ఖమ్మం చుట్టూ తెలంగాణ రాజకీయం

Publish Date:Jan 10, 2023

Advertisement

తెలంగాణ రాజకీయాలకు ఖమ్మం అడ్డుగా మారుతోందా? గల్లీ నుంచి ఢిల్లీ దాకా సాగుతున్న తెలంగాణ రాజకీయాలు ఖమ్మం చుట్టూనే తిరుగుతున్నాయా? ఉభయ తెలుగు రాష్ట్రల సరిహద్దు జిల్లా రాజకీయాలు తెలంగాణ రాజకీయాలలో కీలకం కానున్నాయా  అంటే, అవుననే సమాధానమే వస్తోంది. తెలుగుదేశం పార్టీ గత డిసెంబర్ 21న ఖమ్మంలో శంఖారావం పేరిట బహిరంగ సభను నిర్వహించింది. అనూహ్యంగా  టీడీపీ సభ సూపర్ సక్సెస్ అయింది. సభ సక్సెస్ అవడమే కాదు  రాష్ట్ర రాజకీయాలని కొత్త మలుపు తిప్పింది. కొత్త చర్చకు దారి చూపింది. తెరాస, భారాసగా మారి జాతీయ స్థాయిలో విస్తరించేందుకు అడుగులు వేస్తున్న నేపధ్యంలో టీడీపీలో చాలా కాలం తర్వాత తెలంగాణ గడ్డమీద సభ  నిర్వహించం, ఈ సభలో చంద్రబాబు నాయుడు చేసిన ప్రసంగం ఉభయ తెలుగు రాష్ట్రాల రాజకీయాల్లో హాట్ టాపిక్  మారింది. 

అదలా ఉంటే కొత్త సంవత్సరం (2023) జనవరి ఫస్ట్ న ఖమ్మం జిల్లాకు చెందిన ఇద్దరు అధికార భారాస ముఖ్య నేతలు మాజీ మంత్రి తుమ్మల నాగేశ్వర రావు,  మాజీ ఎంపీ పొంగులేటి  ఒకరు పాలేరులో ఇంకొకరు ఖమ్మంలో ఏర్పాటు చేసిన ఆత్మీయ సమ్మేళనాలు అధికార బీఆర్ఎస్ లో ప్రకంపనలు సృష్టించాయి. ఇక అక్కడి నుంచి తెలంగాణ రాజకీయాలు ఖమ్మం చుట్టూతా  తిరుగుతున్నాయి. ఇటు తుమ్మల, అటు పొంగులేటి ఒకే సారి అసమ్మతి గళం వినిపించడం ఆ ఇద్దరు పార్టీతో సంబంధం లేకుండా రేపటి ఎన్నికల్లో పోటీ చేస్తున్నామని ప్రకటించడం, అందుకు కొనసాగింపుగా ఆ ఇద్దరు పార్టీ మారడం ఖాయమని ప్రచారం జరగడంతో అధికార బీఆర్ఎస్ నాయకులు అప్రమత్తమయ్యారు.  

జిల్లా మంత్రి పువ్వాడ అజయ్ తో పాటుగా ఇతర మంత్రులు  ముఖ్య నేతలు ఉమ్మడి ఖమ్మం  జిల్లాలో  పర్యటిస్తున్నారు. మరో వంక పొంగులేటి బీజేపీ తీర్థం పుచ్చుకునేందుకు సిద్దమై, మండలాల వారీగా ఆత్మీయ సమ్మేళనాలు నిర్వహిస్తున్నారు. ఈ నేపధ్యంలో ముఖ్యమంత్రి కేసీఆర్  ఈ నెల 18న ఢిల్లీలో అనుకున్న భారాస ఆవిర్భావ సభను ఖమ్మంలో నిర్వహించాలని నిర్ణయించారు. గతంలో ఢిల్లీ  లేదా యూపీలో భారీ బహిరంగసభ పెట్టి బీఆర్ఎస్ సన్నిహిత జాతీయ నేతలందర్నీ పిలిచి..  కొత్త పార్టీ విధి, విధానాలు, జెండా, అజెండాలను ప్రకటిస్తారని అనుకున్నారు. కానీ ఇప్పుడు ప్లాన్ మార్చి ఖమ్మంలో ఆవిర్భావ సభ పెడుతున్నారు. దీంతో ఖమ్మం రాజకీయాలపై మీడియా  ఫోకస్ పెరిగింది.

అదలా ఉంటే అదే రోజున పొంగులేటి, ఢిల్లీలో కేంద్ర హోం మంత్రి అమిత్ షా సమక్షంలో బీజేపీలో చేరేందుకు ముహూర్తం ఖరారైందని అంటున్నారు. అయితే, పొంగులేటి ఢిల్లీలో అమిత్ షా సమక్షంలో బీజేపీలో చేరతారా లేక, ఒక రోజు తర్వాత  జనవరి 19 న హైదరాబాద్ వస్తున్న ప్రధాని నరేంద్ర మోడీ సమక్షంలో పార్టీలో చేరతారా అనే విషయంలో కొంత క్లారిటీ రావలసి వుంది. ప్రధాని మోడీ జనవరి 19న హైదరాబాద్ విజయవాడ మధ్య వందే భారత్ ఎక్స్ ప్రెస్ రైలును ప్రారంభించడంతో పాటు  సికింద్రాబాద్ రైల్వే స్టేషన్  ఆధునీకరణ పనులకు శంకుస్థాపన చేస్తారు.  ఈ సందర్భంగా సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్ లో బీజేపీ భారీ బహిరంగ సభ నిర్వహించాలని నిర్ణయించినట్లు తెలుస్తోంది. ఈ సభలో పొంగులేటి పార్టీలో చేరే అవకాశం ఉందని అంటున్నారు .అయితే చిత్రంగా చంద్రబాబు నాయుడు ఖమ్మంలో కాలు పెట్టింది మొదలు గల్లీ నుంచి ఢిల్లీ వరకు తెలంగాణ రాజకీయాలు ఖమ్మం చుట్టూనే తిరుగుతున్నాయి.

