జగన్‌కి కేసీఆర్ జలక్!
Publish Date:Jul 15, 2014
Advertisement
టీఆర్ఎస్ అధ్యక్షుడు కేసీఆర్ ఇప్పుడు అందరికీ జలక్‌లు ఇస్తున్నారు. ఇప్పుడు ఆయన దృష్టి తెలంగాణలో నామ్‌కే వాస్తేగా వున్న వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ మీద పడింది. అందుకే ఆయన ‘‘జలక్ దిఖలాజా... జలక్ దిఖలాజా.. ఏక్‌బార్ ఆజా ఆజా’’ అన్నట్టుగా ఆ పార్టీ నాయకులను టీఆర్ఎస్‌లోకి ఆహ్వానిస్తూ తెలంగాణలో వైసీపీ ఖేల్ ఖతమ్ దుకాణ్ బంద్ చేయాలన్న ఆలోచనలో వున్నారు. అసలే తెలంగాణలో టోటల్‌గా ఆరిపోయిన జగన్ పార్టీకి ఈరకంగా కూడా జలక్ ఇవ్వడానికి టీఆర్ఎస్ ప్రయత్నిస్తోంది. రేపో మాపో తెలంగాణలోని వైసీపీ ప్రజా ప్రతినిధులందరూ కట్టకట్టుకుని టీఆర్ఎస్‌లో చేరిపోయే అవకాశం వున్నట్టు తెలుస్తోంది. ఈ పరిణామం జగన్‌కి ఊహించని జలక్ అని రాజకీయ పరిశీలకులు భావిస్తున్నారు. పాపం జగన్ భాయ్ మొదటి నుంచీ టీఆర్ఎస్ అన్నా, కేసీఆర్ అన్నా వల్లమాలిన ప్రేమను ప్రదర్శిస్తూనే వున్నారు. కేసీఆర్ పుణ్యమా అని రాష్ట్ర విభజన జరిగిపోతే మిగిలిన ఆంధ్రప్రదేశ్‌లో అయినా అధికారంలోకి రావచ్చని కలలు కన్నారు. అందుకే రాష్ట్ర విభజనకు మద్దతు ఇచ్చారు. కేసీఆర్‌కి జై కొట్టారు. తెలుగుదేశం అధినేత చంద్రబాబు నాయుడిని విమర్శించడంతోనే దినచర్యను ప్రారంభించే జగన్ గారు రాష్ట్ర విభజనకి కారకుడైన కేసీఆర్‌ని ఏనాడూ పల్లెత్తు మాట కూడా అన్న దాఖలాలు లేవు. కేసీఆర్ కూడా ఎప్పుడైనా చంద్రబాబునే టార్గెట్ చేసేవారు తప్ప జగన్‌ని ఒక్క మాట కూడా అనేవారు కాదు. కేసీఆర్ ఒక దశలో జగన్ మీద ఎంత అభిమానం ప్రదర్శించారంటే, తెలంగాణలో టీఆర్ఎస్, సీమాంధ్రలో జగన్ అధికారంలోకి రావడం ఖాయమని చెప్పారు. అప్పట్లో తనమీద అంత ప్రేమ ప్రదర్శించిన కేసీఆర్ ఇప్పుడు సడన్‌గా తెలంగాణలో వైసీపీ ఉనికికే టెండర్ పెట్టే ఆలోచనలు చేస్తూ వుండటం జగన్‌కి కోలుకోలేని షాక్ అయ్యిందని రాజకీయ పరిశీలకులు భావిస్తున్నారు. కేసీఆర్ తనకు ఇలాంటి షాక్ ఇస్తారని జగన్ కలలో కూడా ఊహించి వుండరని అంటున్నారు.
http://www.teluguone.com/news/content/telangana-ycp-leaders-to-join-in-trs-45-35911.html





