టీడీపీ రీఎంట్రీతో తెలంగాణలో మారుతున్న ముఖచిత్రం

Publish Date:Dec 24, 2022

Advertisement

తెలంగాణ రాష్ట్ర అవిర్భావం తర్వాత, రాష్ట్ర రాజకీయాలలో ‘గుణాత్మక’ మార్పులు చోటు చేసుకున్నాయి.  ఉద్యమ పార్టీగా పుట్టిన  తెలంగాణ రాష్ట్ర సమితి పుష్కర కాలం పైగా సాగిన తెలంగాణ రాష్ట్ర సాధన ఉద్యమానికి సారధ్యం వహిచింది. కానీ, రాష్ట్ర విభజన జరిగి, తెరాస అధికారంలోకి వచ్చిన తర్వాత, ఉద్యమ స్పూర్తిని తెరాస పక్కన పెట్టింది. ఉద్యమ వాసనలను వదిలేసి, ఫక్తు పదహారణాల రాజకీయ పార్టీగా మారిపోయింది.

ఇక అక్కడి నుంచి  తెరాస అధ్యక్షుడు, ముఖ్యమంత్రి కే.చంద్రశేఖర రావు  వ్యూహాత్మకంగా పావులు కదిపారు.  తెలంగాణ అంటే తెరాస, తెరాస అంటే కేసీఆర్  అనే విధంగా రాష్ట్ర రాజకీయాలను తమ గుప్పిట్లోకి తీసుకున్నారు. ఇంకా స్పష్టంగా చెప్పాలంటే  గడచిన ఎనిమిదేళ్ళ కాలంలో చాలా వరకు తెలంగాణ రాజకీయాలను కేసీఆర్ శాసించారు. రాజకీయ పునరేకీకరణ పేరిట ప్రతిపక్షం,ప్రజాపక్షం అనేది లేకుండా చేశారు. ఓవంక ఉద్యమ నాయకులను ఒకరి వెంట ఒకరిని బయటకు పంపారు.. మరోవంక ప్రతిపక్ష పార్టీలను నిర్వీర్యం చేశారు. సామ ధాన భేద దండోపాయాలను ప్రయోగించి కాంగ్రెస్, తెలుగు దేశం పార్టీ ఎంపీలు, ఎమ్మెల్యేలను తమ వైపుకు తిప్పుకున్నారు. ముఖ్యంగా ఆంధ్రా పార్టీ ముద్ర  వేసి టీడీపీని నిర్వీర్యం చేయడంలో చాలా వరకు సక్సెస్ అయ్యారు. 

అయితే మారిన రాజకీయ పరిస్థితుల నేపధ్యంలో, రాజకీయాల్లో బండ్లు ఓడలు ఓడలు బండ్లవుతాయనే నానుడి మరో మారు నిజమైంది. ఎనిమిదేళ్ళలో తెరాస రూపు రేఖలు గుర్తు పట్టలేనంతగా మారిపోయాయి. తెలంగాణ అస్తిత్వ పునాదులపై ఉద్యమ పార్టీగా పుట్టి కుటుంబ పార్టీగా మారిన తెరాస సహజంగానే ఉద్యమ స్పూర్తికి  ప్రజలకు  దూరమైంది. ఉప ఎన్నికల ఓటమితో మొదలైన తిరోగమనం  తెరాస నాయకత్వాన్ని కలవరపాటుకు గురి చేసింది. కుటుంబ పాలనా ముద్రను మురికి మరకను తుడిచేసుకునేందుకు అవతారం మార్చింది. అదే క్రమంలో జాతీయ పార్టీగా అవతరించే ఉద్దేశంతో భారత రాష్ట్ర సమితి (భారాస) గా పేరు మార్చుకుంది.

అదలా ఉంటే, తెరాస పేరు భారాసగా మారిన  నేపధ్యంలో రాష్ట్ర రాజకీయాలలో మరో మారు, రాజకీయ పునరేకీకరణ ప్రక్రియ మొదలైంది.ఇంతవరకు సెంటిమెంటును అడ్డుపెట్టుకుని కేసీఆర్ సాగించిన రాజకీయాలకు తెర పడింది. ఈ నేపధ్యంలో  తెలుగు దేశం పార్టీ రాష్ట్ర రాజకీయాల్లో రీఎంట్రీ ఇచ్చింది. ఎక్కడ తగ్గాలో ఎక్కడ హెచ్చాలో తెలిసిన  టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు సమయం చూసి ఖమ్మం నుంచి తెలంగాణ శంఖారావం పూరించారు. ఇంత కాలం తాతకు దగ్గులు నేర్పుతున్నామనే భ్రమల్లో ఉన్న కేసేఆర్ అండ్ కో చంద్రబాబు శంఖారావంతో ఒక్క సారిగా ఉలిక్కి పడుతున్నారు. తెలంగాణ అస్తిత్వ వాదాన్ని  ప్రాతీయ  ఆకాంక్షలను అడ్డుపెట్టుకుని రాజకీయ ప్రయోజనం పొందిన తెరాస పేరును భారాసగా మార్చుకుని దేశంలో జెండా ఎగరేస్తానంటూనే  తెలంగాణలోకి మాత్రం తెలుగుదేశం పార్టీ రాకుడదాని అంటున్నారు.

అయితే, ప్రజలు మాత్రం పోటీ పడి మరీ టీడీపీకు పునః స్వాగతం పలుకుతున్నారు. ఈ నేపధ్యంలోనే టీడీపీ రీఎంట్రీతో తెలంగాణ రాష్ట్ర రాజకీయ పునరేకీకరణ,రాష్ట్ర రాజకీయ  ముఖచిత్రంలో అనూహ్య మార్పులు తప్పవని అంటున్నారు.

