పదో తరగతి పరీక్షల షెడ్యూల్ విడుదల
Publish Date:May 22, 2020
Advertisement
కరోనా వైరస్ కారణంగా వాయిదా పడ్డ పదో తరగతి పరీక్షలను నిర్వహించేందుకు తెలంగాణ ప్రభుత్వం సిద్ధమైంది. హైకోర్టు ఆదేశాలకు అనుగుణంగా, కోవిడ్ -19 నిబంధనలకు లోబడి జూన్ 8వ తేదీ నుంచి పదో తరగతి పరీక్షలను నిర్వహించాలని నిర్ణయించినట్లు విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి తెలిపారు. పరీక్షా కేంద్రాల్లో భౌతిక దూరం పాటించాలన్న హైకోర్టు సూచనలకు అనుగుణంగా ప్రస్తుతం ఉన్న 2,530 పరీక్షా కేంద్రాలకు అదనంగా మరో 2,005 కేంద్రాలను ఏర్పాటు చేసినట్లు మంత్రి పేర్కొన్నారు. పదో తరగతి పరీక్షల షెడ్యూల్ను రాష్ట్ర విద్యాశాఖ విడుదల చేసింది. జూన్ 8 నుంచి జూలై 5వ తేదీ వరకు పరీక్షలు జరుగనున్నాయి. హైకోర్టు ఆదేశాల మేరకు ప్రతి పరీక్షకు రెండు రోజుల వ్యవధి వచ్చేలా షెడ్యూల్ను రూపొందించారు. పరీక్షలన్నీ ఉదయం 9.30 నుంచి మధ్యాహం 12.15 గంటల మధ్య నిర్వహించనున్నారు.
http://www.teluguone.com/news/content/telangana-ssc-exam-schedule-released-25-99459.html





