతం సిద్ధమవుతున్న చార్జ్‌షీట్‌ను మరింత పటిష్టంగా రూపొందించేందుకు ఉన్నతాధికారులు ఢిల్లీలోని ప్రముఖ సుప్రీంకోర్టు న్యాయవాదులతో సంప్రదింపులు జరిపినట్లు తెలుస్తోంది. సాంకేతిక సాక్ష్యాలు, బాధితుల వాంగ్మూలాల ఆధారంగా ఈ అదనపు చార్జిషీట్ ను సిద్ధం చేస్తున్నట్లు సమాచారం.
విపత్కర సమయంలో తెలుగు రాష్ట్రాల ఐక్యత.. ఏపీకి సాయం.!
హైదరాబాద్‌లోని జూబ్లీహిల్స్ నివాసంలో ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డిని శ్రీ కృష్ణ సదర్ సమ్మేళనం ఉత్సవ కమిటీ ప్రతినిధులు మర్యాదపూర్వకంగా కలిశారు.
ఒక్కోసారి చిన్న ప్రయత్నం కూడా ఊహించని విధంగా జీవితాన్ని మార్చేస్తుందనడానికి నిదర్శనంగా నిలిచింది ఒక ఉదంతం.
ఆంధ్రప్రదేశ్‌ను వణికించిన అర్నబ్ తుఫాను ప్రభావంతో పంటలు, ఇళ్లు, రహదారులు, విద్యుత్ వ్యవస్థలకు నష్టం వాటిల్లింది.
ప్రకృతి వైపరీత్యాలు సంభవించిన క్లిష్ట పరిస్థితుల్లోనూ ఏ మాత్రం వెనకడుగు వేయకుండా, ప్రాణాలను సైతం లెక్కచేయకుండా విద్యుత్ శాఖ సిబ్బంది సేవలందిస్తున్న తీరు ఎంతో స్ఫూర్తిదాయకమని
స్థానిక  సన్నాహాలపై తెలుగుదేశం కూటమికి చెందిన దాదాపు 45 వేల మంది ముఖ్య నేతలు, ప్రజాప్రతినిధులు,  కార్యకర్తలతో  సీఎం చంద్రబాబు ఈ టెలీ కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన వైసీపీపై చంద్ర నిప్పులు చెరిగారు.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.