By
en-us Political News

  
ఈ నేపథ్యంలో వైయస్ జగన్మోహన్ రెడ్డికి అత్యంత సన్నిహితుడైన చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి వైసీపీ తరపున తొలిసారిగా విజయసాయి పార్టీపై స్పందించారు. అయితే, ఆయన తన స్పందనను చాలా సాధారణంగా, క్లుప్తంగా ముగించడమే కాకుండా విజయసాయి రెడ్డిని   తేలికగా తీసుకున్నట్లు కనిపించింది.
వైసీపీకి సుదీర్ఘకాలం పాటు అత్యంత సన్నిహితుడిగా, కీలక నేతగా వ్యవహరించిన విజయసాయిరెడ్డి సొంతంగా కొత్త రాజకీయ పార్టీని ప్రకటించడం రాష్ట్ర రాజకీయ వర్గాల్లోచర్చకు తెరతీసింది.
పేద,  మధ్యతరగతి ప్రజల ఆదాయాన్ని పెంచేలా చర్యలు తీసుకోవడం వంటి హామీలను ప్రకటించారు. రాజకీయాల్లో పాత పద్ధతులకు స్వస్తి చెప్పి, ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా పరిపాలన అందించడమే తమ పార్టీ విధానమని విజయసాయిరెడ్డి చెప్పారు, 
విజయ్ ప్రభంజనంతో ఎంతోమంది సామాన్య అభ్యర్థులు సైతం ఎమ్మెల్యేలుగా విజయం సాధించారు. అయితే.. ప్రజలు అందించిన ఈ భారీ విజయాన్ని కొందరు ప్రజాప్రతినిధులు సరిగ్గా ఉపయోగించుకోలేకపోతున్నారనే విమర్శలు వ్యక్తమవుతున్నాయి.
కడప జిల్లా రాజకీయాల్లో ఆసక్తికర పరిణామాలు చోటుచేసుకుంటున్నాయి.
ప్రతి ఒక్కరికీ నిర్దిష్ట పాత్రలు ఉండేలా చంద్రబాబు    రూపొందించిన వ్యవస్థ వల్ల  కుటుంబంలో అంతర్గత విభేదాలు రాకుండా, ఎవరికీ తక్కువ అనే భావన కలగకుండా ఉందనీ, కుటుంబంలో అందరం సమానమేననీ చెప్పారు.
నిన్నటి వరకూ జగన్ కు పెట్టని కోటలా నిలిచిన పులివెందులలో ఇప్పుడు తెలుగుదేశం జెండా ఘనంగా ఎగురుతోంది.  సుదీర్ఘకాలంగా వైసీపీకి తిరుగులేని కంచుకోటగా ఉన్ పులివెందుల పరిధిలో తెలుగుదేశం పార్టీ తన ఉనికిని బలంగా చాటుకుంటోంది.
వైసీపీ అధినేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి తీరుపై ఆ పార్టీ నుంచి బయటకు వచ్చిన మాజీ ఎంపీ విజయసాయి రెడ్డి తీవ్రస్థాయిలో మండిపడ్డారు.
తుఫాను కారణంగా చీరాల మన్సిపాల్టీలో ఓట్ల లెక్కింపు శుక్రవారం (నవంబర్ 5) జరుగుతోంది. ఇప్పటి వరకు ఎక్కడా కనీసం డిపాజిట్ కూడా దక్కని కాంగ్రెస్ ఖాతాలో  తొలి విజయం నమోదైంది. కాంగ్రెస్ పార్టీ చీరాల మునిసిపోల్స్ లో గట్టి పోటీ ఇచ్చింది. 25వ వార్డులో విజయం సాధించింది.  25వ వార్డు నుంచి బరిలోకి దిగిన కాంగ్రెస్ అభ్యర్థి వెంకట్రావు విజయం సాధించారు. 
పోలింగ్ సరళి, వెలువడిన ఫలితాలు వైసీపీ శిబిరంలో ఆందోళన కలిగిస్తుంటే వైసీపీ అధినేత, మాజీ సీఎం జగన్ మాత్రం మేకపోతు గాంభీర్యం ప్రదర్శిస్తూ, అధికార తెలుగుదేశం కూటమి అరాచకాలు, అధికార దుర్వినియోగం తమ ఓటమికి కారణాలుగా చూపడానికి ప్రయత్నిస్తున్నారు.  ఎన్నికల ఫలితాల వెల్లడి తర్వాత వైఎస్ జగన్ నిర్వహించిన ఈ మీడియా సమావేశంలో జగన్ చెప్పిందే చెప్పారు. 
కాంగ్రెస్, కమ్మూనిస్టుల మద్దతుతో ఎన్నికల బరిలోకి దిగిన ఏబీవీకి ఘోర పరాజయం ఎదురైన సంగతి తెలిసిందే. కమ్యూనిస్టులకు అంతో ఇంతో పట్టున్న ప్రాంతాలలో కూడా ఆయనకు ఓట్లు రాలలేదు. ఇక కాంగ్రెస్ మద్దతు ఆయనకు ఎందుకూ కొరగాకుండా పోయింది. 
ఈ వేడుకలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి, కేటీఆర్,   విజయ్ ఒకే దగ్గర చేరి సరదాగా ముచ్చటించుకోవడం ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది.  
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.