By
en-us Political News

  
గర్ల్స్ హాస్టల్ ముసుగులో అండాల అక్రమ దందా గుట్టురట్టు
బెంగళూరు నగరంలోని ఒక ప్రతిష్టాత్మక లగ్జరీ హోటల్‌లో చోటుచేసుకున్న ఘోర ప్రమాదం స్థానికంగా తీవ్ర కలకలం రేపింది.
అర్నబ్ తుపాను నష్టాల నుంచి రాష్ట్రాన్ని సాధారణ స్థితికి తీసుకొచ్చే పునరుద్ధరణ పనులను వేగవంతం చేయడంతో
ఆంధ్రప్రదేశ్‌లో అత్యంత ఉత్కంఠ రేకెత్తిస్తున్న మున్సిపల్ ఎన్నికల ప్రక్రియ తుది దశకు చేరుకుంది.
జమ్ము కశ్మీర్ ముఖ్యమంత్రి ఒమర్ అబ్దుల్లా తన వ్యక్తిగత జీవితంలో ఓ సరికొత్త అధ్యాయాన్ని ప్రారంభించారు.
దేశ రాజధాని ఢిల్లీలో మరోసారి రాజకీయ వేడి తారాస్థాయికి చేరింది. కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ పిలుపునిచ్చిన భారీ నిరసన ర్యాలీ అంశం ప్రస్తుతం దేశవ్యాప్తంగా తీవ్ర చర్చనీయాంశంగా మారింది.
రాప్తాడు పాఠశాలలో రక్తచరిత్ర.!
పేదరికం.. కష్టాలు.. రోజువారీ కూలీ పని! ఒకప్పుడు కనీస అవసరాల కోసం పోరాడిన మహిళ.. నేడు ప్రపంచంలోని ప్రముఖ టెక్నాలజీ కంపెనీలకు కీలక భాగస్వామిగా ఎదిగారు.
విజయసాయి ఈ వీడియో చేయడం వెనుక పొలిటకల్ స్ట్రాటజీ ఉందని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. తారకరత్న కుమార్తెతో వీడియో చేయడం ద్వారా తెలుగుదేశం శ్రేణుల మద్దతు పొంది తన పొలిటికల్ రూట్ లో ఇబ్బందులు లేకుండా చూసుకుంటున్నారని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.
ర్నాబ్ తుపానుతో అతలాకుతలమైన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో తుపాను ప్రభావిత ప్రాంతాలలో విద్యుత్ సరఫరాను సత్వరమే పునరుద్ధరించడానికి తమిళనాడు సహాయాన్ని కోరింది. ఈ మేరకు మంత్రి గొట్టిపాటి రవికుమార్ తమిళనాడు ప్రభుత్వాన్ని  రాష్ట్రంలో తుపాను ప్రభావిత ప్రాంతాలలో విద్యుత్ పునరుద్ధరణ  వేగవంతం చేయడానికి  అదనపు విద్యుత్ శాఖ సిబ్బందిని, పరికరాలను కోరారు.
సాధారణంగా వైసీపీ ఎకో సిస్టమ్ ఎలా ఉంటుందంటే.. ఎవరైనా సరే  ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడిని , ఆయన పాలనా విధానాలను పొగిడితే వెంటనే ఆ పొగిడిన వారిపై విమర్శలు గుప్పించేస్తుంది. ఇందుకు గతంలో చాలా చాలా ఉదాహరణలు ఉన్నాయి.
పులివెందుల మునిసిపోల్ రణరంగంగా మారే అవకాశం ఉందని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. గత అనుభవాలను దృష్టిలో ఉంచుకుని పోలీసులూ అప్రమత్తమయ్యారు. ఎలాంటి హింసాత్మక ఘటనలకూ తావులేకుండా భారీ బందోబస్తు ఏర్పాట్లు చేశారు. అవసరమైతే  ఇటు తెలుగుదేశం కూటమి, అటు వైసీపీకి చెందిన ముఖ్య నేతలను హౌస్ అరెస్టు చేసేందుకైనా వెనుకాడబోమని పోలీసులు విస్పష్ట హెచ్చరికలు జారీ చేశారు.
గతంలో రాష్ట్ర రాజకీయాలలో  కొండా సురేఖ కేటీఆర్ పై చేసిన వ్యక్తిగత విమర్శలు  దుమారం రేపిన సంగతి తెలిసిందే. ఇప్పుడు ఆ వ్యాఖ్యలకు బేషరతుగా క్షమాపణ చెప్పిన కొండా సురేఖ వాటిని ఉపసంహరించుకున్నారు.   గతంలో కేటీఆర్ పై తాను చేసిన అనుచిత వ్యాఖ్యలను  పూర్తిగా వెనక్కి తీసుకుంటున్నట్లు సోషల్ మీడియా వేదికగా  పేర్కొన్నారు. 
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.